డిప్యూటీ CM గా పిఠాపురం MLA పవన్ కళ్యాణ్.... అధ్యక్షా అని అసెంబ్లీ మొదలవబోతున్న పవన్ ఘర్జన .
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేనాని, అభిమానులు ఆరాధ్య దేవుడు, జనసైనికుల డెమీ గాడ్ పిఠాపురంలో అద్భుత విజయం సాధించారు. అధ్యక్షా అని అసెంబ్లీలో గర్జించాలనే కలను ఆయన మొత్తానికి సాధించారు.Sri Media News
అధ్యక్షా అని అసెంబ్లీలో గర్జించాలనే కలను ఆయన మొత్తానికి సాధించారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేనాని, అభిమానులు ఆరాధ్య దేవుడు, జనసైనికుల డెమీ గాడ్ పిఠాపురంలో అద్భుత విజయం సాధించారు. వైసీపీ అబ్యర్ధి వంగా గీత పై 70వేల కు పై మెజారిటీతో గెలుపొందారు. అధ్యక్షా అని అసెంబ్లీలో గర్జించాలనే కలను ఆయన మొత్తానికి సాధించారు. భీమవరం లో ఓడిపోయారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఘోర పరాభవం పొందారు. ఎంతలా అంటే పవన్ ను అసలు ఓటర్లు పట్టించుకోలేదు. నేను మీకు మంచి చేయడానికే వచ్చానన్నా కూడా ఎవరూ నమ్మలేదు. భీమవరంలో వైసీపీ అభ్యర్ధి గ్రంథి శ్రీనివాస్ చేతిలో దారుణ ఓటమి పాలయ్యారు. ఇక గాజువాకలో అయితే మూడో స్తానంలో నిలిచి అవమానకరమైన ఓటమి చెందారు. ఆయన్ను ఎందుకు ఓటర్లు రిజెక్ట్ చేశారనేది మిస్టరీ. అయితే ప్రచారంలో ఓటర్లను నమ్మించలేకపోయారు. ఆవేశపూరితమైనది కాకుండా నియోజకవర్గానికి ఏం చేస్తామనేదానని బలంగా చెప్పలేకపోయారనేది నాడు ఆయన పై ఉన్న విమర్శ. నియోజకవర్గంలో ప్రచారం చేసినప్పుడు రాష్ట్ర, జాతీయ సమస్యల మీద ప్రచారం చేస్తే జనాలు నమ్మరు. వారికి బోర్ కొడుతుంది కూడా. పైగా ఆయన చంద్రబాబుతో కలిసి, తర్వాత విడిపోయి ఒంటరిగా పోటీ చేశారు. కానీ టీడీపీని విమర్శించలేదు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని తిట్టారు. అది కూడా మైనస్ గా మారింది. కానీ ఈ సారి మాత్రం పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వెళ్లారు. పిఠాపురం ప్రజల మనసులును గెలుచుకునేందుకు ఆయన ఇంటిని కూడా నిర్మించుకున్నారు. నియోజకవర్గానికి ఏం చేస్తానో చెప్పడమే కాదు టీడీపీ సీనియర్ నేత వర్మను ముందుంచి మరీ ప్రచారం చేయించారాయన. ఇప్పుడు ఏకంగా 70వేల కు పైచిలుకు మెజారిటీతో.....................
పిఠాపురం మాత్రం స్వాగతించింది
ఇక పవన్ కళ్యాణ్ కు ఈసారి కాపు సామాజికవర్గం కూడా బలంగా వెనుకొచ్చింది. వైసీపీ ముద్రగడ లాంటి హేహా హేమీలను దించినా కూడా పవన్ ను ఓడించలేకపోయారు. బీమవరం పట్టించుకోకపోయినా, గాజువాక ఓటర్లు నమ్మకమైని పిఠాపురం మాత్రం స్వాగతించింది. మా సేవకుడివి నువ్వే జనసేనాని అంటూ గెలిపించుకుంది. పిఠాపురం తాలూక మేం అంటూ అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపుతున్నారు. పిఠాపురం లో పవన్ గెలిస్తే ఏపీలో ని అభిమానులే కాదు తెలంగాణలోని ఫ్యాన్స్ కూడా మేం పిఠాపురం తాలూకా అంటూ బైక్ లు, వాహనాల మీద పేరు రాసుకుని సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కు ఇది లైఫ్ టైమ్ కోరిక. అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఆయనకు బలంగా ఉంది. వంగా గీతను గెలిపించండి. మా అక్కను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని స్వయంగా జగన్ చెప్పినా కూడా ఈసారి జనం నమ్మలేదు. ఎందుకంటే వంగా గీతకు డిప్యూటీ సీఎం పదవి వస్తే సామాన్యులకు ఏం ఒరుగుతుంది. ముందు నియోజకవర్గానికి ఏం చేశారు? ఇక ముందు ఏం చేస్తారనేది చెప్పడంలో జగన్ విఫలమయ్యారు. పవన్ ను ఓడించేందుకు కాపు సామాజిక నేతలందరినీ జగన్ ఫ్యాన్ కింద కూర్చోబెట్టినా సరే ఓటర్లు వపన్ ను అక్కున చేర్చుకున్నారు. పైగా సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్ దారుణంగా దత్త పుత్రుడని హేళన చేశారు. ముగ్గురు పెళ్లాలు, నలుగురు పెళ్లాలంటూ కూడా అపహాస్యం చేసి తక్కువ చేసి మాట్లాడారు. కానీ పిఠాపురం ప్రజలు అవి పట్టించుకోకుండా జనసేనానిని ఎమ్మెల్యే పీఠం ఎక్కించారు.
గెలుపొందడం అనేది సామాన్య విషయం కాదు. గెలిచే వరకు నిలబడ్డ పవన్ పట్టుదలను అభినందించాల్సిందే.
పవన్ గెలుపుకు ముఖ్య కారణం ఇక్కడి టీడీపీ నేతలే. వర్మ లాంటి నేతలతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా నిజాయితీగా పనిచేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇతర ప్రాంతాల నుంచి వెళ్లి మరీ ప్రచారం చేసి పవన్ గెలుపు కోసం కష్టపడ్డారు. టీడీపీ ఓటింగ్ ఇక్కడ చాలా ఎక్కువ. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం కు మారడంతో మొత్తం సీన్ మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు పిఠాపురం మామూలు స్థానం కాదు. వీవీఐపీ స్థానంగా పిఠాపురం మారింది. అంతే కాదు తనను ఏ నియోజకవర్గ ప్రజలు ఆదరించకపోయినా కూడా పవన్ కళ్యాణ్ ను గెలిపించిన ఈ స్థానంపై ఆయన ఎమోషనల్ గా ఖచ్చితంగా బాండింగ్ ఏర్పాటు చేసుకుంటారనడంలో సందేహం లేదు. ఖచ్చితంగా తనకు ఎమ్ఎల్ ఏ పవన్ కళ్యాణ్ అనే స్టేటస్ ఇచ్చిన పిఠాపురం పై ఆయన ద్రుష్టిపెడతారు. నియోజకవర్గం అభివ్రుద్దికి శాయ శక్తులా ప్రయత్నిస్తారు. ఇప్టపికే పిఠాపురం తాలూకా అనే పేర్లు తెలుగు రాష్ట్రాల్లో అంతటా పవన్ కళ్యాణ్ గెలుపును ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఆయన గెలుపు పిఠాపురం కో లేదంటే ఏపీకో పరిమితం కాలేదనేది వాస్తవం.
పవన్ ఏకంగా డిప్యూటీ మినిస్టర్ హోదాలో
తెలంగాణలో కూడా పవన్ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం కు ఎమ్మెల్యేనే కాదు ఖచ్చితంగా డిప్యూటీసీఎం అనడంలో సందేహం లేదు. ఎమ్మెల్యేగా గెలిస్తే చాలనుకున్న పవన్ ను ఏకంగా డిప్యూటీసీఎం ను చేసిన పిఠాపురం కాస్త పవన్ పురం అయిందని సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తోంది. డైరెక్ట్ గా ఆయన డిప్యూటీసీఎం అవుతారనడం లోసందేహం లేదు. అంతే కాదు తెలంగాణలో మాదిరిగా ఒకే ఉపముఖ్యమంత్రి పదవితో చంద్రబాబు నాయుడు పవన్ ను కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ ఆల్రెడీ మొదలైంది. మొత్తం మీద పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అధ్యక్షా అనే సమయం రానే వచ్చింది. పవన్ ఏకంగా డిప్యూటీ మినిస్టర్ హోదాలో కాన్వాయ్ తో అదరగొట్టే అవకాశం దక్కించుకున్నారు. అదే సమయంలో పిఠాపురంతో పాటు ఏపీ ప్రజల ఆకాంక్షలను ఆయన మోయాల్సిన టైమ్ కూడా వచ్చింది.
What's Your Reaction?