జగన్‌ను తండ్రి గెలిపించాడు.. అమ్మ, చెల్లి ఓడించారు..?
ఏపీలో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలివేనంటూ ఎన్నికల ఫలితాల గురించి ఎంతో మంది ఎన్నో విశ్లేషణలు ఇచ్చారు. 2019 కంటే మెజార్టీ సీట్లతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని జగన్ చెప్పిన మాటలు తప్పు అయ్యాయి.Sri Media News
ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి టీడీపీ అత్యధిక మెజారిటీతో... దూసుకు పోయింది. జగన్ చెప్పిన మాటలు వైసీపీ కేడర్ లో విశ్వాసం నింపటం కోసమేననే ప్రచారం చేశారా అని అనిపించాకా మనదు... అంతేకాదు... వైసీపీ గెలుపుపై జగన్ అంచనాలు లేకుండా చెప్పరనే మరో వాదన వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెందడానికి ప్రధాన కారణం కూటమి ఏర్పాటు అనేవారు కొందరైతే.... వైఎస్ జగన్ తల్లి విజయమ్మ కూడా ఈ ఓటమికి కారణమని విశ్లేషకులు అంటున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. పేరు చెబితే పెదవాడి గుండే అనందంతో ఉప్పోంగి పోతుంది... అంతగా...కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జనం చేత నీరాజనం అందుకున్న నాయకుడు వైఎస్ఆర్. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడు. సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచే తత్వం.. అభాగ్యులను అక్కున చేర్చుకునే గుణం ఆయనను ప్రజల్లో దేవుడిని చేశాయి. అటువంటి గొప్ప నాయకుడి కొడుకు జగన్. అందువల్లే తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే సమర్దత జగన్ కు వుందని ప్రజలు అందరు నమ్మారు. అందుకే జగన్ పార్టీ పెట్టిన వెంటనే వైఎస్సార్ ను అభిమానించే నాయకులు, కార్యకర్తలంతా ఆయన వెంట నడిచారు. ప్రజలు కూడా ఆయనవైపు మళ్ళారు. దీంతో 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ బంపర్ మెజారిటీతో గెలుపొందారు... వైసిపికి 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లు వచ్చాయి.
తండ్రికి ఉన్న పేరుతో ప్రజల్లోకి వెళ్లిన జగన్ ను ప్రజలు ఆకాశానికి ఎత్తారు. కానీ అందివచ్చిన అవకాశాన్ని వైస్ జగన్ చేజేతులా నాశనం చేసుకున్నారు. జగన్ 2019 ఎన్నికల ముందు ప్రచారంలో... రైతు భరోసాగా ఏడాదికి 12500 ఇస్తా అన్నాడు కానీ, 7500 మాత్రమే ఇచ్చాడు అనే వాదనలు ఉన్నాయి. ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ టోల్ టాక్స్ లేకుండా చేస్తాం అన్న జగన్... అసలు ఇలాంటి హామీ ఒకటి ఇచ్చాం అని కూడా మర్చిపోవడం. పోలవరం రివర్స్ టెండరింగ్. 25 ఎంపీలు ఇస్తే మెడలు వంచుతామని పదవిలోకొచ్చిన ప్రత్యేక హోదా విషయంలో ఏం మాట్లాడక పోవడం. ప్రతి ఏడాది జనవరి 1 జాబ్ క్యాలెండర్ అన్న జగన్ ఈ ఐదు సంవత్సరల్లో ఉద్యోగాలే తీయ్యలేదు... అంతేకాదు... మన రాష్ట్ర నిరుద్యోగులు... ఉద్యోగాల కోసం వలస వెళ్ళటం. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయ్యడం... ఇటుంవంటి అనేక చర్యల ఫలితమే 2024 ఎన్నికల్లో జగన్ ఓటమి... 2019లో ఎంత భారీ మెజారిటీతో గెలిచిందో అంతే భారీ ఓటమిని 2024లో రుచి చూసింది వైసీపీ. జగన్ గెలుపుకు తండ్రి వైఎస్ఆర్ కారణమైతే... తాజా ఓటమికి ఆయన తల్లి విజయమ్మ కారణం అని ప్రస్తుతం రాష్ట్రంలో టాక్ వినిపిస్తుంది.
2019 వైసీపీ విజయం తరువాత అధికారంలో వుండగానే వైఎస్ కుటుంబంలో చిచ్చు రగిలింది. అందరు జగన్ కు దూరం అవుతు వచ్చారు. ముందుగా అన్నతో వచ్చిన కొన్ని వ్యక్తిగత కారణాలతో చెల్లి షర్మిల దూరమైంది.ఈ దూరం గడుస్తున్న ఐదు సంవత్సరాల్లో మరింత పెరుగుతు వచ్చింది... సరిగ్గా2024 ఎన్నికల సమయానికి... అన్నకు షాక్ ఇస్తూ... పూర్తిగా రాజకీయ ప్రత్యర్థిగా మారారు షర్మిల. కొంతకాలం తెలంగాణ రాజకీయాల్లో పనిచేసిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు.
ఇది జగన్ కు పెద్ద ఎదురుదెబ్బ... సొంత చెల్లే ఆయనకు ఎదురుతిరగడంతో ప్రజల్లో ఓ రకమైన అనుమానం మొదలయ్యింది. సీరియస్ గానే వైసిపిని, సోదరుడు జగన్ ను ఓడించేందుకు ప్రయత్నించారు షర్మిల .
నిజానికి జగన్ రాజకీయ ప్రస్థానంలో షర్మిల పాత్రను వైఎస్ అభిమానులెవరూ మరువలేరు. జగన్ జైలులో ఉన్నప్పుడు కేడర్‌ను కాపాడుకుంటూనే పాదయాత్ర ద్వారా తమ కుటుంబానికి సానుభూతి సంపాదించి పెట్టారు. 2019 ఎన్నికల సమయంలో ఆమె ప్రజలతో మమేకమై జగన్ కోసం ప్రచార చేశారు. ముఖ్యంగా బై.. బై.. బాబు అంటూ ఆమె చేసిన నినాదం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. 2019లో వైసీపీ ఘన విజయం సాధించి అన్నకు గిఫ్ట్ ఇచ్చారు షర్మిల.
ఇలా ఉన్న సమయంలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు... వైఎస్ విజయమ్మ అమెరికా నుంచి షర్మిలకు మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు.ఈ వీడియో జగన్ రాజకీయ ప్రస్థానాన్ని గట్టి దెబ్బ కొట్టిందని చాల మంది వైసీపీ నాయకులు అంటున్న మాట... ఈ వీడియోలో కడప లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు మద్దతు ఇవ్వమని... కడప ఓటర్లు షర్మిలకు అండగా ఉండాలని,వచ్చే ఎన్నికల్లో షర్మిల విజయం సాధించాలని విజయమ్మ చెప్పుకోచ్చారు. కాగా ఈ వీడియోలో ఎక్కడ తన కొడుకు జగన్ గురించి ప్రస్థావించలేదు... దీంతో సొంత చెల్లే కాదు కన్నతల్లి కూడా జగన్ ను నమ్మడంలేదని ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఇది చిన్న విషయంలాగే కనిపించినా వైసిపికి చాలా పెద్ద డ్యామేజ్ చేసింది. ఇదే విషయాన్ని... ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటివారు బహిరంగంగానే వైసిపి ఓటమికి విజయమ్మే కారణమని అంటున్నారు.
ఎన్నికల ప్రచారం వేళ వైఎస్ విజయమ్మ కనీసం ఒక్కసారయినా జగన్ తో కనిపించి వుంటే పరిస్థితి వేరేలా వుండేదని వైసిపి నాయకులు భావన. ఆమె వైసిపికి ప్రచారం చేసివుంటే వైఎస్ కుటుంబమంతా జగన్ తో వున్నారనే నమ్మకం ప్రజల్లో ప్రజల్లోకి వెళ్లివుండేదని... కానీ విజయమ్మ మాత్రం కొడుకు రాజకీయ భవిష్యత్ ను నాశనం చేస్తూ అమెరికా వెళ్లిపోయారని... తండ్రి వైఎస్సార్ జగన్ గెలిపించి సీఎం పీఠంపై కూర్చోబెడితే... తల్లి విజయమ్మ మాత్రం కొడుకును ఓడించి గద్దె దింపిందని వైసీపీ నాయకులు చెబుతున్న మాట.
కుటుంబ తగాదాలు కూడా జగన్ కొంపముంచాయి. సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య... ఇందులో సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర జగన్ మెడకు చుట్టుకున్నాయి. బాబాయ్ ని చంపిన హంతకుడిని జగన్ కాపాడుతున్నారనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి ప్రతిపక్షాలు. దీన్ని బలపరుస్తూ... జగన్‌కు సొంత చెల్లెళ్లు బల్లెంలో మాదిరిగా తయారవ్వడం...వైసీపీకి పెద్దమైనస్... ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు తోడుగా వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మలు స్టార్ కాంపైనర్‌గా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కానీ ఈసారి వైఎస్ ఫ్యామిలీ నుంచి 2019 వచ్చిన సపోర్ట్ ఈ సారి లేదు.. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చిన్నాన్న కుమార్తె వైఎస్ సునీతారెడ్డి చేసిన ఆరోపణలు సైతం తీవ్ర ప్రభావితం చూపాయి. దీనికి తోడు.. వివేకా భార్య సుగుణమ్మ, కూతురు సునీత న్యాయపోరాటం వైస్ జగన్ విజయావకాశాలను మరింత దెబ్బతీసాయి. వీరు వైఎస్ జగన్ కు ఓటు వేయవద్దని ప్రజలను కోరారు. ఇలా వైసిపి ఓటమిలో వైఎస్ కుటుంబానికి పాత్ర వుంది.
ఇదిలా ఉంటే వైఎస్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి తీరుకూడా జగన్ ను దెబ్బతీసిందని... సుబ్బారెడ్డి టిటిడి ఛైర్మన్ గా వుండగానే తిరుమలలో అనేక అక్రమాలు జరిగాయని... ఇది వైసీపీ ఓటమికి కారణమయ్యిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు జగన్ 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అనుసరించిన రాజకీయ కక్షపూరిత విధానాలు... ఆ పార్టీ ఘోర ఓటమికి కారణమని విశ్లేషకులు చెబుతున్న మాట. అధికారం చేపట్టిన కొద్దిరోజులకే ఉండవల్లిలోని ప్రజా వేదికను కూల్చివేయడం. సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, సీఐడీ కస్టడీలో ఆయన్ను కొట్టించారన్న ఆరోపణలు. కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు కూడా ఇష్టపడని సీఎం జగన్ ధోరణి, ఇగో... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడమే కారణాలు అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ....
What's Your Reaction?