రోజా దారి ఎటువైపు..? జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తుందా..? మరి రోజా నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
నగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాదించి జైత్రయాత్ర కొనసాగించాలని కలలు కన్న రోజాకు టీడీపీ గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో రోజాను పొగిడే జనాలు కన్నా తిట్టే జనాలు ఎక్కువగా ఉంటారు. దానికి కారణం రోజా మాట తీరు ..కఠినంగా ఘాటుగా మాట్లాడేస్తుంది . అయితే ఇప్పుడు రోజా ఏం చేయబోతుంది..? మళ్లీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తుందా..? Sri Media News
రోజా.. రోజా.. రోజా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కంటెంట్ లో ఆమె పేరునే ముందు ఉంది. నోటికి హద్దు అదుపులేకుండా మీడియా ముందు మాట్లాడి.. అటూ రాజకీయాలకు.. ఇటు సినిమాలకు రెండింటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది ఆమె పరిస్థితి. వైసీపీ అధికారంలో ఉందన్న గర్వంతో.. పవన్ కళ్యాణ్ ను, చంద్రబాబును నోటికి వచ్చినట్లు తిట్టిపోసింది ఈ ఫైర్ బ్రాండ్. కానీ రాష్ట్రంలో టీడీపీ విజయంతో... తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్న రేంజిలో రోజా భవిష్యత్తు మారిపోయింది. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ లేడీ డైనమిక్ స్టార్ అంటూ పలు రకాల ట్యాగ్స్ క్రియేట్ చేసుకుని బాగా వైరల్ అయిన రోజా .. ప్రస్తుతం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్‌కి గురవుతుంది.
నగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాదించి జైత్రయాత్ర కొనసాగించాలని కలలు కన్న రోజాకు టీడీపీ గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో రోజాను పొగిడే జనాలు కన్నా తిట్టే జనాలు ఎక్కువగా ఉంటారు. దానికి కారణం రోజా మాట తీరు ..కఠినంగా ఘాటుగా మాట్లాడేస్తుంది . అయితే ఇప్పుడు రోజా ఏం చేయబోతుంది..? మళ్లీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తుందా..? జబర్దస్త్ లోకి ఎంట్రి ఈ ఇచ్చినా అప్పటి క్రేజ్ ఉంటుందా? అనే ప్రశ్న రాష్ట్ర ప్రజలందరిలో ఉంది.
అయితే... రోజా గురించి ఎవరి నోట విన్న ఆదరించరు అన్న సమాధనమే వినిపిస్తుంది. అంతేకాదు... ఆమెను సినిమాలోకి తీసుకోవడానికి డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపించడం లేదంటా... పవన్ కళ్యాణ్ ని నానా బూతులు తిట్టిన రోజాను ఏ డైరెక్టర్ ఎంకరేజ్ చేస్తారు? పైగా పవన్ అధికారం చేపట్టారు.. మినిస్టర్ పొజిషన్ కూడా తీసుకుంటారు. పైగా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి నీచంగా మాట్లాడింది. మినిస్టర్ పదవిలో ఉండి.. మీడియా ముందు ఏం పీకలేరు.. వాడెంత.. వీడెంత అంటూ అసభ్యకరమైన భాషలో తిట్టిపోసింది. ఇక చివరికి పవన్ కు సపోర్ట్ గా నిలిచినందుకు జబర్దస్త్ కమెడియన్స్ ను కూడా వదలలేదు. ఆమె మాటలు విన్న ప్రజలకు విసుగు వచ్చింది. ఛీఛీ ఇలాంటి మనిషినా మేము గెలిపించింది అనుకున్నారో ఏమో కానీ, ఈసారి నగరి ప్రజలు.. రోజాను డిపాజిట్ కూడా లేకుండా ఓడించి పడేశారు.
ఎన్నికల ఫలితాలు రాకముందు నుంచే రోజా.. జబర్దస్త్ కు జడ్జిగా వస్తుందని వార్తలు వినిపించాయి. దీంతో సిగ్గులేకుండా ఏ మొహం పెట్టుకొని రోజా మళ్లీ జబర్దస్త్ కు వస్తుందని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో కింద దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. ఆమెను మళ్లీ జడ్జిగా తీసుకొస్తే బాయ్ కాట్ చేస్తామని, రోజా ఓవర్ యాక్షన్ చూడలేమని చెప్పుకొస్తున్నారు. అంతే కాకుండా ఆ డైమండ్ రాణిని ఈ షోకు తీసుకొస్తే ఒక్కడు కూడా చూడడు అంటూ జబర్దస్త్ బాయ్ కాట్ అనే పేరుతో ట్రెండ్ చేస్తున్నారు.
ఇప్పటికే జబర్దస్త్ లో చాలా మార్పులు వచ్చాయి. రేటింగ్ లేక రెండుగా ఉన్న జబర్దస్త్.. ఇప్పుడు మళ్లీ ఒకటిగా మారింది. ఇంద్రజ జడ్జి స్థానం నుంచి తప్పుకుంది. అది రోజా కోసమే అని వార్తలు వచ్చాయి. ఈ వారం కాకపోతే వచ్చే వారం.. రోజా మళ్లీ జబర్దస్త్ జడ్జిగా మారనున్నట్లు చెప్పుకొస్తున్నారు. అయితే ఈసారి రోజా ను జబర్దస్త్ లోకి తీసుకొస్తే సహించేది లేదని జబర్దస్త్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మల్లెమాల ఆమెను తీసుకొస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.
What's Your Reaction?