మంచు లక్ష్మికి నటిగా ఎందుకు ఫేమ్‌ రావటం లేదు?

మంచు లక్ష్మికి నటిగా ఎందుకు ఫేమ్‌ రావటం లేదు?మెుదటి భర్త నుంచి విడిపోవటానికి కారణం..భర్తకు సైతం దూరంగా ఎందుకు ఉంటుంది?మంచు లక్ష్మి జీవితంలో తండ్రే విలనా.?Sri media News

Jun 10, 2024 - 17:01
 0  6
మంచు లక్ష్మికి నటిగా ఎందుకు ఫేమ్‌ రావటం లేదు?

మంచు లక్ష్మి అంటే పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కలెక్షన్‌ కింగ్‌ గారాల పట్టి.. మోహన్‌ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె.. హీరోయిన్‌గా, విలన్‌గా, క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా, టీవీ హోస్ట్‌గా, ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.  అయితే కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు లక్ష్మి సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గానే ఉంటున్నారు. తన లేటెస్ట్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. అడపాదడపా గ్లామర్ షో కూడా చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నారు. మంచు లక్ష్మి అనగానే డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌.. ఏం అనుకుంటే అది చేసేస్తుంది.. గడుసుది అనుకునేవారు చాలా మంది ఉంటారు.. కానీ ఆమె మనస్సు చాలా మంచిది.. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలపై ఏనాడూ పబ్లిసిటీ చేసుకోలేదు.. కుడి చేత్తో చేసిన సాయం.. ఎడమ చేతికి తెలియకూడదు అని అంటుంటారు కదా.. ఆ రూల్‌ని మాత్రం పాటిస్తారు మంచు లక్ష్మి.. ఎంతో టాలెంట్‌ ఉన్నా.. మంచు లక్ష్మికి నటిగా ఎందుకు ఫేమ్‌ రావటం లేదు? మంచు లక్ష్మీ మెుదటి భర్త నుంచి విడిపోవటానికి కారణం మోహన్‌ బాబేనా? ప్రస్తుత భర్తకు సైతం దూరంగా ఎందుకు ఉంటుంది? సరోగసి ద్వారా బిడ్డను ఎందుకు కన్నది? తెలుసుకుందాం రండి

మంచు లక్ష్మీ ప్రసన్న 1977 అక్టోబర్‌ 8న చెన్నైలో పుట్టింది. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు-విద్యాదేవిల ఏకైక కుమార్తె.. అయితే లక్ష్మీ ప్రసన్న చిన్నప్పుడే.. విద్యా దేవి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.. దీంతో విద్యా దేవి చెల్లి అయిన నిర్మలా దేవినే పెళ్లి చేసుకున్నారు. లక్ష్మీ ప్రసన్నకు మంచు విష్ణు, మంచు మనోజ్‌ తమ్ముళ్లన్న విషయం మనకు తెలిసిందే..
మంచు లక్ష్మీ స్కూలింగ్‌ మెుత్తం చెన్నైలోనే జరిగింది. కుటుంబంలో ఏకైక ఆడబిడ్డ కావటంతో.. కొంచెం గారాబంగానే పెంచారు లక్ష్మీ ప్రసన్నను.. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుంది.. అయితే పుట్టింది, పెరిగింది, చదివింది మెుత్తం చెన్నైలోనే కావటంతో.. తెలుగు అంతగా వచ్చేది కాదు.. దీంతో తెలుగు మర్చిపోతుందేమోనన్న భయంతో.. మోహన్‌ బాబు తిరుపతిలో ఉన్న వాళ్ల కాలేజ్‌లోనే ఇంటర్‌ జాయిన్‌ చేసేశారు.. అలా అక్కడ ఫ్రెండ్స్‌, అమ్మమ్మ ద్వారా తెలుగు బాగానే నేర్చుకుంది. ఆ తరువాత హైదరాబాద్‌లోని నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో వన్‌ ఇయర్‌ కోర్స్‌ చేసింది. ఆ తరువాత లక్ష్మీ ప్రసన్నను ఒప్పించి మరీ.. అమెరికాలోని ఓక్లాహోమా సినీ యూనివర్సిటీకి పంపించేశారు.. అందులో థియేటర్‌లో బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేశారు.. ఇక అక్కడ కోర్స్‌ పూర్తి అయినా సరే.. ఇండియాకి రాకుండా.. అమెరికాలోనే సీరియల్స్‌లో, మూవీస్‌లో యాక్ట్‌ చేశారు. మెుదటిగా లాస్‌ వేగాస్‌ అనే సీరియల్‌లో 2004లో స్క్రీన్‌పై కనిపించారు. ఆ తరువాత ది ఓడ్‌ అనే హాలీవుడ్‌ మూవీలోనూ ఓ చిన్న క్యారెక్టర్‌ ప్లే చేశారు. ఆ తరువాత డెడ్‌ ఏఎమ్‌, Thank you for Washing అనే మూవీస్‌లో కనిపించింది.. అక్కడున్నప్పుడే.. రాఘవేంద్ర రావు కుమారుడు అయిన ప్రకాష్‌ కోవెలపూడి పరిచయం అయ్యాడు..
యూఎస్‌లో ఉండి సీరియల్స్‌, మూవీస్‌లో చిన్న చిన్న పాత్రలు తన కూతురు చేయటం ఇష్టం లేని మోహన్‌ బాబు..  మంచు లక్ష్మీని హైద్రాబాద్‌కు రప్పించేశారు. అలా ఇండియాకు వచ్చిన తరువాత.. తనకు ఫ్రెండ్‌ అయిన ప్రకాష్‌ కోవెలపూడి డైరెక్షన్‌లో వచ్చిన అనగనగా ఓ ధీరుడు మూవీలో.. విలన్‌ పాత్ర పోషించింది.. అలా ఐరేంద్రి పాత్రతో మంచి మార్కులే కొట్టేసింది.. ఈ సినిమాలో ఈమె యాక్షన్‌ చూసిన మణిరత్నం.. కడలి మూవీలో ఛాన్స్‌ ఇచ్చారు. అలా తమిళ్‌ ఇండస్ట్రీలోకి వెళ్లింది.. ఆ తరువాత దొంగల ముఠా, ఊకొడతారా ఉలిక్కిపడతారా, గుండెల్లో గోదారి, లక్ష్మీ బాంబ్‌ వైఫ్‌ ఆఫ్‌ రామ్‌, పిట్ట కథలు మూవీస్‌లో యాక్ట్‌‌ చేశారు. ఇక ప్రొడ్యూసర్‌గా శ్రీ, నేను మీకు తెలుసు, ఝుమ్మంది నాథం మూవీస్‌కి పని చేశారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క షోస్‌లో యాంకర్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. లక్ష్మీ మంచు యాక్టింగ్‌కు రెండు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, రెండు నంది అవార్డులు కూడా వచ్చాయి.

మంచు లక్ష్మి ఇండియాకు వచ్చే వరకు ఆమె గురించి తెలిసింది తక్కువే. ఫిల్మ్ సర్కిల్స్ తో పాటు సన్నిహితులకు మాత్రమే మంచు లక్ష్మి వ్యక్తిగత జీవితంలోని కోణాలు తెలుసు. ఈ జనరేషన్‌కి తెలియని మరో విషయం ఆమెకు రెండు పెళ్లిళ్లు జరిగాయి. వికీపీడియాలో ఆమె బయోగ్రఫీలో రెండో భర్త వివరాలు మాత్రమే ఉంటాయి. 90లలోనే మంచు లక్ష్మి వివాహం చేసుకుంది. ల‌క్ష్మి హైద‌రాబాద్‌లోని కాలేజ్‌లో చ‌దువుకునే రోజుల్లో స్నేహితుడు లండ‌న్ శ్రీనివాస్‌ను ప్రేమించింది.. ఈ విషయం మోహన్‌ బాబుకి తెలియటంతో.. శ్రీనివాస్‌ని మర్చిపోవాలని.. చాలా ప్రెజర్‌ చేశారంట.. అంతేగాకుండా.. అతన్ని మర్చిపోకపోతే.. ఎంత దూరంకైనా వెళ్తా అని వార్నింగ్‌ కూడా ఇచ్చారంట.. దీంతో.. మోహన్‌ బాబు అవుట్‌డోర్‌ షూటింగ్‌ పెళ్లిన టైమ్‌లో.. మంచు లక్ష్మీ-లండన్‌ శ్రీనివాస్‌ని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసేసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న మోహన్‌ బాబు.. తన కూతుర్ని.. ఆమె భర్తని ఎలాగైనా విడదీయాలని అనుకున్నాడంట.. అంతేగాకుండా.. శ్రీనివాస్‌ ఫ్యామిలీ, రిలేటివ్స్‌ని రౌడీలతో ఇబ్బంది కూడా పెట్టించారంట.. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో.. ఇండస్ట్రీ పెద్దలు అయిన దాసరి నారాయణ, మురళీ మోహన్‌, ఎర్రగడ్డ సురేష్‌తో పంచాయతీ పెట్టించారు. పెళ్లి అయ్యి సంవత్సరం అయినా పట్టు వీడని మోహన్‌ బాబు.. శ్రీనివాస్‌కి ఎక్కడా జాబ్‌ దొరక్కుండా చేయటం, అతన్ని కొట్టించటం, బెదిరించడం ఆపలేదు.. దీంతో తండ్రికి ఎలాగైనా నచ్చజెప్పాలని ఇంటికి వెళ్లిన మంచు లక్ష్మీ.. తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు.. దీంతో శ్రీనివాస్‌.. అప్పటి డీజీపీ, హోం మినిష్టర్‌, చీఫ్‌ మినిష్టర్లకు సైతం ఫిర్యాదు చేశాడు.. కానీ మోహన్‌ బాబు పలుకుబడి, డబ్బు ముందు.. శ్రీనివాస్‌ ప్రేమ తేలిపోయింది.

అలా మంచు లక్ష్మి-శ్రీనివాస్ మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. మంచు లక్ష్మి భర్త.. శ్రీనివాస్ ఈ గొడవల విషయంలో మోహన్ బాబును తప్పుబట్టారు. ఆయన కారణంగానే మా వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు. అప్పట్లో మంచు లక్ష్మి భర్త శ్రీనివాస్ చేసిన ఈ స్టేట్‌మెంట్‌ వార్తలకెక్కింది. మా కాపురంలో మామ మోహన్ బాబు చిచ్చు పెడుతున్నాడు అంటూ శ్రీనివాస్ ఆవేదన చెందాడంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే శ్రీనివాస్‌ అంటే తన తండ్రికి ఇష్టం లేకపోవటం, తను శ్రీనివాస్‌ని వదలకపోతే అతని ప్రాణాలకే ముప్పు ఉందని గ్రహించిన మంచు లక్ష్మీ.. తండ్రి కోసం ప్రేమను వదిలేసింది.. అలా మెుదటి భర్త శ్రీనివాస్‌కి విడాకులు ఇచ్చేసింది. ఇక్కడే ఉంటే మంచు లక్ష్మీ మనసు మార్చుకుంటుందని.. అమెరికాలోని థియేటర్‌ కోర్స్‌కి పంపించేశాడు మోహన్‌ బాబు.. తన ప్రేమను దూరం చేసిన తండ్రిని డబ్బులు అడగకూడదని.. అక్కడే సీరియల్స్‌లో, మూవీస్‌లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది మంచు లక్ష్మీ. అక్కడే ఓ సీరియల్‌ ఆర్టిస్ట్‌తో లక్ష్మీ మళ్లీ ప్రేమలో పడిందని తెలుసుకున్న మోహన్‌ బాబు.. ఇండియాకి రప్పించేసి.. అప్పటికే ఫిక్స్‌ చేసిన బ్రాహ్మిణ్‌ ఫ్యామిలీకి చెందిన ఆండీ శ్రీనివాస్‌తో పెళ్లి చేసేశారు..

అలా 2006లో చెన్నైకి చెందిన ఆండీ శ్రీనివాసన్ అనే వ్యక్తిని మంచు లక్ష్మి రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి నిరాడంబరంగా జరిగింది. వివాహమయ్యాక మంచు లక్ష్మి అమెరికా వెళ్లిపోయారు. అక్కడ కొన్ని టెలివిజన్ షోలు చేశారు. ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. 2011లో ఇండియాలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు మూవీలో విలన్ రోల్ చేశారు.
ఇక ఆండీ శ్రీనివాస్‌ అండ్‌ మంచు లక్ష్మీ సరోగసీ పద్దతిలో ఓ పాపకు జన్మనిచ్చారు.. అయితే సరోగసి ద్వారా ఎందుకు పిల్లలు కనాల్సి వచ్చిందో మంచు లక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.. తన తమ్ముడు విష్ణుకి ఆరి, వివి అనే కవలలు పుట్టడంతో.. తనకు కూడా పిల్లలపై ఆశ కలిగి.. కనాలని అనుకుందంట లక్ష్మీ మంచు.. అయితే పిల్లల కోసం ఎన్నో హాస్పటల్స్‌ చుట్టూ తిరిగినా.. ఎన్ని మెడిసిన్స్‌ యూజ్‌ చేసినా రిజల్ట్స్‌ నెగిటివ్‌గా రావటంతో.. సరోగసి ద్వారా పిల్లలు కనటానికి ఫిక్స్‌ అయినట్లు తెలిపారు.

అయితే ల‌క్ష్మి ఎంత డేరింగ్‌గా ఉంటుందో ఆమె మ‌న‌స్సు అంత వెన్న. ఆమె తెలియ‌కుండానే ఎక్కువ సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ఉంటుంది. పేద పిల్ల‌ల‌కు త‌మ విద్యాసంస్థ‌ల్లో రాయితీల‌తో కూడిన చ‌దువు చెప్పించ‌డం, కొంద‌రికి ఫ్రీ ఎడ్యుకేష‌న్ ఇప్పించ‌డం చేస్తున్నా.. దీని గురించి ఆమె బ‌య‌ట ఎక్క‌డా చెప్పుకోరు. లక్ష్మీ చాలా కాలంగా ఇండియాలోనే ఉంటుండగా, ఆమె భర్త మాత్రం అమెరికాలో ఉంటున్నారు. దీంతో వీరి పర్సనల్ లైఫ్ మీద అనేక రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో తాను ఎందుకు భర్తతో పాటు ఉండటం లేదనే విషయం మీద ఆమె లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. పెళ్లి తర్వాత తాము యూఎస్ లో ఉన్నామని, పిల్లలు కావాలనుకున్నప్పుడు ఇండియాకి వచ్చామని చెప్పింది.

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ఇక్కడ మన దేశంలో పిల్లల్ని పెంచినట్లు అమెరికాలో పెంచలేం. అందుకే నేను ఇండియా వచ్చాను. మా ఆయన అక్కడే పనిచేస్తారు కాబట్టి అమెరికాలోనే ఉన్నారు. కానీ తరచుగా ఇక్కడకు వచ్చి కొన్ని రోజులు మాతో పాటు ఉండి వెళ్తారు. గత రెండు నెలలు ఇక్కడే ఉన్నారు. ఇటీవల పాపని తీసుకుని వెళ్లారు. ఇంకో మూడు వారాల్లో తిరిగి వస్తారు. ఆయన అమెరికాలో ఉంటారన్న మాటే కానీ, అక్కడ కన్నా ఇక్కడే ఎక్కువ ఉంటారు అని తెలిపింది.

‘‘మాకు నచ్చిన పని చేసుకుంటూ, నచ్చినట్లు ఉండాలని మేం అనుకున్నాం. కరోనా మనకు ఎంతో నేర్పింది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఎవరో ఫీల్ అవుతారని ఆయన పని వదిలేసుకొని, నా పని వదిలేసుకొని బ్రతకలేం. ఇద్దరి పీస్ ఆఫ్ మైండ్ కు తగ్గట్టుగా ఉంటున్నాం. ఇదే చాలా బాగుంది'' అని మంచు లక్ష్మి చెప్పింది. ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్లే మనల్ని మోసం చేస్తారని నటి మంచు లక్ష్మి తెలిపింది. జనాలు మోసం చెప్పినప్పుడు ఈ బ్రతుకెందుకు, నేను చచ్చిపోతే బాగుండు అని చాలా సార్లు అనిపించిందని చెప్పింది.

''నమ్మిన వాళ్లు మోసం చేసినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. ఆ బాధను నేను అనుభవించా. ఎదుటి వ్యక్తులు ఏం చెప్పినా నమ్మేదాన్ని. నేను మోహన్‌ బాబు గారి అమ్మాయిని కదా, నన్నెవరు మోసం చేస్తారు అనే ధీమా ఉండేది. కానీ, నన్నే మోసం చేశారు. అది కూడా తెలిసినవాళ్ళే. ఈ విషయాన్ని బయటకు వచ్చి నేను చెప్పుకోలేను. ఆ వ్యక్తులెవరో ఇప్పుడు చెప్పి అనవసరంగా వాళ్ళను ఫేమస్ చెయ్యను. నన్ను వాడుకొని వాళ్ళు పైకి వెళ్లారు. మనకు కరెక్ట్ కాదు అనుకున్నవాళ్ళని మనం దూరం పెడతాం. కానీ మనవాళ్ళు అని నమ్మించి బుట్టలో వేసినవారే మోసం చేస్తారు.

వాళ్ళు 30 ఏళ్లుగా తెలుసు.. మా ఫ్యామిలీకి మంచి స్నేహితులని బాగా నమ్మా. వాళ్లను నమ్మొద్దని నాన్న ఎన్నోసార్లు చెప్పారు. నేను వినలేదు. వాళ్లు మోసం చేసినప్పుడు మనసు విరిగిపోయింది. దాని గురించి మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది. నా పాప వల్ల ఆ బాధ నుంచి బయటకు రాగలిగాను’’ అని మంచు లక్ష్మి చెప్పింది. తనపై వచ్చే మీమ్స్ చూసి ఎంజాయ్‌ చేస్తుంటానని, కానీ కొందరు కావాలని నెగెటివ్‌గా ట్రోల్స్‌ చేస్తున్నప్పుడు బాధపడిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చింది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow