40 ఏళ్ల వ్యక్తితో.. 19 ఏళ్ల యువతి ప్రేమ
ప్రేమ వయసుని చూసి పుట్టేది కాదు.. మనసుని చూసి పుట్టేది... ప్రేమకి, పెళ్లికి వయసుతో సంబంధం లేదని, మనసులు కలిస్తే చాలని చెబుతుంటారు కొందరు ప్రేమికులు... అందుకే చాల మంది ప్రేమ గుడ్డిది అంటారు.... ఇక సమాజంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.. ఇది నిజమే అనిపించకమానదు.Sri Media News
ప్రేమ వయసుని చూసి పుట్టేది కాదు.. మనసుని చూసి పుట్టేది... ప్రేమకి, పెళ్లికి వయసుతో సంబంధం లేదని, మనసులు కలిస్తే చాలని చెబుతుంటారు కొందరు ప్రేమికులు... అందుకే చాల మంది ప్రేమ గుడ్డిది అంటారు.... ఇక సమాజంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.. ఇది నిజమే అనిపించకమానదు. ప్రపంచంలో అనేక దేశల్లో ప్రేమ పేరుతో జరిగే దారుణాలు అన్ని ఇన్ని కాదు... అంతేందుకు మన దేశంలో కూడా ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలను మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమించిన వారి కోసం ప్రాణాలు తీసుకునే వారు ఎక్కువ అవుతున్నారు. ఒక్క క్షణం మనసుతో ఆలోచించి పెద్దలను ఒప్పించే ఓపిక యువతలో ఉండటం లేదు... అంతేకాదు...
ప్రేమించే వ్యక్తి వయసు కూడా చూడా కుండా ప్రేమిస్తున్నారు కొందరు. వయసును పట్టించుకోకుండా ప్రేమించుకున్న వారి ప్రేమను కుటుంబం ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు.. కారణం ప్రేమించుకున్న ఇద్దరి మధ్య వయసు గ్యాప్ ఎక్కువ ఉండటమే... ఇటువంటి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 19 ఏళ్ల ఓ యువతి... పెళ్లై, ఇద్దరు పిల్లలున్న 40 ఏళ్ల వ్యక్తిని ప్రేమించింది. అంతేకాదు.. ప్రేమించిన వాడి కోసం ఏకంగా కన్నవారిని కూడా వదిలేసి వెళ్లింది. కానీ చివరకు ఆ యువతికి ఏం జరిగింది.. ఎలాంటి పరిస్థితి ఎదురయ్యిందో తెలుసుకుందాం.
అతడి వయసు 40 సంవత్సరాలు.. పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అతడు తనకన్నా 20 ఏళ్ల చిన్నదైన యువతిని ప్రేమ పేరుతో ఆకర్షించి తన వెంట తిప్పుకోవడం ప్రారంభించాడు. ఆయువతి ఎంత మత్తులో ఉందంటే.. ప్రేమించిన వాడి కోసం ఏకంగా కన్న వాళ్లను సైతం వదులుకుని.. అతడితో వెళ్లింది. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. లవర్‌తో వెళ్లిన యువతి చివరికు చెరువులో శవమై తేలింది. యువతిని తీసుకెళ్లిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈఘటన కర్ణాటక, తుమకూరు జిల్లా కొరటిగెరె తాలూకా మావత్తురుగ్రామంలో వెలుగు చూసింది. ఇదే తాలూకా కోళాల సమీపంలోని బైరగొండ్లు గ్రామానికి చెందిన రంగశ్యామయ్య(40) అనే వ్యక్తికి పెళ్లై.. ఇద్దరు పిల్లలు సంతానం కూడా ఉన్నారు.
అతడికి లక్ష్మయ్యన పాళ్య గ్రామానికి చెందిన అనన్య అనే 19 సంవత్సరాల యువతితో పరిచయం ఏర్పడింది. ఈ అమ్మాయి ఆమె బీకాం సెకండియర్ చదువుతోంది. అయితే తన వయసులో సగం ఏజ్ ఉన్న అనన్యకు మాయ మాటలు చెప్పి.. తనను ప్రేమించేలా చేసుకున్నాడు
రంగశ్యామయ్య. అయితే ఈ విషయం అనన్య ఇంట్లో తెలిసింది. తల్లిదండ్రులు అనన్యను నిలదీశారు.. రంగశ్యామయ్యతో పెళ్లికి మేం ఓప్పుకోం అని చెప్పారు. అయిన అనన్య వినలేదు.. నేను పెళ్లి చేసుకుంటే రంగశ్యామయ్యనే చేసుకుంటానని తెగేసి చెప్పింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెళ్లై, పిల్లలున్న వ్యక్తితో వివాహం ఏంటని మందలించారు. దాంతో తల్లిదండ్రులు తమను విడదీస్తారని భావించిన అనన్య.. రంగశ్యామయ్యతో కలిసి ఇంటి నుంచి వెళ్లి పోయింది.
దాంతో అనన్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనన్య కోసం గాలస్తుండగా.. మావత్తురు చెరువులో యువతి మృతదేహం తేలియాడుతుందని.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా ఆ మృతదేహం అనన్యదిగా గుర్తించారు. గట్టుపై ఇద్దరి పాదరక్షలు, కారు ఉన్నాయి. వీరిద్దరూ కారులో సంచరించినట్లు అనుమానిస్తున్నారు.
రంగశ్యామయ్య కూడా ఇదే చెరువులో దూకి ఉంటాడని భావించి మృతదేహం కోసం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రంగశ్యామయ్య ఏం అయ్యాడు అనే విషయం ఇంకా తెలియలేదు... ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారా..? లేక రంగశ్యామయ్య అనన్యని చంపి పరిపోయడా అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే రంగశ్యామయ్యను అనన్యను వారి కుటుంబం వారే చంపి కేసును తప్పుగా నడిపిస్తున్నార అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ప్రేమకి, పెళ్లికి వయసుతో సంబంధం లేదని, మనసులు కలిస్తే చాలని ప్రూవ్ చేస్తూ.. కొత్త కపుల్ కు గోల్స్ సెట్ చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని జంటలు.. పెళ్లి చేసుకునే జంటల మధ్య 5,6 ఏళ్ల ఎజ్ గ్యాప్ అంటే కామన్.. కానీ.. 20..30 ఏళ్ల గ్యాప్ తో ప్రేమలో మునిగితేలుతున్నారు ఈ మధ్య జంటలు... కొందరు అబ్బాయిలు అయితే ఆల్రెడీ పెళ్లి అయిపోయి తమ కంటే వయసులో పెద్దవారు అయినా మహిళలను పెళ్లి చేసుకుంటు.. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్న అనేక జంటలను మనం చూస్తునే ఉన్నాం... గతంలో అబ్బాయి వయస్సు కన్నా అమ్మాయి వయస్సు 10-15 ఏళ్లు గ్యాప్ ఉన్న చేసేసేవారు. కానీ అమ్మాయి.. అబ్బాయి కన్నా ఒక్క గంట ముందు పుట్టినా.. ససేమిరా అనేవారు.... కానీ ఈ రోజుల్లో ఆ బేరియర్స్ ఏమీ లేవు.
What's Your Reaction?