టీచర్ కొంపముంచిన రీల్స్....

ఈరోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మోజులో పడి కొందరు చిత్ర విచిత్రమైన పనులకు పాల్పడుతున్నారు. తమ రీల్స్ వైరల్ అవ్వాలని.. లక్షల్లో వ్యూస్, లైక్స్ రావాలన్న ఉద్దేశంతో హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. చివరికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం.. తమ విధులను మరచి వింత వింతగా వీడియోలు చేస్తున్నారు.Sri Media News

Jun 10, 2024 - 17:45
 0  12
టీచర్ కొంపముంచిన రీల్స్....

ఈరోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మోజులో పడి కొందరు చిత్ర విచిత్రమైన పనులకు పాల్పడుతున్నారు. తమ రీల్స్ వైరల్ అవ్వాలని.. లక్షల్లో వ్యూస్, లైక్స్ రావాలన్న ఉద్దేశంతో హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. చివరికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం.. తమ విధులను మరచి వింత వింతగా వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ టీచర్ కూడా అలాంటి తప్పే చేయడంతో, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎవరి వ్యక్తిగత జీవితం వారికి ఉంటుంది. ఎవరికి నచ్చిన పనులు చేసుకోవచ్చు. కానీ, విధుల్లో ఉండగా ఇలాంటి పిచ్చి పనులు చేయడం సరికాదు..   ప్రస్తుతం ఈ టీచర్ చేసిన నిర్వాకంపై నెట్టింట పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.

పాట్లిపుత్ర యూనివర్సిటీ పరీక్షలను వాల్యుయేషన్ చేసే సమయంలో.. బిహార్‌కు చెందిన ఒక టీచర్స్ రీల్స్ చేసింది. ఇలా చేయడమే పెద్ద తప్పయితే, అంతకుమించి మరో పెద్ద తప్పు ఆమె చేసింది. విద్యార్థులు రాసిన ఆన్సర్లను ఏమాత్రం గమనించకుండానే.. రైట్ మార్క్ వేస్తూ వెళ్లిపోయింది. ఓవైపు ఇతర టీచర్లు సరిగ్గా వాల్యుయేట్ చేస్తూ తమ బాధ్యతలను నిర్వర్తిస్తుంటే.. ఈ టీచరమ్మా మాత్రం రీల్స్ కోసం పోజులు కొడుతూ, జవాబుల్ని గమనించకుండా రైట్ మార్క్ వేసుకుంటూ వెళ్లింది.

 దీంతో విద్యార్థుల భవిష్యత్తును ఇలాంటి టీచర్లే నాశనం చేస్తున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు పేపర్ వ్యాల్యూయేషన్ దగ్గర వీడియోలు, ఫొటోలు అంటూ ఏంటి వాళ్ల రచ్చ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మార్కుతో టాపర్స్ అయ్యే వాళ్లు ఉంటారు. అదే మార్కు రాలేదని ప్రాణాలు తీసుకునే వాళ్లు ఉంటారు. ఇలాంటి వాళ్లు చేసే నిర్లక్ష్యపు పనుల వల్ల అక్కడ విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి.. ఆమెపై చర్యలు తీసుకున్నారు. ఆ టీచరమ్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow