టీటీడీ ఛైర్మన్ పదవి ఎవరికి దక్కనుందో...? టీటీడీ బోర్డ్‌ ఛైర్మన్‌గా నాగబాబు? చంద్రబాబు దృష్టిలో ఎవరున్నారు..?

చంద్రబాబు కూడా కోందరి పేర్లను ప్రతిపాదనకు తీసుకు వచ్చినట్టు తెలుస్తుంది... తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచిన ఓ టీవీ ఛానల్ అధినేతకు తొలి విడతగా రెండు సంవత్సరాలపాటు టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వలని అనుకున్నట్టు టీడీపీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇక బిజెపి నుంచి గెలిచిన ఒక ఎంపీ పేరు కూడా టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది.Sri Media News

Jun 7, 2024 - 12:36
 0  9
టీటీడీ ఛైర్మన్ పదవి ఎవరికి దక్కనుందో...? టీటీడీ బోర్డ్‌ ఛైర్మన్‌గా నాగబాబు? చంద్రబాబు దృష్టిలో ఎవరున్నారు..?

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ అంటే మంత్రి పదవి కంటే ఎక్కువ. అలాంటి పదవి కోసం ఎంత తీవ్ర ఒత్తిడి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది.  చంద్రబాబు తన కేబినెట్ కూర్పు పైన... ఇదే సమయంలో నామినేటెడ్ పదవుల్లో తొలి విడత మూడు నుంచి అయిదు వరకు ప్రకటించేలా నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ఇప్పటికే పలువురు చంద్రబాబు వద్ద ప్రతిపాదించనట్లు తెలుస్తోంది. కొత్త బోర్డులో సభ్యులుగా నియామకం కోసం చర్చలు జరుగుతున్నాయి.

అయితే సామాజిక వర్గాల సమీకరణ.. ప్రాధాన్యతలో భాగంగా క్షత్రియ వర్గానికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలనేది మరో ప్రతిపాదన. అందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, గోదావరి జిల్లాలకు చెందిన అదే వర్గానికి చెందిన మరో నేత పేరు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత..మాజీ డిప్యూటీ స్పీకర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.

 మరోవైపు జనసేన నేత, పవన్‌కల్యాణ్ టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా నాగబాబును నియమించాలని టీడీపీ అధినేత చంద్రబాబును జనసేనాని పవన్‌కల్యాణ్‌ డిమాండ్ పెట్టినట్లు సమాచారం. నిజానికి జనసేన తరపున ఈ ఎన్నికల్లో నాగబాబు పోటీ చేయకుండా పార్లమెంట్‌ సీటు త్యాగం చేశారు. దీంతో ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులపై చంద్రబాబుతో పవన్ చర్చలు జరుపుతున్నారని టాక్‌. విజయవాడ దుర్గమ్మ గుడి ఛైర్మన్‌ పోస్టుకు జనసేన నేత బాడిత శంకర్‌ను సుజన, చిన్ని సిఫారసు చేయనున్నారు. పదేళ్లుగా జనసేనను నమ్ముకున్న వారందరికీ న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్. స్థానికసంస్థల్లోనూ పార్టీ శ్రేణులకు ప్రాధాన్యం కల్పించనట్టు తెలుస్తుంది...

అయితే చంద్రబాబు కూడా కోందరి పేర్లను ప్రతిపాదనకు తీసుకు వచ్చినట్టు తెలుస్తుంది...  తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచిన ఓ టీవీ ఛానల్ అధినేతకు తొలి విడతగా రెండు సంవత్సరాలపాటు టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వలని అనుకున్నట్టు టీడీపీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇక బిజెపి నుంచి గెలిచిన ఒక ఎంపీ పేరు కూడా టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది.

 అంతేకాదు... ఈసారి టీడీపీ 160 స్థానాలు దక్కించుకుంటుందని... ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ చెప్పారు... ఆయన చెప్పిన మాట ప్రకారం కూటమి 164 స్థానాలు దక్కించుకుంది. ఎన్నికల సమయంలో బాబుకు మద్దతుగా ఒక వీడియో కూడా అశ్వినీ రిలీజ్ చేశాడు. దీంతో ఆయనకు చంద్రబాబు అవకాశం ఇస్తారేమో అనే చర్చ జరుగుతుంది. అయితే పవన్ నాగబాబు కోసం బాబును పట్టు పట్టడంతో నాగబాబు టీటీడీ చైర్మన్ పదవీని చెపట్టే అవకాశం ఉందని టాక్..

పవన్‌‌కు పెద్దలు అంటే గౌరవం ఉంది కాబట్టి.. చంద్రబాబు టీటీడీ చైర్మన్  పదవీని ఇవ్వాలని ఆలోచిస్తున్న ఇద్దరు.. కూడా వయసులో పెద్దవారు.. అంతేకాదు... వారి పై పవన్‌‌కి కూడా ఎంతో గౌరవం ఉందని... కాబట్టి ఈ సారి కూడా నాగబాబు టీటీడీ చైర్మన్ రేసు నుంచి ప్రస్తుతనికి తప్పుకోక తప్పదు అని తెలుస్తుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow