ఏపీ కొత్త సీఎస్, ఇంటెలిజెన్స్ ఛీఫ్ వీరేనా ? రెడ్ బుక్’ను ఓపెన్ చేసిన లోకేష్
వైసీపీ ప్రభుత్వనికి అనుకూలంగా వ్యవహరించిన అధికారులను ఉపేక్షించేది లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేశ్‌లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. వైసీపీకి తొత్తులుగా పని చేసిన అధికారుల జాబితాను రెడ్ బుక్‌లో నారా లోకేశ్ నోట్ చేసిన సంగతి కూడా తెలిసిందే.Sri Media News
వైసీపీ ప్రభుత్వనికి అనుకూలంగా వ్యవహరించిన అధికారులను ఉపేక్షించేది లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేశ్‌లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. వైసీపీకి తొత్తులుగా పని చేసిన అధికారుల జాబితాను రెడ్ బుక్‌లో నారా లోకేశ్ నోట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 4న విజయం సాధించిన టీడీపీ... రెడ్ బుక్‌కు పనిచెప్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెడ్ బుక్‌లో పేర్లు ఉన్న వారిని కలిసేందుకు చంద్రబాబు అపాయింట్మెంట్ నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డిలకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అందులో భాగంగానే తెలుస్తోంది.
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని తన నివాసంలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఉదయం 8 గంటలకు వెళ్లారు. అయితే పీఎస్ఆర్ ఆంజనేయులను ప్రధాన గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది నిలిపివేసింది. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని నిరాకరించింది.
ఇదిలా ఉంటే మరో ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి సైతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసేందుకు ప్రయత్నించారు. అయితే కొల్లి రఘురామిరెడ్డిని ప్రధాన గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది నిలిపివేసింది. అనుమతి లేదని లోపలికి పంపేందుకు నిరాకరించింది. మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్తున్నట్లు చెప్పినా సెక్యూరిటీ సిబ్బంది లోపలికి పంపించేందుకు అంగీకరించలేదు.
ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న అధికారులను సాగనంపడటంతో పాటు కొత్త వారిగా ఎవరికి అవకాశం కల్పించాలనే దానిపై కూడా చంద్రబాబు చర్చిస్తున్నారు. ఇప్పటికే గత ఐదేళ్ల ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలనూ వైసీపీ భ్రష్టుపట్టించిందని భావిస్తున్న చంద్రబాబు వాటిని తిరిగి గాడిన పెట్టేందుకు సమర్ధులైన అధికారుల కోసం అన్వేషిస్తున్నారు.
అంతేకాదు... అధికార యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభించారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సెలవు పైన వెళ్లాల్సిందిగా ఆదేశాలు అందాయి. ఈ నెలాఖరున జవహర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. తనకు అందిన సూచనల మేరకు జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శిగా జగన్ హాయంలో పని చేసిన రావత్ అనారోగ్య కారణాల తో సెలవు పై ఉన్నారు. ఇక..చంద్రబాబు తన పాలన ప్రారంభానికి ముందే సీఎస్..డీజీపీ...ఇంటలిజెన్స్ చీఫ్ ల నియామకం పైన కసరత్తు పపూర్తి చేసిట్లు తెలుస్తోంది.
కొత్త సీఎస్ గా విజయానంద్ నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వం 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్ గత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి పదవిని కొన్ని రోజులు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు. బీసీ (యాదవ) సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ గా, ఏపీ ట్రాన్స్ కో , ఏపీ జెన్ కో సీఎండీగా పనిచేశారు.రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎనర్జీ, ఐటి మంత్రిత్వ శాఖల ముఖ్యకార్యదర్శి(ప్రిన్సిపల్ సెక్రెటరీ)గా పనిచేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు.
అలాగే మరో కీలకమైన పోస్టు ఇంటెలిజెన్స్ ఛీఫ్ కు కూడా చంద్రబాబు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైల్వేస్ డీజీపీగా ఉంటూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన బాల సుబ్రమణ్యాన్ని పిలిపించి ఇంటెల్ ఛీఫ్ పదవి కట్టబెట్టవచ్చని తెలుస్తోంది.
What's Your Reaction?