తమిళనాడు వెళ్ళిన రోజా !తన్ని తరిమేసిన ప్రజలు.. భయంతో పరుగో పరుగు!!
నగరిలో ఎలాగైనా ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూసిన రోజాకు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైంది. ఓటమి తరువాత రోజా ఎక్కడ పెద్దగా ఎక్కడ కనిపించలేదు... సడన్‌గా వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో కనిపించారు.Sri Media News
రోజా మంత్రిగా ఉన్న సమయంలో వారానికి ఓ సారి తిరుమల వెళ్లేవారు.ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అటు వైపు కూడా చూడటం లేదు.. కొత్తగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను భర్త సెల్వమణితో కలిసి దర్శించుకుంటున్నారు. ఇలా ఓ ఆలయానికి వెళ్లిన రోజా అక్కడ ప్రవర్తించిన తీరు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అనేక విమర్శలు వస్తున్నాయి..
అసలు రోజా చేసిన తప్పు ఏంటి? ఎందుకు రోజా ఇలా ట్రోల్ అవుతున్నారు? అంటే.. మాజీ మంత్రి రోజా సోమవారం తమిళనాడులోని తిరెచ్చెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భర్త సెల్వమణితో కలిసి రోజా వరుణాభిషేకంలో పాల్గొన్నారు. అభిషేకం తర్వాత రోజా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ రోజాను చూసి కొందరు గుర్తు పట్టారు.. హీరోయిన్ రోజా ఆలయానికి వచ్చారని తెలిసి కొందరు భక్తులు ఫోటోలు, సెల్ఫీల కోసం రోజా దగ్గరకు వెళ్లారు... అందరిని రోజా నవ్వుతూ పలకరించి.. సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగుంది.. కానీ.. తనతో ఫోటోలు తీసుకునేందుకు పారిశుద్ధ్య మహిళా కార్మికులు వచ్చారు. వారిని చూసిన రోజా వారిని దగ్గరికి రానివ్వలేదు... దూరంగా నిల్చోవాలంటూ సైగలు చేశారు. ఆ మహిళా పారిశుద్ధ్య కార్మికులు కాస్త దూరంగా నిలబడి ఆమెతో ఫోటోలు తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో రోజా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. కొంతమంది నెటిజన్లు రోజా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'పారిశుద్ధ్య కార్మికులంటే అంత చిన్నచూపా' అని రోజా తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోజా వీడియోను టీడీపీ కూడా తన అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసి ట్వీట్ చేసింది. 'పారిశుధ్య కార్మికులపై వివక్ష చూపిస్తూ, అసహ్యంగా హావభావాలు పెట్టి వారిని అవమానించిన వైసీపీ నేత రోజా రెడ్డి. దుమ్మెత్తి పోస్తున్న తమిళ మీడియా' అంటూ ట్వీట్‌లో పేర్కొంది. అయితే ఈ వివాదంపై మాజీ మంత్రి రోజా ఇంకా స్పందించలేదు.
ఇదిలా ఉంటే గతంలో రోజా మంత్రిగా ఉన్న సమయంలో ఓ ఉద్యోగి చేత తన చెప్పులు మోయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రోజా మంత్రిగా ఉన్నప్పుడు బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో సందర్శించారు. ఆ సమయంలో తన చెప్పుల్ని బయటవిడిచి, వాటిని జాగ్రత్తగా చూడాలని వ్యక్తిగత సిబ్బందికి సైగ చేశారు. దీంతో రిసార్ట్స్ ఉద్యోగి మంత్రి చెప్పులను తడిసిపోకుండా చేతితో పట్టుకుని మంత్రిని ఫాలో అయ్యారు. కొద్దిసేపు చేత్తో మోసిన అనంతరం పక్కన పెట్టారు. మంత్రి రోజా నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె కాళ్ల దగ్గర పెట్టారు. ఇలా ఉద్యోగి చెప్పులు మోయటం వివాదాస్పదం అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతిపక్షపార్టీలు అప్పట్లో రోజా తీరుపై విమర్శలు గుప్పించారు.
అంతేకాదు రోజా మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో కలిసి తిరుమల దర్శన టికెట్లు అమ్ముకుంటున్నారన్నారని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. టీడీపీ నేత ఆనం వెంకటరమణ రెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి.. ‘‘ఈ మధ్య మంత్రి రోజా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి పదే పదే వెళ్తున్నారు. ఎందుకా అని ఆరా తీస్తే ప్రొటోకాల్ దర్శనం కూడా డబ్బులు సంపాదిస్తున్నారని తెలిసింది.’’అని తీవ్ర విమర్శలు చేశారు.
రోజా మంత్రిగా ఉన్నప్పుడు... మంత్రి అయిన మూడు నెలలకే కొత్త బెంజ్ కారును తన కొడుకుకి కోటిన్నర రూపాయలు పెట్టి కొనడం కూడా ఎన్నో విమర్శలకు దారి తీసింది. తన కొడుకు కౌశిక్ కు గిఫ్ట్ గా ఇచ్చేందుకే దాన్ని కొన్నట్లు స్వయంగా రోజా చెప్పడంతో మంత్రి అయ్యాక జీతం, ఇతర అలవెన్సులు కలిపి భారీగానే రోజాకు వస్తున్నాయని.. దాంతో పాటు ఎవరికైనా అపాయింట్ ఇవ్వాలంటే వారి నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు లాగేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలా అందరి దగ్గర దండుకున్న డబ్బుతో తన కొడుక్కి బెంజ్ కారు కొని గిఫ్ట్‌గా ఇచ్చింది అనే విమర్శలను కూడా ఎదుర్కొన్నారు రోజా. దీనిపై అప్పట్లో రోజాపై టీడీపీ సోషల్ మీడియా ఓ ఆటాడుకుంటోంది. ‘ఇదిగో.. ఇది వింటున్నారా?.. మంత్రి రోజా కొత్త వ్యాపారం మొదలెట్టారు’. ‘మంత్రి గారికి అపాయింట్ మెంట్‌కు డబ్బులు బాగానే వస్తున్నట్లున్నాయి. బాగానే వెనకేశారు’ అంటూ రోజా వీడియోపై సోషల్ మీడియా వేదికగా నెటిజనులు అప్పట్లో ట్రోల్ చేశారు. అంతేకాదు.. జగన్ కేబినెట్లో ‘కరప్షన్ క్వీన్ రోజా, అన్న ఆరోపణలు కూడా ఈమె పై ఉన్నాయి.
What's Your Reaction?