ఆమె వయస్సు 16 అతను 35+..17 ఏళ్లకే పలకరించిన చావు!!
నటన అంటే ఏంటో తెలియని వయస్సులోనే కెమెరా ముందుకు వచ్చింది. టీనేజ్‌కే హీరోయిన్‌గా కుర్రోళ్ల మనస్సు దోచేసింది.. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి.. ఆమె తప్ప ఇంకెవరూ నటించలేరు అన్నట్లు జీవించేసింది.. అందుకేనేమో 17 ఏళ్ల వయస్సుకే నేషనల్ ఫిలిం అవార్డు వచ్చింది.. అభిమానులు, కుటుంబ సభ్యులు పండుగ చేసుకున్నారు అవార్డు వచ్చినందకు.. కానీ ఏం లాభం.. అవార్డు వచ్చి వారం కూడా గడవకముందే.. గదిలో ఉరికి వేలాడింది.Sri Media News
తండ్రి వయస్సు వ్యక్తితో ప్రేమ.. ఆ ఊబి నుంచి బయటకు రాలేకే ఇలా చేసిందా? అసలు అంత పెద్ద వయస్సులో ఉన్న వ్యక్తితో ప్రేమలో ఎందుకు పడింది? ఇంతకీ ఎవరీ అందాల తార? చనిపోయిందా.. ఎవరైనా చంపేశారా? తెలుసుకుందాం రండి.
మనవూరి పాండవులు సినిమా చూసిన వారిని ఆ మూవీ గురించి అడిగితే.. ఎవరి నోటి నుంచైనా..అందులో పిచ్చి పిల్ల క్యారెక్టర్ గురించే చెప్తారు.. అంత అద్భుతంగా ఆమె నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇప్పటికీ ఆ పాత్రలో యాక్ట్ చేసిన అమ్మాయిలా యాక్ట్ చేయటం కష్టం అంటారు యాక్టర్స్.. నటులకే నటనలో సవాల్ విసిరిన ఆమె ఎవరో కాదు.. శోభా.. ఆమె అసలు పేరు మహాలక్ష్మి మీనన్.
మూడేళ్ల వయస్సు నుంచే బేబీ మహాలక్ష్మిగా సినిమాల్లో యాక్ట్ చేయటం మెుదలు పెట్టిన ఈమె 1962 సెప్టెంబర్ 23న కేపీ మీనన్, ప్రేమ మీనన్ అనే మలయాళీ దంపతులకు చెన్నైలో జన్మించారు. శోభా తల్లి ప్రేమా మీనన్.. 1954 నుంచి 1981 వరకు మలయాళీ చిత్ర పరిశ్రమలో ప్రేమ అనే పేరుతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఈమె సుమారు 50 సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సపోర్టింగ్ రోల్స్‌లో యాక్ట్ చేసి.. మెప్పించింది..
తల్లి ప్రోత్సాహంతో.. బేబీ మహాలక్ష్మిగా మూడేళ్లకే యాక్టింగ్ మెుదలు పెట్టింది.. 1966లో మళయాళం సినిమాలలో యాక్ట్ చేయటం మెుదలు పెట్టింది.. వయస్సు చిన్నదైనప్పటికీ.. ఇచ్చిన పాత్రలో ఒదిగిపోయి.. పాత్రకు తగ్గ ఎక్స్‌ప్రెషన్స్ పెడుతూ.. ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసేసింది తన నటనతో బేబీ మహాలక్ష్మి.. 1971లో ఉత్తమ బాల నటిగా కేరళ స్టేట్ ఫిలిం అవార్డుని అందుకుంది మహాలక్ష్మి అలియాస్ శోభ.
1978లో ఉత్తరధాత్రి అనే మళయాళ సినిమాతో హీరోయిన్‌గా యాక్ట్ చేయటం మెుదలు పెట్టింది.. హీరోయిన్‌గా శోభ యాక్ట్ చేసే టైమ్‌కి ఆమె వయస్సు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే.. అంత చిన్న వయస్సులోనే.. హీరోయిన్‌గా అలరిస్తూ.. మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపుని తెచ్చుకుంది.. శోభ యాక్ట్ చేస్తే.. సినిమాకు అవార్డు పక్కా అన్నట్లు.. శోభా నటనకు అవార్డుల పంట పండేది.. అదీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పురస్కారాలను అందుకునేది శోభ.
1977లో సెకండ్ బెస్ట్ యాక్టరస్‌గా, 1978లో బెస్ట్ యాక్టరస్‌గా కేరళ స్టేట్ ఫిలిం అవార్డుని అందుకుంది.. ఆ తరువాత కన్నడలో శోభ నటించిన అపరిచిత అనే సినిమాకు గాను.. బెస్ట్ కన్నడ యాక్టరస్‌గా అవార్డు వచ్చింది.. ఆ తరువాత 1979లో వచ్చిన పసి అనే సినిమాలో బెస్ట్ తమిళ్ యాక్టరస్‌గా, ఫిలింఫేర్ అవార్డు, ఉత్తమ జాతీయ నటిగానూ అవార్డుని అందుకున్నారు..
తరం మారింది, మనవూరి పాండవులు అనే తెలుగు సినిమాల్లో పిచ్చి పిల్లలా నటించి.. ప్రేక్షకులను తన నటనతో కన్నీళ్లు పెట్టించింది.. తెలుగులో తప్ప మిగిలిన అన్ని సౌత్ ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టరస్‌గా అవార్డులు పొందింది.. అంతేగాకుండా.. నేషనల్ అవార్డు సైతం రావటంతో.. ఇండియా మెుత్తం.. శోభా పేరు.. మారుమోగింది.. ఇదంతా కేవలం 17 ఏళ్ల వయస్సులో సంపాదించింది శోభా.
అయితే శోభా తన తండ్రి వయస్సు ఉన్న బాలు మహేంద్ర ప్రేమలో పడింది.. అందరూ శోభా గురించి పరితపిస్తుంటే.. శోభా మాత్రం.. బాలు గురించి పరితపించి పోయేది.. బాలు మహేంద్ర సౌత్‌లో సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, స్ర్కీన్ రైటర్, ఎడిటర్‌గా మంచి పేరు సంపాదించారు..
తను పని చేసిన వివిధ రంగాలలో ఐదు జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. నిరీక్షణ, వసంత కోకిల సినిమాలకు డైరెక్టర్ బాలు మహేంద్రనే.. ఈ సినిమాలు అప్పటికీ.. ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ సినిమాలుగా నిలిచిపోయాయి. మనవూరి పాండవులు, శంకరాభరణం వంటి సినిమాలకు సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు.. అయితే చెన్నైలో.. బాలు మహేంద్ర ఇంటి పక్కనే శోభా వాళ్ల ఇళ్లు కూడా ఉండేది.. అప్పటికే పెళ్లి అయిన బాలు మహేంద్ర.. తన భార్యతో కలిసి.. అప్పుడప్పుడు శోభా ఇంటికి వెళ్లి వచ్చేవాడు కూడా.. తన తండ్రి వయస్సు ఉన్న బాలు మహేంద్రని.. శోభా అంకుల్ అని పిలిచేది.. ఈయన రికమెండేషన్‌తోనే.. తెలుగులో నటించింది శోభా.. ఆ తరువాత డైరెక్టర్‌గా కోకిల అనే కన్నడ సినిమా తీశాడు బాలు.. అందులో హీరోయిన్‌గా శోభా నటించారు.. ఈ సినిమా టైమ్‌లోనే శోభా.. బాలుకి దగ్గరయ్యింది.. అలా అతని ప్రేమలో పడిపోయింది..
శోభా తీరులో మార్పుని గమనించిన ఆమె తల్లి మందలించినా.. శోభాలో ఎటువంటి మార్పు రాలేదు.. బాలు గారి నామ స్మరణలోనే రోజులు గడిపేది.. అసలు అతడిని విడిచి ఉండలేని స్థితికి వచ్చేసింది శోభా.. దీంతో పదహారు ఏళ్లకే 1978లో అప్పటికే పెళ్లి అయ్యి.. పిల్లలున్న తన తండ్రి వయస్సు ఉన్న బాలు గారిని రెండో పెళ్లి చేసేసుకుంది.. అతడిని పెళ్లి చేసుకున్న ఒక సంవత్సరంలోనే ఆమెకు నేషనల్ అవార్డు లభించింది.
దానిని అందుకునేందుకు ఢిల్లీ వెళ్ళగా నేషనల్ అవార్డు టీమ్ ఎంతో ఘనంగా స్వాగతించి సత్కరించి పంపించింది.చెన్నై చేరుకున్నాక అభిమానులు ఆమెను కంగ్రాట్యులేట్ చేసేందుకు బారులు తీరారు. పూల వర్షం కురిపించారు. వారందరికీ శోభ అంటే ఒక ఎమోషన్. ఆమెకు వారందరూ వీరాభిమానులు అయిపోయారు.దర్శకుల నుంచి నిర్మాతల వరకు ప్రతి ఒక్కరు ఆమె తమ సినిమాలో నటిస్తే బాగుండు అని కోరుకునేవారు. అందరూ ఈమె గురించే ఆలోచిస్తుంటే ఆమె మాత్రం ఒక్క బాలు మహేంద్ర గురించే ఆలోచించేది.. ఆమె అతడు లేకుండా అస్సలు ఉండలేకపోయేది. 17 ఏళ్ల వయసులో ఆమెకు తండ్రి, భర్తగా, గురువు అన్నీ తానే అయ్యేవాడు. అతను లేకుంటే చాలా తల్లడిల్లిపోయేది శోభ.
1980 ఏప్రిల్ 30వ తేదీ శోభ ఫోన్ బాలు మహేంద్రకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేయమని అడిగింది.కాస్త లేట్ అయిందని అతను చెప్పాడు. కొద్దిసేపు ఆగి మళ్ళీ ఫోన్ చేసింది. ఎత్తకపోవడంతో అసహనంతో ఇంట్లో ఒంటరిగా దిక్కుతోచని అమ్మాయిల తిరుగుతూ ఉండిపోయింది. మళ్లీ ఫోన్ చేసి త్వరగా వచ్చేయండని రిక్వెస్ట్ చేసింది. అప్పుడు బాలు మాట్లాడుతూ “నాకు తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు, వాడిని కూడా చూసుకోవాలి కదా” అన్నాడు.బాలు మహేంద్ర శోభ కంటే ముందే అహిళేశ్వరి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అది తెలిసి కూడా శోభ అతనిని ప్రేమించింది.ఆరోజు రాత్రి అతడి కోసం వేయికళ్లతో వేచి చూసింది.వస్తాడేమో అనే ఆశలన్నీ నిరాశగా మారడంతో ఆమె బాగా దిగులు చెందింది.రాత్రి గడిచిపోయినా అతడు రాలేదు.అతని జాడ కనిపించనేలేదు. దాంతో 18 ఏళ్లు కూడా నిండని శోభా విలవిల్లాడిపోయింది. ఆ బాధను తట్టుకోలేక మద్రాసులోని ఆర్కేనగర్ లోని తన ఇంట్లో బాగా ఏడ్చేసింది.తీవ్రమైన బాధ ఆమెను మరింత డిస్టర్బ్ చేసింది. ఆ సమయంలో చేతికందిన జార్జెట్ చీరని తీసుకొని ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయింది.
మే 1వ తేదీన శోభ చనిపోయి ఇంట్లో విగత జీవిగా పడి ఉందని తెలిసి తమిళనాడు ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.ఎంతో ప్రతిభ ఉన్నా సరే దక్కాల్సిన ప్రేమ దొరకక చివరికి ఆమె మరణించిందని తెలిసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. అయితే శోభాది ఆత్మహత్య కాదనీ.. హత్య అనీ.. ఆమె భర్త బాలు మహేంద్రనే ఆమెను చంపేశాడని ఆరోపణలు వచ్చాయి.. దీంతో బాలుని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.. ఆ రోజంతా.. అతను తన మెుదటి భార్యతో ఇంట్లోనే ఉన్నాడని తేలటంతో.. ఆయన నిర్దోషి అని వదిలేశారు.. పోస్టుమార్టం కూడా శోభాది ఆత్మహత్యే అని తేల్చింది.. దీంతో పోలీసులు సైతం శోభాది ఆత్మహత్య అని నిర్ధారించారు. మొత్తం మీద శోభ 17 ఏళ్ల వయసులోనే మరణించింది కానీ ఆమె ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
శోభాని పెళ్లి చేసుకోవటం కోసం, ఆమె ప్రేమ కోసం అప్పటి స్టార్ హీరోలు చాలా ట్రై చేశారు.. కానీ శోభాకి వారెవరూ నచ్చలేదు.. అంకుల్ అంకుల్ అంటూ పిలిచిన బాలు ప్రేమలో పడిపోయింది..
ఆయన చూపించే కేరింగ్.. నిజమైన ప్రేమ అనుకుంది.. అందుకే.. తండ్రి వయస్సు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది.. కానీ చివరికి సరి అయిన ప్రేమ దొరకటం లేదంటూ అర్థంతరంగా ప్రాణాలు తీసుకుంది. అయితే ఇప్పటికీ ఓ రూమర్ శోభ గురించి వినిపిస్తూనే ఉంటుంది.. అప్పటి స్టార్ హీరోయిన్లే కావాలని.. శోభను మానసిక క్షోభకు గురిచేసి.. ఆత్మహత్య చేసుకునేలా చేశారని గుసగుసలు వినిపిస్తాయి. ఎందుకంటే.. ప్రతి డైరెక్టర్, ప్రొడ్యూసర్.. శోభానే తమ సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేయాలని కోరుకునేవారు.. ఆమె ఉంటే చాలు.. ఆమె తెరపై కనిపిస్తే చాలు.. ప్రేక్షకులు పరిగెత్తుకొని వస్తారు అనే అపోహలో ఉండేవారు వారు. కానీ ఆమె కాల్షీట్లు దొరకక వేరే హీరోయిన్ల దగ్గరికి వెళ్లినప్పుడు.. శోభా నో చెప్పింది.. అందుకే ఇక్కడికి వచ్చాం అని చెప్పేవారంట.. దీంతో ఆ సీనియర్ హీరోయిన్స్‌కి ఆ మాటలు నచ్చక.. ఇలా చేయించారన్న టాక్ వినిపించింది. కానీ ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే చనిపోయిన శోభా చెప్పలేదు.. శోభా చనిపోయే నాటి కొన్ని సంవత్సరాల నుంచి అటు పేరెంట్స్‌కి, బంధువులకు దూరంగానే ఉంది.. ఆ ఒంటరితనమే ఆమెను మరింత కుంగదీసి ఉండొచ్చు.
What's Your Reaction?