ఈ నక్షత్రాలలో పుట్టిన వారు అదృష్టవంతులు ప్రపంచ ధనవంతులు అవుతారు
జ్యోతిషశాస్త్రంలో, మన జీవితాలను రూపొందించడంలో మన జన్మ రాశులే కాకుండా మన జన్మ నక్షత్రాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 27 నక్షత్రాలు ఆ జాతకుని యొక్క స్వభావాన్ని తెలుపుతాయి అని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉంటారు.Sri Media News
జ్యోతిషశాస్త్రంలో, మన జీవితాలను రూపొందించడంలో మన జన్మ రాశులే కాకుండా మన జన్మ నక్షత్రాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 27 నక్షత్రాలు ఆ జాతకుని యొక్క స్వభావాన్ని తెలుపుతాయి అని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉంటారు. అంటే ఒక్కో నక్షత్రంలో పుట్టిన వారు ఒక విధంగా ప్రవర్తిస్తారు. వారి స్వభావం కానీ వారి లక్షణాలు కానీ నక్షత్రాన్ని బట్టి కూడా అంచనా వేయగలుగుతారు. జ్యోతిష నిపుణులు మనకు ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో పుట్టిన వారు ఏ విధంగా ఉంటారు. అలాగే ధనవంతులయ్యేటువంటి అదృష్టం అవకాశం ఏ నక్షత్రంలో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ 27 నక్షత్రాల ప్రాముఖ్యతను తెలుసుకుందాం..
హిందూ పురాణాల ప్రకారం... 27 నక్షత్రాలు దక్షుని కుమార్తెలు. ఆ నక్షత్రములే - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. వీరిని చంద్రుడు వివాహం చేసుకున్నాడు. వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ చాల అందంగా ఉండేవారు. వీరందరికంటే.. రోహిణి మరింత అందంగా ఉండేది...
దీంతో చంద్రుడు రోహిణిని ఎక్కువగా ప్రేమించేవాడు. అంతేకాదు... రోహిణితో సమయం గడపడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు చంద్రుడు... దీంతో చంద్రుడి ప్రవర్తన నచ్చని... మిగిలిన 26 మంది భార్యలు చంద్రుని ప్రవర్తనపై దక్ష రాజుకు ఫిర్యాదు చేశారు. వేంటనె చంద్రుని వద్దకు వెళ్లి దక్షుడు తన కూమర్తెలందరిని సమానంగా ప్రేమించమని చంద్రుడిని పదే పదే వెడుకుంటాడు దక్షుడు. కానీ చంద్రుడు తన ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన దక్షుడు... చంద్రుడిని అనారోగ్యంతో, ప్రకాశ హినుడవుతావు అని...శపించాడు. క్రమంగా చంద్రుడి ప్రకాశం క్షిణిస్తుంది.. దీంతో వృక్షసంపద చనిపోవడం ప్రారంభమవుతుంది. వృక్ష జాతి లేకపోతే భూమిపై మనుషులు ఉండరని... దేవతలందరూ జోక్యం చేసుకుని దక్షుడిని తన శాపాన్ని వెనక్కి తీసుకోమని కోరారు. దీంతో వారి అభ్యర్థనను అంగికరిచిన దక్షుడు చంద్రుడు... ప్రతి పదిహేను రోజులు అనారోగ్యంతో బాధపడుతాడని.. దాని నుండి క్రమంగా కోలుకుంటానని శప విమోచనం చేస్తాడు. ఇది ప్రతి నెల మనం చూడవచ్చు 15 రోజులు చంద్రుక్షీణంచి పౌర్ణమికి పూర్తిగా ప్రకాశ వంతంగా కనిపిస్తాడు...
ఇది నక్షత్రల అసలు చరిత్ర.. మరి ఏ నక్షత్రల్లో పుట్టినవారు... ధనవంతులు అవుతారో చూడండి...
అశ్విని నక్షత్రం
ఈ నక్షత్రంలో పుట్టిన వారు సంచార స్వభావాన్ని కలిగిన వారిగా ఉంటారు. అలాగే చపలత్వం అనేది ఈ జాతకుల స్వభావం .
భరణి నక్షత్రం:
ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వార్థ ప్రవృత్తిని కలిగి ఉంటారు. సొంత నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమౌతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడతారు. ఇతరులు తీసుకునే నిర్ణయాలే తమ నిర్ణయాలుగా చెప్తూ ఉంటారు.
కృత్తికా నక్షత్రం:
ఈ నక్షత్రంలో పుట్టిన వారు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇతరుల వస్తువులు తమరిగా ఆక్రమించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారు అహంకార స్వభావులు ఉంటారు. ఈ జాతకులకి నిప్పు వాహనాలు ఆయుధాలు అంటే ఎక్కువ భయం ఉంటుంది.
రోహిణి నక్షత్రం:
ఈ నక్షత్రంలో పుట్టిన వారు ప్రశాంతంగా ఉంటారు. కళా ప్రియులుగా ఉంటారు. వీరు మనసులో ఏది దాచుకోరు.. ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు.
మృగశిర నక్షత్రం:
ఈ నక్షత్రంలోఎవరైతే పుడుత్తారో వారు భోగవిళాసులు అంటారు. అమితమైన తెలివితేటలు ఉన్నా కూడా సరైన సందర్భంలో తమ తెలివిని ప్రదర్శించలేరు.ఎవ్వరిని కూడా వీరు నమ్మరు.. ఎవరి మాట వినరు.
పునర్వసు నక్షేత్రం:
ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు ఆదర్శవాదులుగా ఉంటారు. ఇతరులకి సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా వీళ్ళు శాంత స్వభావులు, ఆధ్యాత్మికంగా ఉండటం వీరికి ఎక్కువ ఇష్టం.
ఆశ్లేష నక్షత్రం:
ఈ నక్షత్రంలో పుట్టిన వారు మొండి పట్టు కలిగినటువంటి స్వభావులై ఉంటారు. కష్టాలను కొని తెచ్చుకుంటారు. ఎక్కువ ధనవంతులయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ నక్షత్రల్లో పుట్టిన వారందరు ధనవంతులైయ్యే అవకాశాలు ఎకువ..
అయితే ఈ నక్షత్రాలన్నిటికంటే... ధనిష్టా నక్షత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ధనిష్టా నక్షత్రనికి అధిపతి అంగారకుడు, శని దేవుడు పుట్టిన నక్షత్రం...అందువల్ల ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఈ నక్షత్రంలో పుట్టిన వారు పరోపకారం చేయడంలో కూడా ముందుంటారు. పనిచేయటం అంటే ధనిష్ట నక్షత్రం వాళ్లకి ఇష్టం అందరిలో సులభంగా కలిసిపోతారు. తక్కువ సమయంలో మంచి స్నేహితుని సంపాదించుకుంటారు. మంచి జ్ఞానాన్ని సంపాదించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా మనసుని లగ్నం చేస్తారు. జీవితాన్ని చాలా ప్రశాంతంగా గడపాలి అని భావిస్తారు. ఏదైనా సాధించడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తమ మాటల ద్వారా ఇతరులను కూడా ప్రభావితం చేయగలుగుతారు. ఎక్కువ ధనవంతులైనటువంటి అవకాశం 27 నక్షత్రాల్లోనూ దనిష్టా నక్షత్రంలో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది.
What's Your Reaction?