జగన్ ఆ తప్పు చేసి ఉండకూడదు....వైసీపీ ఓటమికి కారణాలు ఇవే.....
వైసీపీ ఓటమికి కారణాలు ఇవే కూటమి ఎర్పడటమే కీలకమా..? జగన్ ఆ తప్పు చేసి ఉండకూడదు ఇచ్చిన హామీలే జగన్ కొంప ముంచాయా
2019 కంటే మెజార్టీ సీట్లతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని జగన్ చెప్పిన మాటలు తప్పు అయ్యాయి... ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి టీడీపీ అత్యధిక మెజారిటీతో... దూసుకు పోయింది. జగన్ చెప్పిన మాటలు వైసీపీ కేడర్ లో విశ్వాసం నింపటం కోసమేననే ప్రచారం చేశారా అని అనిపించాకా మనదు... అంతేకాదు... వైసీపీ గెలుపుపై జగన్ అంచనాలు లేకుండా చెప్పరనే మరో వాదన వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెందడానికి జగన్ చేసిన మోసాలు, తప్పులే కారణాలు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జగన్ 2019 ఎన్నికల ముందు ప్రచారంలో... రైతు భరోసాగా ఏడాదికి 12500 ఇస్తా అన్నాడు కానీ, 7500 మాత్రమే ఇచ్చాడు అనే వాదనలు ఉన్నాయి. అయితే 2014లో టీడీపీ ప్రభుత్వం... అన్నదాత సుఖీభవ పేరుతో 68లక్షల మందికి రాష్ట్ర ఖజానా నుంచి ఏడాదికి 15వేలు ఇచ్చారు. ఇప్పుడు దానిని 7500కి తగ్గించి 45లక్షల మందికే జగన్ ఇస్తున్నాడనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అంతేకాదు... 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని జగన్ 3 పైసలు కూడా విడుదల చేయలేదనే ప్రచారం టీడీపీ ప్రజల్లోకి బాగా తీసుకుపోయింది. ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ టోల్ టాక్స్ లేకుండా చేస్తాం అన్న జగన్... అసలు ఇలాంటి హామీ ఒకటి ఇచ్చాం అని కూడా మర్చిపోవడం కూడా ఓ కారణంగా మనం చెప్పుకొవచ్చు. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన 2లక్షల ఇళ్ళని ఎవరికీ మంజూరు చెయ్యకుండా ఈ ఐదు సంవత్సరాలు గెంటుకుంటూ వచ్చారు జగన్ దీంతో ప్రజల్లో వైసీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ప్రజల్లో ఓ ఇమెజ్ ఎర్పడిపోయింది. అంతేకాదు... పోలవరం రివర్స్ టెండరింగ్ తో మొదలైన మోసం అలసత్వంతో కాఫర్ డ్యాం పాడు చేసే స్థాయికి తెచ్చిచిందని రాజకీయ విశ్లేషకుల అంచానా...“మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఆరు వేల కోట్లు ” కట్టబెట్టి కేవలం 2% పూర్తి చేసారని ఇది జగన్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖతను తీసుకువచ్చిందని తెలుస్తుంది,
అంతేకాదు... 25 ఎంపీలు ఇస్తే మెడలు వంచుతామని పదవిలోకొచ్చిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో... సార్ ప్లీజ్.. సార్ ప్లీజ్ అంటూ జగన్ స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలేదనే ముద్ర పడిపోయింది. అంతేకాదు... అవినీతి కేసుల కోసం కనిపించినపుడల్లా కాళ్ళ మీద పడిపోవాడం తప్ప జగన్ ఇంకా పోరాడి తెచ్చేదెముందిలే అని ఏపీ ప్రజలు జగన్‌ను పక్కన పెట్టేసారని చెప్పుకొవచ్చు. ప్రతి ఏడాది జనవరి 1 జాబ్ క్యాలెండర్ అన్న జగన్ ఈ ఐదు సంవత్సరల్లో ఉద్యోగాలే తీయ్యలేదు... అంతేకాదు... మన రాష్ట్ర నిరుద్యోగులు... ఉద్యోగాల కోసం వలస వెళ్ళటం జగన్ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
అంతేకాదు... అన్నిటికంటే... ముఖ్యంగా జగన్ ఇచ్చిన హామిల్లో మద్యపాన నిషేధం.. జగన్ ప్రచారంలో ఏపీలో విడతల వారిగా ఏపీలో మద్యపాన నిషేధం చేస్తానాని చెప్పి తాగుబోతులని తాకట్టు పెట్టి అప్పు తెవడం ఏపీ ప్రజల్లోకి బాగా వెళ్లిపోయింది ... మరో విషయం ఏమిటంటే... మద్యం రేటు పెంచిన జగన్... కల్తీ మందును విక్రయించి మద్యం విక్రయిస్తున్నాడని పేరు రావడం... దానికి తోడు.. లోకల్ బ్రాండింగ్‌తో మద్యం తయ్యారయ్యి... రావడం ఆ మద్యం సిండికేట్ అంతా వైసీపీ నాయకుల బీనామిలదే అని టీడీపీ ప్రజల్లోకి తీసుకుపోవడం దాన్ని వైసీపీ ప్రభుత్వం ఖండిచలేక పోవడం కూడా జగన్ ఓటమికి కారణంగా... ఆయన చేసిన తప్పుల్లో ఒకటిగా మీగిలిపోయింది.
జగన్ 2019 ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని, మెరుగైన పీఆర్సీ అంధిస్తామని, జగన్ హామీ ఇచ్చారు. దాంతో వైఎస్ జగన్ కాన్ఫిడెన్స్ మెచ్చి పెద్దఎత్తున ఉద్యోగులు వైసీపీకి మద్దతు తెలిపారు. గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి ఉద్యోగులు కూడా ఒక కారణం.... తీర అధికారం చేపట్టిన తరువాత ఉద్యోగుల కొరకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది జగన్ సర్కార్. ఎన్నోమార్లు ఇచ్చిన హామీలు నెరవేర్చలని. ఉద్యోగులు డిమాండ్ చేసినప్పటికీ వైసీపీ సర్కార్ మాత్రం చూసి చూడనట్లుగా వదిలేసింది. పలు మార్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. సీపీఎస్ రద్దు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో. అలాంటప్పుడు ఎందుకు హామీ ఇచ్చారని వైసీపీని నిలదీశాయి. ఉద్యోగ సంఘాలు. అంతేకాదు... 2024లో జగన్ ఓటమికి ఈ ఉద్యమం కూడా కారణం.
ఇంటివద్దకే నాణ్యమైన ఇసుక అని చెప్పి ఇసుకని 10వేలు నుంచి 30వేలు వసూలు చేస్తూ కూడా కట్టడాలకి ఎందుకూ పనికిరాని ఇసుకని వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని... ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ హయంలో ఇసుక మాఫియా చెలరే గిందని, జేకే సంస్థ పేరుతో రూ.40లక్షల కోట్లు దోచుకున్నారని టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రభుత్వం తమపై వస్తున్న నెగిటివిటిని.. జగన్ కానీ... ముఖ్యమంత్రి జగన్ కానీ...వారిపై టీడీపీ చేస్తుంది నిజాం కాదు అని నిరుపించూకోవడంలో వైసీపీ విఫలం చెందడం కూడా ఈ ఓటమికి ముఖ్యకారణం. ఇసుక టెండర్లు అయిపోయినా పాత తేదీ లతో దోపిడీ చేసి ఇసుకను అక్రమంగా నిలువ చేస్తున్నారని ప్రజలు కూడా బయటకు వచ్చి చెప్పడం గమనర్వం.
ముస్లింల అభ్యున్నతికి 2014లో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన.. రెండు పథకాలు అమలు చేయలేమనివైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. దుల్హన్, విదేశీ విద్యా పథకాలను.. నిధుల కొరత కారణంగా అమలు చేయడం లేదని హైకోర్టుకు తెలపడం. దుల్హన్ పథకాన్ని లక్ష రూపాయలు చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చిన సీఎం జగన్.. ముస్లింలకు ధోకా ఇచ్చారని.. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అప్పట్లో విమర్శించింది.
నిరుపేదల ముస్లిం యువతులకు వివాహం సందర్భంగా ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన దుల్హన్ పథకాన్ని నిలిపేసినట్లు.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పడం... దుల్హన్ పథకంతోపాటు విదేశీ విద్య పథకం నిలిపివేతపైనా.. 2021లో షిబ్లి వాజ్యం వేశారు. మైనారిటీలకు ఉన్నత విద్య కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో 15 లక్షలు రూపాయల వరకు ఆర్థిక సాయం అందేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక సాయం అందకపోగా.. 2018, 19 ఆర్థిక సంవత్సరాల్లో విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించిన... 574 మందికి కూడా సాయం విడుదల చేయడం లేదని.. పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు అప్పట్లో నివేదించారు కూడా... ముస్లింల సంక్షేమంలో వైసీపీ ప్రభుత్వం కోతపెట్టడం కూడా ముస్లిం వర్గల్లో వైసీపీ ఓటమికి దారి తీసింది.
మూడు రాజధానుల విషయం కూడా వైసీపీపై తీవ్ర ప్రభావం చూపింది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ప్రకటించిన జగన్. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. అమరావతిని శాసన రాజధానిగా.. కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించారు. అయితే విశాఖ తరలిపోతున్నాం అని పదేపదే ప్రకటించడం ఇతర ప్రాంత వాసులకు నచ్చలేదు. మరోవైపు ఉత్తరాంధ్రలో వైసీపీ భూ కబ్జాలకు పాల్పడుతుందనే ఆరోపణలు వైసీపీని ఇరకాటంలో పడేశాయి. విశాఖ రాజధాని అనే విషయం దేవుడెరుగు..విశాఖ రాజధాని అయితే ఈ ప్రాంతంలో సెంటిభూమి మిగలదని... అడవిని తొలిచేస్తారని టీడీపీ చేసిన ఆరోపణలు ఆ పార్టీకి ప్లస్ అవ్వగా.. వైసీపీకి మైనస్ అయ్యింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డవలప్‌మెంట్ స్కీంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం సీఐడీని దర్యాప్తుకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సీఐడీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించింది. ఇదే వైసీపీకి పెద్ద మైనస్‌గా మారింది. వైఎస్ఆర్ కూడా తన ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేయలేదు. ఆ క్రెడిట్ కోసం ఎందుకో తెలియదు కానీ చంద్రబాబుపై అవినీతి పరుడు అని తెలిపేందుకు రోజుకు ముగ్గురు నలుగురుమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే ప్రెస్మీట్లు పెట్టి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చంద్రబాబు క్రెడిబిలిటీ దెబ్బతీయడం ఎలా ఉన్నా..చంద్రబాబు నాయుడు 15ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో జరిగిన మంచి బయటకు వచ్చింది. దీంతో యువత, ముఖ్యంగా అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న టీడీపీ శ్రేణులు ఈ అరెస్ట్‌తో రెచ్చిపోయారు. ఇది వైసీపీ ఓటమికి రెండో కారణంగా చెప్పుకోవచ్చు.
వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు సొంత చెల్లెళ్లు బల్లెంలో మాదిరిగా తయారవ్వడం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. ఒకవైపు సొంత చెల్లి వైఎస్ షర్మిల రాజకీయంగా చేసిన విమర్శలు వైసీపీకి పెద్దమైనస్‌గా మారాయి., మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చిన్నాన్న కుమార్తె వైఎస్ సునీతారెడ్డి చేసిన ఆరోపణలు సైతం తీవ్ర ప్రభావితం చూపాయి. చివరలో వైఎస్ విజయమ్మ సైతం షర్మిలకు మద్దతుగా వీడియో రిలీజ్ చేయడం వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు తోడుగా వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మలు స్టార్ కాంపైనర్‌గా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కానీ ఈసారి వైఎస్ ఫ్యామిలీ నుంచి స్టార్ కాంపైనర్‌గా వచ్చిన సంగతి ఎక్కడా లేదు. వైఎస్ భారతి కేవలం కడపకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇలా వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలుగా వీటిని చెప్పుకోవచ్చు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలపై దాడి జరిగింది. విజయనగరం, విజయవాడ, అంతర్వేది వంటి ప్రముఖ దేవాలయాలలో దాడులు జరిగాయి. ఈ క్రమంలో వైసీపీ హిందూ వ్యతిరేక పార్టీ అని టీడీపీ ఆరోపించింది. హిందూ దేవాలయాలపై ఇంతలా దాడులకు పాల్పడుతుంటే ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయకపోవడం వైసీపీ హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పడానికి నిదర్శనం అని చెప్పుకొచ్చాయి. దీంతో ఇది వైసీపీ కొంపముంచింది. కొన్ని సామాజిక వర్గాలకు దూరం చేసింది. ఇదే తరుణంలో ప్రధాని నరేంద్రమోడీతో చంద్రబాబు నాయడు మరింత సఖ్యతగా ఉండటం ఓటర్లు కూటమివైపు మెగ్గు చూపారు.
అంతేకాదు... వైసీపీ ఓటమికి ప్రధాన కారణం కూటమి ఏర్పాటు అని చెప్పవచ్చు. కూటమి ఏర్పడుతుందా? లేదా అనే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏపీ పోలీసులు అడ్డుకుని పెద్ద రచ్చ చేశారు. ఇదే కొంపముంచింది. దీంతో కూటమి ఏర్పాటుపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. అంతేకాదు సీఎం జగన్ దగ్గర నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడాన్ని పవన్ కల్యాణ్ మాత్రమే కాదు ఆయన అభిమానులు సైతం తట్టుకోలేకపోయారు. సొంత రాష్ట్రం రావడానికి ఇన్ని అడ్డంకులా.. పాస్ట్ పోర్టు తీసుకురావాలా ఏంటి అని ప్రశ్నించిన పవన్ కల్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చకూడదనే లక్ష్యంతో కూటమికి నడుం బిగించారు. స్కిల్ డవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా.. నేరుగా వెళ్లి మద్దతు ప్రకటించేశారు. అంతేకాదు టీడీపీతో జట్టుకట్టేందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో ఆ బాధ్యతను సైతం తనపై వేసుకున్న పవన్ కల్యాణ్ ఎలాగోలా కూటమి ఏర్పాటుకు చక్రం తిప్పారు. అనంతరం కూటమి బలంగా నిలబడాలనే లక్ష్యంతో సీట్ల విషయంలోనూ అనేక త్యాగాలు చేశారు. ఇలా ఈ ఎన్నికల్లో...కూటమి గెలుపులోనూ అసలైన గేమ్ ఛేంజగర్‌గా పవన్ కల్యాణ్ నిలిచారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే నమ్ముకుంది. డీబీటీ విధానంలో ప్రతీ లబ్ధిదారుడికి పాదర్శకంగా నేరుగా వారి అకౌంట్లలో డబ్బులు జమ చేశామని వైసీపీ చెప్పుకొచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే ఆధారపడిందే తప్ప శాశ్వత అభిృద్ధిపై ఏమాత్రం ఫోకస్ పెట్టలేకపోయింది. కానీ యువత, నిరుద్యోగులు మాత్రం శాశ్వత అభివృద్ధిని కోరుకున్నారు. అయితే ఆ దిశగా వైసీపీ అడుగులు వేయకపోవడంతో ఓటమికి మరో కారణంగా చెప్పుకోవచ్చు.
|
What's Your Reaction?