సినిమా రంగానికి రాజకీయాలకు విడదీయలేని సంబంధం

సినిమా రంగానికి రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది.. సినీ రంగంలో బాగా ఫేమ్‌ సాధించి.. రాజకీయాల్లో తమ ఫేట్‌ ఎలా ఉందో పరీక్షించుకోవటానికి కొందరు సినీ హీరోలు.. సొంత పార్టీలు స్థాపించి ప్రజల్లోకి వెళ్లి రాజకీయాల్లో చక్రం తిప్పితే, కొందరు మధ్యలోనే విరమించిన వారు ఉన్నారు.Sri Media News

Jun 9, 2024 - 23:50
 0  7
సినిమా రంగానికి రాజకీయాలకు విడదీయలేని సంబంధం
సినిమా రంగానికి రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది.. సినీ రంగంలో బాగా ఫేమ్‌ సాధించి.. రాజకీయాల్లో తమ ఫేట్‌ ఎలా ఉందో పరీక్షించుకోవటానికి కొందరు సినీ హీరోలు.. సొంత పార్టీలు స్థాపించి ప్రజల్లోకి వెళ్లి రాజకీయాల్లో చక్రం తిప్పితే, కొందరు మధ్యలోనే విరమించిన వారు ఉన్నారు. అయితే తమిళనాడులో సీని రాజకీయాలు చాలా ఎక్కువే... సో మనం తెలుగు, తమిళ రాజకీయాల్లో మన సీని నటులు ఎవరెవరు వచ్చారో, వారు రాజకీయాల్లో తీసుకు వచ్చిన మార్పులు మనం తెలుసుకుందాం..
తెలుగునాట సినీ తారలు కూడా రాజకీయాల్లో రాణించవచ్చని రుజువు చేశారునందమూరి తారక రామారావు. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన.. తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆయన స్థాపించిన పార్టీలో అప్పుడు అనేకమంది సినీ తారలు చేరి.. రాజకీయాల్లో కూడా రాణించారు. ఇప్పటికీ వారిలో రాజకీయ నాయకులుగా స్థిరపడ్డవారు కొందరు ఉన్నారు. అయితే మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదట పార్టీ స్థాపించిన నటుడు ఎంజీ రామచంద్రన్. ఆయన డీఎంకే పార్టీ నుండి విడిపోయి సొంతంగా అన్నాడీఎంకే పార్టీని 1972లో స్థాపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత దక్షిణాదిలో సినీ తారల పరంపర కూడా కొనసాగింది. 
ఎంజీ రామచంద్రన్ పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యాక.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ పార్టీ స్థాపించి ప్రభంజనం సృష్టించి..9 నెలల్లోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తరువాత తెలుగు నటీనటులు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి.. వారికి తోచిన పార్టీలో చేరి.. ఎమ్మెల్యే, ఎంపీ పదవులు చేపట్టారు. వీరందరిలోనూ ఎన్టీఆర్‌‌ని చరిత్ర సృష్టించిన నాయకుడిగా చెప్పవచ్చు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సీఎం పదవి చేపట్టారు. విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టారు.
ఆనాడు కేంద్రంలో నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. బహుశా..! ఆయన బతికున్నట్లైతే దేవెగౌడ స్థానంలో ఆయనే ప్రధాన మంత్రి పదవి చేపట్టి ఉండేవారని తెలుగురాష్ట్ర ప్రజలు భావించారు. అయితే ఇక్కడ మనం ఓ సీనియర్ తెలుగు నటుడు గురించి చప్పుకోవాలి. రాజకీయాల్లోకి వెళ్లిన మొట్టమొదటి తెలుగు సినిమా నటుడు జగ్గయ్య. 1967లోనే ఈయన కాంగ్రెస్ టికెట్టు మీద ఒంగోలు ఎంపీగా గెలిచారు.  కాంగ్రెస్ పార్టీ ఒక సినిమా నటుడికి టికెట్ ఇవ్వడం అదే తొలిసారి. విద్యార్థి దశలో జగ్గయ్య కాంగ్రెస్ సోషలిస్టు గ్రూపుతో కలిసి పనిచేశారు.  నెహ్రూ పిలుపుమేరకు కాంగ్రెస్ లో చేరి... పార్టీకి సేవలందించారు. 
చాలా ఏళ్ల తరువాత ఎన్టీఆర్ అంతటి ఛరిష్మా గల నాయకుడిగా చిరంజీవి వచ్చి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అదే సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయనకు 18 సీట్లే వచ్చాయి. ఆ తరువాత ఏపీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కేంద్రంలో 2012 నుండి 2014 వరకు టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం 2018లో ముగిసింది. తరువాత రాజకీయలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టి హిట్టులతో దూసుకుపోతున్నారు.
అన్నయ్య చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్‌‌లో విలీనం చేసిన తరువాత  పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని 2014 సార్వత్రిక ఎన్నికల ముందు స్థాపించాడు. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేసింది. కానీ, పవన్‌ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఆ ఎన్నికలలో జనసేన కేవలం ఒకే ఒక్క సీటు గెలిచింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ కూటమికి, కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చారు. జనసేన పేరుతో పార్టీ పెట్టి ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయల్లో చూరుగ్గా ఉన్నారు. 2024 లో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.
వీరు మాత్రమే కాకుండా అనేక మంది తెలుగు హీరోలు రాజకీయాల్లో చూరుగ్గా పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ రాజీవ్ గాంధీ స్పూర్తితో కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఎన్నికల్లో ప్రచారం చేశారు. తరువాత కృష్ణ ఏలూరు నుండి ఎంపీగా విజయం సాధించారు.  
కృష్ణంరాజు బీజేపీ పార్టీలో 90వ దశకంలో చేరారు. ఆ పార్టీ తరుఫున ఎంపీగా గెలిచి..  కేంద్రంలో విదేశాంగ, రక్షణశాఖ సహాయ మంత్రిగా పలుమార్లు పనిచేశారు. 2004 నుండి బీజేపీకి దూరంగా ఉన్న ఆయన తిరిగి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. మొన్నీమధ్య ఆయన పేరు తమిళనాడు గవర్నర్ రేసులో నిలిచారు. కానీ అకాల మరణంతో 2023లో మరణించారు.
నటి శారద ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు. తెనాలి నుండి పార్లమెంటు ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత చంద్రబాబు హయాంలో కూడా టీడీపీకి ప్రచారం చేశారు. తరువాత రాజకీయాలకు దూరంగా చెన్నైలో స్థిరపడ్డారు. 
జయప్రద ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరారు. కానీ చంద్రబాబు నాయుడు పార్టీ భాద్యతలు చేపట్టాక.. జయప్రదను రాజ్యసభకు పంపారు. ఆ తరువాత ఈమె టీడీపీకి దూరంగా వెళ్లిపోయారు. సమాజ్‌వాద్‌ పార్టీలో చేరి అక్కడ కూడా రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంటుకు వెళ్లారు. తరువాత సమాజ్ వాద్ పార్టికి కూడా దూరమైయారు. 
అన్నగారు స్థాపించిన టీడీపీలో చేరి.. మోహన్ బాబు రాజ్యసభ సభ్యులయ్యారు. తరువాత టీడీపీకి దూరమై.. వైఎస్‌తో బంధుత్వం ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 
జయభేరి గ్రూప్ సంస్థల ఛైర్మన్ మురళీ మోహన్ రాజమండ్రి నుంచి టీడీపీ టికెట్టుపై 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. నాడు ఎన్టీఆర్‌తో ఎన్నికల ప్రచారం పాల్గొన్నా.. 2009 ఎన్నికల్లో ఉండవల్లి చేతిలో పరాజయం పాలయ్యారు. కోట శ్రీనివాసరావు 1999లో బీజేపీలో చేరి.. ఆ పార్టీ టికెట్టుపై విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 
బాబుమోహన్ అన్నగారు స్థాపించిన టీడీపీలో ఆది నుంచి ఉన్నారు. ఈయన కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా పేరుంది. చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత టీఆర్ఎస్‌లో చేరి ఆందోల్ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విజయశాంతి తొలుత బీజేపీలో ఉండేవారు. ఆ తరువాత హైదరాబాద్‌లో స్థిరపడి తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. తరువాత టీఆర్ఎస్‌లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అప్పటి నుండి ఆవిడ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. తెరాస ఎంపీగా ఢిల్లీకి  వెళ్లారు. 2014లో తెరాస నుండి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. తరువాత మళ్లి తిరిగి బీజేపీకి వచ్చారు. ప్రస్తుతం బీజేపీ తరఫున క్రీయశీలకంగా పని చేస్తున్నారు.
 జయసుధ సనత్‌నగర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత పార్టీ నుండి బయటకు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే తరువాత టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. 
దాసరి నారాయణరావు కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. కేంద్రంలో బొగ్గు గనుల శాఖకు సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఉదయం పత్రిక వ్యవస్థాపకుడుగా కూడా వ్యవహరించారు.
రామానాయుడు టీడీపీ పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు హయంలో గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీగా సేవలందించారు. సినీ నటి రోజా.. తొలుత టీడీపీలో ఉండేవారు. తెలుగు దేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పని చేశారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత టీడీపీకి దూరమై.. 2014 ఎన్నికల ముందు వైఎస్‌ఆర్‌సీపీ పార్టీలో చేరి నగరి స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
బాలకృష్ణ ప్రస్తుత హిందూపూర్ ఎమ్మెల్యే. 2014లో టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. గతంలో తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. 
అయితే... తమిళ నాడులో మనకంటే ఎక్కువగా రాజకీయాలు  ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వరకూ అందరూ సినీరంగం నుంచి వచ్చిన వారే.. ఎంజీఆర్ మొదలు విజయ్ కాంత్, కమల్ హాసన్ వరకూ సొంత పార్టీలు స్థాపించిన వారే.. దక్షిణ భారత్‌లో ఏపీ రాజకీయల తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ రాజకీయాలు తమిళనాడువి మాత్రమే.. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల ఆధిపత్యం ఉండేది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈసారి బీజేపీ గట్టి పోటి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.
అయితే సీని హీరో రజనీకాంత్ రాజకీయల్లోకి వస్తారని కొత్త పార్టీ పెడతానని... ప్రకటించే సమయానికి ఆయనకు ఆరోగ్యం సహకరించక పార్టీని రద్దు చేశారు. రాజకీయాల్లో ఉంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుందని, ఇందుకు తన ఆరోగ్యం సహకరించకపోవచ్చని రజినీకాంత్ అభిప్రాయపడ్డారు. దీంతో రజినీ మక్కల్ మండ్రం పార్టీని రద్దు చేసుకున్నారు.
కమల్‌ హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమల్‌ పార్టీకి వచ్చిన ఓట్లు 3.6 శాతం మాత్రమే. దాంతో రాజకీయ నాయకుడిగా కమల్‌ కొంత గందరగోళంలో పడ్డారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ద్రావిడ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండకపోతే తమిళనాడులో రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని తేల్చిచెప్తున్నారు. పాలిటిక్స్‌ను పార్ట్‌ టైమ్‌ హాబీగా తీసుకుంటే తమిళ ఓటర్లు ఆదరించరని అంటున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూ.. సీరియస్‌ పొలిటిషియన్‌ అని చెప్తే నమ్మేందుకు ప్రస్తుత ఓటర్లు సిద్ధంగా లేరని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా కమల్‌ హాసన్‌ ముందున్నవి రెండే ఆప్షన్లు తమిళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకటి పార్టీకి ప్యాకప్‌ చెప్పడం, రెండు పొత్తు కుదుర్చుకొని పార్లమెంట్‌ సభ్యుడిగా అడుగుపెట్టడం. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే పొత్తుకు సిద్ధమనే సంకేతాలు కమల్‌ నుంచి కనిపిస్తున్నాయి. ఈ మధ్య జరిగిన ఈరోడ్‌ ఉపఎన్నికలో డీఎంకే అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. కాగా 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో డీఎంకే వైపు టర్న్‌ తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది.
సినీ నటుడు దళపతి విజయ్‌ రాజకీయల్లోకి వస్తారని అభిమనుల్లో తరచూ చర్చ జరుగుతూనే ఉంది. దీనికి బలం చేకూర్చుతూ.. ఇటీవల కాలంలో తన చిత్రాల్లో రాజకీయంగా చర్చకు తావిచ్చే డైలాగులతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఇది వివాదాలకు సైతం దారి తీస్తున్నాయి.  విజయ్‌ ప్రస్తుతం వేస్తున్న అడుగులు 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్నట్టుగా పలువురు భావిస్తున్నారు. విజయ్‌ పార్టీని ప్రారంభిస్తే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకే లాభంగా మారొచ్చని చర్చ జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా అధికార పార్టీకే ఎక్కువ లాభం చేకూరుతుందని పొలిటికల్‌ టాక్‌.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow