1% కూడా ఊహించని కల్కి 2898 AD లో గెస్ట్ రోల్స్, ఎవరెవరు ఉన్నారంటే?
ప్రభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రపంచ స్థాయిలో హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఈయన నటించి విడుదలైన చిత్రం ‘కల్కి 2898 AD’ థియేటర్లలో అదరగొడుతోంది. Sri Media News
ప్రభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రపంచ స్థాయిలో హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఈయన నటించి విడుదలైన చిత్రం ‘కల్కి 2898 AD’ థియేటర్లలో అదరగొడుతోంది. అసలు ఇందులో ప్రభాస్ పాత్ర కానీ, ఇతర నటీనటుల పాత్రలు కానీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు నాగ్ అశ్విన్. ఇక ఈ సినిమా విడుదలైన ప్రతీ చోట.. మంచి టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్లో ‘కల్కి 2898 AD’ సినిమాకు సంబంధించి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమాలు ఒకరు ఇద్దరు కాదు.. చాలామంది హీరోలను మనం చూడొచ్చు. ప్రభాస్ కెరీర్లో ‘కల్కి 2898 AD’ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఏకంగా 600 కోట్లు బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా మొదటి భాగం నుంచి మొదలు క్లైమాక్స్ వరకు గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉన్నాయి. ఈ విధంగా పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్న ఈ చిత్ర స్టోరీని డైరెక్టర్ నాగ్ అశ్విన్, హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాకుండా తెరకెక్కించారు.
ఈ మూవీలో చాలా మంది తారలు గెస్ట్ రోల్స్ చేశారు. ఈ విషయన్ని సీనిమా రిలిజ్కి ముందే డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ రివిల్ చేశారు కూడా... ఇప్పుడు వారందరి పేర్లు.. అందుకు సంబంధించిన విజువల్ వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, ఆర్జీవీ, ఫరియా అబ్దుల్లా, కె.వి. అనుదీప్లు కల్కిలో ఉన్నారు. ఇక ఎవరూ ఊహించని విధంగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా కల్కిలో గెస్ట్ రోల్ చేసారు. జక్కన్న స్రీన్ మీద కనిపించగానే అందరూ షాక్ అయ్యారు. కల్కి 2898 ఏడీలో తెలుగు హీరోలు రానా దగ్గుబాటి, నాని కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మరికొద్ది నిమిషాల్లో క్లారిటీ రానుంది. ఒక్కో స్టార్ రివీల్ అవుతున్న సమయంలో థియేటర్లో ఈలలు, కేకలు వేస్తూ ఫాన్స్ సందడి చేస్తున్నారు.
బారీ బడ్జెట్తో ఎనలేని తారాగాణంతో వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మించారు. ఇప్పటికే భైరవగా థియేటర్స్లో దుమ్మురేపుతున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసం భవిష్యత్ కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల్ని దర్శకుడు నాగ్ అశ్విన్ అద్బుతంగా క్రియేట్ చేశాడు. ఆ మూడు ప్రపంచాల నేపథ్యంలోనే ఈ కథ సాగుతుంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీలో భారీ అగ్ర తారాగణం ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన,దిశా పటాని, కీర్తి సురేష్ వాయిస్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు కల్కిలో ఉన్నాయి. ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త క్యారెక్టర్తో డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాడు.
ప్రభాస్ సినిమా కావడంతో ఓవర్సీస్ సహా దేశంలోని అన్ని థియేటర్లలోనూ ప్రేక్షకులు భారీ సంఖ్యలో సీనిమాకు వెళ్తున్నారు. ప్రీమియర్స్ మొదటి షో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆడియెన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఓవర్సీస్ ప్రీమియర్స్ భారీ బ్లాక్ బస్టర్అయ్యింది. ఇక్కడ "కల్కి యూనానిమస్ ఎపిక్ బ్లాక్ బస్టర్. అద్భుతమైన విజువల్ వండర్ మాస్టర్పీస్. ఇండియన్ సినిమాలో ఎప్పుడు చూడనటువంటి చిత్రమిది. కళ్లు చెదిరే విజువల్ స్టోరీ టెల్లింగ్తో ప్రతి ఒక్కరు స్టన్ అవ్వడమే. ఇక మాటల్లేవ్ అంతే." అని అభిమానులు ట్విట్టర్లో సంబరాలు చేసుకుంటున్నారు... ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి భారీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వినిపిస్తోంది. ఓపెనింగ్స్ డే అడ్వాన్స్ సేల్స్ రూ.100 కోట్లు దాటేశాయని తెలుస్తుంది.
‘కల్కి 2898 AD’ ప్రీ-రిలీజ్ థియేటర్ బిజినెస్ దాదాపు 385 కోట్ల రూపాయలు జరిగింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా ఈ రేంజ్ బిజినెస్ చేయలేదు. ప్రభాస్ ‘కల్కి 2898 AD’ తెలుగు రాష్ట్రాల్లో 85 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందని తెలుస్తోంది. సీడెడ్ హక్కులు రూ.27 కోట్లకు, నైజాం హక్కులు రూ.70 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇలా ఈ సినిమా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రూ.182 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో పాటు తమిళనాడు, కేరళలో రూ.22 కోట్లకు ఈ సినిమా డీల్ ఫిక్స్ చేసింది. కర్నాటకలో ఈ చిత్రానికి దాదాపు 30 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
అలాగే నార్త్ ఇండియన్ థియేట్రికల్ బిజినెస్ రేషియో రూ.80 కోట్లు కాగా, ఏఏ ఫిల్మ్స్ ద్వారా అడ్వాన్స్ కమీషన్ ప్రాతిపదికన సినిమాను పంపిణీ చేయనున్నారు. ‘కల్కి 2898 AD’ ఓవర్సీస్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 70 కోట్ల రూపాయలు జరిగిందట. ‘కల్కి 2898 AD’ ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రకారం, మేకర్స్ తమ సినిమా నుండి ప్రపంచవ్యాప్తంగా కనీసం 700 కోట్ల రూపాయలు ఆశిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 600 కోట్ల రూపాయలు. ఇక ఈ సినిమా ముందు ముందు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
What's Your Reaction?