సాధారణంగా ఏదైనా కష్టం వస్తే.. డాక్టర్ దగ్గరికి వెళ్లి.. దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటారు.. కానీ డాక్టర్‌కే సమస్య వస్తే.. ఎక్కడికి వెళ్లాలను అనుకుందో ఏమో.. కనీసం పిల్లల గురించి కూడా ఆలోచించకుండా.. సూసైడ్ చేసేసుకుంది.. అసలు ఆ డాక్టర్ లైఫ్‌లో ఏం జరిగింది.. ఎందుకు సూసైడ్ చేసుకుంది?
కొచ్చిలోని కక్కనాడులోని ఓ ఫ్లాట్‍లో డెంటల్ డాక్టర్ బిందు చెరియన్ ఆత్మహత్య చేసుకుంది. తిరువనంతపురంలోని ఎర్నాకులంలో బిందు డెంటల్ డాక్టర్‌గా వర్క్ చేస్తుంది. ఆమెకు భర్త పిల్లలు ఉన్నారు. అయితే వీరి కోజికోడ్‌లో ఉంటుండగా. ఆమె వృత్తి రీత్యా కొచ్చిలో ఉంటోంది. పిల్లల స్కూల్స్, భర్త ఉద్యోగం కోజికోడ్‌లో ఉండటంతో.. కొచ్చిలో బిందు ఒంటరిగా ఫ్లాట్ తీసుకొని ఉండటం స్టార్ట్ చేసింది. ఏమాత్రం సెలవులు దొరికినా, భర్త, పిల్లలు దగ్గరికి వెళ్లిపోయేది. అయితే కొన్ని రోజులుగా ఫ్లాట్ నుంచి ఆమె బయటకు రాకపోవటం, ఫ్లాట్ నుంచి దుర్వాసన రావటంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. పోలీసులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా.. బిందు ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతదేహం దగ్గర సూసైడ్ నోట్ కూడా ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె చనిపోయినట్లు అందులో రాసి ఉంది. దీంతో, బిందు సూసైడ్ విషయాన్ని కుటంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు పోలీసులు.
డాక్టర్‌గా పని చేస్తున్న ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఉండటం ఏంటి అసలు ఆమె చనిపోవటానికి ఆర్థిక ఇబ్బందులే కారణమా.. లేక ఇతర కోణాలున్నాయా అనే విషయంపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే డాక్టర్ చదివి.. దంత వైద్యురాలిగా రాణిస్తున్న బిందు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం కలిగించింది. వైద్యురాలిగా ఎంతో మందికి సేవలిందించే బిందు.. ఇలా చేయడమేమిటని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే బిందు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆమె కుటుంబ సభ్యులు. తల్లి కోసం పిల్లలు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
కనీసం ఆ ఇద్దరి పిల్లల గురించి అయినా ఆలోచించి.. బిందు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అని కుటుంబ సభ్యులు బాధను వ్యక్తం చేశారు. సమస్య ఎంత పెద్దది అయినా.. సొల్యూషన్ ఉంటుంది. అంతేకానీ ప్రతి ప్రాబ్లమ్‌కు ఆత్మహత్య పరిష్కారం కాదని చాలా మంది అంటుంటారు. మరికొంత మంది వాదన మరోలా ఉంటుంది..ఆ సిచ్చుయేషన్ ఎదురైతే అలాగే ఆలోచన చేస్తుంటారని చెబుతుంటారు. ఏదీ ఏమైనప్పటికీ.. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మానసిక నిపుణులను సంప్రదించాలని చాలా మంది సూచిస్తుంటారు.. ఒక డాక్టర్‌గా సేవలు అందించిన బిందు కూడా ఇలా సూసైడ్ చేసుకోవటం పట్ల తీవ్ర చర్చ జరుగుతుంది. హ్యాపీ ఫ్యామిలీ కాస్తా.. ఇప్పుడు.. సాడ్ ఫ్యామిలీగా మారిపోయింది.