కల్కి ఇక్కడే ఎందుకు జన్మిస్తాడు? శంబలపై హిట్లర్‌కు ఆసక్తి ఎందుకు?
ప్రభాస్ నటించిన‘కల్కి 2898 AD’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.‘కల్కి 2898 AD’ సినిమా గురించి నాగ్ అశ్విన్ ఇంటర్వ్యూలు, ట్రైలర్‌లు విడుదలైన నాటి నుంచి దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు శంబల. మరి నిజంగానే ఈ నగరం ఉందా.. Sri Media News
ప్రభాస్ నటించిన‘కల్కి 2898 AD’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.‘కల్కి 2898 AD’ సినిమా గురించి నాగ్ అశ్విన్ ఇంటర్వ్యూలు, ట్రైలర్‌లు విడుదలైన నాటి నుంచి దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు శంబల. మరి నిజంగానే ఈ నగరం ఉందా.. ఉంటే ఎక్కడ ఉంది.. ఇప్పటి వరకు ఎవరైనా శంబలకు వెళ్లారా.. దీని గురించి పురణాలు, వేదాల్లో ఎక్కడైనా ప్రస్తావన ఉందా? కల్కి ఇక్కడే ఎందుకు జన్మిస్తాడు? శంబల ప్రత్యేకత ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
శ్రీ మహావిష్ణువు పది అవతారాల్లో చివరిది కల్కి. ఆయన జన్మించబోయే పవిత్ర ప్రదేశమే శంబల. దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతం. హిమాలయాల్లో అంతుచిక్కని ప్రదేశం. సాక్షాత్తు శివుడు కొలువు ఉండే మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఎక్కడో పుణ్యభూమి శంబాలా ఉంటుందని , ఆ ప్రదేశం అంతా అధ్బుతమైన సువాసన అలుముకొని ఉంటుందని అంటారు. పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలాను వీక్షించడం ఎంతో మధురానుభూతి కలిగిస్తుందని చెబుతారు.
బౌద్ద గ్రందాలను బట్టి శంబాలా చాలా ఆహ్లాదకరమైన చోటు .ఇక్కడ నివసించే వారు నిరంతరం సుఖ, సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు. పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని ‘ది ఫర్బిడెన్ ల్యాండ్’ అని, ‘ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్’ అని అంటారు. చైనీయులకు కుడా శంబాలా గురించి తెలుసు. లోకంలో పాపం పెరిగిపొయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబాలాలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లో తీసుకుంటారు.. అదే సయయంలో కల్కి జన్మిస్తాడని, అప్పటి నుంచి ఈ పుడమి పైన కొత్త శకం ప్రారంభం అవుతుందని కొన్ని గ్రంధాలు చెప్తున్నాయి.
1903లో కొందరు భారతీయ శాస్త్రవేత్తలు, కొందరు గూఢచారులు శంబల నగరాన్ని అన్వేషిస్తూ.. వెళ్లారు. ఈక్రమంలో వీరు తమ ప్రయాణంలో.. హిమాలయాల్లో చూసిన వింతలన్నింటిపై ఓ నివేదిక తయారు చేశారు. ఇది అప్పట్లో.. పెను సంచలనం సృష్టించింది. ఈ నివేదిక చదివాక చాలా మంది శంబలను చూడాలని ప్రయత్నాలు చేశారు. అయితే శంబల గురించి ప్రపంచానికి మొదట తెలియజేసిన వ్యక్తి నికోలస్ రోయిచ్. రష్యన్ చిత్రకారుడు, రచయిత, పురావస్తు శాస్త్రవేత్త, థియోసాఫిస్ట్, తత్వవేత్త అయిన నికోలస్ రోయిచ్.. రాసిన పుస్తకాల ఆధారంగానే జనాలకు శంబల గురించి ఎక్కువ వివరాలు తెలిశాయి.
భారతీయ సంప్రదాయాలకు ముగ్ధుడైన రోయిచ్.. కులు ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని ఉండిపోయాడు. ఆయన మరణించే వరకు శంబల గురించి అన్వేషిస్తూనే ఉన్నాడు. రోయిచ్ మరణం తర్వాతే శంబలకు సంబంధించిన రహాస్యాలు చాలా వెలుగు చూశాయి. కులులో ఉన్న రోయిచ్ ఎగ్జిబిషన్లో.. ఈ వివరాలన్నీ ఉన్నాయి. రోయిచ్ శంబలకు వెళ్లే దారిని ఓ చిత్రంలో రహస్యంగా చిత్రీకరించాడని.. ఆయన గీసిన బొమ్మల్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తే.. శంబలకు వెళ్లే దారి తెలుస్తుందని అంటారు. ఇక రోయిచ్ రాసిన పుసక్తంలో కల్కి జన్మించడానికి ముందు ఎర్రని రాయితో చేసిన గుర్రం సకిలించడమే కాక.. ఈ జీవశిల దేశంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతుందని.. సరిగ్గా కల్కి జన్మించడానికి ముందు శంబలకు చేరుకుంటాడని రోయిచ్ తన రచనల్లో చెప్పుకొచ్చాడు. ఈ మెరిసే శిలనే చింతామణి అంటారు. కల్కిని వర్ణిస్తూ గీసే చిత్రాల్లో ఈ చింతామణి కనిపిస్తుంది.
13వ దలైలామా తన గురువు తాషీలామాతో కలసి తాళపత్ర గ్రంధాల్లో రాసిన ఎన్నో రహస్య విషయాల్లో ఈ శంబల గురించి కూడా ఉంది. 'శంబలకు వెళ్లే దారి' అనే పేరుతో తాషీలామా ఓ గ్రంధాన్ని రచించారు. హిమాలయా పర్వతాలకు ఉత్తరాన ఉన్న మంచు పర్వతాల్లో ఓ రహస్య స్థావరం ఉంది. అక్కడ చాలామంది మహర్షులు ధ్యానంలో ఉన్నారు. శంబలలో వయసుని స్తంభింపజేసి నిత్యయవ్వనాన్ని ప్రసాదించే ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయి. అక్కడున్న యోగులలో అద్భుతమైన శక్తులున్నాయని తాషీలామా రాసిన గ్రంధంలో ఉన్నాయి కూడా.
హైందవ పురాణాల్లో శంబల ప్రాంతాన్ని సిద్ధశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని అంటారు. త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం. శంబళలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టపం అని పిలిచేవారు. ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్‌గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని ‘రూప్ ఆఫ్ ది వరల్డ్’ అని కూడా అంటారు. చైనా భూభాగంలో ఉన్న కైలాశ పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య నరగం శంబళ ఉందని నమ్ముతారు... అంతే కాదు మరి కొందరు చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం.. ఎవరెస్ట్ అడుగున ఓ సొరంగం మార్గం ఉంది. దాని గుండా వెళ్తే.. గడ్డకట్టిన మంచునది ఉంటుంది. దాని అడుగున ఓ సొరంగం ఉంది. దాన్ని దాటితే ఓ పర్వతం వస్తుంది. దానిలో ఓ గుహ వస్తుంది. ఇక్కడ సిద్ధపురుషులు తపస్సు చేస్తుంటారు అని చెబుతారు. వారిని దాటుకుని వెళ్తే.. మంచుకొండల మధ్యన స్ఫటిక పర్వతం, శ్రీచక్రం కనిపిస్తాయి. ఈ స్ఫటిక పర్వతం కిందనే రహస్యంగా ఉన్న నగరం శంబల అంటారు. టిబెటన్లు.. శంబలను ఇప్పటికీ మహిమాన్విత ప్రాంతంగా విశ్వసిస్తారు. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే చూడగాలరని... ప్రవేశించగలరని అంటారు.
ఈ నగరాన్ని చూడాలంటే.. స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబళ నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో ఉంది. అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంబళ నగరాన్ని చూసి రావడం గమనార్హం. ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయ ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పనికాదు. మానవ శరీరంలో ఉండే సుశుమ్న నాడీ తెరుచుకున్నవారికి మాత్రమే శంబళ నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసినా.. పూర్వ కర్మల వల్ల శంబళకు వెళ్లే దారి కనుగోలేరు.
శంబల నగరం గురించి తెలుసుకున్న హిట్లర్‌కు ఆ నగరంపై ఆసక్తి పెరిగింది. అక్కడ ఉన్న అద్భుత శక్తుల గురించి తెలుసుకోవాలని భావించాడు.. శంబల నగరాన్ని చూడాలని ఆశతో అల్టిమా తులే అనే టీమ్‌ను హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు. అయితే, వారి శ్రమ ఫలించలేదు. శంబళ నగరాన్ని కనుగొనలేక వెనుతిరిగారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ శంబల నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి పద్మాకర్. 1980లో ఆయన హిమాలయాల్లోని ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాన్ ఏర్పడిందని, ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో ఓ సుమారు 20 అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకుని జనావాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడని ఆయన చెప్పాడు. దివ్యదృష్టి గల వ్యక్తులకు శంబళలోకి ప్రవేశం సులభమని, ఇది కేవలం యోగసాధానతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకు వెళ్లిన వ్యక్తులు కేవలం శంబళ నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్లు తెలుస్తుంది. అసలైన రహస్య నగరంలోకి అడుగుపెట్టడం వారికి సాధ్యం కానట్లు వారు చెప్పారు కూడా
కలియుగం ప్రారంభానికి ముందు శంబలలో వ్యాస మహర్షి తపస్సుచేశాడు..హిమాలయాల్లో ప్రవహించే బియాస్ నది అసలు పేరు వ్యాస్ నది. కాలక్రమేణా బియాస్ గా మారింది. భాగవతం చివరి స్కందం వ్యాసుడు ఈ ప్రాంతంలోనే రచించాడని చెబుతారు. అందుకే భాగవత చివరి స్కందంలో కల్కి అవతారం, శంబల గురించి...ధర్మ సంస్థాపన గురించి రాశారు.
What's Your Reaction?