పదేళ్లు చంద్రబాబుని దారుణంగా అవమానించారు...కానీ ఇప్పుడు దేశంలో మోడీ, అమిత్ షాలు చేతులు కట్టుకుని బాబు కోసం వెయిట్ చేయాల్సిందే.

ఇప్పుడు దేశంలో కింగ్ మేకర్స్ ఇద్దరే ఒద్దరు. కేంద్రంలో మోడీ మళ్లీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు ఖచ్చితంగా కావాలి. కేంద్రంలో మోడీ మళ్లీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు ఖచ్చితంగా కావాలి. Sri Media News

Jun 5, 2024 - 14:45
 0  3
పదేళ్లు చంద్రబాబుని దారుణంగా అవమానించారు...కానీ ఇప్పుడు దేశంలో మోడీ, అమిత్ షాలు చేతులు కట్టుకుని బాబు కోసం వెయిట్ చేయాల్సిందే.

మోడీ, అమిత్ షాలు చేతులు కట్టుకుని బాబు కోసం వెయిట్ చేయాల్సిందే

ఏపీలో చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయన నాలుగోసారి సీఎం అయ్యారు. అది కాదు అసలైన వార్త. కేంద్రంలో మోడీ మళ్లీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు ఖచ్చితంగా కావాలి. లేదంటే మోడీ, అమిత్ షాలు చేతులు కట్టుకుని బాబు కోసం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు దేశంలో కింగ్ మేకర్స్ ఇద్దరే ఒద్దరు. ఒకటి చంద్రబాబు మరొకరు నితిష్ కుమార్. వీరిని ఎన్నో సార్లు మోడీ స్వయంగా అవమానించారు. మొన్నటికి మొన్న నితిష్ కుమార్ ని ప్రచారంలో కూడా ఇన్ సల్ట్ చేశారు మోడీ. అయినా ఆయన హూందాగా ప్రవర్తించారు. ఇక కుదరదు. మోడీ అయినా షా అయినా సరే తగ్గి ఉండాల్సిందే. ఇక బాబు విషయానికి వస్తే  పదేళ్లు చంద్రబాబు నాయుడిని దారుణంగా అవమానించారు. సొంత మెజారిటీ రావడంతో గుజరాత్ వాళ్లు దేశం మొత్తంవిరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, హెం మంత్రి అమిత్ షా లు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. గతంలో బాబు అవమానించారని రెచ్చిపోయారు. ఎంతలా అంటే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తన ఆఫీస్ ముందు బాబును వెయిట్ చేయించారు. బాబు బొకే పట్టుకుని అరగంటకు పైగా ఎదురు చూసేలా దారునంగా కక్ష సాధించారు.

వైఎస్ జగన్ కు వంత పాడుతూ బాబును దూరం పెట్టింది బీజేపీ

ఇక మొదటి సారి పొత్తులో ఉన్నా కూడా అమరావతికి నిధులు ఇవ్వకుండా మట్టి, నీళ్లు తెచ్చి మహా ప్రసాదం తీసుకొమ్మన్నారు మోడీ. రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత పోలవరం పూర్తి చేసేందుకు పేచీలు పెట్టారు. పేరుకే ఎన్డీఏలో ఉన్నారు కానీ బాబుకు ఏ మాత్రం సహకరించలేదు గుజరాత్ బ్యాచ్. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు. వెనుకబడిని జిల్లాలకు నిధులు అడిగినా ఇవ్వలేదు. చివరకు తుఫాన్ వచ్చింది సాయం చేయమన్నా కూడా రూపాయి విదిల్చలేదు. చివరకు బాబే కేంద్రం దగ్గర నిధులు తేలేక సమర్ధించుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. ఇక రెండవ సారి వైఎస్ జగన్ గెలిచిన తర్వాత కూడా బాబును దూరం పెట్టారు. వైఎస్ జగన్ కు వంత పాడుతూ బాబును దూరం పెట్టింది బీజేపీ. ఆ తర్వాత కూడా చంద్రబాబును లెక్క చేయలేదు. చివరకు చంద్రబాబు నాయుడు ను జైల్లో పెట్టినా కూడా కనీసం మాట వరసకు కూడా ఏమీ మాట్లాడలేదు. ఒకప్పుడు బీజేపీకి వాజ్ పేయి హయాంలో ఆ పార్టీకి నమ్మకమైన పర్మినెంట్ మిత్రులైన పార్టీలు మూడే. ఒకటి శివసేన, రెండు అకాళిదల్, ఆ తర్వాత టీడీపీ. కానీ ఈ మూడు పార్టీలను ముంచింది బీజేపీ. టీడీపీని కూడా అలానే అవసరం కోసం వాడుకుని ముంచింది. ఏపీకి న్యాయం చేయకుండా జగన్ ను అడ్డు పెట్టుకుని ఆడుకుంది. ఎంతలా అంటే టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు చేయించి మరీ బీజేపీలో చేర్చుకుంది. కానీ టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. పదేళ్లు మోడీ, అమిత్ షా హవా నడిచింది. ఇప్పుడు బాబు టైమొచ్చింది. ఎంతలా టీడీపీకి పదహారు సీట్లైనా కూడా ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి కావాలంటే ఎంతో కీలకం. అందుకే మెజారిటీ తగ్గిందని గుర్తించి గుజరాతీ తెలివితో మోడీ బాబుకు ఫోన్ చేశారు.కంగ్రాట్స్ చెప్పారు. ఆ తర్వాత అమిత్ షా ఫోన్ కంగ్రాట్స్ చెప్పి ఢిల్లీకి రావాలని ఆహ్వానించారు అమిత్ షా. ఎన్డీఏ కూటమికి మీటింగ్ కు రావాలని ఇన్వైట్ చేశారు. ఇదే అమిత్ షా స్వయంగా బాబు లాంటి సీనియర్ నేతకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మోడీ తో కూడా కలవకుండా రెండు రోజులు వెయిట్ చేయించిన రోజులు ఉన్నాయి. కొన్ని సార్లు కలవకుండానే బాబు వచ్చారు. ఇటు చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు అమిత్ షా, మోడీని కలిసేందుకు శతవిథాలా ప్రయత్నించారు లోకేష్. వారి సాయం తీసుకోవాలనుకున్నా కూడా మాకు సంబంధం లేనట్లు వదిలేశారు. ఇక టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు కూడా వీరిద్దరూ మొదట్లో ఒప్పుకోలేదు. కేవలం పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల కనీసం ఓట్లు లేకున్నా టీడీపీ దయ వల్ల నాలుగు సీట్లు వస్తాయన్న ఆశతో పొత్తు పెట్టుకున్నారు. దాని వల్ల బీజేపీకే లాభం జరిగింది. ఎందుకంటే అసలు ఓట్లే లేని బీజేపీకి మూడు ఎంపీ స్థానాలు రావడం అంటే అది టీడీపీ, జనసేన కూటమి వల్లే. ఇలా ఎటు చూసుకున్నా బాబు ఇప్పుడు కింగ్ మేకర్ అయ్యారు.

అమరావతి నిర్మాణం కోసం చచ్చినట్లు మోడీ నిధులు ఇవ్వాల్సిందే.

అయితే ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చచ్చినట్లు మోడీ నిధులు ఇవ్వాల్సిందే. ఇంతకు ముందులా నిధులడిగితే బయటకు పంపిచినట్లు డ్రామాలు చేస్తే కుదరదు. అడగగానే ఇవ్వాలి. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. పోలవరం పూర్తి చేయాలి. వెనుబడిన జిల్లాలకు తోడుగా కేంద్ర సంస్థలను వెంటనే రాజధానిలో ఏర్పాటు చేసేలా బాబు అడగగానే సాయం చేయాల్సిందే. తుఫాన్ లు వచ్చినా ట్వీట్ చేసి మొహం చాటేసే మోడీకి ఇక ఆ పరిస్థితి ఉండదు. ఇప్పుడు బాబుకు బెస్ట్ ఛాన్స్ అని చెప్పాలి. బహుషా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా కేంద్రంలో కూడా చక్రం తిప్పే చాన్స్ దక్కడం నిజంగా అద్రుష్టం అని చెప్పాలి. ఈ లెక్కన ఏపీని అభివ్రుద్దిలో పరుగులు పెట్టించేందుకు మంచి అవకాశం వచ్చిందని చెప్పాలి. మంచి కంపెనీలను మోడీ గుజరాత్ కు తన్నుకుని వెళ్లేవారు. ఇక బుల్లెట్ ట్రెయిన్ నుంచి ఇతరత్రా చిప్ తయారీ కంపెనీలను కూడా గుజరాత్ కు తరలించారాయన. కానీ ఈ సారి బాబు ప్రతిదాంట్లో వాటా అడుగుతారు. లేదంటే అంతే. ఇక వెంటనే చంద్రబాబును ఢిల్లీకి పిలవడం వెనుక మోడీ, అమిత్ షాకు భయం ఉంది. ఎందుకంటే ఇండియా కూటమి నేతలు కూడా ఎన్డీయే మిత్ర పక్షాలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అందుకే మోడీ, షాలు మీటింగ్ ఏర్పాటు చేసి కొత్త ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేసేందుకు తహతహలాడుతున్నారు. లేదంటే నితిన్ గడ్కరీ నుంచి రాజ్ నాథ్ సింగ్ లాంటి వారు కూడా ఇప్పుడు ప్రధాని రేసులోకి వచ్చే చాన్స్ ఉంది. లేదంటే చంద్రబాబునే ప్రధానిగా చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రకటిస్తే వారికి చాన్స్ ఉండదు. అందుకే ఇటు సొంత పార్టీ సీనియర్ లనుంచి ప్రతిపక్షం నుంచి పోటీ లేకముందే పొత్తులను సెట్ చేసుకుని మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాలని భావిస్తున్నారు మోడీ. ఏది ఏమైనా ఇంతకు ముందులా మోడీ వన్ మాన్ షో చేస్తామంటే ఎన్డీయే మిత్ర పక్షాలు ఒప్పుకోవు. మీడియా ముందు ఓవారక్షన్ నుంచి అనవసర మైన డబ్బా కొట్టుకుంటామన్నా, ముస్లింలను తిడతామన్నా, మత రాజకీయాలు చేస్తామన్నా కూడా ఒప్పుకోవు. అదే జరిగితే బయటకు వెళ్లిపోతామంటారు. కాబట్టి ఇక మోడీ ప్రధానిగా పని చేయాలంటే గతం తాలూకు చెడ్డ పనులన్నీ మానుకోవాలి. ప్రభుత్వాలను కూలదోయడాలు, గుడుల విధ్వేష మాటలు. బీజేపీ నేతల నాలుక జారడాల లాంటివన్నీ తగ్గించుకుంటే మంచిది. లేదంటే బాబు, నితిష్ కుమార్ లు సడెన్ బ్రేక్ తొక్కితే బీజేపీ సర్కారు కుప్పకూలిపోతుంది. ఏది ఏమైనా ఏపీ అభివ్రుద్ది చేసేందుకు చంద్రబాబు నాయుడుకు వచ్చిన గొప్ప అవకాశమిది. మరి బాబు దానిని సద్వినియోగం చేసుకుంటారా లేదా చూడాలి. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ ఇప్పటికే ఏపీకి ఏదంటే అదిస్తామని హామీ ఇచ్చింది. పైగా కూటమి నేతలంతా ఒప్పుకుంటే బాబు ప్రధాని కూడా కావచ్చు. అందుకే ఇటు మోడీ లేకుంటే అంటే ఇండియా అలయెన్స్ సిద్దంగా ఉంది. భవిష్యత్ లో బాబుకు ఏం రాసిపెట్టి ఉందో చూడాలి. ఏది ఏమైనా ఈ సారి ఎన్నికలు దేశ దిశనే కాదు ఏపీ దశను మార్చే ఎన్నికలయ్యాయని చెప్పొచ్చు, ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పే సమయం వచ్చింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow