రామోజీరావు ఆ కోరిక తీరకుండానే మరణించారా..? ఈ అరుదైన ఘట్టాన్ని చూడకుండానే..?

అతి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన చెరుకూరి రామోజీరావు… అతిపెద్ద సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగి... వ్యాపారం రంగంతో ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన… ఎన్నో మైలురాళ్లను అధిగమించి రామోజీరావు.. అంటే ఓ చరిత్ర ఉంది అని చెప్పుకునేలా... చరిత్రలో కొన్ని పేజీలకు తన ముద్రవేశారు. Sri Media News

Jun 8, 2024 - 12:49
 0  11
రామోజీరావు ఆ కోరిక తీరకుండానే మరణించారా..? ఈ అరుదైన ఘట్టాన్ని చూడకుండానే..?

అతి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన చెరుకూరి రామోజీరావు… అతిపెద్ద సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగి... వ్యాపారం రంగంతో ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన… ఎన్నో మైలురాళ్లను అధిగమించి రామోజీరావు.. అంటే ఓ చరిత్ర ఉంది అని చెప్పుకునేలా... చరిత్రలో కొన్ని పేజీలకు తన ముద్రవేశారు. ఎలాంటి సమస్యలు ఎదురొచ్చినా… వెనక్కి తగ్గని రథసారథిగా ముందుకు నడిచారు. తెలుగు జాతి యశస్సుని కాపాడిన భీష్మాచార్యుడు రామోజీ. గురించి తెలుసుకుందాం....

1936లో నవంబర్ 16న గుడివాడ కృష్ణా జిల్లాలో ఓ రైతుకుటుంబంలో జన్మించారు. ఈయన తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. వీరిది వ్యవసాయాధారిత కుటుంబం. రామోజీరావు పూర్వీకు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందగా, అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తన తాత రామయ్య మరణించిన 13 రోజులకు జన్మించాడు. దీంతో కుటుంబ సభ్యులు తన తాత జ్ఞాపకార్థం రామోజీకి రామయ్య అనే పేరు పెట్టారు. కానీ ఈ పేరు అంటే రామోజీరావుకు అస్సలు నచ్చక పోయేది. అందుకే తాను ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడే సొంతంగా తన పేరును తానే సృష్టించుకొని, రామోజీరావు అని పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతం కొనసాగుతూ వచ్చింది. అలా రామోజీరావు తన పేరు తానే పెట్టుకున్నారు.

ఎన్నో సంస్థలకు అధినేత అయిన రామోజీరావు తన ప్రస్థానాన్ని... అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో మొదలుపెట్టారు. రామోజీ రావుకి ఈయనకు అడ్వర్టైజింగ్ అంటే ఆసక్తి ఎక్కువ. దీంతో రామోజీరావు తనకు పరిచయస్తుడు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడైన తహశిల రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగం గురించి నేర్చుకోవాలి అనుకున్నాడు. అందుకోసం చదువు పూర్తి అయ్యాక ఢిల్లీలోని ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఆయన తొలిసారి ఉద్యోగంలో చేరాడు. అదే ఆయన మొదటి ఉద్యోగం. మూడు సంవత్సరాలు అందులో పని చేసిన తర్వాత, రామోజీరావు హైదరాబాద్‌కు వచ్చాడు. తర్వాత ఆయన వ్యాపారం చేయాలని నిర్ణియించుకున్నాడు. అలా 1962లో మార్గదర్శి చిట్స్ ప్రారంభించారు. ఇదే ఆయన జీవితంలో తొలి వ్యాపారం. తర్వతా కిరణ్ యాడ్స్ అడ్వర్టైజ్ మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. తర్వాత వసుంధర ఫర్టిలైజర్స్, అన్నదాత పత్రిక, ఈనాడు, ఊషాకిరణ్ మూవీస్, కళాంజలి, ప్రియా ఫఉడ్స్, ఈటీవీ, ఈనాడు, వసుంధర పబ్లికేషన్స్ ఇలా ఎన్నింటినో స్థాపించి వ్యాపారవేత్తగా రికార్డ్ క్రియేట్ చేశారు.

కాగా...తెలుగు మీడియా రంగంలో  ఎన్నో మార్పులకు ఈయనే ఆద్యుడు. ట్రెండ్ సెట్ చేసిన ఘనుడు. ఆయన్ను చూసి స్ఫూర్తి పొందినోళ్లు కోట్లాది మంది. అంతేకాదు...ముఖ్యమంత్రుల్ని సైతం కనుసైగతో శాసించే స్థాయిలో ఉండి కూడా.. అహాన్ని ప్రదర్శించని తత్త్వం రామోజీ సొంతం.  మీడియా రంగంలో కావొచ్చు.. ఆయన నిర్వహించే మిగిలినవ్యాపారాల్లో కావొచ్చు. ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పని చేయటస్తారు...  ఒక విషయానికి ఒకసారి కమిట్ అయితే అదెంత కష్టమైనా.. మరెంత నష్టమైనా వెనక్కి తగ్గని మొండితనంతో ముందుకు దూసుకుపోయోవారు.

1984లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ స్థాపించిన రామోజీరావు మొదటి చిత్రం ‘శ్రీవారికి ప్రేమలేఖ’తో ఘన విజయాన్ని అందుకుని టాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప క్లాసిక్ అందించారు. లెక్కలేనన్ని అవార్డులుతో పాటు కమర్షియల్ గానూ బ్లాక్ బస్టర్ అందుకుంది. సుప్రసిద్ధ నృత్యకారిణి సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తీసిన ‘మయూరి’ బయోపిక్కుల విషయంలో రామోజీరావు ముందుచూపుకు నిదర్శనం. మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ‘ప్రతిఘటన’ ఒక చరిత్ర. మూస ఫార్ములాలో కొట్టుమిట్టాడుతున్న టాలీవుడ్ కు ఒక కొత్త జానర్ ని పరిచాయం చేసిన ఘనత రామోజీ గారిదే. అప్పటిలో ఈ సినిమా బెంగళూరులో అయిదు వందల రోజులు ఆడటం ఎవరూ అందుకోలేని ఓ రికార్డ్.

గిరిజన వాడలో జరిగిన నిజ జీవిత ఘటన ఆధారంగా తీసిన ‘మౌనపోరాటం’ మరో మెచ్చుతునక. నక్సలైట్ల ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో ఇటు వీళ్ళను అటు పోలీస్ వ్యవస్థను ప్రశ్నిస్తూ తీసిన ‘పీపుల్స్ ఎన్కౌంటర్’ ఎన్ని వివాదాలు వచ్చినా జనం ఆదరించారు. హృదయాన్ని హత్తుకునే ‘అమ్మ’ ద్వారా బ్రహ్మానందంలోని సీరియస్ కోణాన్ని వెలికి తీసిన ఘనత ఆయనకే దక్కుతుంది. పరుగుల రాణి ‘అశ్విని’ కథని ఆమెతోనే తీసి శభాష్ అనిపించుకోవండ రామోజీరావు అభిరుచికి నిదర్శనం.

 అంతేకాదు... 1996లో  ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీని  స్థాపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గొప్ప సిటీ పర్యాటక ప్రదేశంగా కూడా పేరుగాంచింది. రామోజీ ఫిలిం సిటీ సుమారు 2000 ఎకరాలలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరంగా పేరు పొందింది.  ఈ ఫిలిం సిటీలో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన ఎన్నో రకాల భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడ్డాయి... ఇంకా నిర్మించబడుతున్నాయి. ఇందులో వివిధ దేశాలలోని ఉద్యానవనాల నమూనాలు, రకరకాల దేశ విదేశీ శిల్పాలు ఇంకా సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల ఫిక్స్డ్ సెట్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం (లార్జెస్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫిల్మ్‌సిటీ ఇన్‌ ది వరల్డ్‌)గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందింది.

టీవీ అంటే దూరదర్శన్‌ అని మాత్రమే తెలిసిన రోజుల్లో “ఈటీవీ.. మీ టీవీ" అంటూ బుల్లితెర అద్భుతాన్ని సృష్టించారు రామోజీరావు. 1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రారంభమైన ఈటీవీని అనతికాలంలోనే జాతీయస్థాయి నెట్‌వర్క్‌గా విస్తరించారు. ప్రాంతీయ భాషా ఛానళ్లకు కొత్త అర్ధం చెప్పారు. తెలుగు రాష్ట్రాల కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌, ఈటీవీ తెలంగాణ ఛానళ్లను ప్రారంభించి విశ్వసనీయ సమాచార వేదికలుగా తీర్చిదిద్దారు. ఈటీవీ ప్లస్‌, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్‌, ఈటీవీ బాలభారత్ కొంతకాలానికి ఆ కీర్తికిరీటంలో చేరాయి.

మాతృభాష పరిరక్షణకు కూడా కృషి చేశారు... రామోజీ రావు. పరాయి భాషలపై మోజు తెలుగు పలుకు ఉనికినే ప్రశ్నార్థకం చేసే దుస్థితి మధ్య అమ్మభాషలోని కమ్మదనాన్ని నేటి తరాలకు చాటిచెప్పారు. రామోజీ ఫౌండేషన్‌ ద్వారా తెలుగు వెలుగు మాసపత్రికను ప్రచురించి మాతృభాషాభివృద్ధికి తనవంతు కృషిచేశారు.

మీడియాలో రామోజీ రావు చేసిన ప్రతి ప్రయోగం వినూత్నమే. ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాల్సిందే. అందుకే అనేక పదవులు, పురస్కారాలు ఆయన్ను వరించాయి. 1987 ఏప్రిల్‌లో ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు రామోజీ రావు. పత్రికాస్వేచ్ఛ అణచివేతకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించడంలో కీలకపాత్ర పోషించారు. పాత్రికేయ రంగంలో సేవలకు గుర్తింపుగా బీడీ గోయెంకా, యుధ్‌వీర్‌ పురస్కారాలు అందుకున్నారు. 1986లో ఆంధ్రవిశ్వ కళా పరిషత్‌ ఆయన్ను డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌ డిగ్రీతో గౌరవించింది. 1989 మార్చిలో తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం 2015 సెప్టెంబర్‌లో ఒడిశాలోని శ్రీశ్రీ విశ్వవిద్యాలయం రామోజీరావును గౌరవ డాక్టరేట్‌లతో సత్కరించాయి. 2016లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

అయినప్పటికి రామోజీరావు  తన కోరిక తీరకుండానే మరణించారంట. ఆయనకు ఎంతో ఇష్టమైన ఉషా కిరణ్ బ్యానర్‌లో వంద సినిమాలు తీయాలని ఎప్పుడూ అనుకునేవాడంట, కానీ ఇప్పటికీ ఆయన 95 సినిమాలేమో తెరకెక్కించారు. వంద సినిమా అనేది ఆయన తీరని కోరికగానే మిగిలిపోయింది. అంతేకాదు... రామోజీరావు 1974లో ‘ఈనాడు’ సంస్థానాన్ని ప్రారంభించి ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ సంచలనం సృష్టించారు. అలాంటి పత్రిక ‘ఈనాడు ను ప్రారంభించి ఈ 2024 ఆగస్టు 10 నాటికి 50 ఏళ్లు పూర్తవుతాయి. ఈ అరుదైన ఘట్టాన్ని చూడకుండానే రామోజీరావు మన మధ్య లేకపోవడం నిజంగా విషాదకరమైన ఘటన.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow