వైసీపీ కంచుకోట కుప్పకూల్చిన మాధవి...వైసీపికి బ్యాక్‌బోన్ విరిగిపోయిందా..? ఎవరు ఈ... రెడ్డెప్పగారి మాధవీరెడ్డి
వైఎస్‌ఆర్ కుటుంబంలో వచ్చిన చీలిక టీడీపీకి మేలు చేసిందని... ఈ చీలికతో కడప జిల్లాలో సైకిల్ స్పీడ్‌కి వైసీపీ లీడర్లు కకావికలమైపోయారని... ఇద్దరు మినహా మిగతావారంతా కౌంటింగ్ ప్రారంభమైన కాసేపటికే అస్సాం ట్రైన్ ఎక్కేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.Sri Media News
రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా.. ప్రాంతమేదైనా ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కన్ఫూజన్ లేకుండా కూటమికి పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో జనసునామీ సృష్టించి 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ..2024లో ప్రజా తీర్పుతో చతికిలిపడిపోయింది. వైసీపీకి రాయలసీమ కంచుకోట లాంటిది. సీమలోని ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు, ఫ్యాను పార్టీకి గట్టి పట్టున్న జిల్లాలు. సింపుల్‌గా చెప్పాలంటే వైసీపికి బ్యాక్‌బోన్ లాంటిది రాయలసీమ. అటువంటి రాయల సీమలో వైసీపీ కంచుకోటలో టీడీపీ జెండా పాతింది రెడ్డెప్పగారి మాధవీరెడ్డి. 16,282ఓట్ల మెజార్టీతో గెలిచి.... డిప్యూటీ సీఎం వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషాను ఓడించి కడపలో జగన్ లెగసీకి బ్రేక్ వేసింది రెడ్డెప్పగారి మాధవీరెడ్డి.
కడపకు పాలకులం ... పాలెగాల్లం... మేమే అంటూ విర్రవీగిన వైసీపీ ప్రత్యర్థులకు తన గెలుసుతో కోలుకోలేని ఓటమి రుచి చూపించారు మాధవీ... కడప రాజకీయాల్లోకి ప్రవేశించి... సొంత పార్టీ నుంచి వచ్చిన వ్యతిరేకతను ఎదురించి.... ఆరు నెలలు కూడా కాక ముందే .. టీడీపీకి భారోసాని ఇచ్చి... అడుగంటిన ఆశలపై నీళ్లు జల్లి... కడపలో టీడీపీ జెండాను రెపరెపలాడించిన ఘనత రెడ్డప్పగారి మాధవిదే. కడప నుంచి తొలి మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు మాధవి.
కడప అసెంబ్లీ స్థానం ముస్లిం మైనార్టీ ఓటర్లకు నిలయం. ఈ స్థానం నుంచి రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించేవారు. గత దశాబ్దాల నుంచి టీడీపీ, వైసీపీ నుంచి ముస్లిం మైనార్టీలే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత, 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన"ముస్లిమేతర మహిళ, టిడిపి అభ్యర్థి ఆర్ మాధవి రెడ్డి గెలుపొందడం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పారు. డిప్యూటీ సీఎం షేక్ అంజాద్ బాషాతో టీడీపీ అభ్యర్థిగా మొదటిసారి మాధవి రెడ్డి పోటీ చేసి గెలుపొందారు.
కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మాధవికి నియోజకవర్గంలో సహకరిండానికి అక్కడ పెద్దలు ఓప్పుకొలేదు. అయినప్పటికి సవాళ్లను దాటుకుంటూ తన భర్త టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు మాధవి.
ఎన్నికల ముందు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కడపలో నిర్వహించిన ప్రచార సభలో మాధవి కన్ను కొట్టడం వైరల్ అయింది. చంద్రబాబు సీరియస్‌గా మాట్లాడుతుంటే మాధవి సభ వేదికపై సీట్లో కూర్చొని నాయకులతో మాట్లాడుతూ ఉంటుంది. వేదిక కింద ఉన్న వారు ఏం చెప్పారో తెలియదు కానీ... మాధవి ఉన్నట్టుండి కన్ను కొట్టారు. ఈ రెండు, మూడు సెకన్ల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది. వైసీపీ కూడా దీన్ని విపరీతంగా ట్రోల్ చేసింది.
ఇది చూసి రెండు మూడు వారాలు చాలా బాధపడ్డారట మాధవి. అయితే , వైసీపీ వాళ్ల ట్రోలింగ్ వల్ల సోషలహ మీడియా ఫాలోయింగ్ పెరిగిందని.. తానెంతో కష్టపడ్డా రాని ఫాలోయింగ్ వచ్చిందని కూడా ఆమె చెప్పడం విచిత్రం... తనపై చేసిన ట్రోలింగుల వెనుక అంజాద్ బాషా పీఏ ఉన్నారని ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్‌వ్యూలో చెప్పుకొచ్చారు.. మాధవి
కడప అసెంబ్లీ స్థానం నుంచి హ్యాట్రిక్ సాధించాలనే దిశగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పోటీ చేశారు. ఆయనపై పార్టీ వర్గాలనే కాకుండా తన సొంత సామాజిక వర్గం ముస్లింలలో కూడా అసంతృప్తి ఎక్కువగా ఉండడంతో పాటు ఆయన సోదరుడు కొందరు బంధువుల వల్ల వ్యతిరేకత కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అఫ్జల్ ఖాన్ ను ఆ పార్టీ ఇక్కడనుంచి పోటీ చేయించింది. దీనివల్ల ముస్లిం మైనారిటీ ఓట్లు చీలిపోయాయి. దీనిని బాగా వినియోగించుకున్నారు... మాధవి.
అంతేకాదు... తనకు ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థి అంజాద్‌బాషా అక్రమాలపై మాధవి విరుచుకుపడ్డారు. ఏ సందర్భాలోనూ వెనక్కు తగ్గలేదు. ఢీ అంటే ఢీ అన్నారు. ‘ద్వారకానగర్‌లోని మీ ఇంటిలో దూరి కొడతాం ...’ అని అంజాద్‌బాషా సోదరుడు అహ్మద్ టూటౌన్ పోలీస్‌స్టేషన్ ముందు చేసిన బెదిరింపులకు ఆమె భయపడలేదు. దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. మహిళలపై వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ఇది నగర ఓటర్లను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసింది. ఎన్నికల ప్రచారంలో కడపకు వచ్చిన జగన్.... అంజాద్‌బాషాను చూడకండి, నన్ను చూసి ఓటెయ్యండి అన్న మాటలు నగర ఓటర్లను ఆలోచనలో పడేశాయి. ఈ రెండు అంశాలను అస్త్ర్రాలుగా మలచుకుని, విజయానికి బాటలు వేసుకున్నారు.
కడపను నిలబెట్టుకోవాలని జగన్ వ్యూహాత్మకంగా పావులు కదిపిన మాధవి ముందు అవి ఫలించలేదు... కడపలో టీడీపీ గెలిచి పాతికేళ్లు అవుతోంది. కడప అసెంబ్లీ స్థానం నుంచి 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కందుల శివానందరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ముస్లిమేతర ఎమ్మెల్యేలు కడప స్థానం నుంచి గెలవలేదు. ఆ తర్వాత 1994, 1999 ఎన్నికల్లో టిడిపి నుంచి ఎస్సే ఖలీల్ బాషా, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన సయ్యద్ మహమ్మద్ అహమదుల్లా డాక్టర్ వైయస్సార్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర విభజన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ కి అవకాశం లేకుండా పోయింది. దీంతో 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది. 1999లో చివరిసారిగా తెలుగుదేశం పార్టీ కడపలో విజయం సాధించింది. ఆ తరువాత మళ్లీ 2024లో టీడీపీ విజయం సాధించింది.
అయితే... వైఎస్‌ఆర్ కుటుంబంలో వచ్చిన చీలిక టీడీపీకి మేలు చేసిందని... ఈ చీలికతో కడప జిల్లాలో సైకిల్ స్పీడ్‌కి వైసీపీ లీడర్లు కకావికలమైపోయారని... ఇద్దరు మినహా మిగతావారంతా కౌంటింగ్ ప్రారంభమైన కాసేపటికే అస్సాం ట్రైన్ ఎక్కేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
What's Your Reaction?