ఆ దేశం ఎక్కడ ఉంటుందో జూలై 21న ప్రకటిస్తానని తన అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన కూడా విడుదల చేశాడు.
ఎన్నో కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద.. 2019లో పోలీసులు వెతుకుతున్న క్రమంలో అతడు కనిపించకుండా పోయాడు. నిత్యానంద స్వయంగా కైలాస ద్వీపానికి వెళ్లినట్లు చెప్పారు. హిందువుల దేశంగా మార్చింది తానేనని చెప్పారు. దేశాధ్యక్షుడినని చెప్పుకుంటున్న నిత్యానంద..తమకు ప్రత్యేక ప్రభుత్వం,ప్రత్యేక జెండా, పాస్ పోర్టు, కరెన్సీ ఉన్నాయని ప్రకటించారు.
అయితే ఆ దేశం ఎక్కడ ఉందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు వీడియో ద్వారా ఉపన్యాసాలు ఇస్తూ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసేవాడు. కైలాసాన్ని జులై 21న ప్రకటిస్తానని నిత్యానంద తాజాగా ప్రకటించారు. తన అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన ఉంచారు. అందులో ‘కైలాసం తెరుచుకుంది. 21న గురుపూర్ణిమ రోజున కైలాసం ఎక్కడ అనేది ప్రకటిస్తారు. మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము’ అని అందులో పేర్కొన్నారు. అలాగే, ‘కైలాష్ నివాసిగా ఇప్పుడే నమోదు చేసుకోండి’ అని ఆన్‌లైన్ లింక్ ఉంది. ఈ ప్రకటనతో సమాధానం లేని కైలాస దేశం చిరునామా త్వరలో తేలనుంది అని అందరూ అనుకుంటారు. అయితే సడెన్‌గా తన చిరునామా ఎక్కడుందో నిత్యానంద చెప్పటానికి వెనుకున్నది మాత్రం ఓ మహిళ అని వార్తలు వస్తున్నాయి.
ఆమె ఎవరో కాదు.. గతంలో నిత్యానంద ఫాలోవరే.. దాదాపు 10 ఏళ్లు నిత్యానంద ఆశ్రమంలో సేవలు అందించిన సారా లాండ్రీ. దైవం పేరిట నిత్యానంద చేస్తున్న చీకటీ పనులను బహిర్గతం చేసింది సారా. ఆమె ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ… తాను 2009లో నిత్యానంద ఆశ్రమంలో చేరానని తెలిపింది. తాను సనాతన ధర్మాన్ని తెలుసుకోవాలని, యోగా, మెడిటేషన్ నేర్చుకోవాలనే భావనతో అక్కడ చేరినట్లు తెలిపింది. తాను పెద్ద చదువులు చదివానని, ట్రైనింగ్ ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్‌కు వెళ్లేదాననని చెప్పుకొచ్చారు.
మతపరమైన పాఠాలు చెప్పేందుకు ఆయన సొంతంగా సంస్థను నిర్వహించడం లేదని, ఆశ్రమాన్ని మాఫియాలా పని చేయించాడని సారా పేర్కొంది. తాను 24 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల వరకు అక్కడే ఉన్నానని తెలిపింది. తొమ్మిదేళ్ల పాటు నిత్యానంద సూచనల మేరకే తన జీవితం సాగిందని ఆ మహిళ పేర్కొంది. తాను ఆశ్రమాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆమెపై తప్పుడు ఆరోపణలు చేసి పలు వివాదాల్లో ఇరికించారని తెలిపింది. తాను హిందువు కాదని, తన ఆశ్రమంలోని పిల్లలను కొట్టారని తనపై ఆరోపణలు చేశారని సారా పేర్కొంది. దీని తర్వాత తాను నిత్యానంద ఆశ్రమంలో పని చేసే ఆమె మాజీ అనుచరుడితో మాట్లాడానని తెలిపింది.
అక్కడ పిల్లలను చంపడం, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు తనకు తెలిసిందని వ్యక్తి చెప్పాడని, అంతేకాక తప్పుడు పనులు చేసేలా ప్రేరేపిస్తున్నారని తెలిపింది. ఇదే సమయంలో ఆ ఆశ్రమంలో తమను తాము సన్యాసులుగా చెప్పుకునే మహిళలు చాలా మందిని ప్రభావితం చేయగలిగారని ఆ మహిళ తెలిపింది. అలానే నిత్యానంద ప్రస్తావించిన కైలాసం గురించి కూడా సారా ప్రస్తావించింది. కైలాసం అనేది ఒక ఫేక్ న్యూస్ అనీ, అది ఒక తప్పుడు దేశమని, అది నిత్యానంద సృష్టించిన ఓ అభూత కల్పన అని అంది. ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన అతడిని శిక్షించాలని భారత్‌ను అభ్యర్థిస్తానని సారా అన్నారు. పోలీసులు, ప్రభుత్వం కలిసి అతనికి సహాయం చేస్తున్నాయి. అతని నేర కథ చాలా పెద్దది, ఎందుకంటే నేను అతనితో పాటు అన్ని నేరాలకు సాక్షిని. ఇప్పుడు న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం పోయిందని తెలిపింది. సారా కామెంట్స్ బట్టి.. ప్రభుత్వం కూడా నిత్యానందకు హెల్ప్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇన్ని సంవత్సరాలుగా ఓ వ్యక్తి చట్టాలను తప్పించుకొని తిరగటమే కాకుండా.. నేను ఇక్కడే ఉన్నాను అంటూ ఇంటర్నెట్ వేదికగా వీడియోలు పోస్ట్ చేయటం, ఏకంగా ఒక వ్యవస్థనే నడిపించటం అంటే మామూలు విషయం కాదు కదా. ఏదో గట్టి సాయం లేకుండా.. అతను అయితే ఉండడు కదా అనిపించక మానదు. అయితే సారా ఈ విధంగా కైలాస్ దేశం చేసిన కామెంట్స్ కారణంగా.. తన దేశం ఎక్కడుందో నిత్యానంద రివీల్ చేయనున్నాడని తెలుస్తోంది. మరి నిత్యానంద ఆచూకీ తెలిస్తే.. పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని అరెస్ట్ చేస్తారా లేదా.. ప్రభుత్వ పెద్దలు అతడిని కాపాడుతారా అన్నది వేచి చూడాలి.