ఏపీ ప్రజలు వైఎస్ జగన్ ను ఎందుకు తిరస్కరించారు? మొదటి సారి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న జగన్

ఇది విశ్లేషకుల ప్రశ్న కాదు. దాదాపుగా వైఎస్ జగన్ గద్గద స్వరంతో ఎమోషనల్ గా ఏడుస్తూ అడిగిన ప్రశ్న. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆయన ఆపుకున్నారు.Sri Media News

Jun 5, 2024 - 17:12
 0  6
ఏపీ ప్రజలు వైఎస్ జగన్ ను ఎందుకు తిరస్కరించారు? మొదటి సారి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న జగన్

ఏపీ ప్రజలు వైఎస్ జగన్ ను ఎందుకు తిరస్కరించారు?

ఇది విశ్లేషకుల ప్రశ్న కాదు. దాదాపుగా వైఎస్ జగన్ గద్గద స్వరంతో ఎమోషనల్ గా ఏడుస్తూ అడిగిన ప్రశ్న. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆయన ఆపుకున్నారు. ఎందుకంటే నేను నా అక్క చెల్లెమ్మలు, అవ్వా తాతలకు ఎంతో చేశాను. నా వాళ్లనుకున్నాను. డ్రైవర్లు, టైలర్లు, కార్మికులు, మహిళలు ఒకరేమిటి నేను అందరికి ఎంతో మంచి చేశాను. 53 లక్షల మంది తల్లులకు మంచి చేసి వారి పిల్లలు భాగుపడాలని తపించాను.

అందరూ ఆర్ధికంగా భాగుండాలని తపించాను

66 లక్షల మంది వికలాంగులు, అవ్వాతాతలకు పెన్షన్ లు ఇచ్చి మంచి చేశాను. రైతులకు, మత్స్యకారులకు ఇలా ఎవరికీ తక్కువ చేయలేదు. అందరూ ఆర్ధికంగా భాగుండాలని తపించాను. నేను పేదల గురించి తప్ప రాష్ట్రంలో దేని గురించి ఆలోచించలేదు. వారు ఆర్దికంగా బలపడితే మిగతావన్నీ సర్దుకుంటాయని భావించాను.

కన్నీళ్లు వస్తున్నా ఆపుకుంటూ చివరి సారిగా

కానీ ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదని కన్నీళ్లు వస్తున్నా ఆపుకుంటూ చివరి సారిగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారాయన. నా మీద ఉన్న ఆ ప్రేమ ఏమైంది. జగనన్నా అంటూ పిలిచేవారు. నా అమ్మలు, అక్కల ప్రేమ ఎటుపోయిందో తెలియడం లేదు. ఇంతటి ఆశ్చర్యకర ఫలితాలొస్తాయని కలలో కూడా ఊహించలేదన్నారాయన. నేను సామాజిక న్యాయం చేశాను. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ లా భావించి అమలు చేశాను. పేదల కోసం తాపత్రయ పడ్డాను. మరి ఇంత చేసినా ఆ ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు. చేయగలిగినంత చేశాము. ఇప్పుడు ఏమీ చేయలేము. ప్రజల తీర్పును తీసుకుంటాం. నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. నా కష్టాల్లో తోడుగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాను. పేదవాడికి తోడుగా ఉంటాము. ఎప్పుడూ అండగా నిలబడతాం. ఇంత తక్కువ సీట్లు వచ్చినా 40 శాతం ఓటు బ్యాంక్ ను తగ్గించలేకపోయారు. పెద్ద పెద్ద నేతల కూటమి ని ఎదర్కొన్నాం. బీజేపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అభినందనలు. నాకు తోడుగా ఉన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు మనస్పూర్తిగా క్రుతగ్నతలు తెలియజేస్తున్నాను. ఏం జరిగిందో తెలియదు. ఇక నుంచి ప్రజల పక్షాను ఉంటాను. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా దేనికైనా నేను సిద్దంగా ఉన్నాను. గెలిచి ప్రభుత్వ ఏర్పాటు చేయబోయే వాళ్లకు ఆల్ ది బెస్ట్ అన్నారు వైసీపీ అధినేత జగన్.

ఫలితాలు చూస్తే మాత్రం మొత్తం తేడా

జగన్ స్పీచ్ విన్నవారికే కాదు గ్రామీణ పేదలు జగన్ వెంటే ఉన్నారని ఫలితాలు వచ్చేవరకు అందరూ భావించారు. గెలవకపోయినా టఫ్ కాంపిటీషన్ ఉంటుందనుకున్నారు. క్లోజ్ ఫైట్ ఉందని ఊహించారు. కానీ ఫలితాలు చూస్తే మాత్రం మొత్తం తేడాగా ఉంది. ఎంతలా అంటే ఊహించనంత. జగన్ పథకాల ద్వారా లబ్దిపొందిన వారు కూడా ఓటు వేయలేదా అనే అనుమానం కలిగింది. అందుకే జగన్ ఎమోషనల్ అయ్యారు. గెలవకపోయినా గౌరవప్రదమైన సీట్లు రాలేదనేది ఆయన బాధ స్పష్టంగా కనిపించింది. ఎక్కడ తేడా జరిగిందనే ఆయనే ప్రశ్నించడం చూస్తే అసలు ఓటమికి సరైన కారణం తెలియడం లేదనే మాట వినిపించింది. కానీ ప్రజలు ఎప్పుడూ తెలివైన నిర్ణయం తీసుకుంటారు. ప్రజలతో లింక్ తెగిపోతేనే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. కేవలం సంక్షేమం నమ్ముకున్న జగన్ ప్రజలతో లింక్ తెగిపోయిందనడానికి ఆయన చివరి స్పీచ్ ఉదాహరణ అని చెప్పొచ్చు. ప్రజలు ఎందుకు ఆదరించలేదో అర్ధం కావడం లేదని ప్రశ్నించారు జగన్. ఆయనకు ఈ ప్రశ్న రావడం ఆశ్చర్యమే. ఎందుకంటే తన తప్పులను సులువుగా తెలుసుకునే శక్తి జగన్ కు ఉండాలి. ప్రజల ఆస్పిరేషన్స్ ఏంటో తెలుసుకోలేకపోయారాయన. ప్రజల కష్టాలను గుర్తించలేకపోయారు. కేవలం డబ్బులను పంచితే చాలు గెలుస్తామనుకున్నారు. వాలంటీర్లు గెలిపిస్తారని అనుకున్నారు. కానీ తాను ప్రవేశ పెట్టిన లిక్కర్ ను సామాన్య జనం ఎలా తాగుతారని ఆయన తెలుసుకోలేకపోయారు. జనం తిడుతున్నా కూడా తప్పుడు పద్దతినే సరైందనుకున్నారు. జనం చస్తారని తెలిసినా పట్టించుకోలేదు. ఇక రోడ్లు భాగోలేవని కేసీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో విమర్శించినా కూడా జగన్ అర్దం చేసుకోలేకపోయారు. చంద్రబాబు చేసిన తప్పునుతాను చేయొద్దని భావించలేదు. రాజధానిని నిర్మించాలనే తపన ఆయనకు లేదు. కేవలం రాజకీయ కోణంలోనే చూశారు. అమరావతిని వదిలేశారు. పోనీ కొత్త రాజధానిని కూడాడెవలప్ చేయలేదు. కొత్త పరిశ్రమలు రాలేదు. ఉద్యోగాలు లేవు. ఇలా ఒకటా, రెండా ఎన్నో తప్పులు. తమ నాయకుల బరితెగింపు బూతులను ఎంకరేజ్ చేశారు. దాడులు, కబ్జాలను పట్టించుకోలేదు. కనీసం సోషల్ మీడియాను రోజూ చూసి వాటిని పరిష్కరిస్తే ఇంత చెడ్డ పేరు వచ్చేది కాదు. పైగా మొత్తం తన చుట్టూ రెడ్డి సామాజికవర్గం వారినే ఎంచుకున్నారు. పేరుకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు టికెట్ లు ఇచ్చినా మెయిన్ పవర్ మొత్తం ఒకే సామాజిక వర్గం దగ్గరుందనే అప ఖ్యాతి ఆయన మూటగట్టుకున్నారు.

రౌడీయిజం వద్దు

అయితే ఇన్ని విమర్శలు సరే...దాదాపుగా మూడు లక్షల కోట్లను పంచారు జగన్. పేదలకు డైరెక్ట్ గా డబ్బులిచ్చారు. రెండున్నర లక్షల మంది వాలంటీర్లను పెట్టుకున్నారు. ప్రభుత్వారం లబ్దిపొందిన వారు ఓట్లు వేసినా కొన్నైనా సీట్లు రావాలి. కానీ రాలేదు. ఎందుకనేది ఎవరికీ అందని ప్రశ్న. అంటే ఏపీ ప్రజలు కేవలం సంక్షేమం మాత్రమే కోరుకోవడం లేదు. సరిపోయే సంక్షేమమే కాదు తమకు అభివ్రుద్ది కూడా కావాలని తేల్చారు. రౌడీయిజం వద్దు. రాజధాని కూడా కావాలని కోరుకున్నారు. అంటే రేపు చంద్రబాబు నాయుడైనా సరే ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా కూడా ప్రజలు ఓట్లేయరనేది నేటి ఏపీ ఫలితాలతో తేలిపోయింది. ఉద్యోగాలు కూడా వేయాలి. నాయకుల కబ్జాలు , నేరాలను కంట్రోల్ చేయాలి. రౌడీయిజం చేసే నాయకులను పక్కన పెట్టాలి. ఎలాగూ అధికారంలోకి వచ్చాం కదా అని అతి చేస్తే వైసీపీ కి పట్టిన గతే పడుతుందనడంలో సందేహం లేదు. ప్రజలు చాలా తెలివిగా ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. సంక్షేమం మాత్రమే కాదు ఆకాంక్షలను కూడా నెరవేర్చాలి. ఇప్పుడు పోలవరం నుంచి స్పెషల్ స్టేటస్ వరకు, రాజధాని నుంచి మౌలిక వసతుల కల్పన వరకు అన్నీ జనం లెక్కలు వేస్తారు. నేటి ఎన్నికల ఫలితాలతో మరొకటి కూడా స్పష్టమైంది. జనం ఓర్చుకుంటున్నారని అనుకోవద్దు. అన్నింటిని గమనిస్తున్నారు. తమకు అవకాశం రాగానే తొక్కేస్తున్నారు. ఎంతలా అంటే అథ:పాతాళానికి. జగన్ అండ్ కోకు జరిగింది అదే. వైసీపీ ఎమ్మెల్యేలు ఓటర్ల మీదే బలుపు చూపించారు. ఒకడు ఓటరు ను కొడితే మరొకడు ఏకంగా ఓటింగ్ మిషన్ లనే నేలకు కొట్టాడు. ఇవన్నీ కూడా ప్రజలు చూడటం లేదు, భయపడటం లేదనుకుంటే మాత్రం వాత తప్పదు. వైసీపీకి అదే జరిగింది.

బాబు కూడా ఆ పద్దతి మార్చుకోవాలనేదానికి ఇదో సంకేతం

ఇక సీఎం గా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన కదల్లేదు. ఇప్పుడు బాబు కూడా ఆ పద్దతి మార్చుకోవాలనేదానికి ఇదో సంకేతం. చంద్రబాబు కూడా గెలిస్తే సొంత పార్టీ కార్యకర్తలకు కూడా దొరకడనే పేరుంది. కాబట్టి అది కూడా మార్చుకోవాలి. మీడియాతో మాట్లాడాలి. మీడియా వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. బయట ఏం జరుగుతుందో కూడా సీఎంకు తెలుస్తుంది. కానీ జగన్ అది చేయలేదు. మీడియాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అదీ తప్పే. సొంత పార్టీ నాయకులను జగన్ కంట్రోల్ చేయలేదు. బాబు కంట్రోల్ చేయాలి. తమకు అవకాశం వచ్చింది కదా అని దాడులకు తెగబడితే ఐదేళ్ల పాటు సామాన్యులు మనసులో పెట్టుకుంటారు. తర్వాత ఓటుతో ఊచకోత కోస్తారు. వైఎస్ జగన్ ఓటమికి పథకాలు, తప్పులు ఒక కారణమైతే బూతులు మాట్లాడటం కూడా ఎవరూ సహించరు. సోషల్ మీడియాలో ఎంటర్టెయిన్ మెంట్ గా చూశారు కానీ అదే జనం చీకొట్టారు. చట్టసభల్లో ఉండి, మంత్రులుగా ఉన్నవారు కూడా ఏపీ పేరును చెడగొట్టారనే కోపం ఉంది. కొడాలి నాని, వంశీ, రోజా, అప్పల్రాజు, పేర్ని నాని ఇలా ఒకరా ఇద్దరు చాలా దారుణంగా చంద్రబాబును తిట్టారు. ఆఖరికి చంద్రబాబు భార్యను కూడా రాజకీయాల్లోకి లాగి అవమానించారు. బాబును ఏడ్చేలా చేశారు. ఇవన్నీ జనం పట్టించుకోరులే అని అధికారం మత్తులో రెచ్చిపోయారు. అవన్నీ కూడా వైసీపీకి చెడ్డ పేరు తెచ్చాయి. ఓటమికి కారణమయ్యాయి. ప్రజలను తక్కువగా అంచనా వేసిన జగన్ అండ్ కో ఇప్పుడు గోర్లు గిల్లుకుంటున్నారు. ఎందుకంటే జగన్ వారిని కంట్రోల్ చేయాల్సింది. తాను బూతులు మాట్లాడలేక తన కింద ఉన్నవారితో పోటీ పడి తిట్టించారాయన. ప్రజలు ప్రతి విషయాన్ని లెక్కలేసుకుని మరి ఆలోచన చేస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు టీడీపీ అయినా సరే. రివేంజ్ పాలిటిక్స్ కి దిగి దిగజారి ప్రవర్తిస్తే మాత్రం అంతే సంగతులు. దేనికైనా లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే అంతే సంగతులనడానికి ఉదాహరణ.

మీ పాలన ఎంత చెత్తగా ఉందో చూసుకో జగన్

ప్రజలకు కోపం వస్తే ఎలా ఉంటుందో వైసీకికి రుచి చూపించారు. తాను గొప్పగా చేశానిన జగన్ భ్రమపడ్డారు. కానీ పది మంచి పనులు చేసి వంద తప్పులు చేస్తామంటే ఒప్పుకోమని తేల్చారు. మీరు మా డబ్బులను మాకిచ్చి మామీద స్వారీ చేస్తానంటే క్షమించమన్నారు. బాబు కూడా దీనిని ద్రుష్టిలో పెట్టుకోవాలి. గతంలో గొప్ప అవకాశాన్ని బాబు చేజార్చుకున్నారు. జగన్ ఒక్క చాన్స్ అంటూవ చ్చి అదే తప్పు చేశారు. మరో బంపర్ చాన్స్ టీడీపీకి వచ్చింది. ఇంత చేసినా ఏడ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇవే కారణాలు. ఇంకా లోతుగా వెళ్తే ఎన్నో ఉన్నాయి. ఎవ్రీ థింగ్ కౌంట్స్. కౌంటింగ్ అయ్యాకే తెలుస్తుంది. ఓటరు దెబ్బ ఏంటనేది. జగన్ ఏడ్చి తాను ఎంతో చేశానని భ్రమలోంచి బయటకు రావాలి. ఓటరు ఎప్పుడూ తెలివైన వాడే. అన్నింటికి సలక శాఖ మంత్రులను పెట్టుకోవద్దు. తమ తమ శాఖలపై పట్టుండేవారిని పెట్టుకోలేదు జగన్. నామ్ కే వాస్తే తోలు బొమ్మలను మంత్రులుగా పెట్టి మొత్తం తానే చేశారు. కనీసం అమర్నాథ్ కు ఐటీ అంటే తెలియదు. అలాంటి వ్యక్తిని జనం మీద రుద్దితే ఊరుకుంటారా? మంత్రులంతా డమ్మీలే. కనీసం ఏ మంత్రిది ఏ శాఖో జనాలకు కూడా గుర్తు లేకుండా అనామాకలకు, తెలివి లేని వారికి, జనంలో గుర్తింపు లేని వారికిచ్చి జగన్ చేజేతులా ఓటమి కొని తెచ్చుకున్నారు. కాబట్టి పవర్ లోకి వచ్చి గుడ్డిగా పాలన చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది. ఎందుకంటే 151 సీట్లిచ్చి అందలం ఎక్కించిన జనం ఇప్పుడు పది సీట్లకు పరిమితం చేశారంటే మీ పాలన ఎంత చెత్తగా ఉందో చూసుకో జగన్ అని మొహం మీదే చెప్పారు. కానీ జగన్ మాత్రం నా అక్క చెల్లెళ్ల ప్రేమ ఏమైంది. నా తాతలు ఎటు వెళ్లారు. నా తమ్ముళ్ల ప్రేమ ఏమైందని బాదపడుతున్నారు. కానీ తన కింది ఉన్న ఎమ్మెల్యేలు ఒక్క సారి గెలిచి పది తరాలకు సరిపడా దోచుకున్నారనే విషయాన్ని జగన్ గుర్తిస్తే భాగుంటుందేమె. రౌడీ మూకలను వెంటేసుకుని చిల్లరగా తిరిగిన ఎమ్మెల్యే లను వచ్చే సారైనా దూరం పెట్టాలి. ఇది జగన్ కే కాదు ఎలా పాలించకూడదో జగన్ కు వచ్చిన ఫలితాలను చూసైనా టీడీపీ అధినేత జాగ్రత్తగా మసలుకోవడానికి ఇదో గుణపాఠం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow