గర్భాలయాల్లోకి ఆడవారిని ఎందుకు రానివ్వరు....!మహిళలు అర్చకత్వం చేయకూడదా?

గర్భాలయాల్లోకి ఆడవారిని ఎందుకు రానివ్వరు మహిళలు అర్చకత్వం చేయకూడదా? ఆ విషయంలో సన్షేషనల్‌ స్టెప్‌ తీసుకున్న తమిళనాడు ఆ గుడిలో పూజారిగా బ్రాహ్మనేతర మహిళ.Sri Media News

Jun 3, 2024 - 19:24
 0  13
గర్భాలయాల్లోకి ఆడవారిని ఎందుకు రానివ్వరు....!మహిళలు అర్చకత్వం చేయకూడదా?

మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.. హిందువులంతా నిత్యం దేవాలయాలకు వెళ్లి.. పూజలు చేసి వస్తూ ఉంటారు.. అయితే ఆలయానికి వెళ్లేటప్పుడు ఎన్నో నియమ నిబంధనలు, ఎంతో నిష్టగా ఉంటూ పూజలు చేస్తుంటారు.. వందల సంఖ్యలలో ఉన్న ఆలయాలలో మహిళా పూజారులను ఎప్పుడూ చూసి ఉండరు కదా? మరి ఆలయాలలో మగవారినే పూజారులుగా ఎందుకు నియమిస్తారు? ఆడవారిని ఎందుకు పూజారులుగా తీసుకోరు? గర్భాలయాలలోకి ఎందుకు ఆడవారిని అనుమతించరు అని విషయాలు తెలుసుకుందాం రండి.
సృష్టికి మూలం ఆడవారే.. వారు లేకుండా.. జీవి పుట్టుక ఉండదు.. అందుకోసం.. ఆడవారిలో ప్రత్యేక వ్యవస్థే ఉంటుంది.. అందువల్లే వారు రజస్వల అయినప్పటి నుంచి.. గర్భాశయం నుంచి ఒక్కో అండం విడుదల అవ్వటం మెుదలవుతుంది.. ఇది ప్రతి నెలా జరిగే సహజ ప్రక్రియ.. దీన్ని కొన్ని ప్రదేశాలలో ముట్టు అని, మరి కొన్ని ప్రదేశాలలో బహిష్టు అని ఇక మనకి అర్థం అయ్యే భాషలో చెప్పాలంటే పీరియడ్స్‌ అని అంటారు.. పీరియడ్స్‌ అయిన వారు మైలపడతారని హిందూ సాంప్రదాయం ప్రకారం చెప్తుంటారు. అందుకే ఆ మూడు రోజులు వారిని వేరుగా పెడతారు.. ఇది అనాచారం అయిప్పటికీ ఇప్పటికీ అదే సాంప్రదాయాన్ని పాటిస్తుంటారు.

అయితే పీరియడ్స్‌ ఎప్పుడు వస్తాయి అనేది ఖచ్చితంగా చెప్పలేము. దీని కారణంగా స్త్రీలని ఆలయంలో పూజారులుగా నియమించరు. ఆరోజుల్లో కనుక స్త్రీలు  పూజలు చేస్తే దైవ దోషం అవుతుంది. పైగా ఆ తర్వాత మళ్లీ ఎన్నో శుద్ధ ప్రక్రియలు చేయాల్సి ఉంటుంది. నిత్యం దేవాలయంలో పూజలు చేసే పూజారులు దీప, ధూప, నైవేద్యాలను తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఆడవారిని గాని పూజారులుగా చేస్తే.. వారి ప్రత్యేక రోజులలో ధూప, దీప, నైవేద్యాలకు ఆటంకం ఏర్పడుతుంది.
అందుకే ఆలయాలలో పూజారులుగా మగవారు మాత్రమే ఉంటారు. దేవాలయాన్ని శుభ్రపరచడం కోసం కూడా పురుషుల్ని మాత్రమే నియమిస్తారు. అయితే ఆలయ ఈవోలుగా మాత్రం ఆడవారిని నియమిస్తూ ఉంటారు.

ఆడవారికి ఉండే నెలసరి సమస్యలు ఇతర కారణాలతో అర్చకత్వం వైపు వారిని సమాజం అడుగు వేయనివ్వలేదు. భగవంతుడికి సేవ చేయాలని ఉన్నా మగవారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో మహిళలు సైతం వెనకడుగేసారు. ఇదిలా ఉంటే.. ఆనాటి నుండి వస్తున్న సంప్రదాయాన్ని ఈ విషయంలో బ్రేక్‌ చేసింది తమిళనాడు గవర్నమెంట్‌. ఈ రంగంలో ఆడవారికి కూడా అవకాశం కల్పిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది తమిళనాడు స్టేట్‌ గవర్నమెంట్‌. దీనికి నాంది పలికింది డీఎంకే ప్రభుత్వమే. 2007లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిథి తొలిసారిగా ఓ మహిళను అర్చకురాలిగా నియమించగా.. ఇప్పటి ముఖ్యమంత్రి స్టాలిన్ మరో మహిళకు అవకాశం కల్పించారు. తాజాగా మరో ముగ్గురు మహిళలు అర్చకత్వాన్ని చేస్తున్నారు. మహిళలు అర్చకత్వంలోకి అడుగుపెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకమైన శిక్షణనిస్తోండటం విశేషం. తాజాగా అర్చకత్వం శిక్షణ పూర్తి చేసిన మహిళలు గుడిలోకి అర్చకులుగా అడుగుపెడుతున్నారు.  ‘మహిళలు విమానం నడిపినా, అంతరిక్షానికి వెళ్లొచ్చినా వారు ప్రవేశించలేని ప్రదేశంగా ఆలయ గుర్భగుడి ఉంది. ఇకపై ఆ పరిస్థితి మారనుంది’ అని తమిళనాడు సీఎం స్టాలిన్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా కూడా మారింది.

ఇదిలా ఉండగా తమిళనాడు తీసుకున్న నిర్ణయంపై సనాతన వాదులు ఫైర్‌ అవుతున్నారు.. హిందుత్వానికి వ్యతిరేకులు అయిన డీఎంకే ప్రభుత్వం.. హిందూ మతాన్ని కించపరచటానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ చాలా మంది నిరసనలకు కూడా దిగారు. అయితే.. ఈ నిరసనలకు, ఆందోళనకు వెనక్కి తగ్గకుండా.. తన పని తాను చేసుకొని వెళ్లిపోతున్నారు నేతలు.. 
అయితే ఈ మార్పు కేవలం మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా వస్తోంది..
మాస్కోలోని ఓ దేవాలయంలో హిందూ మతానికి చెందిన ఓ వ్యక్తిని..పాశ్చాత్య బ్రాహ్మణేతర మహిళా పూజారీ ఆశీర్వదిస్తున్నారు. ఈ ఫోటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. వైరల్‌గా మారింది. సనాతన ధర్మం అభివృద్ధి చెందుతోందని, పూజారీగా ఉండటానికి మగవారు లేదా..హిందూ కుటుంబంలో జన్మించాలా ? పూజారీగా ఉండటానికి బ్రాహ్మణుడు కావాల్సిన అవసరం లేదని ఎంతో మంది కామెంట్స్‌ చేశారు.

కాలానికి అనుగుణంగా.. సంప్రదాయాలను మార్చుకొంటేనే… సమాజం ముందుకు పోగలదని అంటుంటారు. గతంలో ఇలా చాలా సంప్రదాయాలను మార్చుకున్నారు. ప్రధానంగా.. మహిళలు, అంటరానివారు, శూద్రులు, విద్యకు అర్హులు కారని అన్నారు. కానీ పరిస్థితిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆధునిక యుగంలో ఏ రంగంలోనైనా.. మహిళలు రాణిస్తున్నారు. అయితే కుల సమాజం, మహిళల పట్ల ఇంకా వివక్ష ఇంకా ఉంది.. ఇక ఆలయాల్లోకి మహిళ ప్రవేశం, పూజారులుగా ఆడవారిని చూసే అవకాశం.. చూస్తుంటే క్రమంగా ఈ అసమానతలు పోతాయనే అనిపిస్తోంది.. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow