రాబిన్ సింగ్ క్రికెట్ చరిత్ర మరచిన విజేత.....కనుమరుగైన క్రికెట్ పోరాట యోథుడు

ఓటమి తలపుతట్టేలా ఉన్న సమయంలో బంతి అందుకున్న రాబిన్‌ సింగ్‌ హ్యాట్రిక్‌తో అద్భుతం చేశాడు. హ్యాట్రిక్‌తో పాటు మొత్తం 5 వికెట్లు కూల్చి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. బాల్‌తోనే కాదు.. ఆస్ట్రేలియాపై తన బ్యాటింగ్‌ పవర్‌ కూడా చూపించాడు.Sri Media News

Jun 5, 2024 - 15:04
 0  8
రాబిన్ సింగ్ క్రికెట్ చరిత్ర మరచిన విజేత.....కనుమరుగైన క్రికెట్ పోరాట యోథుడు

రబింద్ర రామ్ నారాయణ్ సింగ్..

చరిత్ర మరచిన విజేత ఇతడు... చరిత్ర మరిచిపోయిన.. అభిమానుల హృదయంలో నిలిచిపోయిన  విజేత... క్రికెట్ చరిత్రలో కనుమరుగైన పోరాట యోథుడు... రబింద్ర రామ్ నారాయణ్ సింగ్.. "రాబిన్" సింగ్... గొప్ప ఆటగాళ్లు సైతం ఈ ఆటగాడిని విశ్మరించలేరు... ఇతడిని తక్కువ అంచనా వెయ్యలేరు... అతడి ఆట క్రికెట్ అభిమానుల్లో చేదరని ముద్ర... కానీ...  సచిన్, గంగూలీ, కపిల్ దేవ్ లాంటి.. ఆటగాళ్ల మానియాలో, రాబిన్ సింగ్ అద్భుతమైన ఎన్నో విజయాలు చరిత్రలో కలిసిపోయాయి.

చరిత్ర మరవని ఇన్నింగ్స్ లతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన ఆటగాడు... రాబిన్ సింగ్ .హేమహేమీలతో భారత్‌ బ్యాటింగ్‌ బలంగా ఉన్నా.. ఫీల్డింగ్‌లో మాత్రం మనం పసికూనలమే. కవర్స్‌లో ఇద్దరు ఫీల్డర్ల మధ్య నుంచి బాల్‌ వెళ్తుంటే చేయి లేపి బౌండరీ లైన్‌ ఫీల్డర్‌ను అలర్ట్‌ చేయడం అలవాటు పడ్డ టీమిండియా.. తొలిసారి పక్కకు డైవ్‌ చేస్తూ.. బాల్‌ను ఆపే ఫీల్డర్‌ను చూసింది.. అతడే.. రాబిన్‌ సింగ్‌.

ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చి బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ కొత్త ఒరవడి సృష్టించాడు. 1999 వన్డే వరల్డ్‌ కప్‌ సందర్భంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ప్రధాన బౌలర్లు రాణించకపోయినా.. ఓటమి తలపుతట్టేలా ఉన్న సమయంలో బంతి అందుకున్న రాబిన్‌ సింగ్‌ హ్యాట్రిక్‌తో అద్భుతం చేశాడు. హ్యాట్రిక్‌తో పాటు మొత్తం 5 వికెట్లు కూల్చి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. బాల్‌తోనే కాదు.. ఆస్ట్రేలియాపై తన బ్యాటింగ్‌ పవర్‌ కూడా చూపించాడు.


భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.

1999 వన్డే వరల్డ్‌ కప్‌ సందర్భంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ప్రధాన బౌలర్లు రాణించకపోయినా... ఓటమి తలపుతట్టేలా ఉన్న సమయంలో బంతి అందుకున్న రాబిన్‌ సింగ్‌ హ్యాట్రిక్‌తో అద్భుతం చేశాడు. హ్యాట్రిక్‌తో పాటు మొత్తం 5 వికెట్లు కూల్చి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. బాల్‌తోనే కాదు.. ఆస్ట్రేలియాపై తన బ్యాటింగ్‌ పవర్‌ కూడా చూపించాడు.100 పరుగులలోపే 4 కీలక వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటి పరిస్థితుల్లో షేన్‌ వార్న్‌ లాంటి దిగ్గజ బౌలర్‌ను ఎదుర్కొవడమే కాకుండా.. అతని ఓవర్‌లో ఏకంగా మూడు భారీ సిక్సులు కొట్టి.. ఆస్ట్రేలియాకే షాక్‌ ఇచ్చాడు. ఇలా అనేక సందర్భాల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో టీమిండియాకు అపద్బాంధవుడిలా మారాడు. రాబిన్‌ రాక ముందు.. ఆడితే సచిన్‌ లేదంటే గంగూలీ.. బౌలింగ్‌ వేస్తే శ్రీనాథ్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌ లేదంటే కుంబ్లే.

ఇలా ఉన్న టీమిండియాకు రాబిన్‌ సింగ్‌ ఒక యోధుడిలా... దొరికాడు. జట్టు 4, 5 వికెట్లు కోల్పోయినా ప్రత్యర్థి టీమ్‌కు వణుకుపుట్టించేవాడు రాబిన్‌ సింగ్‌. మూడు విభాగాల్లోనూ అద్భుతాలు చేసిన రాబిన్‌ సింగ్‌లోని మరో స్పెషల్‌ టాలెంట్‌ ఏంటంటే.. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో ఒక విభాగంలో అద్భుత ప్రదర్శన ఇస్తాడు. జట్టులో అతనుంటే బ్యాటర్‌, బౌలర్‌, ఫీల్డర్‌ రూపంలో ముగ్గురు ఆటగాళ్లు జట్టులో ఉన్నట్లే.ఇలా వన్డేల్లో అప్పటి వరకు టీమిండియా చూడని ఒక ఆటగాడిగా ఎదిగిన రాబిన్‌సింగ్‌ టెస్ట్ జట్టులో మాత్రం స్థానం సంపాదించుకోలేక.

తన టెస్ట్ కెరీర్ ను ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ కు పరిమితం చేసుకున్నాడు. మెగ్రాత్, బ్రెట్ లీ, గిలెస్పీ, షేన్ వార్న్ లాంటి దిగ్గజ బౌలర్లను ఎదుర్కొంటూ.. ఆస్ట్రేలియాపై 1999లో చేసిన 30 బంతుల్లో 75 పరుగుల ఇన్నింగ్స్ ఇప్పటికీ ఓ మరపురాని సంఘటనే. ఇంతటి ఘనత వహించిన రాబిన్ కు మాత్రం రావాల్సినంత పేరు మాత్రం రాలేదనే చెప్పాలి. సచిన్, గంగూలీ, అజారుద్దీన్ లాంటి ఆటగాళ్ల మాటున రాబిన్ సింగ్ అనే పోరాట శిఖరం కనుమరుగు కాక తప్పలేదు. ఇప్పుడంటే సోషల్ మీడియా వాడకం పెరిగాక.. సచిన్, కోహ్లీ, ధోని లాంటి ఆటగాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

సింగ్ పదవీ విరమణ చేసిన వెంటనే కోచింగ్ ప్రారంభించాడు. అతని మొదటి కోచింగ్ స్థానం భారత అండర్-19 క్రికెట్ జట్టుతో. 2004లో, అతను హాంకాంగ్ జాతీయ క్రికెట్ జట్టుకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ఆ జట్టు 2004 ఆసియా కప్‌కు అర్హత సాధించడంలో కృషి చేశాడు. 2006 లో సింగ్, ఇండియా A క్రికెట్ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు. అక్కడ గౌతమ్ గంభీర్, రాబిన్ ఉతప్ప వంటి క్రికెటర్లకు శిక్షణ ఇచ్చాడు. సింగ్ కోచ్‌గా ఉన్న పలువురు క్రికెటర్లు భారత జాతీయ జట్టుకు ఆడారు. 2007, 2008లో భారత జాతీయ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీకి మొదటి ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు.

2020లో UAE క్రికెట్‌‌కి డైరెక్టర్‌గా

సింగ్ 2009 అక్టోబరు వరకు భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు అయిన ముంబై ఇండియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసాడు. 2010లో MIలో 3 సంవత్సరాల కాలానికి ప్రధాన కోచ్‌గా చేరాడు. అంతకు ముందు ఎప్పుడూ మొదటి నాలుగు స్థానాలకు అర్హత సాధించని ఆ జట్టు అదృష్టం దాంతో మలుపు తిరిగింది. అతను 2010 IPL సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు రన్నరప్ స్థానం సాధించడంలో తోడ్పడ్డాడు. అప్పటి నుండి 2013, 2015, 2017, 2019, 2020 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకోవడంలో కోచింగ్ లో భాగమయ్యాడు. 2013 ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20, 2011 ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 లను ముంబై ఇండియన్స్ గెలవడంలో కూడా కృషి చేసాడు.


రాబిన్ సింగ్ 2020లో UAE క్రికెట్‌‌కి డైరెక్టర్‌గా, UAE జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. 2 సంవత్సరాల పాటు కరోనా మహమ్మారి అతని పదవీకాలానికి అంతరాయం కలిగించింది. కొన్ని నెలలు అతని శిక్షణలో ఉన్న ఆటగాళ్ళు అసలు క్రికెట్ ఆడనే లేదు. అయినప్పటికీ, UAE వరుస విజయాలను సాధించి, ఆస్ట్రేలియాలో జరిగే ICC T20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow