హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా ఏ పాత్ర వచ్చినా.. అందులో లీనమైపోయి.. ఆ పాత్రకే వన్నె తెచ్చిన విశిష్ట నటుడు ఆయన. ఆయనెవరో కాదు లెజెండరీ నటుడు మోహన్ బాబు. ఈయన ఇండస్ట్రీకి వచ్చి 49 ఏళ్లు అవుతోంది. నటుడిగా ఆయన ఈ 48 ఏళ్లలో ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్రను వేశారు. ఆయన తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను, ఎత్తుపల్లాలను చూశారు. అయితే హీరోగా మోహన్ బాబుని పరిచయం చేసింది.. ఒక స్టార్ హీరోగా నెలబెట్టిందీ నాటి స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఇద్దరి మధ్యా ఎటువంటి దాపరికాలు ఉండేవారి కాదు. ఇద్దర్నీ ఇండస్ట్రీలో గురు శిష్యులు అని పిలిచేవారు. కానీ దాసరి గారు మోహన్ బాబుని అందరి ముందూ బూటు కాలితో తన్నారు.. అసలు ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? మోహన్ బాబు ఏం చేశారు? మెుదటి భార్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? చిరంజీవికి లైఫ్ ఇచ్చింది మోహన్ బాబేనా?
1975 నవంబర్ 22న స్వర్గం-నరకం చిత్రంతో దాసరి నారాయణరావు పరిచయం చేసిన మోహన్‌బాబు.. అతి తక్కువ కాలంలోనే మంచి యాక్టర్ అనే పేరు తెచ్చుకున్నాడు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా ఏ పాత్ర వచ్చినా.. అందులో లీనమైపోయి.. ఆ పాత్రకే వన్నె తెచ్చిన విశిష్ట నటుడు మోహన్‌బాబు.. తన విలక్షణ యాక్టింగ్‌తో సినిమాలకు రికార్డ్ కలెక్షన్లు తెచ్చి.. కలెక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నాడు.. ఒక్క యాక్టర్‌గా కాకుండా.. ప్రొడ్యూసర్‌గానూ రికార్డ్ సృష్టించారు.. క్రమశిక్షణ పాటించటంలో మహానటుడు ఎన్టీఆర్ తర్వాత మోహన్ బాబే అని చెప్పాలి.. సినీ రంగానికే పరిమితం కాకుండా.. విద్యారంగంలోకి ప్రవేశించారు మోహన్ బాబు. శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతోనే ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. కళా రంగంలో, విద్యా రంగంలో మోహన్ బాబు చేసిన సేవలకు గానూ.. 2007లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పేరుతో సత్కరించింది. మోహన్ బాబు ప్రస్థానం ఎలా మెుదలయ్యిందంటే మెుదటిగా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో.
1952 మార్చి 19న చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం, మోదుగులపాళంలో పుట్టారు మోహన్‌బాబు. మోహన్ బాబు తండ్రి ఉపాధ్యాయుడు. మోహన్ బాబుకి ముగ్గురు తమ్ముళ్లు, ఒక చెల్లి ఉన్నారు. భక్తవత్సలం నాయుడు అనేది మోహన్ బాబు అసలు పేరు. మోహన్ బాబు ఏర్పేడు, తిరుపతిలోనే స్కూలింగ్ పూర్తి అయ్యింది. చైన్నైలో ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన మోహన్ బాబు, సినిమాల్లోకి రాకముందు.. ఫిజికల్ ట్రైనింగ్ టీచర్‌గా పని చేశారు. 1970 ప్రారంభంలో అర్ధ దశాబ్దంపాటు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశారు..
స్వర్గం-నరకం మూవీతో 1975లో సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు మోహన్ బాబు. అప్పుడే తన పేరును భక్తవత్సలం నుంచి మోహన్ బాబుగా మార్చుకున్నారు. దర్శకత్వ రత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్వర్గం-నరకం మూవీతో వరసుగా సూపర్ హిట్ మూవీస్‌లో నటించారు. అల్లుడుగారు సినిమాతో సోలో హీరోగా నిలదొక్కుకున్న మోహన్ బాబు.. అసెంబ్లీ రౌడీ, రౌడీగారి పెళ్లాం, అల్లరి మెుగుడు వంటి సినిమాలతో కలెక్షన్ల మోత మోగించి కలెక్షన్ కింగ్‌గా అనిపించుకున్నారు. రజినీకాంత్ అతిథి పాత్రలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన పెదరాయుడు అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. నటుడిగా కాకుండా నిర్మాతగానూ మోహన్ బాబు రికార్డులు సృష్టించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. యాక్టర్‌గా ఆయన సూపర్ హిట్ సినిమాలు అన్నీ తన సొంత బ్యానర్‌లోనే రావటం. 1983లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్టార్ట్ చేసి.. ఇప్పటి వరకు 56 మూవీస్‌కి ప్రొడ్యూస్ చేశారు. ఆ తరువాత 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్థాపించి.. విద్యా రంగంలో సేవలు అందిస్తున్నారు. 1995లో ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజ్యసభకు ఎంపీగా ఎన్నిక అయ్యి.. సేవలు అందించారు.
సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే మోహన్ బాబుకి విద్యాదేవితో పెళ్లి జరిగింది. వీరిద్దరికీ మంచు లక్ష్మీ, విష్ణు పుట్టారు. పెళ్లి తరువాత మోహన్ బాబుకి వరుసుగా సినీ అవకాశాలు రావటంతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. అలా.. షూటింగ్స్ బిజీలో ఇంటికి వెళ్లటానికి లేట్ అయ్యేది. దీంతో విద్యాదేవి మోహన్ బాబుకి రోజూ చిన్న చిన్న గొడవలు, అపార్థాలు ఎక్కువయ్యాయి. గొడవలు ముదరటంతో విద్యాదేవి ఆత్మహత్య చేసుకుంది. ఆవిడ చనిపోయిన నాటికి లక్ష్మీ, విష్ణుల వయస్సులో చాలా చిన్నవారు.. తల్లి లేని లోటు వారికి తీర్చాలని మోహన్ బాబుకి నచ్చజెప్పి.. విద్యాదేవి చెల్లి అయిన నిర్మలాదేవిని ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. వీరిద్దరికీ మనోజ్ జన్మించారు. నిర్మలాదేవితో పెళ్లి తరువాత మోహన్ బాబు కోపం మెల్లిమెల్లిగా తగ్గింది.
అసెంబ్లీ రౌడీ, రౌడీగారి పెళ్లాం, అల్లరి మెుగుడు వంటి సూపర్ డూపర్ హిట్స్‌తో మంచి జోష్ మీద ఉన్న మోహన్ బాబు ప్రొడ్యూసర్‌గా మారి.. మంచి సినిమాలు నిర్మించారు. కానీ ఇక్కడ నుంచే ఆయన డౌన్ ఫాల్ మెుదలయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే.. తన వరకు వచ్చిన సినిమాలన్నింటినీ తానే ప్రొడ్యూస్ చేయాలని పట్టుబట్టేవారు.. అలా ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు ఒప్పుకున్నా.. ఆయన ఛాదస్తంతో మరొకసారి ఛాన్స్ ఇవ్వటానికే భయపడేవారట. పైగా క్రమశిక్షణ పేరిట.. కొంచెం ఎక్కువ గానే.. స్ట్రిక్ట్‌గా ఉండటంతో.. మోహన్ బాబుతో పని చేయాలంటేనే భయపడిపోయేవారు..
ఇటు వయసు మీదపడటం.. అటు తన నట వారసత్వంగా తన ఇద్దరి కుమారులను, కుమార్తెను సినీ పరిశ్రమకు పరిచయం చేయటం వంటి కారణాలతో సినిమాలకు కొంచెం దూరం అయ్యారు మోహన్ బాబు. ఇదే కాకుండా.. వయసు మీద పడతున్నా.. సినిమాల్లో హీరోగానే చెయ్యాలి.. హీరోయిన్స్‌తో రొమాన్స్ వంటి వల్ల కూడా మోహన్ బాబు సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని అంటుంటారు.
సినిమాలకు దూరం అంటే ఆయనే ప్రొడ్యూసర్‌గా చేసేయ్యాలన్న పట్టుదల ఉండటంతో.. ఆయనను వేరొక ప్రొడక్షన్‌లో పని చేయాలని చెప్పే ధైర్యం ఎవరూ చేయకపోవటంతో మెయిన్ లీడ్‌గా ఆయనను పెట్టి సినిమాలు తీసే వారు ఆయన దగ్గరకు రాలేకపోయారు. కానీ యమ దొంగ, శాకుంతలం వంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు అడగటంతో ఆ క్యారెక్టర్స్ చేశారనే చెప్పాలి..
నిజం చెప్పాలంటే.. మోహన్ బాబు మంచి నటుడు అయినప్పటికీ, ఆయన వయస్సుకు తగ్గ పాత్రలు ఎన్నుకోకపోవటమే ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. ఆయనతో పాటుగా సినీ ఇండస్ట్రీకి హీరోగా వచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిన వారిని చూసైనా.. మోహన్ బాబులో మార్పు రాలేదు.
మోహన్ బాబుతో పాటు.. ఆయన పిల్లలు కూడా.. ఆయన చేసే క్రింజ్‌కు మేము ఏమాత్రం తగ్గము అన్నట్లు బిహేవ్ చేయటం మెుదలు పెట్టారు. మంచు విష్ణుపై వచ్చే ట్రోలింగ్స్ ఎలా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉంటాము.. ఇక మంచు లక్ష్మి విషయానికి వస్తే.. ఆమె చేసిన కామెంట్స్ వల్ల.. మంచు ఫ్యామిలీ మరింత ట్రోలింగ్‌కు గురైంది. ఏంటంటే.. నేను హాలీవుడ్ రేంజ్ యాక్టర్‌ను.. నాకు తగ్గ యాక్టర్స్ ఇక్కడ ఎవరూ లేరు అని లక్ష్మీ మంచు చేసిన కామెంట్స్ అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి.
ఇవన్నీ మంచు ఫ్యామిలీ శాపంగా మారాయి. కలెక్షన్ కింగ్ అని పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ఇమేజ్ ఎంతలా పడిపోయిందంటే.. అప్పట్లో వచ్చిన సన్ ఆఫ్ ఇండియా కలెక్షన్లే సాక్ష్యం.. ఆ సినిమాలో ఒక సాంగ్‌కు కోసం పెట్టిన పెట్టుబడిలో కేవలం పది శాతం మాత్రమే వచ్చిందంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. అర్థం చేసుకోవచ్చు..
ఇక దాసరి చనిపోయిన తరువాత.. ఆయన గురించి మోహన్ బాబు చెప్పిన విషయం ఒకటి ఫుల్ వైరల్‌గా మారింది. మోహన్ బాబు ఫస్ట్ మూవీ అయిన స్వర్గం నరకం షూటింగ్ జరుగుతున్నప్పుడు.. డైలాగ్స్ చెప్పటంలో తడబడ్డారంట కలెక్షన్ కింగ్.. ఒక్క డైలాగ్ కోసం ఏకంగా దాదాపు 20 టేక్స్ తీసుకున్నాడంట.. దీంతో ఆ మూవీ డైరెక్టర్.. దాసరి నారాయణరావు గారు.. కోపంతో అక్కడ అందరూ చూస్తున్నా.. బూటు కాలితో తన్నారంట. ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు మోహన్ బాబు. కానీ గురువు గారు అలా చేయటం వల్లే తరువాత ఇంకెప్పుడూ షూటింగ్‌లో బెరుకుగా లేకుండా.. కాన్ఫిడెంట్‌గా ఉన్నానని చెప్పుకొచ్చారు.
ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి, మోహన్ బాబుకు సెపరేట్ ఇమేజ్ వుంది. వీళ్లిద్దరు కలిసి అప్పట్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. అందులో కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోలుగా నటించారు. కొన్ని సినిమాల్లో చిరు హీరోగా నటిస్తే.. మోహన్ బాబు విలన్‌గా యాక్ట్ చేసారు. అయితే ఓ సందర్భంలో చిరుకు మోహన్ బాబు పెద్ద లైఫ్ ఇచ్చారు.
అప్పట్లో చిరంజీవి ఎస్పీ పరశురామ్, ది జెంటిల్మెన్, బిగ్ బాస్, రిక్షావోడు వంటి డిజాస్టర్ మూవీస్‌తో వరుసగా మూడేళ్లు ఫ్లాపులతో సతమతమయ్యారు. అలాంటి సమయంలో చిరంజీవికి లైఫ్ ఇచ్చిన మూవీ హిట్లర్. ఈ సినిమాను ముందుగా నిర్మాతలు చిరంజీవితో చేయాలనుకోలేదు. మోహన్ బాబుతో తీయాలనుకున్నారు.. కానీ కాల్షీట్స్ ఖాళీగా లేకపోవటంతో.. ఆ సినిమాను రిజెక్ట్ చేశారు మోహన్ బాబు. అలా హిట్లర్ మూవీ చిరంజీవి చేతిలో పడటం.. అది సూపర్ హిట్ కావటం.. అలా చిరంజీవి మళ్లీ హీరోగా నిలదొక్కుకోవటానికి కారణం అయ్యారు మోహన్ బాబు.