అందుకే ఫ్రెండ్‌షిప్‌ని అందమైన రిలేషన్ షిప్ అని చెప్తారు. ఫ్రెండ్స్ కోసం ప్రత్యేకంగా ఓ రోజు పెట్టుకొని సెలబ్రేట్ కూడా చేసుకుంటాం మనం. కుచేలుడు శ్రీకృష్ణుడు వంటి వారి పవిత్రమైన ఫ్రెండ్‌షిప్‌ని చూశాం. కానీ ఈ రోజుల్లో ప్రతి బంధం కూడా కమర్షియల్ అయిపోయింది కల్తీగా మారింది. అందులో మినహాయింపు కాదు ఫ్రెండ్ షిప్ కూడా. నమ్మిన వ్యక్తినే నట్టేట ముంచేస్తున్నారు.. ఓ పక్క స్నేహితుడితో సన్నిహితంగా ఉంటూ అతడికే వెన్నుపోటు పొడుస్తున్నారు. దీనికి ప్రధాన కారణమౌతుంది డబ్బు. డబ్బుకు లోకం దాసోహం అని మరోసారి నిరూపితమైంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా ఈ కోవలోకే వస్తుంది.
నాన్న ఆఫీస్‌కు వెళ్తున్నా చెప్పి బయలుదేరిన కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన పూజా ఏకే.. తిరిగి ఇంటికి రాలేదు. మెుదట ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి.. పూజా గురించి కనుక్కున్నారు ఆమె తల్లిదండ్రులు. మా దగ్గరకి రాలేదు.. చాలా రోజుల నుంచి మేము కాంటాక్ట్‌లో లేము అని దాదాపు అందరి నుంచీ సమాధానం వచ్చింది. దీంతో కంగారు పడిన పూజ తల్లిదండ్రులు.. బంధువుల ఇంటికి వెళ్లిందేమోనని.. తెలిసిన వాళ్లకు, రిలేటివ్స్‌కు ఫోన్ చేశారు. వారింటికి కూడా రాలేదు అని చెప్పట్టంతో.. తండ్రి కుశాల్ అగుంబే పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా పూజ మృతదేహం దొరికింది.
ధర్మస్థల సంఘం సేవా ప్రతినిధిగా వర్క్ చేస్తుంది 24 ఏళ్ల పూజా ఏకే. మంచి అమ్మాయి అన్న పేరు ఉంది. జూన్ 30న పని నిమిత్తం ఇంటి నుండి బయటకు వెళ్లిన తను.. శవంగా కనిపించటంతో అందరూ షాక్ తిన్నారు. ఎవరితోనూ శత్రుత్వం లేదు, అందరినీ నవ్వుతూ పలకరించే పూజాని ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందని ఆరా తీయటం మెుదలు పెట్టారు. ఎవరితోనూ గొడవలు లేవు, పని చేసే చోటా మంచి అమ్మాయి అనే పేరు ఉంది.. కేసులో ముందుకు వెళ్లటానికి పోలీసులకు ఎటువంటి లీడ్ దొరకటం లేదు. ఈ క్రమంలోనే పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలించారు. పూజా మిస్ అయిన రోజు ఎవరికి కాల్ చేసిందో గుర్తించారు.
పోలీసుల ఎంక్వైరీలో ఫ్రెండ్ మణికంఠతోనే చివరి సారిగా పూజా మాట్లాడినట్లు తేలింది.
మణికంఠను అదుపులోకి తీసుకుని విచారించగా.. తొలుత తనకేమీ తెలియదని బుకాయించాడు. మా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్.. నేను ఎందుకు తనను చంపుతాను అంటూ మెుసలి కన్నీరు కార్చాడు. పూజా తల్లిదండ్రులతో సైతం మణికంఠకు పరిచయం ఉండటం, ఇంట్లో జరిగే స్పెషల్ ఈవెంట్స్‌కి హాజరు కావటంతో.. మణికంఠను పూజ తల్లిదండ్రులు కూడా అనుమానించలేదు.
కానీ పోలీసులకు మణికంఠ చెప్తున్న మాటలు నమ్మాలని అనిపించలేదు. దీంతో ఇన్వెస్టిగేషన్ మరోసారి మెుదలు పెట్టారు. అసలు పూజా చివరిగా ఫోన్ చేసింది నీకే.. ఆమె ఏం చెప్పింది అని గట్టిగా అడిగారు మణికంఠను. ఎప్పుడూ ఫోన్ చేసినట్లే చేసి.. క్యాజువల్‌గా మాట్లాడి పెట్టేసింది. అంతేగానీ తాను నాకేమీ చెప్పలేదు అంటూ మణికంఠ అతి తెలివి ప్రదర్శించాడు. ఇక లాభం లేదనుకున్న పోలీసులు తమదైన స్టైల్‌లో విచారిస్తే.. తానే పూజను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందనీ, అందుకే ఆమెను చంపేసి.. మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు వివరించాడు.
మణికంఠ చేసిన నేరం పూజ తల్లిదండ్రులకు తెలియటంతో.. కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంట్లో మనిషిగా, పూజకు అన్న దొరికాడు అనికొని ఆనందపడ్డాం.. కానీ ఫ్రెండ్ రూపంలో ఆ యముడే వచ్చాడు అని తెలుసుకోలేకపోయాం అంటూ భోరుమని విలపించారు.
ఈరోజుల్లో ఏ బంధం ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నాం. ఫ్రెండ్స్ అని నమ్మితే.. నమ్మించి మోసం చేసేస్తున్నారు. డబ్బుల విషయంలో జరిగిన గొడవతో పూజను అతి దారుణంగా చంపేసి.. మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టిన మణికంఠకు ఎటువంటి శిక్ష వేయాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.