బుద్ధుడిని ఎందుకు చంపాలని అనుకున్నారు? ఆ కల తరువాతే బుద్ధుడు పుట్టాడా? సిద్ధార్థుడి నుంచి బుద్ధుడుగా మారటానికి గల కారణాలు ఏంటి.?

బుద్ధుడి బోధనలు విని.. ఎంతో మంది జీవ హింసకు దూరంగా.. ఉంటూ సన్యాసిలుగా మారి కొందరు ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు.Sri Media News

Jun 3, 2024 - 19:48
Jun 3, 2024 - 20:03
 0  15
బుద్ధుడిని ఎందుకు చంపాలని అనుకున్నారు? ఆ కల తరువాతే బుద్ధుడు పుట్టాడా? సిద్ధార్థుడి నుంచి బుద్ధుడుగా మారటానికి గల కారణాలు ఏంటి.?

బుద్ధుడు భారతదేశానికి చెందినవారు కాదా?

గౌతమ బుద్ధుడు గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే అని చెప్పాలి.. బుద్ధుని గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువే అనీ.. ఇంకా తెలియాల్సిన విషయాలు కాల గర్భంలో కలిసిపోయాయాని అంటుంటారు చరిత్రకారులు. ప్రపంచానికి శాంతిని ప్రభోధించి.. నలుగురికి సాయ పడాలి, ఎవరినీ బాధపెట్టకూడదు అని చెప్పిన బుద్ధుడు.. భార్యను, అతడి ఏడు రోజుల కుమారుడిని ఎందుకు వదిలి వెళ్లిపోయాడు? బుద్ధుడు భారతదేశానికి చెందినవారు కాదా? సన్యాసిగా మారిన బుద్ధుడిపై హత్యాయత్నం జరిగిందా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రండి.

గౌతమ అనేది సిద్ధార్థుడి ఇంటి పేరు కాదు

బుద్ధుని జీవితంలో కేవలం కొన్ని విషయాలను మాత్రమే నిర్థారించగలమనీ, మిగతా వాటిలకి చారిత్రకత ఆధారాలు దొరకటం లేదని చరిత్రకారులు చెప్తున్నారు. బుద్ధునికి తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధార్థుడు.
సిద్ధార్థుడు కపిలవస్తు దేశానికి చెందిన లుంబినీ పట్టణంలో పుట్టాడు.. భౌగోళికంగా ఈ ప్రాంతం ప్రస్తుత నేపాల్‌ దేశంలో ఉంది. కానీ చారిత్రకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలోకి వస్తుంది. గౌతమ అనేది సిద్ధార్థుడి ఇంటి పేరు కాదు. సిద్ధార్థుడిని పెంచిన తల్లి గౌతమి.. అలా ఆమె పేరు సిద్ధార్థుడికి వచ్చింది.

సిద్ధార్థుడి తండ్రి పేరు శుద్ధోదనుడు, తల్లి మహామాయ.. ఈమెనే మాయా దేవి అని కూడా పిలుస్తారు. ఈమె కోళియన్‌ దేశపు రాకుమారి. ఓరోజు మాయా దేవికి ఏనుగు తన గర్భంలోకి ప్రవేశిస్తున్నట్లు కల వచ్చింది.. దీంతో పండితులను పిలిపించి.. వచ్చిన ఆ కలకు అర్థం ఏమిటి అని అడిగారు.. త్వరలోనే మహారాణి గర్భవతి కానుందని చెప్తారు.. దీంతో రాజ్యంలో సంబరాలు చేసుకుంటారు.. 

కల వచ్చిన కొన్ని రోజులకే మహామాయ గర్భం దాలుస్తుంది.. శాక్య వంశాచారం ప్రకారం పుట్టింట్లో పురిడుపోసుకోవాలి.. దీంతో నెలలు నిండగానే.. పుట్టింటికి బయలుదేరుతుంది మహామాయ.. అయితే తండ్రి రాజ్యానికి వెళ్లే మార్గమధ్యలోనే లుంబినీ అనే ప్రాంతంలో ఒక సాల వృక్షం కింద మగ బిడ్డకు జన్మినిస్తుంది.. మహామాయ జాతకం ప్రకారం ఆడ లేదా మగ శిశువుకి జన్మనిచ్చిన కొన్ని రోజులకే ఆమె మరణిస్తుంది.. జాతకం ప్రకారమే.. శిశువు పుట్టిన కొన్ని రోజులకే ఆమె అనారోగ్యంతో మరణించింది..

శిశువు పుట్టిన ఐదో రోజున సిద్ధార్థుడు అని నామకరణం చేసిన శుద్ధోదనుడు.. ఎనిమిది మంది జ్యోతిష్యులని ఆహ్వానిస్తాడు.. వచ్చిన వారికి సిద్ధార్థుడు పుట్టిన వార, తిథి, నక్షత్రాలు, సమయం ఇచ్చి.. జాతకం ఎలా ఉంటుందో చెప్పమని అడుగుతారు. 
వచ్చిన జ్యోతిష్యులలో కౌండిన్యుడనే పండితుడు.. సిద్ధార్థుడు భవిష్యత్తులో బుద్ధుడిగా మారుతాడని జోస్యం చెప్తాడు. 

క సిద్ధార్థుడు తల్లి మహామాయ మరణించటంతో.. సిద్ధార్థుడి పిన్ని అయిన మహా ప్రజాపతి పెంపకంలో పెరుగుతాడు. సిద్ధార్థుడు చిన్నప్పటి నుంచి రాకుమారుడిగా, విలాసవంతమైన జీవితం గడుపుతాడు. సిద్ధార్థుడి జాతకం ప్రకారం అతడు ఓ సన్యాసిగా మారుతాడని ముందే తెలియటంతో.. తన కుమారుడిని గొప్ప చక్రవర్తిని చేయాలన్న ధ్యేయంతో సిద్ధార్థుడికి ఎటువంటి తాత్విక విషయాలు గానీ, సామాన్య ప్రజల కష్ట సుఖాలు గాని తెలియకుండా పెంచుతాడు శుద్ధోధనుడు. అలా సిద్ధార్థుడి బాల్యం అంతా కోట నాలుగు గోడల మధ్యలోనే జరుగుతుంది..
సిద్ధార్థుడికి పదహారేళ్ల ప్రాయం వచ్చేసరికి.. యశోథరతో పెళ్లి చేస్తారు.. వీరికి రాహులుడు అనే కుమారుడు కూడా జన్మిస్తాడు. అలా 29 ఏళ్లు వరకు సిద్ధార్థుడు రాజ భోగాలను అనుభవిస్తాడు.. 

సిద్ధార్థుడికి ఐహిక ప్రపంచ కష్ట సుఖాలు తెలియకూడదని శుద్ధోధనుడు ఎంతో ప్రయత్నిస్తాడు.. కానీ.. ఓ రోజు సిద్ధార్థుడు కోట కిటికీ నుంచి బయటకు చూస్తాడు. అప్పుడు ఒక ముసలి వాడిని, ఒక రోగిష్టిని, శవ యాత్రని, ఒక సన్యాసిని చూస్తాడు.. 

తనతో పాటు అక్కడే ఉన్న తన రథసారథి చెన్నుడు ద్వారా.. ప్రతి మానవుడు ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలుసుకుంటాడు.. దీంతో సిద్ధార్థుడికి ఒక రకమైన వైరాగ్యం అలముకుంటుంది.. తను అనుభవించే రాచమర్యాదలు, భోగభాగ్యాలు కేవలం శరీరం ఉన్నంత వరకే అన్న నిజాన్ని తెలుసుకుంటాడు.. అలా సిద్ధార్ధుడు పుట్టిన ఏడు రోజులకి.. రాచ మర్యాదలను, కోటను వదిలి బయటకు వెళ్లిపోతాడు.. దీనినే మహా నిష్క్రమణ అని అంటారు.

కోట నుంచి బయటకు వచ్చేసిన సిద్ధార్థుడు.. తన సన్యాసి జీవితాన్ని మగధ సామ్రాజ్యంలో భిక్షాటన ద్వారా ప్రారంభిస్తాడు…. కానీ ఆ సామ్రాజ్య రాజు అయిన బింబిసారుడు.. సిద్ధార్థుడిని గుర్తించి.. తన సింహాసనాన్ని బహుమతిగా ఇస్తాడు.. కానీ సిద్ధార్థుడు సున్నితంగా తిరస్కరించి.. తన జ్ఞాన అభ్యాసన పూర్తి అయ్యాక.. మెుదటిగా మగధకే వస్తానని మాట ఇస్తాడు.. 

కోటను విడిచిన తరువాత.. మెుదటిగా ఇద్దరు సన్యాసుల వద్ద శిష్యరికం చేస్తాడు సిద్ధార్థుడు. అలరకలమ అనే సన్యాసి తన బోధనలతో సిద్ధార్థుడిని ప్రావీణ్యుడిగా చేసి.. తన వారసుడిగా ఉండమని కోరుతాడు.. అందుకు నిరాకరించిన సిద్ధార్థుడు.. తను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందనీ చెప్పి .. గురువు దగ్గర నుంచి మరో గురువుని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్తాడు.

సిద్ధార్థుడు కౌండిన్యుడనే యోగి వద్ద మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి శిష్యరికం చేస్తాడు.. వీరు జ్ఞాన అభ్యాసనంలో శరీర అవసరాలన్నింటినీ.. అంటే ఆహారంతో సహా అన్నింటినీ త్యజించి.. సాధన చేసేవారు. దీంతో సిద్ధార్థుడి శరీరం పూర్తిగా క్షీణించటంతో పాటు.. శక్తి సన్నగిల్లుతూ వచ్చింది.. చివరికి ఓ రోజు.. నదిలో స్నానం చేస్తుండగా.. సిద్ధార్థుడు కళ్లు తిరిగి పడిపోయాడు. అప్పుడు తను ఎంచుకున్న మార్గం సరియైనది కాదని తెలుసుకున్నాడు సిద్ధార్థుడు..

ఆ తరువాత ధ్యానం ద్వార ఐహిక సుఖాలు, కోరికలను త్యజించవచ్చుననే మార్గాన్ని కనిపెట్టాడు.. అలా సిద్ధార్థుడుకి బుద్ధ గయలోని ఒక బోధి వృక్షం నీడలో జ్ఞానోదయమయ్యింది.. 49 రోజుల పాటు ధ్యానం చేయగా.. జ్ఞానోదయం అయినట్లు చరిత్ర కారులు చెప్తుంటారు. ఈ 49 రోజులు సుజాత అనే పల్లెటూరి మహిళ తెచ్చే కొద్ది అన్నాన్ని, పాలను ఆహారంగా తీసుకున్నాడంట సిద్ధార్థుడు..
జ్ఞానోదయం అయిన తరువాత నుంచి గౌతమ సిద్ధార్థుడు కాస్తా.. గౌతమ బుద్ధుడిగా మారాడు..

జ్ఞానోదయం అయిన తరువాత మనిషి అజ్ఞానానికి, కష్టాలకు గల కారణాలు, వాటి నుంచి విముక్తి అయ్యే మార్గాల గురించి తెలుసుకున్నాడు బుద్ధుడు. వీటిని నాలుగు పరమ సత్యాలుగా బోధించాడు.. వీటినే బౌద్ధ మతంలో నిర్వాణ అంటారు. గౌతమ బుద్ధుని బోధనలు విన్న ఇద్దరు వ్యాపారులు.. ఆయనకు శిష్యులుగా మారారు. వారే తపుస్సా, భల్లక అనే ఇద్దరు వర్తకులు. వీరికే గౌతమ బుద్ధుడు తన తల నుంచి కొన్ని వెంట్రుకలు ఇచ్చారని.. వాటిని ఇప్పటికీ రంగూన్‌లో ఉన్న ష్యూ డాగన్‌ ఆలయంలో ఉన్నాయని నమ్ముతారు ప్రజలు. 

ఇక బుద్ధుడు తన తెలుసుకున్న పరమ సత్యాల గురించి తన మెుదటి గురువులు అయిన అలరకలమ, ఉద్దకరామపుత్తలకు చెప్పాలని అనుకుంటాడు.. కానీ.. వారు అప్పటికే మరణిస్తారు.. దీంతో ఉత్తర భారతదేశంలో ఉన్న వారణాశిలో ఒక లేళ్ల ఉద్యానవనంలో కౌండిన్యుని వద్ద తనతో పాటు శిష్యరికం చేసిన మిగిలిన ఐదుగురు సన్యాసిలకు తను తెలుసుకున్న పరమ సత్యంపై మెుదటి ఉపన్యాసం ఇచ్చాడు.. వీరంతా బుద్ధునితో కలిసి బౌద్ధ భిక్షువుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా బుద్ధం, ధర్మం, సంఘం అనే మూడు సూత్రాలతో కూడిన మెుదటి బౌద్ధ మత సంఘం ఏర్పడింది. ఆ తర్వాత యాసుడు, అతని 54 మంది మిత్రులతో కలిసి బౌద్ధ మత సంఘంలో వ్యక్తుల సంఖ్య 60ని దాటింది.. ఆ తర్వాత ముగ్గురు కశ్యప సోదరులు, వారి 200, 300, 500 మంది శిష్యులతో బౌద్ధ మత సంఘం వెయ్యి మందిని దాటింది.. వీరంతా కలిసి.. బుద్ధుని బోధనలను సామాన్య ప్రజలకు బోధించటానికి ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారు.

గౌతమ బుద్ధుడు గంగా నదీ పరీవాహక ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, దక్షిణ నేపాల్ ప్రాంతాలలో పర్యటించి విభిన్న సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు తన సిద్ధాంతాలను బోధించాడు. ఈ ప్రజలలో గొప్ప తత్వవేత్తలను మొదలుకొని వీధులను శుభ్రం చేసే అంటరానివారు, అంగుళీమాల లాంటి హంతకులు, అళవక వంటి నర మాంస భక్షకులు ఉండేవారు. బౌద్ధ మతంలో అన్ని జాతులు తెగలకు చెందిన ప్రజలు మారడానికి వీలుండడం కుల, వర్గ విభజన లేకపోవడంతో బౌద్ధ మత సంఘంలోకి వేల కొద్దీ ప్రజలు రావడం మొదలు పెట్టారు. దీని వల్ల గౌతమ బుద్ధుడు ఇతర మతస్తుల నుండి బెదిరింపులు, హత్యాయత్నాలు మెుదలయ్యాయి.

బౌద్ధ మత సంఘం భిక్షువులతో, సన్యాసులతో భారతదేశంలోని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ధర్మ ప్రచారం చేస్తూ వెళ్లేవారు. ఒక్ వర్షాకాలం తప్ప మిగితా సంవత్సరం అంతా.. వివిధ ప్రాంతాలలో తిరుగుతూనే ఉండేవారు. వర్షాకాలంలో వరదల వల్ల ఎక్కడి బౌద్ధ భిక్షువులు అక్కడే ఉండేవారు.. అయితే బౌద్ధ భిక్షువులు ఉండటం కోసం వస్సాన అనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసేవారు.. మెుదటి వస్సాన బౌద్ధ మత సంఘం ఏర్పడిన మెుదటి సంవత్సరానికి  వారణాసిలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బుద్ధుడు బింబిసారుడికి ఇచ్చిన మాట ప్రకారం మగధ రాజ్య రాజధాని అయిన రాజగృహను సందర్శిస్తాడు.

ఇదిలా ఉండగా బుద్ధునికి జ్ఞానోదయం అయ్యిందన్న విషయం తెలుసుకున్న శుద్ధోదనుడు.. బుద్ధుడిని కపిలవస్తు రమ్మని రాజ దూతలతో ఆహ్వానం పంపిస్తాడు.. కానీ వెళ్లిన తొమ్మిది మంది దూతలు రాజు ఆహ్వానం చెప్పకుండా.. బౌద్ధ సంఘంలో చేరి సన్యాసులుగా మారిపోయారు.. కానీ బుద్ధుడి బాల్య స్నేహితుడు కులుదాయి మాత్రం రాజు ఆహ్వానం చెప్పి.. అప్పుడు బౌద్ధ సంఘంలో చేరాడు.. అలా తండ్రి శుద్ధోదనుడి ఆహ్వానం అందుకున్న బుద్ధుడు కాలి నడకన కపిలవస్తుకు బయలుదేరుతాడు.. 

బుద్ధుడు కపివస్తుకు చేరగా.. అక్కడ అతని మాటలు విని రాజ పరివారంలోని చాలా మంది బౌద్ధులుగా మారుతారు.. సిద్ధార్థుడు కుమారుడైన రాహులుడు కూడా ఏడు సంవత్సరాల వయస్సులోనే బౌద్ధ మత సంఘంలో చేరిపోతాడు. 

అయితే బుద్ధుడికి సోదరుడి వరుస అయ్యే దవదత్తుడికి బౌద్ధ మతం నచ్చదు.. దీంతో బుద్ధుడిని చంపించటానికి దేవదత్తుడు మూడు సార్లు ప్రయత్నం చేస్తాడు.. మెుదటిగా విలువిద్య నిపుణులతో హత్య చేయటానికి ట్రై చేస్తే.. వారు బుద్ధునికి శిష్యులుగా మారిపోతారు.. ఆ తరువాత బండరాయిని బుద్ధుడిపై వేసి చంపేయాలని.. బండరాయిని దొర్లిస్తే.. అది వేరొక బండను ఢీకొని చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోయి.. బుద్ధుని పాదాలను తాకి ఆగిపోతుంది.. ఇక ముడో సారి ఏనుగుకు సారాయి తాగించి.. బుద్ధినిపై వదలగా.. అది కూడా విఫలం అవుతుంది..
అలా బుద్ధుడిపై సోదరుడే హత్యాయత్నం చేసినా.. వాటి నుంచి తప్పించుకుంటాడు.. బుద్ధుడి బోధనలు విని.. ఎంతో మంది జీవ హింసకు దూరంగా.. ఉంటూ సన్యాసిలుగా మారి కొందరు ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow