శోభనం గదిలో ఉరివేసుకున్న వరుడు.. కారణం ఏమై ఉండొచ్చు..?
ఎంతో సిగ్గుతో మురిసిలోతు... పెళ్లి కూతురు పాల గ్లాస్ తో బెడ్ రూమ్‌కి వెళ్లింది. అంతే అక్కడ సీన్ చూసి పెళ్లికూతురు ఒక్కసారిగా షాక్ అయ్యింది. భయంగా, మొహమాటంగా భర్తతో ఏకాంత సమయం గడిపెందుకు వెళ్లిన పెళ్లి కూతురికి జీవితంలో మరచిపోలేని షాక్ ఇచ్చాడు పెళ్లి కొడుకు.
పెళ్లి కూతురికే కాదు... ఇరు కుటుంబ సభ్యులకు ఇది ఉహించని షాకే... పెళ్లి కొడుకు చేసిన పనికి ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని అత్తింటికి వచ్చిన ఆ పెళ్లి కూతురు దిక్కులేనిదిగా మారిపోయింది. పెళ్లి అయ్యి కాలికి పెట్టిన పారాణి కూడా ఆరక ముందే... పెళ్లి కూతురి కన్నిటికి కారణం అయ్యాడు. అసలు శోభనం రోజు రాత్రి ఏం జరిగింది? పెళ్లి కొడుకు చేసిన తప్పు ఏంటి? పెళ్లి కూతురు చేసిన తప్పు ఏంటో తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాకు చెందిన ఉస్రహర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తున్న జ్ఞాన్ సింగ్ యాదవ్... తన చిన్న కొడుకు సతేంద్ర యాదవ్‌కు తఖా రతన్‌పురా గ్రామానికి చెందిన వినీతా యాదవ్‌తో జూలై 2న వివాహం ఘనంగా జరిపించాడు. పెళ్లి కూతురు ఇటింవారు వధువరులకు ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఆ ఊరేగింపు అనంతరం జులై 3న, వధువును మెట్టినింటికి తీసుకు వచ్చారు. ఊరేగింపుగా మధ్యాహ్నం 2 గంటలకు శివరాకు చేరుకుంది నవ వధువు. మెట్టినింటి వారు ఘన స్వాగతం పలికారు. రాత్రి పూట జాగరణ చేయడంతో బంధువులు, కొంత మంది కుటుంబ సభ్యులు నిద్రపోయారు. అయితే ఇంట్లోని మహిళలు పెళ్లికూతురుతో పాటు ఇతర పూజలు చేయడం ప్రారంభించారు. సాయంత్రం ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయడం గురించి మాట్లాకున్నారు.... అప్పటి వరకు వరుడు సత్యేంద్ర స్నేహితులతో కలిసి డ్యాన్స్ లు వేస్తూ పెళ్లి వేడుకలో ఉత్సాహంగా ఉన్నాడు.
సత్యేంద్రకు సడెన్‌గా ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ... శోభనం రోజు పెళ్లి కూతురు పాల గ్లాస్‌తో బెడ్ రూమ్ వెళ్లింది. అంతే అక్కడ సీన్ చూసి పెళ్లికూతురుకి ఒంటి నిండ చెమటలు పట్టాయి. ఒక్కసారిగా షాక్ అయ్యింది. కుటుంబ సభ్యులు శోభనం గదిలోకి వెళ్లి చూడగా సత్యేంద్ర ఫ్యాన్ కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. . దీంతో వధువు షాక్‌కు గురై అక్కడే స్పృహతప్పి పడిపోయింది. నవ వరుడు ఆత్మహత్యతో ఇరు కుటుంబాల్లో విషాధం నెలకొంది. కాళ్ల పారాణి కూడా ఆరక ముందే ఆ వివాహిత వితంతువుగా మారడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. బలవన్మరణానికి గల కారణాలను ఇంకా తెలియరాలేదు.
జులై 3న, వధువును మెట్టినింటికి తీసుకు వచ్చినప్పుడు వరుడు బాగున్నాడు. తరువాత సతేంద్ర యాదవ్ .. తల్లికి బంగారపు ఉంగరం.. ఇతర వస్తువులు ఇచ్చి నిద్ర పోతానంటూ తన గదిలోకి వెళ్లాడు... సాయంత్రం 4 గంటలకు తలపులు కొట్టారు. ఈ టైంలో ఏం జరిగింది? సత్యేంద్రకు ఉరి వేసుకునేంత కష్టం ఏం వచ్చింది. ఏదైన విషయమై వరుడు... వధువుతో గొడవ పడి.. మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా అని విచారిస్తున్నారు. అయితే... వధువుకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందా... ఈ విషయం తెలిసి వరుడు ఫస్ట్ నైట్ రూమ్‌లో అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడ అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
What's Your Reaction?