సీఎంగా నారా లోకేష్..? లోకేష్‌‌‌‌కి ఆ సత్త ఉందా?

2024 ఎన్నికల్లో లో టీడీపీ విజయం సాధించడంతో ఏపీకి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారా... లేదా నారా లోకేష్ చేస్తారా అనే ప్రశ్న ఏపీలో ప్రతి ఒక్కరిలో ఉంది. Sri Media News

Jun 4, 2024 - 16:17
 0  8
సీఎంగా నారా లోకేష్..? లోకేష్‌‌‌‌కి ఆ సత్త ఉందా?

2024 ఎన్నికల్లో లో టీడీపీ విజయం సాధించడంతో ఏపీకి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారా... లేదా నారా లోకేష్ చేస్తారా అనే ప్రశ్న ఏపీలో ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే సీఎంగా యువనేత నారా లోకేష్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని అలంకరించబోతున్నారా?...  టీడీపీ పగ్గాలు నారా లోకేష్ చేపట్టానున్నారా..? నారా లోకేష్‌‌కి రాష్ట్రాన్ని పాలించే సత్త ఉందా?

చంద్రబాబుకు అసలైన రాజకీయ వారసుడు నారా లోకేష్. ఇప్పటికే బాబు మంత్రివర్గంలో కీలక శాఖలు చూశారు లోకేష్.. ఇక 2019లో టీడీపీ రెండవసారి అధికారంలోకి వచ్చి ఉంటే లోకేష్ సీఎం అయ్యి ఉండేవారు అని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో నారా లోకేష్ సీఎం అవుతారు అనే టీడీపీ కల కల్లగానే మిగిలిపోయింది. కానీ ఈ సారి టీడీపీ... జనసేన, బీజేపీతో కూటమి కట్టింది. జగన్‌‌ను ఈ సారి ఎలగైనా గద్దెదించాలని చేసిన ప్రయత్నాల్లో విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో, టీడీపీ నేతల్లో... ఈసారి లోకేష్ సీఎంగా ప్రమాణస్వికారం చేస్తారా... అసలు బాబు నిర్ణయం ఏంటి అన్న చర్చ పార్టీ లోపలా బయటా సాగుతోంది.

ఈసారి ఎన్నికలు లోకేష్ జాతకాన్ని కీలక మలుపు తిప్పుతాయని టీడీపీలో యువ నాయకులతో పాటు సోషల్ మీడియా వింగ్ కూడా బలంగా విశ్వసిస్తున్నారు. టీడీపీకి సొంతంగా 105 సీట్లు పైన వస్తే కచ్చితంగా లోకేష్ ని సీఎం గా చేస్తారు అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ టీడీపీకి సోలోగా మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా సీట్లు రాకపోతే కూటమితోనే అధికారం చేపడితే మాత్రం చంద్రబాబే సీఎం అవుతారు అని అంటున్నారు.

అయితే ఇక్కడే చిక్కులు వచ్చాయి నారా లోకేష్‌‌కి... ఎందుకంటే.... బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుభవాన్ని చూసి మాత్రమే మద్దతు ప్రకటించారు.... సో లోకేష్ ని సీఎం చేస్తామంటే ఆ రెండు పార్టీలూ ఒప్పుకొంటాయా అనేది పెద్ద ప్రశ్న..?

అయితే టీడీపీలో  కొంత మంది సినియార్ నాయకులు... రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవిని నారా లోకేశ్‌కు ఇవ్వాలని చంద్రబాబును కోరినట్టు తెలుస్తుంది. చంద్రబాబు అమరావతిలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే లోకేశ్‌ను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించాలని నాయకులు డిమాండ్‌ చేసినట్టు తెలుస్తుంది.

విమర్శల నుండి ఎదిగిన నాయకుడు నారా లోకేష్. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా 2024లో పార్టీని అధికారంలోకి తీసుకురావాడానికి  స్వచ్ఛందంగా బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. అయితే గతంలో  నారా లోకేష్ పై ప్రతిపక్షలు, విపక్షలు, సొంత పార్టీ నేతలు సైతం ఎన్నో విమర్శలు, చెతకానీ నాయకుడు... చంద్రబాబు చరిష్మాను ముందుకు తీసుకొని పోలేరు అని అనేక మంది లోకేష్‌‌ని అవమానించిన వారు ఉన్నారు... అంతేకాదు... పప్పు అంటూ అవమానించారు.

బాడీ షేమింగ్ చేశారు.   హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని ప్రయత్నించారు ... కానీ లోకేష్... నిబద్దత గల కార్యదక్షకుడు. తనపై వస్తున్న నెగిటీవిటిని... పాజిటీవ్‌గా చేసుకోని... విమర్శలను ప్రశంశాలుగా మార్చుకొన్నారు. అంతేకాదు... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు... ఇప్పుడు ఎవరికీ లోకేష్ నాయకత్వం పై ఎటువంటి అనుమానాలూ లేకుండా చేసుకున్నారు లోకేష్. సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందారని అంటున్నారంటే... ఆయన ఎంతగా  ప్రజాభిమానం చూరగొన్నారో మనం గుర్తించ వచ్చు.

లోకేశ్‌ 226 రోజులలో 3,132 కిలోమీటర్లు లోకేశ్ యువగళం పాదయాత్ర తెలుగు రాజకీయాలలో మరో చరిత్రగా చెప్పాలి. లోకేష్ ఈ యాత్రతో ప్రజలతో మమేకమై, వారి కష్టాలను తెలుసుకుని, కన్నీళ్లు తుడుస్తూ వారిలో భరోసా కల్పించారు. లోకేష్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు అధికార వైసీపీ కుట్రలు, కుతంత్రాలు, దాడులను ప్రజాదరణతో ఎదుర్కొని ముందడుగు వేయడం నభూతో నభవిష్యతి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, ఆ తరువాత జగన్ కూడా పాదయాత్రలు చేశారు. కానీ అప్పట్లో వారికి అధికార పార్టీ నుంచి అడ్డంకులు ఎదురు కాలేదు.

కానీ లోకేష్ పాదయాత్ర విషయంలో అలాకాదు. జగన్ సర్కార్ ఆయన తొలి అడుగు వేయక ముందే  అడ్డంకులు సృష్టించింది. జీవో లు జారీ చేసి మరీ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. భౌతిక దాడులకు సైతం తెగబడింది. మాట్లాడుతుంటే మైకు లాగేసింది. నిలుచున్న కూర్చీ తీసేసింది. ప్రచార వాహనాలను సీజ్ చేసింది. అయినా లోకేష్ వెరవలేదు. మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ నడక ఆపలేదు. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, దుమ్ము ధూళిలో నడవడం, రోజూ వేల మంది పార్టీ నాయకుల్ని, కార్యర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేశ్ ని ప్రజలు తమ నాయకుడిగా ఓన్ చేసుకునేందుకున్నారు. ‘‘లోకేషా.. పాదయాతన’’ అని ఎగతాళి చేసిన వారే శభాష్ అని ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారంటే లోకేష్ అంచెలంచెలుగా ఎదిగిన తీరు తెలుస్తుంది... అంతేకాదు.. ఇప్పుడు చంద్రబాబు తరువాత టీడీపీ పగ్గాలు చెపట్టే సత్తా లోకేష్‌‌కి ఉందా లేదా అనే అనుమానం లేకుండా చేసుకున్నారు.

అయితే టీడీపీ వరకూ చూస్తే చంద్రబాబు మూడు సార్లు సీఎం చేశారు. ఆయన తానుగా పదే పదే చెప్పుకున్నట్లుగా ఈ పదవి అన్నది కొత్త కాదు, పైగా బాబు ఈసారి పూర్తి స్థాయిలో కష్టపడింది కూడా లోకేష్ కోసమే అన్న మాట ఉంది. లోకేష్ సీఎం అయితే చూడాలన్నది కూడా బాబులో ఆశ ఉంది. అంతే కాదు... టీడీపీకి సొంతంగా 105 సీట్లు పైనే వచ్చాయి సో... లోకేష్‌‌ని సీఎంగా చేసే అవకాశం కూడా ఉంది. తన సమక్షంలోనే లోకేష్ ని సీఎంగా చేస్తే అటు పార్టీ కూడా పూర్తిగా లోకేష్ కంట్రోల్ లోకి వస్తుందని మరింత కాలం టీడీపీ మనుగడ సాగించడానికి అది బలమైన పునాది వేసినట్లూ అవుతుందని బాబు సహా టీడీపీ పెద్దలు భావిస్తున్నారుట.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow