చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులు వీరేనా....

చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులు వీరేనా లోకేష్ మంత్రి పదవి తీసుకుంటాడా..? కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్..? టీటీడీ బోర్డ్‌ ఛైర్మన్‌గా నాగబాబు?

Jun 6, 2024 - 15:42
Jun 6, 2024 - 18:11
 0  12
చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులు వీరేనా....

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో కూటమికి  ఏపీ ప్రజలు భారీ విజయం అందించారు. రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా.. ప్రాంతమేదైనా ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కన్ఫూజన్ లేకుండా కూటమికి పట్టం కట్టారు.   2019 ఎన్నికల్లో జనసునామీ సృష్టించి 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ.. చతికిలిపడిపోయింది. వైసీపీ ఓటమికి, టీడీపీ విజయానికి బీజం పడింది... టీడపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 12న జరపడానికి టీడీపీ నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు నాయుడు గారుతో పాటు మరికొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రులుగా ఎవరికి చోటు దక్కనున్నది అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది.
జనసేన పార్టీ నుంచి ఎంతమందికి కేబినెట్‌లో చోటు కల్పించబోతున్నారు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీజేపీ నుంచి ఎంతమందికి చోటు కల్పించనున్నారు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

అయితే తాజాగా ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఎన్డీఏ భాగస్వామ్యం కావడం వల్ల కేంద్ర క్యాబినెట్‌లో కూడా టీడీపీలో కొందరికీ మంత్రి పదవులు దక్కుతాయి. ఆ అవకాశం హ్యాట్రిక్‌ విక్టరీ సాధించిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి వస్తుందని తెలుస్తుంది. అంతేకాదు... పవన్ కళ్యాణ్‌‌కి కూడా కేంద్ర క్యాబినెట్‌‌లో పదవీ దక్కనుందని.... అంతేకాదు... నారా లోకేష్‌‌కి కూడా కేంద్ర పదవి దక్కనుందని కాబట్టి వీరు... చంద్రబాబు క్యాబినెట్‌‌లో ఉండే అవకాశం లేదని తెలుస్తుంది.


శ్రీకాకులం జిల్లాలో హ్యాట్రిక్‌ విక్టరీతో ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా కింజరాపు అచ్చెన్నాయుడు, వరుసగా మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా బెందాళం అశోక్, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి ఉన్నారు.    

జిల్లాలో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే టీడీపీ రాజకీయం రసవత్తరం కానుంది. కీలకమైన వెలమ సామాజిక వర్గానికివ్వాలా? కాళింగ సామాజిక వర్గానికా? అన్న చిక్కుముడి తప్పక ఉంటుంది. వెలమ సామాజిక వర్గానికే ఇవ్వాల్సి వస్తే అచ్చెన్నాయుడికే దాదాపు ఇచ్చే అవకాశం ఉంది. కాళింగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే రెండు సార్లు గెలిచి, గతంలో పార్టీ విప్‌గా పనిచేసి, ఇటీవల ఎన్నికల వరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కూన రవికుమార్‌కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. మూడు సార్లు గెలిచారని పరిగణనలోకి తీసుకుంటే ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌పై ఆలోచన చేసే అవకాశం ఉంది.


కానీ, టీడీపీ రాజకీయాలు శాసిస్తున్న వారిగా చూస్తే కూన రవికుమార్‌కే అగ్రతాంబూలం ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్త సమీకరణాల నేపథ్యంలో జిల్లాలో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే మాత్రం సామాజిక వర్గ చిచ్చు రేగక తప్పదు. వెలమ సామాజిక వర్గానికిస్తే కాళింగులకు అనాయ్యం చేశారని, కాళింగులకు ఇస్తే వెలమలకు ముఖ్యంగా సీనియరైన కింజరాపు అచ్చెన్నాయుడికి మొండి చేయి చూపారని, అన్యాయం చేశారని ఆ సామాజిక వర్గం అనుకోక తప్పదు. జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులిస్తేనే ఆ రెండు సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్టు అవుతుంది.

లేదంటే ఒకరికి మంత్రి పదవి, మరొకరికి గతంలో మాదిరిగా విప్‌ ఇచ్చి సర్దుబాటైనా చేసి చేతులు దులుపుకోవచ్చు. ఈ సమయంలో అటు కాపుల నుంచి, ఇటు గౌతు ఫ్యామిలీ నుంచి గాని మంత్రి పదవి ఆశించే అవకాశం ఉండదు. జిల్లాలో ఎక్కువగా కాపులున్నప్పటికీ ఇతర జిల్లాల సమీకరణాల నేపథ్యంలో ఈ జిల్లా నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేకు అవకాశం వచ్చే ఛాన్స్‌ లేదు. ఇక, గౌతు ఫ్యామిలీని తీసుకుంటే తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేగా శిరీషకు నచ్చ చెప్పి సమర్థించుకోవడానికి అవకాశం ఉంది. ’

గుంటూరు జిల్లా నుంచి నారా లోకేష్, ధూళిపాళ్ల నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో నరేంద్ర మినహా మిగితా వారందరు మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. అయితే వీరందరికి అవకాశం ఇస్తారా లేదా అనేది మాత్రం చూడాలి.అయితే గతంలో చంద్రబాబు క్యాబినెట్లో  మంత్రులుగా చేసిన వారిలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రతిపాటి పుల్లారావు ఒకరు. 2014ఎన్నికలలోటిడిపి నుంచి గెలిచిన పుల్లారావుకి చంద్రబాబు నాయుడు ముఖ్యమైన వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత అప్పగించారు. మరలా క్యాబినెట్ విస్తరణలో భాగంగా పుల్లారావుని పౌరసరఫరాల శాఖ మంత్రిగానియమించారు.

చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన పుల్లారావుకు క్యాబినెట్లో చోటు దొరికే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుత క్యాబినెట్లో చంద్రబాబు పుల్లారావు ఏ పదవి బాధ్యతలపై ఇస్తారో అనే అంశంపై నియోజకవర్గంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.ప్రస్తుత ఎన్నికలలో టిడిపి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు వైసీపీ అభ్యర్థి కాబట్టి మనోహర్ నాయుడు పై 33 వేల పైచిలుకు ఓట్లతో మెజారిటీ సాధించారు.

విజయనగరం జిల్లా నుండి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కళా వెంకట్రావు, గుమ్మడి సంధ్యా రాణి.... విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనిత , కొణతాల రామకృష్ణ, చింతకాయల అయ్యన్నపాత్రుడు.... తూర్పుగోదావరి జిల్లా నుండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవ వరప్రసాద్... పశ్చిమగోదావరి జిల్లా నుండి నిమ్మల రామానాయుడు, రఘురామ కృష్ణంరాజు... కృష్ణా జిల్లా నుండి శ్రీరామ్ తాతయ్య, కొల్లు రవీంద్ర , కామినేని శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా నుండి అనగాని సత్యప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, నాదెండ్ల మనోహర్ ప్రకాశం జిల్లా నుండి డోలా బాల వీరాంజనేయస్వామి , గొట్టిపాటి రవి కుమార్,.... నెల్లూరు జిల్లా నుండి పొంగూరు నారాణయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి- కోవూరు, .... చిత్తూరు జిల్లా నుండి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, విఎమ్ థామస్, అమర్నాథ్ రెడ్డి.... కడప జిల్లా నుండి మాధవి రెడ్డి, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, వరదరాజులు రెడ్డి,.... కర్నూలు జిల్లా నుండి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మహ్మద్ ఫరూక్,... అనంతపురం జిల్లా నుండి పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ పేర్లు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది.


ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోసం తన టికెట్ త్యాగం చేశారు మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మ. పవన్ కోసం తన సీటునే త్యాగం చేసిన నేపథ్యంలో వర్మకు చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో ఖచ్చితంగా చోటు కల్పిస్తారనే సమాచారం వినిపిస్తోంది. ఇప్పటికే వర్మను ఎమ్మెల్సీని చేస్తానని అంతేకాదు ఊహించని స్థానం కూడా కల్పిస్తానని చంద్రబాబు నాయుడు హామీ కూడా ఇచ్చారు. జనసేన పార్టీని గెలిపించేందుకు విశేష కృషి చేసిన వర్మకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిగా చేయడానికి టీడీపీ అధినాయకత్వం రెడీగా ఉందని ప్రచారం జరుగుతుంది.

 జనసేనలో ఐదుగురికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు సమాచారం.. కూటమి మంత్రిగా ఉండే వారిలో మొదటి వ్యక్తి నాదెండ్ల అని అంటున్నారు. అదే విధంగా చూస్తే రెండవ వారు గోదావరి జిల్లాలకు చెందిన కందుల దుర్గేష్. ఈయన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఉంటూ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఇక 2019లో రాజమండ్రి రూరల్ నుంచి జనసేన తరఫున పోటీ చేసి అత్యధిక ఓట్లు సాధించారు.

ఈసారి ఆయనకు రాజమండ్రి రూరల్ నుంచి సీటు దక్కలేదు. అయినా కూటమి ధర్మాన్ని పాటించి నిడదవోలు వెళ్ళి పోటీ చేశారు. బలమైన సామాజిక వర్గం నేపథ్యంతో పాటు ఆయన పార్టీ పట్ల చూపించిన విధేయత అన్నీ కలసి ఆయనకు జనసేన నుంచి కూటమి తరఫున మంత్రి పదవి దక్కేలా చేస్తాయని అంటున్నారు. అంటే కందుల దుర్గేష్ మంత్రిగానే ఈసారి చట్ట సభలో అడుగుపెడతారు అన్న మాట.
ఇక మూడవ బెర్త్ ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి సీనియర్ మోస్ట్ లీడర్ మాజీ మంత్రి అయిన కొణతాల రామకృష్ణకు దక్కుతుంది అని అంటున్నారు ఆయన ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితమే మంత్రి అయ్యారు. వైఎస్సార్ ప్రభుత్వంలో అయిదేళ్ళ పాటు పోటీ చేశారు. ఆయన సమర్ధుడుగా వివాదరహితుడుగా పేరు తెచ్చుకున్నారు. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన కొణతాలకు మంత్రి యోగం ఖాయమని అంటున్నారు.

అయితే మిగిలిన రెండు పదవులు ఎవరికి ఇస్తారు అనేదాని పై క్లారిటి రావాలి. అయితే పార్లమెంట్ ఎంపీ సీటు త్యాగం చేసిన నాగబాబుకు కూటమి ప్రభుత్వం టీటీడీ బోర్డ్‌ ఛైర్మన్‌గా పదవి ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ విషయమై పవన్ కళ్యాణ్ చంద్రబాబును డిమాండ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జసేనని రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్‌ పోస్టులపైనా ఫోకస్‌ చేస్తునట్టు తెలుస్తుంది. విజయవాడ దుర్గమ్మ గుడి ఛైర్మన్‌ పోస్టుకు జనసేన నేత బాడిత శంకర్‌ను సుజన, చిన్ని సిఫారసు చేయనున్నారు. పదేళ్లుగా జనసేనను నమ్ముకున్న వారందరికీ న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్. స్థానికసంస్థల్లోనూ పార్టీ శ్రేణులకు ప్రాధాన్యం కల్పించనున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow