ఛార్టెర్డ్ అకౌంటెంట్ ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి!
సోషల్ మీడియాలో గుర్తింపుని.. లక్షల్లో ఫాలోవర్స్‌ని తీసుకువచ్చిన రీల్సే ఆమె ప్రాణాలు తీశాయి. ఆ అమ్మాయి ఏ రోజు అనుకోని ఉండదు.. ఈ రీల్స్ కారణంగా చనిపోతాను అని.. మృత్యువు రీల్స్ రూపంలో వచ్చి తన ప్రాణాలను తీస్తుందని ఉహించి ఉండదు.. మంచి ఉద్యోగం.. సోషల్ మీడియాలో మంచి పేరు.. హీరోయిన్ రేంజ్‌లో అందం ఆమె సొంతం.. కానీ రీల్స్ పిచ్చితో లైక్స్, వ్యూస్ కోసం సాహసాలు చేసింది. కానీ చివరకు ఆ రీల్స్ వల్లే ఆమె చనిపోయింది.Sri Media News

మహరాష్ట్రకు చెందిన అన్వీ కామ్దార్.. ముంబైలో చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తుంది. తక్కువ టైంలోనే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అన్వీ కామ్దార్. టూర్లు తిరుగుతూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి ట్రావెలింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు తెచ్చుకుంది. వర్షకాలం రావడంతో... మాన్ సూన్ టూరిజంపై రీల్స్ చేద్దాం అని నిర్ణయించుకోని దేశ విదేశాల్లో అనేక ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడి విశేషాలను పంచుకుంటూ తన ఫాలోవర్లకు అవగాహన కల్పిస్తుంది. సో జులై 16న ఆన్వీ తన స్నేహితులతో కలిసి కుంభే వాటర్ ఫాల్స్‌కి వెళ్లింది.
సంతోషంగా ఫ్రెండ్స్‌తో గడుపుతూ... జలపాతం దగ్గర రీల్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అన్వీ కామ్దార్ కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయింది. అక్కడే ఉన్న స్నేహితులు అమెను కాపాడెందుక ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేదు.. పోలీసులు, కోస్ట్ గార్డ్, కోలాడ్ రెస్క్యూ టీమ్ ఆరు గంటల పాటు అన్వీ కామ్దార్ కోసం రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటకు తీసి... ఆస్పత్రికి తరలించే లోపు కన్నుమూసింది అన్వీ కామ్దార్. ఇదిలా ఉంటే.. అన్వీ కామ్దార్ వృత్తిరీత్యా ఛార్టెర్డ్ అకౌంటెంట్. డెలాయిట్‌లో పనిచేశారు. ఇన్‌స్టా బయోలో ఆమె తనని తాను ట్రావెల్ డిటెక్టివ్‌గా రాసుకున్నారు. ఇన్స్ స్టాలో 2.56 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
గతంలో మహారాష్ట్ర పుణెలోని స్వామి నారాయణ్ టెంపుల్
నిన్న మెున్నటి వరకు సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు తీసుకుంటే... అది పోయి ఇప్పుడు రీల్స్ ట్రెండ్ వచ్చింది.. ఈ రీల్స్ పిచ్చితో అందరి కంటే. భిన్నంగా ఏదోఒక రీల్ చేసి ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు... వయసుతో తేడా లేకుండా అందరు ఇప్పుడు రీల్స్ పిచ్చిలో తమ ప్రాణాలను లేక్క చేయకుండా రీల్స్ చేస్తూ ప్రాణాలు కొల్పోతున్నారు. ఈ రీల్స్ ద్వార ఫేమస్ అయ్యి... ఓవర్ నైట్‌లోనే స్టార్ డమ్ తెచ్చుకోవాలి అని సోషల్ మీడియాలో ఎవరి టాలెంట్ వారు చూపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం రీల్స్ పిచ్చితో ప్రమాదకరమైన ప్రాంతాల్లో కూడా రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. రీల్స్ వీడియోలు తీయడం కోసం డేంజరస్ స్టంట్‌లు చేసి ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు.
What's Your Reaction?






