విజయ్ మీద ఎందుకంత నెగిటివిటీ ?ఈ సినిమాతో రాజమౌళి నిద్రపోడు

‘కల్కి 2898 AD’ థియేటర్లలో అదరగొడుతోంది. అసలు ఇందులో ప్రభాస్ పాత్ర కానీ, ఇతర నటీనటుల పాత్రలు కానీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు నాగ్ అశ్విన్. ఇక ఈ సినిమా విడుదలైన ప్రతీ చోట.. మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఈ మూవీలో చాలా మంది తారలు గెస్ట్ రోల్స్ చేశారు.Sri Media News

Jun 27, 2024 - 17:51
Jun 27, 2024 - 21:03
 0  4
విజయ్ మీద ఎందుకంత నెగిటివిటీ ?ఈ సినిమాతో రాజమౌళి నిద్రపోడు
vijay-kalki
 ‘కల్కి 2898 AD’  థియేటర్లలో అదరగొడుతోంది. అసలు ఇందులో ప్రభాస్ పాత్ర కానీ, ఇతర  నటీనటుల పాత్రలు కానీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు నాగ్ అశ్విన్. ఇక ఈ సినిమా విడుదలైన ప్రతీ చోట.. మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఈ మూవీలో చాలా మంది తారలు గెస్ట్ రోల్స్ చేశారు. ఇప్పుడు వారందరి పేర్లు.. అందుకు సంబంధించిన విజువల్ వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఈ మూవీలో దుల్కర్‌ సల్మాన్‌, మృణాళ్‌ ఠాకూర్‌, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, ఆర్జీవీ, ఫరియా అబ్దుల్లా, కె.వి. అనుదీప్‌, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

ఇక నాగ్ అశ్విన్ సెంటిమెంట్ హీరోయిన్ మాళవిక నాయర్.. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో నటించింది. ఇక రెండో మూవీ మహానటిలో జెమినీ గణేషన్ పాత్రలో చేసిన దుల్కర్ సల్మాన్ మొదటి భార్య అలివేలు పాత్రలో మాళవిక నాయర్ నటించింది. ఇక ఇప్పుడు విడుదలైన కల్కిలో కూడా మాళవిక నాయర్ ఉంది. అలా మాళవిక ఇంతకు ముందు నటించిన రెండు సినిమాలు హిట్ అవ్వడంతో కల్కి కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని,నాగ్ అశ్విన్ కి ఈమె సెంటిమెంట్ హీరోయిన్ గా మారిపోతుంది అంటూ కొంతమంది జనాలు కామెంట్లు పెడుతున్నారు.

అయితే  గెస్ట్ రోల్స్ చేసిన వారిలో విజయ్ దేవరకొండ చేసిన అర్జునుడి పాత్ర  విజయ్‌‌కి అస్సలు సెట్ అవ్వలేదని ప్రేక్షకులు అంటున్నారు. అంతేకాదు... కల్కి మూవీ అంత పెద్ద హిట్ అయినప్పటికీ  ఈ సినిమాలో విజయ్ అర్జునుడి పాత్రలో  నటించడం మాత్రం సినిమాకి పెద్ద మైనస్ అంటూ సినిమా చూసిన జనాలు ఎక్స్ వేదికగా రివ్యూలు ఇస్తున్నారు. అసలు విజయ్‌‌ని సినిమాలో పెట్టాలన్న ఆలోచన డైరెక్టర్ కి ఎందుకు వచ్చిందో..సినిమా మొత్తానికి పెద్ద మైనస్ అంటూ ఒక నెటిజన్ కామెంట్ పెడితే మరో నెటిజన్ ఆ డైలాగ్ చెప్పడం ఏంట్రా తారు రోడ్డు మీద రేకు డబ్బా వేసి గీకినట్టు అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ చలికి గొంతు వణుకుతున్నట్టు ఆ డైలాగ్ చెప్పడం ఏంటి అని కామెంట్ పెట్టాడు.

కాగా... సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ సీన్‌కు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఈ యుద్ధపు సన్నివేశంలో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. అలాగే కృష్ణుడుని ఈ వీడియోలో చూపించారు. అయితే సినిమాలోని సీన్స్ పోస్ట్ చేసి స్పాయిల్ చేయొద్దని మేకర్స్ కోరారు. కానీ, అవేం పట్టించుకోకుండా ఓ నెటిజన్ ఈ వీడియో పోస్ట్ చేశాడు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అంటే ఈమధ్యన చాలామందికి పడడం లేదు. చాలా తక్కువ సమయంలో ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ పై సోషల్ మీడియాలో రీసెంట్ టైమ్స్ లో విపరీతమైన నెగిటివిటి కనిపిస్తూనే ఉంది. విజయ్ దేవరకొండ సినిమా విడుదలవుతుంది అనగానే కొంతమంది విజయ్ సినిమాపై విషం కక్కుతున్నారు. లైగర్, ఖుషి సినిమా లు విడుదలైన నెక్స్ట్ మినిట్ సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూస్ కనిపించాయి.  

ఫ్యామిలీ స్టార్ విడుదలైన మరుక్షణమే ఆ సినిమా బాలేదు, రౌడీ స్టార్ పనైపోయింది, ఇకపై విజయ్ దేవరకొండ సినిమాలు తియ్యడం వేస్ట్ అంటూ మొదలు పెట్టారు. ఇప్పుడు కల్కిలో విజయ్ చేసిన అర్జునుడి పాత్ర పై కొంతమంది పనిగట్టుకుని నెగెటివిటీని చూపించడం మాత్రం రౌడీ స్టార్ ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు. యాటిట్యూడ్ తగ్గించుకున్నా విజయ్ ని మాత్రం ఆ నెగిటివిటీ వదలడం లేదు. మరి విజయ్ ఏం చేస్తే ఈ నెగెటివిటి నుంచి తప్పించుకుంటాడో చూడాలి.  

అయితే కల్కి సినిమాలో నేచురల్ స్టార్ నాని కూడా కనిపిస్తాడనిప్రచారం జరిగింది. కానీ, ఇక్కడ నాని అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ  సినిమాలో నాని ఎలాంటి పాత్ర పోషించలేదు. అంతేకాదు.. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో కనిపిస్తారనే టాక్ జోరుగా వచ్చింది. కానీ, చిత్రంలో మాత్రం కృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు. తెలుగు డైరెక్టర్లు రాజ‌మౌళి, రామ్‌గోపాల్ వ‌ర్మ గెస్ట్ పాత్రల్లో క‌నిపించారు. వీరి గెస్ట్ అప్పిరియెన్స్ అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తున్నాయి. వీరితో పాటు జాతిర‌త్నాలు డైరెక్టర్ అనుదీప్ కూడా గెస్ట్‌గా న‌టించాడు. అయితే కొందరు సీని అభిమానులు... టాలీవూడ్‌లో ఎస్ఎస్ రాజమౌళికి ఇప్పటివరకు కాంపిటీషన్ లేదు. కానీ, ఈ సినిమాతో రాజమౌళి నిద్రకూడా పోడు. రాజమౌళితోపాటు ఆర్జీవి కూడా నటించారు. అన్నిటికంటే ఆర్జీవీ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు.

కల్కి సీనిమాలో ప్రభాస్ పేరు మారింది. ఇప్పటి వరకు వచ్చిన సీనిమాల్లో ప్రభాస్ టైటిల్ కార్డ్... యంగ్ రెబల్ స్టార్ అని చూపించేవారు. కానీ కల్కి సినిమాలో "శ్రీ" ప్రభాస్ అని చూపించారు. దీంతో ఇక నుంచి ప్రభాస్‌‌ని యంగ్ రెబల్ స్టార్ కాకుండా శ్రీ ప్రభాస్ అని పిలుస్తారన్నట్టు ప్రచారం జరుగుతుంది.  ప్రభాస్ కు ఏదైనా  జాతక దోషాల వల్ల శ్రీ ప్రభాస్ అని పెట్టారా, లేదంటే కావాలనే పెట్టారా అనేది ముందు ముందు తెలుస్తుంది. అయితే ఈ పేరు ఈ సీనిమా వరకు మాత్రమే ఉంటుందా...  లేదా కంటిన్యూ అవుతుందో వేచి చూడల్సిందే. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow