శివుడి మూడో కన్ను వెనుక ఇంత రహస్యం ఉందా? తనను సృష్టించిన ఆది పరాశక్తినే భస్మం చేసిన రుద్రుడు శివుడి ముడో కన్నుకి న్యాయ దేవతకు మధ్య సంబంధం ఏంటి?
శివుడి మూడో కన్ను గురించి చాలా మంది చాలా రకాలుగా చెబుతుంటారు. ఈ విషయంపై పండితులు చెప్పే మాట ఏంటంటే.. శివుడి మూడో కన్ను భక్తుల్లో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని చెబుతుంది. Sri Media News
చేతిలో శూలం.. మెడలో సర్పం.. పులిచర్మం కట్టుకుని.. ఒళ్లంతా బూడిద పూసుకుని.. ఉండే శివయ్య మహిమలు అన్నీ ఇన్నీ కాదు.. శివుని నెత్తిమీద ఉన్న గంగ నుంచి.. ముందు ఉండే నంది వరకు.. ఇలా శివయ్య దగ్గర ఉండే ప్రతీదానికీ ఒక పెద్ద కారణమే ఉంటుంది.. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా చిటుక్కుమనదు. అసురులు అయినా.. శివా అంటూ తపస్సు చేస్తే చాలు.. వరాలు ఇచ్చే భోళా శంకరుడు.. శాంతపరుడు, కరుణా హృదయుడు, ఎల్లప్పుడు ధ్యానముద్రలో ఉండే ముక్కంటి.. మూడో కన్ను తెరిస్తే ప్రళయమే. అంత శాంతపరుడైన శివుడికి శివుడికి ఆ మూడో కన్ను ఎలా వచ్చింది? ఆ వెనుక ఉన్న కథ ఏమిటి తెలుసుకుందాం రండి.
శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే అంశంపై పురాణాలలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో మెుదటిగా చెప్పుకునే కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో.. ఆ అక్కడికి ఆయన భార్య పార్వతి వస్తుంది. ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి.. భర్తను సరదాగా ఆటపట్టిద్దామని మనసులో అనుకుంటుంది. అలా శివుడి వెనక నుంచి వెళ్లి తన రెండు చేతులలో ఆయన రెండు కనులను మూస్తుంది. అయితే.. శివుడి ఎడమ కన్ను చంద్రుడిని.. కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది. అయితే.. పార్వతీదేవి ఆ రెండు కన్నులకు మూసేయటంతో.. ముల్లోకాలు మొత్తం చీకటి అలుముకుని అల్లకల్లోలంగా మారాయి. దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలోనే.. నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని పుట్టించి.. ఆ అగ్నితోనే ముల్లోకాలకు వెలుగును ప్రసరించేలా చేశాడట.. ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ. అయితే.. ఈ అగ్ని వేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా.. ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే.. మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఆదిపరాశక్తి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్టు, శంకరుడిని సృష్టిస్తుంది. అయితే.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది. మొదట ముగ్గురు కూడా.. అందుకు నిరాకరిస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి.. తన మూడో కన్ను తెరిచి ముగ్గురుని భస్మం చేస్తానంటూ శపించగా.. పరమేశ్వరుడు తనకు ఆ మూడో కన్ను ఇస్తే.. తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు. అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాధిస్తుంది. అలా మూడో కన్ను పొందిన శివుడు.. వెంటనే దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు. అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా, మరో భాగాన్ని లక్ష్మిగా, ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి.
మూడో కన్ను విధ్వంసానికే కాదు.. ఆధ్యాత్మిక జ్ఞానానికి, వివేకానికి కూడా చిహ్నమే. రెండు కళ్ల ద్వారా చూడలేని దాన్ని మూడో కన్ను ద్వారా పరమ శివుడు చూస్తాడని భావిస్తారు. మూడో కన్ను తెరిస్తే దుష్ట శక్తులు, అజ్ఞానం నాశనం అవుతాయని నమ్ముతారు.
మూడో కన్ను చైతన్యానికి ప్రతీక అని బౌద్ధం చెబుతోంది. మూడో కన్ను ద్వారా ఏకాగ్రత పెంపొందించుకోవాలని, అంతర్గతంగా మనల్ని మనం ఆవిష్కరించుకోవాలని బౌద్ధ గురువులు చెబుతారు. జ్ఞానోదయం పొందడానికి ఇది ఉపకరిస్తుందని బౌద్ధం తెలియజేస్తోంది.
శివుడి మూడో కన్ను గురించి చాలా మంది చాలా రకాలుగా చెబుతుంటారు. ఈ విషయంపై పండితులు చెప్పే మాట ఏంటంటే.. శివుడి మూడో కన్ను భక్తుల్లో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని చెబుతుంది. ప్రతి మనిషిలోనూ అంతర్ నేత్రం ఉంటుంది. అదే జ్ఞాన జ్యోతిని ప్రసాదిస్తుందని పండితులు చెబుతుంటారు. దీనినే మనోనేత్రమని కూడా చెబుతుంటారు. ప్రతి మనిషిలోనూ జ్ఞాన జ్యోతి అనేది వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలుగుని దర్శంచుకున్న వాడే మహాజ్ఞాని అవుతాడని పండితులు తెలిపారు. అయితే రెండు కళ్లుతో ఒక్కోసారి న్యాయమేదో.. అన్యాయమేదో చూడలేమని, అందుకే న్యాయస్థానంలో న్యాయదేవతకు కళ్లకు గంతలు కట్టి ఉంటాయి. న్యాయమూర్తులు కూడా తమ రెండు కళ్లతో చూడకుండా మనోనేత్రంతో వాస్తవాన్ని తెలుసుకోవాలని దాని అర్థం.
సాక్షాత్తు మన్మథుడు వచ్చి శివుడిని ప్రేరేపించటానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఆ కాముడిని తన మూడోకంటితో భస్మం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే మనోనేత్రంతో కోరికలను కూడా జయించవచ్చని పండితులు తెలిపారు. సామాన్య మానవుడిలో సాధుత్వం, సమతుల్యత, దూరదృష్టి ఉండాలి. పర స్త్రీని తల్లిగా భావించాలి. ఇతరుల ధనం కోసం ఆశపడకూడదు. సన్మార్గంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడానికి మనోనేత్రంతో పని చేయాలని పండితులు చెబుతున్నారు. మనిషిలో మూడో నేత్రం తెరుచుకున్నప్పుడు పెను చీకటికి దూరంగా ఉన్న పరమాత్మను జయిస్తాడని పండితులు చెబుతుంటారు. ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి.
What's Your Reaction?