కంగనకు కానిస్టేబుల్ చెంపదెబ్బ.... కారణం ఏమిటంటే...? స్పందించిన కంగనా రనౌత్
చండీగఢ్ ఎయిర్‌పోర్ట్ వీడియోను కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, అందులో కంగనా, కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ ఘటనపై హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.Sri Media News
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ కంగనా చెంప చెళ్లుమనిపించారు. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా కంగనా బిత్తరపోయారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 6-06-2024 మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరిన కంగన.. విమానం ఎక్కేందుకు చండీగఢ్ విమానాశ్రయంలో బోర్డింగ్ పాయింట్‌కు వెళ్తుండగా ఈ అనూహ్యంగా వచ్చి... సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టింది.
అయితే... కంగనాను తాను ఎందుకు కొట్టాల్సి వచ్చిందో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వివరణ ఇచ్చింది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులపై కంగనా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఇప్పుడు చెంప పగలగగొట్టానని చెప్పుకోచ్చింది. రైతుల ఉద్యమంలో తన తల్లికూడా పాల్గొన్నారని ఆమె చెప్పింది.
100 రూపాయల కోసం రైతులు అక్కడ కూర్చున్నారని ఆమె స్టేట్‌మెంట్ ఇచ్చింది.... ఆమె వెళ్లి అక్కడ కూర్చుంటారా? ఈ స్టేట్‌మెంట్ ఇచ్చేటప్పుడు మా అమ్మ అక్కడ కూర్చుని నిరసన తెలుపుతున్నారు..’ అని కౌర్ వేదన వ్యక్తం చేసింది కూడా. రైతులను అవమానించడంతోనే కంగనాను కొట్టానని అని చెప్పారు కౌర్. 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఉద్యమాన్ని విమర్శిస్తూ కంగనా ‘‘ఎక్స్’’ లో దారుణమైన పోస్ట్‌లు పెట్టారు.
హిమాచల్ ప్రదేశ్ ‘‘మండి’’ నుండి బీజేపీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఈ హీరోయిన్, 70వేల ఓట్లకు పైగా మెజారిటీతో, తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన విక్రమాదిత్య సింగ్ ను ఓడించారు. కాగా, ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి ఢిల్లీకి మధ్యాహ్నం బయల్దేరిన కంగన.. విమానం ఎక్కేందుకు చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆమె బోర్డింగ్ పాయింట్‌కు వెళ్తుండగా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపలుపై ఎడాపేడా వాయించారు. ఊహించని ఈ పరిణామంతో కంగనా షాక్ తిన్నారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆమె ఈ విషయం గురించి పంచుకున్నారు. ఎందుకు కొడుతున్నావని అడిగితే.. తాను రైతులకు మద్దతుదారునని సమాధానం చెప్పినట్టు తెలిపారు. తాను క్షేమంగా ఉన్నాను కానీ పంజాబ్‌లో ఉగ్రవాదం పెరుగుతున్నందుకే తనకు ఆందోళనగా ఉందని కంగనా అన్నారు.
అంతేకాదు... చండీగఢ్ ఎయిర్‌పోర్ట్ వీడియోను కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, అందులో కంగనా, కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ ఘటనపై హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
What's Your Reaction?