షర్మిల శాపానికి ఇద్దరు సీఎంలు బలి... కుప్పకూలిన సామ్రాజ్యాలు.!

ఆడదాని శాపం కచ్చితంగా తగులుతుంది అంటారు మన ఇంట్లోని పెద్దవాళ్లు .. అందుకే ఆడదాని ఉసురు పోసుకోకు ..ఆడదాన్ని ఏడిపించకు.. ఆడదాన్ని శాపం చాలా చాలా స్ట్రాంగ్ అది కచ్చితంగా తగులుతుంది అని చాలామంది పెద్దవాళ్లు మనకు చెబుతూ ఉంటారు. బహుశా ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విషయంలో అదే నిజమైంది అంటున్నారు కొందరు...Sri Media News

Jun 7, 2024 - 11:59
 0  7
షర్మిల శాపానికి ఇద్దరు సీఎంలు బలి... కుప్పకూలిన సామ్రాజ్యాలు.!
Sharmila,KCR,Jagan

వైఎస్‌ రాజశేఖరరెడ్డి  కూతురు షర్మిళ... 2014 వరకూ తన అన్నకు తోడుగా నిలిచి.. అన్నకు ఎదురు నిలిచిన ప్రత్యర్థులపై వీరుచుకు పడుతూ...  ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ పాదయాత్ర చేసి... జగన్‌ జైలులో ఉన్నప్పుడు... అన్న కోసం ప్రచారం చేసిన షర్మిళ... 2019లో జగన్ ఏపీ సీఎంగా పదవీ చెపట్టిన తరువాత... షర్మిళ వైసీపీ పార్టీకీ దూరం అవుతూ వచ్చారు... జగన్‌ ప్రమాణ స్వీకారంలో కూడా షర్మిల కనిపించలేదు... అంతేకాదు... వైఎస్ఆర్ సమాధి వద్ద కూడా వాళ్లు మాట్లాడుకున్న దృశ్యాలు కనిపించలేదు.


ఈ క్రమంలో వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించెందుకు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించారు. అక్కడ ఆమెకు పెద్దగా ఆదరణ లభించలేదు... అయినప్పటికి మాజీ సీఎం కేసీఆర్‌‌పై అవినీతి పాలన చేస్తున్నారంటు... తెలంగాణలో నియంతృత్వ పాలన చేస్తున్నాడంటూ కేసీఆర్ ప్రభుత్వన్ని ఎండగట్టేది షర్మిళ... అంతేకాదు... టీఆర్‌ఎస్‌ పాలనకు వ్యతిరేకంగా షర్మిల ఆమరణ నిరాహార దీక్షను కూడా చెపట్టింది. దీంతో ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకుని... పోలీసు వాహనంలో బలవంతంగా షర్మిళను తరలించారు. ఆ సమయంలో షర్మిల కేసీఆర్ పై కోపంతో... ‘‘కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని  నాశనం చేశావు. నీకు తప్పులు చేసిన చరిత్ర ఉంది, నీ పతనానికి ఇదే నాంది’’ అని శపించింది... అనంతరం తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేశారు. 2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో షర్మిల పెట్టిన శపం వల్లే కేసీఆర్ రాజకీయల్లో ఎప్పుడు చూడని ఓటములను చూస్తున్నారని... తన ఇంటీ చూట్టు సమస్యలు అలుముకుంటున్నాయని అంటారు...


అనంతరం కాంగ్రెస్‌లో తన తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ)ని విలీనం చేసి ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఏపీ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు.. ఏపీకి వచ్చినప్పటి నుంచి ఏ అన్న కోసం అయితే... పాదయాత్ర చేసీ... కష్టపడి.. సీఎంగా నిలబెట్టి... ఇప్పుడు అదే అన్నపై ఆయన పాలనపై షర్మిల విమర్శల భాణాలు సందిస్తూ వచ్చింది. దీనికి కారణాలు లేక పోలేదు... వైసీపీ ప్రభుత్వంలో తనకు కూడా పదవి ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ను వైఎస్‌ షర్మిల కోరారు. తనకు కడప ఎంపీగా కానీ, రాజ్యసభ సీటును షర్మిలకు ఇవ్వాలని విజయమ్మ కూడా చెప్పింది. కానీ జగన్ ఒప్పుకోలేదు.... కుటుంబంలో ఒకరు సీఎం స్థానంలో ఉన్నందున ఇంకొకరికి ప్రభుత్వ పదవి ఇవ్వడం మంచిది కాదని తిరస్కరించారు. అంతేకాదు... న్నాన కోరిక మేరకు నాకు ఆస్తిలో వాటా ఇవ్వాలని షర్మిల జగన్‌ను కోరారు. అందుకు జగన్‌ పూర్తి స్థాయిలో అంగీకరించలేదు.

కొంతవరకు ఇస్తానని చెప్పారు. నాకు సగభాగం ఇవ్వాలని షర్మిల పట్టుపట్టడంతో ఏమీ చెప్పకుండా దాట వేశారు. ఈ విషయంలో విజయ్మ కూడా జగన్‌తో విభేదించింది. ఇక్కడి నుంచి అన్న చెళ్లెళ్ల మధ్యదూరం ఎక్కువగా పెరిగింది. అంతేకాదు... జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య విషయంలో కూడా జగన్ పట్టిచుకోకుండా వదిలేయటాన్ని కూడా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. సమగ్రమైన దర్యాప్తు ఎందుకు జరిపించడం లేదని షర్మిల అన్నను ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదు. వైఎస్‌ జగన్‌ భార్య భారతీరెడ్డి అత్త విజయమ్మకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఆడపడుచు షర్మిలకు పదవులు దక్కకుండా అడ్డుకోవడం, ప్రభుత్వంలో వైఎస్‌ భారతి జోక్యం పెరగటం. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలకు జగన్‌ అధిక ప్రాధాన్యత ఇస్తూ రావడంతో తల్లి, చెల్లి కూడా జగన్‌ను దూరం పెట్టారు.

ఈ వివాదాల వల్లే వైసీపీ పై జగన్ పై ప్రజల్లో నెగిటివిటి ఏర్పడింది. అంతేకాదు... ఎన్నికల్లో అన్నాచెల్లెళ్ల సవాళ్లు.. ఇదే సమయంలో వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తావిస్తూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సైతం షర్మిలతో గొంతు కలపడం షర్మిల కడప ఎంపీగా బరిలో ఉండడంతో వీరిద్దరూ కలిసి ప్రజల్లోకి వెళ్తూ.. అన్న జగన్ ను నిలదీయడం... ఇలా చెల్లెళ్లు చేసిన డ్యామేజ్ కూడా జగన్ ఓడిపోడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇలా షర్మిల శాపం తగిలి ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వారి రాజకీయ జీవితాన్ని కోల్పోయారు అని కొందరు అంటూ ఉంటారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow