స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియని భారతీయులు ఉండరు అయితే ఈ భ్యాంకు ఎప్పుడు ప్రారంభం అయ్యింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకును ప్రారంభించినప్పుడు పెట్టిన పేరు ఏంటి... ఇప్పటివరకు ఎన్ని సార్లు ఈ బ్యాంకు పేరును మార్చరు. ఈ బ్యాంకును స్థాపించిన తరువాత ఇది ఎలా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకుల లిస్ట్‌లో ఏలా చేరింది. అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బ్రిటిష్ పాలన కాలంలో అంటే 1806న బ్యాంక్ ఆఫ్ కలకత్తాగా స్థాపించబడింది. మూడు సంవత్సరాల తర్వాత బ్యాంక్ తన చార్టర్‌ను పొంది... 2 జనవరి 1809లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్‌గా రూపొందింది. ఇది బెంగాల్ ప్రభుత్వంచే స్పాన్సర్ చేయబడిన బ్రిటిష్ ఇండియా మొదటి జాయింట్-స్టాక్ బ్యాంక్ అని మీకు తెలుసా?. బ్యాంక్ ఆఫ్ బెంగాల్ మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులలో ఒకటి... అయితే మిగిలిన రెండు బ్యాంకులు ఏంటీ అనే ప్రశ్న మీకు వచ్చింది కదా.. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఈ మూడు బ్యాంకులును కలిపి 27 జనవరి 1921 న ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది.
అయితే ఇప్పుడు మీకు ఓ అనుమానం వచ్చి ఉండవచ్చు. ఈ మూడు బ్యాంకులు ఎందుకు పెట్టారు. బ్రిటిష్ పాలనలో భారత దేశం ఉన్న సమయం అంటే 1602లో బ్రిటిష్ వారు ఇండియాలోని ముఖ్యమైన కొన్ని రాజ్యాలను అక్రమించుకుని మున్సిపాలిటిలుగా అభివృద్ది చేశారు. అవే మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ వీటినే మనం బ్యాంక్ ఆఫ్ కొలకత్తా, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అని పిలుస్తాం. ఈ మూడు బ్యాంకులు 27 జనవరి 1921 న ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా విలీనం చేశారు. ఈ విలీనం వరకు ఈ మూడు బ్యాంకులు భారతదేశంలో ఆధునిక బ్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి.ఈ మూడు బ్యాంకులు 1861 వరకు పేపర్ కరెన్సీని జారీ చేసే ప్రత్యేక హక్కును కలిగి ఉన్నాయి. తరువాత కాలంలో ఈ హక్కును భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తరువాత 1952లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గవర్నమెంట్‌ని ఫామ్ చేశారు. అనంతరం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నేషనలైజ్ చేస్తూ చట్టం తీసుకు వచ్చారు. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1955 నేషనలైజ్ చేయడం అంటే ఒక ప్రవేటు ఆర్గనైజేషన్‌ని గవర్నమెంట్‌లో కలిపి వేయడమే.. 1955లో బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధినంలో ఉండేది.
1959లో ఇండియన్ గవర్నమెంట్ ఎస్‌బీఐ సబ్సిడరి యక్ట్‌ని తీసుకు వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఇండియాలో ఉన్న ఎనిమిది చిన్న చిన్న బ్యాంకులను ఎస్‌బీఐ సబ్సిడరిగా ప్రకటించారు. అంటే ఈ ఎనిమిది బ్యాంకులు ఎస్‌బీఐ అండర్‌లో పని చేస్తాయి. ఈ విధంగా ఎస్‌బీఐ తన వ్యాపారన్ని చిన్న చిన్న మారుమూల ప్రాంతల్లో కూడా విస్తరించగలిగింది.
అయితే ఇప్పటి వరకు స్టేట్ భ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా మొదలైంది అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఎస్‌బీఐ ఎలా డబ్బులను సంపాదిస్తుంది అనే దాన్ని తెలుసుకుందాం.. సాధారణంగా ఎవరైనా డబ్బులు ఎలా సంపాదిస్తారు? ఉద్యోగం చేసి లేదంటే వ్యాపారం చేసి… అలానే బ్యాంకులు వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తాయి. ఏం వ్యాపారం? అని మీకు డౌట్ రావొచ్చు. బ్యాంకులు వడ్డీ వ్యాపారం చేస్తాయి. అయితే బ్యాంకులు చేసే వ్యాపారం సొంత పెట్టుబడితో చేయవు. ప్రజలలో చాలా మంది వారి డబ్బును ఫిక్సడ్ డిపాజిట్, బాండ్స్ రూపంలో బ్యాంకుల్లో పొదుపు చేసి డబ్బులు దాచుకుంటారు. అలానే వ్యాపారం చేయడానికి డబ్బులు అప్పుగా తీసుకోవాలి అనుకునే వారూ ఉంటారు. వీరిద్దరికీ మధ్య అనుసంధాన కర్తగా బ్యాంకులు వ్యవహరిస్తూ... డబ్బును రొటేషన్ చేసి వ్యాపారం చేస్తుంది. అంతే కాదు బ్యాంకులు ప్రభుత్వాలకు, ప్రభుత్వ ప్రాజెక్టులకు కూడా అప్పులు ఇస్తాయి.
బ్యాంకులో డబ్బులు దాచుకున్న వారికి డిపాజిట్లు మీద వడ్డీ ఇస్తుంది. అలానే అప్పులు తీసుకున్న వారికి అప్పు మీద వడ్డీని తీసుకుంటుంది. ఉదాహరణకు డిపాజిట్లపై ఖాతాదారులకు 8% వడ్డీ ఇస్తూ ఉంటే... అప్పులపై 11- 12% ఛార్జ్ చేస్తూ ఉండొచ్చు. ఈ మధ్యలో ఉన్న తేడా 3–4% బ్యాంకు వారి లాభం. దీనిలో బ్యాంకు ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్‌తో బాటు, బ్యాంకు వారి లాభం కూడా కలిసి ఉంటుంది.
బ్యాంకులో మనం దాచిపెట్టే డబ్బులో కొంత భాగాన్ని బ్యాంక్ వేరేచోట పెట్టుబడిగా పెడతాయి. 2013 లెక్కల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్న డబ్బులు సుమారు లక్షా 30వేల కోట్ల రూపాయలను ఇండియాలో ఉన్న సుమారు 192 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. కంపెనీకు లాభాలు వస్తే, అందులో పెట్టుబడి పెట్టిన వాళ్లకి కూడా లాభాలు వస్తాయి కదా.. అలాగే ఎస్బీఐ కూడా ప్రతి సంవత్సరం వాళ్లు పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ సంపాదిస్తుంది. ఒక్కోసారి మార్కెట్‌లో పరిస్థితులు బాగోకపోతే, అప్పుడు నష్టాలు తప్పవు. నెక్స్ట్ బ్యాంక్‌కి వచ్చే మూడవ ఆదాయ మార్గం పీస్ అండ్ ఛార్జెస్. ఇది మనందరికీ తెలిసిందే. బ్యాంక్‌లో అకౌంట్ మెయింటెనెన్స్, క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నంేదుకు, టైమ్‌కి బిల్ చేయనందుకు, ఎకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయనందుకు, ఎస్‌ఎమ్‌ఎస్ ఛార్జీస్, లేట్ ఫీజెస్, చెక్ బౌన్స్, ఇంటర్నెట్ ఛార్జీస్ అనీ ఇలా బ్యాంక్ కస్టమర్స్ పైనే ఈ భారాలన్నీ వేస్తుంది. ఇవన్నీ బ్యాంక్‌కు ఆదాయ మార్గాలు. ఇలా వచ్చిన డబ్బులో కొంత భాగం ఎంప్లాయీస్‌కు శాలరీ ఇవ్వటానికి, కొంత భాగం బ్యాంక్ మేయింటెన్స్ కోసం ఖర్చు చేస్తుంది. మిగిలిన డబ్బును మళ్లీ వేరే చోట ఇన్వెస్ట్ చేస్తాయి బ్యాంక్స్. దీనివల్ల లాంగ్ టెర్మ్‌లో బ్యాంకులకు ఆదాయం వస్తుంది.
బ్యాంక్స్ ఆదాయం తప్ప.. నష్టాలు ఉండవా అంటే.. ఉంటాయి. ప్రతి రంగంలో లాభ నష్టాలు ఉన్నట్లే.. బ్యాకింగ్ రంగంలో కూడా నష్టాలు ఉంటాయి. బ్యాంకులకు మెయిన్‌గా వచ్చే నష్టాలు అంటే, లోన్ డీఫాల్స్. అదేనండీ లోన్ తీసుకొని ఎగ్గొట్టే వాళ్ళు. వీళ్ళనే బ్యాంకింగ్ టెర్మినాలజీలో నాన్ పెర్ఫామింగ్ ఎసెట్స్ అంటారు. అంటే ఎవరైనా బ్యాంకులో లోన్ తీసుకొని 90 రోజుల పాటు తీసుకున్న లోన్‌కి అసలు కానీ, వడ్డీ కానీ కట్టకపోతే, దాన్ని నాన్ పెర్ఫామింగ్ ఎసెట్ అని అంటారు. కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పులు తీసుకొని, ఎగ్గొట్టేసి ఎంచక్కా ఫారిన్ చెక్కేయటం మనం చూస్తూనే ఉంటున్నాం.
అలా బ్యాంకులకు వేల కోట్లు లాస్ వస్తుంది. ఇటువంటి వాటిని అరికట్టేందుకు బ్యాంక్స్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది. అదే సర్పాసీ యాక్ట్. ఈ చట్టం ప్రకారం ఆర్బీఐ ఎసెట్స్ రీకన్స్ట్రక్షన్ ఎస్టాబిలిష్ చేసి, అప్పులు ఎగ్గొట్టిన వాళ్ల ఆస్తులను జప్తు చేసి, వాళ్లు తీసుకున్న లోన్స్ తిరిగి కలెక్ట్ చేయటానికి ట్రై చేస్తుంది. ఇలా చేయటానికి చాలా టైమ్ పడుతుంది. ఇలా చేస్తే, లోన్ క్లియర్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే, జప్తు చేసిన ఆస్తులు, తీసుకున్న లోన్‌కు వర్త్ అవుతుందో, లేదో తెలియదు కాబట్టి. 2023 లెక్కల ప్రకారం ఎస్బీఐ నాన్ పెర్ఫామింగ్ ఎసెట్స్ మెుత్తం 21 వేల కోట్లు. అమ్మో అంతా.. అని మనకు అనిపించవచ్చు కానీ, ఎస్బీఐ ఆస్తులతో పోల్చుకుంటే, ఇది కేవలం 0.67 పర్సంటేజ్ మాత్రమే.
మెుదట ఎస్బీఐ ఆర్బీఐ ఓనర్ షిప్‌లో ఉండేది అని మనం చెప్పుకున్నాం కదా.. అయితే 2008లో ఇండియన్ గవర్నమెంట్ ఎస్బీఐను ఆర్బీఐ ఓనర్‌షిప్ నుంచి తీసుకొని, కంప్లీట్‌గా గవర్నమెంట్ ఓనర్‌షిప్‌లోనే పెట్టుకుంది. దీనికి కారణం ఆర్బీఐ అనేది ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్‌ను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి అటువంటి రెగ్యులేటరీ బాడీ అండర్‌లో పర్సనల్‌గా ఒక బ్యాంక్ ఉండటం అనేది.. ఆ బ్యాంక్‌కు ఫేవర్‌గా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగేందుకు అవకాశం ఉంది. అందువల్లే ఎస్బీఐను కంప్లీట్‌గా గవర్నమెంట్ ఓనర్‌షిప్‌లోకి తీసుకుంది.
2023 లెక్కల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాల్యుయేషన్ సుమారు 5 లక్షల కోట్ల పైనే ఉంది. ఇదంతా కేవలం ఎస్బీఐ నుంచి మాత్రమే వచ్చింది కాదు. 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడిన తరువాత అందులో చాలా బ్యాంకులను కలిపేసారు. సో అలా కలిపేసిన బ్యాంకుల ఆస్తులు, అప్పులు ఇకపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే చెందుతాయి. 2017లో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిపేసారు. దీనివల్ల ఎస్బీఐ ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఉన్న అతి పెద్ద బ్యాంకులలో ఒకటిగా మారిపోయింది.
అలా ఎస్బీఐ అన్ని బ్యాంకుల కంటే ముందు వరుసలో ఉంది.