హైపర్ ఆది ఋణం తీర్చుకోబోతున్న పవన్ ... జనసేన తరఫున పెద్ద పదవి చేపట్టనున్న ఆది!

ఒక్కడుగా మొదలైన పవన్ రాజకీయ ప్రయాణంలో ఎందరో ఆయన పక్కన చేరారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన అనేకమంది ప్రముఖులు 2024 ఎన్నికల్లో పరోక్షంగా ఆయనకు మద్దతు పలికారు. పవన్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.Sri Media News

Jun 28, 2024 - 13:20
 0  3
హైపర్ ఆది ఋణం తీర్చుకోబోతున్న పవన్ ... జనసేన తరఫున పెద్ద పదవి చేపట్టనున్న ఆది!

ఒక్కడుగా మొదలైన పవన్ రాజకీయ ప్రయాణంలో ఎందరో ఆయన పక్కన చేరారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన అనేకమంది ప్రముఖులు 2024 ఎన్నికల్లో పరోక్షంగా ఆయనకు మద్దతు పలికారు. పవన్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. వారందరి కోరిక..కృషి జనసైనికుల అండదండలే ఆశీస్సులుగా పవన్ ఘన విజయాన్ని అందుకున్నారు. గతంలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకున్న ఈయన నాయకుడా అని ఎగతాళి చేసిన వారితోనే వీడురా మగాడు అనిపించుకుంటున్నాడు పవన్.. అంతేకాదు.. పోటీచేసిన ప్రతి చోట గెలిచి ఓటమన్నదే లేని నాయకుడుగా... టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకొని... రాజకీయల్లో గేమ్ చేంజర్ అయ్యారు పవన్... ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వుందంటే అది పవన్ చలవే అనడంలో అతిశయోక్తి లేదు. స్వయంగా టిడిపి అధినేత, సీఎం చంద్రబాబు నాయుడే పవన్ కల్యాణ్ వల్లే ఇంతటి అద్భుత విజయం సాధ్యమయ్యిందని చెప్పుకొచ్చారు కూడా.

కూటమి విజయం వెనుక ఉన్నది  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే... పవన్ విజయం వెనుక ఆయన అభిమానులు ఉన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో అనేక మంది పవన్ అభిమానులు ఆయన పార్టీ తరఫున వాలంటీర్‌‌గా ప్రచారం చేశారు. ఈ అభిమానుల్లో ఏపీ వారే కాదు... తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారంటే... పవన్ అభిమానులు పవన్ గెలుపుకోసం ఎంతగా కష్ట పడ్డారో మనం చెప్పుకోవచ్చు. అయితే జబర్దస్త్ కమెడియన్స్ చాల మంది పవన్ కోసం ప్రచారం చేశారు.. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్, రాకెట్ రాఘవ ఇలా చాలామంది పిఠాపురంలో జనసేన పార్టీకి ప్రచారం చేస్తూ.. పవన్ కళ్యాణ్ గెలుపుకోసం ఇంటింటికీ తిరిగారు.


వీరందరి కంటే ఓ అడుగు ముందుకేసి... హైపర్ ఆది వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారనే చెప్పాలి. స్వతహాగా... హైపర్ ఆది పవన్ కళ్యాణ్ వీరాభిమాని దీంతో పవన్ కళ్యాణ్ ని ఎవరైనా విమర్శిస్తే చాలు ఊరుకునేవాడు కాదు. పవన్ కళ్యాణ్ పై  ఆరోపణలు చేసేవారికి కౌంటర్లు ఇచ్చి పడేసేవాడు. జబర్దస్త్ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల మీద స్కిట్స్ చేసి, పంచులు వేసేవాడు. ఎన్నికల ముందు నుంచే జనసేన పార్టీ సభల్లో యాక్టివ్‌‌గా ఉండేవాడు ఆది. ఆది పదునైన స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రాసలు పంచులతో అదరగొట్టేవాడు. పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల మీద తన మార్క్ పంచులు వేసేవాడు. కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. జనసేనకు కేటాయించిన అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు...

 దీంతో హైపర్ ఆది పవన్ కోసం కష్టపడటం గుర్తించిన పవన్ కళ్యాణ్ ఆదికి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. మరి అదే జరిగితే సంచలమే అని చెప్పాలి. హైపర్ ఆది ఎదిగిన తీరు అద్భుతం అనాలి. అయితే పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుకు ఇంకా ఎలాంటి పదవి దక్కలేదు. ఆయన్ని కాదని ముందుగా హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ పదవి ఇస్తాడని నమ్మలేం... కానీ పవన్ అభిమానులకు ఇచ్చే వ్యాల్యూ చూస్తే ఇవ్వచ్చు కూడా... అయితే ఎమ్మెల్సీ కాకపోయినా హైపర్ ఆదికి జనసేనలో సముచిత స్థానం దక్కుతుందనే ప్రచారం జరుగుతుంది. ఎన్నిక

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow