తల కిందులుగా ఆలయం నీడ...ఏ శివాలయంలో కనిపించని ప్రత్యేకత ఇదే!

భారతదేశం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది అంటే.. మన పూర్వీకులు పెట్టిన కట్టుబాట్లు మరియు.. తరతరాలకు మన సంస్కృతి తెలిసేలా ఆలయాలపై అప్పుడే చెక్కించారు.. మన దేశంలో ఎన్నో అద్భుత ఆలయాలు ఉండగా కొన్ని ఆలయాలలో రహస్యాలు ఇప్పటికి అంతు చిక్కకుండా ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి.

Jul 11, 2024 - 13:37
 0  8
తల కిందులుగా ఆలయం నీడ...ఏ శివాలయంలో కనిపించని ప్రత్యేకత ఇదే!
అలాంటి వాటిలో క‌ర్ణాట‌క‌లోని హంపిలో ఉన్న విరూపాక్ష ఆల‌యం ఒక‌టి. శాస్త్ర విజ్ఞానం ఇంతలా అభివృద్ధి చెందినా, అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.. ఇప్పటికీ ఈ ఆలయ రహస్యాన్ని కనిపెట్టలేకపోయారు.. అంతేగాకుండా బ్రిటీషర్స్‌ సైతం ఈ రహస్యాన్ని ఛేదించటానికి  ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు.. ఈ ఆలయంలో ఉన్న ఆ వింత ఏమిటి? ప్రపంచంలో ఏ ఆలయంలోనూ కనిపించని ఓ విషయం ఈ ఆలయంలోనే ఉంది.. అది ఏంటి? తెలుసుకుందాం రండి.
కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని హంపిలో విరూపాక్ష దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. విరూపాక్ష అంటే ఎవరు అనే విషయం చాలా మందికి తెలియని రహస్యం. సృష్టి లయకారుడు, ముక్కంటి అయిన శివుడిదే.. దేశంలోని అత్యద్భుత నిర్మాణాల్లో ఒకటిగా భావించే విరూపాక్ష దేవాలయంలో ప‌ర‌మ‌శివుడు విరూపాక్షుడిగా దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆ తరువాత హోయసల రాజులు ఈ ఆలయ బాధ్యతలు చేపట్టారు. 
విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా దీనికి మరింత సొబగులు దిద్దారు. విరూపాక్ష ఆలయం తుంగభద్ర నది ఒడ్డున ఉంది. విరుపాక్ష స్వామి వారికి పంపాపతి అని నామము కూడా ఉంది. పూర్వం పంపానదిగా పేరొందిన‌దే ఈనాటి తుంగభద్రా నది. ఈ ఆలయంలో త్రికాల పూజలు జరుగుతాయి. కర్ణాటకలో అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటిగా విరూపాక్ష ఆల‌యం పేరుగాంచింది. ఇక్క‌డ‌ 9, 10వ శతాబ్దాల‌కు చెందిన శాసనాలు ఉన్నాయి. ముఖ మంటపం లోనికి ఎక్కే మెట్ల ప్రక్కన ఒక శిలా శాసనం పురాతన తెలుగులో రెండు వైపులా చెక్కి ఉంది. 
విరూపాక్ష ఆల‌య రాజగోపురం పదకొండు అంతస్తులుగా నిర్మిత‌మైంది. ముఖమండపంపై అద్భుతమైన పెయింటింగ్స్‌ ఉన్నాయి. ఈ ఆలయంలో స్వామి ఉగ్రరూపుడుగా దర్శనం ఇస్తారు. పైగా ముఖమండపం నుంచి గర్భాలయానికి దారి లేదు. 
ఈ దేవాలయానికి మూడు గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురం 160 అడుగుల ఎత్తుతో, తొమ్మిది అంతస్తులుగా నిర్మిత‌మైంది. ఇది పదిహేను శతాబ్దం నాటిది. దీనిని పదహారవ శతాబ్దంలో కృష్ణదేవరాయలు పునర్నిర్మించాడు. విరూపాక్ష ఆలయం లోపల గోడ మీద 6 అంగుళాల సన్నటి చీలిక ఉంటుంది. గర్భగుడి నీడ ఆలయం వెనుక వైపుతల క్రిందులుగా పడుతుంది. సూర్యోదయం నుండి ఉదయం 9 గంటలవరకు ఈ నీడ కనిపిస్తుంది. గోపురం నీడ ఎత్తు 15 అడుగులు ఉంటుంది. గోపురం ఎత్తు కూడా 15 అడుగుల ఎత్తు ఉండడం గమనార్హం. ఇలా జరగటానికి విరూపాక్షస్వామి మహిమే అని భక్తులు నమ్ముతుంటారు. అసలు నీడ తలకిందులుగా ఎలా పడుతుందని అప్పటి బ్రిటీషర్స్‌ సైతం చాలా కాలం పరిశోధనలు చేసి.. దాని వెనుకున్న రహస్యాన్ని ఛేదించలేకపోయారు. ఈ ఆలయం నాటి వాస్తు శిల్పుల మేధస్సుకు తార్కాణమని ఇదొక అద్భుత దృశ్యం అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే ఉగాది సమయంలో వచ్చే పాడ్యమినాడు సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న శివలింగం మీద పడతాయి. 
ఈ క్షేత్రంలో  అందరినీ  ఆశ్చర్య పరిచే మరో వింత ఏమిటంటే ప్రపంచంలో ఏ  శివాలయంలోని లేని విధంగా ఇక్కడ మూడు తలలు కలిగిన నంది విగ్రహం దర్శనమిస్తుంది. ఏ శివాలయంలో అయిన నందికి ఒక తల ఉండటం మనం చూస్తుంటాము. ఇక్కడ ప్రధాన ఆలయానికి ఉత్తరదిశలో వున్న రెండు ఉపఆలయాల్లో పరమ శివుని సతీమణులైన పంపాదేవి, భువనేశ్వరి ఆలయం బయట మనకు మూడు తలల కలిగిన నంది కనిపిస్తుంది. 
ఇక్కడే ఉన్న‌ విఠలాలయం శిల్పకళా రీత్యా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గర్భాలయాన్ని ఆనుకుని 6 మండపాలు ఆలయ ప్రాంగణంలో విడివిడిగా ఉంటాయి. ఇక్కడే ఉన్న‌ సంగీత స్తంభాల మండపంలో 56 స్తంభాలున్నాయి.  వీటిలోని 7 స్తంభాల‌ను మీటితే సప్తస్వరాలు సరిగమలు వినిపించడం ఒక అద్భుతం. అందుకే ఈ స్తంభాలను సరిగమ స్తంభాలు అని కూడా అంటారు. ఆ కాలంలో ఇలా రాయిలో సప్తస్వరాలు వచ్చేలా ఎలాంటి టెక్నాలజీ వాడారనేది ఇప్పటికి ఎవరికీ అంతుపట్టని విషయం. భారతదేశ బ్రిటీష్ పాలకులు కూడా సంగీత స్తంభాల వెనుక రహస్యాన్ని తెలుసుకోవాల‌ని భావించి రెండు స్తంభాలను పగలకొట్టారు. వాటిలో ఏమీ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయాన్ని యునెస్కో సైతం ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా గుర్తించింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow