ఆ ఊరికి శిక్షగా మూసేసిన ఆలయం తెరిచిన హీరో నిఖిల్.. పూలపై నడిపించిన గ్రామస్తులు

కార్తికేయ 2' తో అనుకోని రేంజ్ లో సక్సెస్ అందుకున్న హీరో నిఖిల్.. ప్రస్తుతం ' స్వయంభు ' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇందులో వారియర్ గా కనిపించబోతున్నాడు.

Jun 6, 2024 - 15:14
Jun 6, 2024 - 15:28
 0  13
ఆ ఊరికి శిక్షగా మూసేసిన ఆలయం తెరిచిన హీరో నిఖిల్.. పూలపై నడిపించిన గ్రామస్తులు

కార్తికేయ 2' తో అనుకోని రేంజ్ లో సక్సెస్ అందుకున్న హీరో నిఖిల్.. ప్రస్తుతం ' స్వయంభు ' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇందులో వారియర్ గా కనిపించబోతున్నాడు. అయితే నిజ జీవితంలోనూ దేవుడంటే అపారమైన భక్తి కలిగిన హీరో.. చీరాల గ్రామస్తులకు శిక్షగా కొన్ని ఏళ్లుగా మూసేసి ఉన్న ఆలయాన్ని తెరిపించాడు. ఆ గుడి అభివృద్ధి బాలు తీసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. ఇందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేశాడు.

ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన నిఖిల్‌ను పూలపై నడిపించి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకున్న నిఖిల్.. మీకు సేవ చేసే భాగ్యాన్ని తన కుటుంబానికి కల్పించారంటూ ఆనందం వ్యక్తంచేశారు. ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. మంచి పని చేశారని కొనియాడుతున్నారు. ఇంత గొప్ప కార్యం చేసిన మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూస్తాడని అశీర్వదిస్తున్నారు. కాగా నిఖిల్ కు రీసెంట్ గా కూతురు పుట్టిన విషయం తెలిసిందే. కాగా ఆమె భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు.

వైవిధ్యమైన కథలతో సినిమాలు తీసే టాలీవుడ్ హీరోల్లో నిఖిల్ కూడా ఒకరు. శేఖర్‌ కమ్ముల హ్యాపీ డేస్‌ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. అంతకు ముందు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసిన ఆయన హ్యాపీ డేస్‌ వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతో తనదైన నటనతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత స్వామి రారా, కార్తికేయ చిత్రాలతో హీరోగా మారాడు. ఈ సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇక హీరోగా నిఖిల్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక కార్తికేయ సినిమా మంచి విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌ కార్తికేయ 2 కూడా తీసుకువచ్చాడు. పాన్‌ ఇండియా వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. తన కెరీర్‌లోనే హయ్యేస్ట్‌ గ్రాస్‌ వసూళ్లు చేసిన సినిమాగా కార్తికేయ 2 నిలిచింది. ప్రస్తుతం స్వయంభు అంటూ మరో క్రేజీ ప్రాజెక్టుతో మన ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow