సందీప్ వంగాని నాగ్ టార్గెట్ చేసాడా? డైరెక్టర్స్ మధ్య గొడవ..? అసలు కారణం ఏంటి..?
సోషల్ మీడియాలో ఇప్పుడు ‘కల్కి2898ఏడీ’- యానిమల్ మూవీ గురించి కాంట్రవర్సీ నడుస్తుంది. దీనికి కారణం.?
ఇన్‌స్టాలో కల్కి డైరెక్టర్ ఓ పోస్టును షేర్ చేయడమే... వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ, జూన్ 27న విడుదలై సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. రీసెంట్ గా 1000 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. కేవలం రెండు సినిమాల అనుభవమున్న నాగ్ అశ్విన్.. ఈ అద్భుతం సృష్టించడంతో ప్రశంసల్లో మునిగి తెలుతున్నాడు నాగ్ అశ్విన్.
ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ.. నాగ్ అశ్విన్ ఓ పోస్టును ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ పోస్టును కొందరు కాంట్రవర్సీ చేస్తున్నారు. అసలు ఈ పోస్టును నాగ్ అశ్విన్ ఏ ఉద్దేశంతో పెట్టాడో తెలియదు కానీ... ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద కంట్రవర్సీ అవుతుంది.
నాగ్ అశ్విన్ కావలనే యానిమల్ మూవీని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టాడని అంటున్నారు... ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో నాగ్ అశ్విన్.. ‘‘మావంటి యంగ్ టీమ్ కి 1000 కోట్ల మైల్ స్టోన్ అనేది చాలా పెద్దది. నిజం ఏంటంటే ఈ రికార్డ్ కలెక్షన్స్‌ని ఎలాంటి బ్లడ్, గాయాలు, అశ్లీలత, రెచ్చగొట్టే సంభాషలు, ఇతరుల మనోభావాల్ని కించపరిచే కంటెంట్ లేకుండా సాధించాం. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే నన్ను నమ్మి నా వెనుక నిలబడ్డ నటీనటులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని స్టోరీలో రాసుకొచ్చారు.
నాగ్ అశ్విన్ ఈ పోస్ట్ చేసింది సందీప్ రెడ్డి వంగా యానిమల్ ని ఉద్దేశించే అనే ప్రచారం తెరపైకి వచ్చింది. యానిమల్ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. మోస్ట్ వైలెంట్ మూవీగా యానిమల్ చిత్రాన్ని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. కొంతమంది క్రిటిక్స్ అయితే యానిమల్ మూవీపై విమర్శలు చేశారు. దీంతో నాగ్ అశ్విన్ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సక్సెస్ ఎంజాయ్ చేయకుండా ఇప్పుడు ఈ అనవసరమైన కాంట్రవర్సీలు అవసరమా అని కొందరు అంటుంటే...
మరికొందరేమో, సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన 'యానిమల్' కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ బడ్జెట్ తో కల్కి రూపొందిందని.. కానీ 'యానిమల్' రూ.900 కోట్లు కలెక్ట్ చేస్తే, ఎందరో స్టార్స్ తో రూపొందించిన కల్కి రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిందని గుర్తు చేస్తున్నారు. ఎవరి టాలెంట్ వాళ్ళదని, అనవసరంగా తోటి డైరెక్టర్ ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటుంటే.. వైలెన్స్, రక్తపాతం లేకుండా కూడా సినిమా సూపర్ హిట్ అందుకోవచ్చని నాగ్ అశ్విన్ కల్కి మూవీతో ప్రూవ్ చేసాడని.. యానిమల్‌ని విమర్శించేవారు అంటున్నారు. సందీప్ రెడ్డికి నాగ్ అశ్విన్ కరెక్ట్ కౌంటర్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగ్ అశ్విన్ పోస్ట్ డైరెక్ట్ గా సందీప్ రెడ్డికి తగులుతాయని అంటున్నారు.
ఈ సంగతి తెలుసుకున్న నాగ్ అశ్విన్ వెంటనే తన పోస్టు రిమూవ్ చేసి సైలెంట్ అయిపోయాడు. కానీ నెటిజన్లు మాత్రం దీన్ని పెద్ద కాంట్రవర్సీగా మార్చారు.వంగా సందీప్‌రెడ్డినే ఇలా టార్గెట్ చేస్తావా? తోటి దర్శకులతో ఇలానేనా ప్రవర్తించేది అంటూ బాగా విమర్శిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌తోనే దాదాపు రూ.1000 కోట్ల వసూళ్లు చేయడం సందీప్‌కి మాత్రమే సాధ్యమైందని, అది చూసి ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నావా అంటూ కామెంట్ చేస్తున్నారు.
నిజానికి సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్.. ఇద్దరు వారి విజనరీతో సక్సెస్ ఫుల్‌గా ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసి సక్సెస్ అందుకుంటు వస్తున్నారు. నాగ్ అశ్విన్ షేర్ చేసిన పోస్ట్.. తన జెన్యూన్ ఫీలింగ్... సందీప్‌రెడ్డి వంగాని టార్గెట్ చేసినట్టుగా కనిపించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. యానిమల్ సినిమాను టార్గెట్ చేయాల్సిన అవసరం నాగ్ అశ్విన్‌కి లేదు... పైగా ఇప్పటిదాకా నాగ్ అశ్విన్ ఎవరిపైనా కూడా ఎలాంటి కాంట్రవర్షల్ కామెంట్స్ చేయలేదు.
కాగా కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పటికి బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఇండియన్ 2, సర్ఫిరా సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ ని కల్కి సినిమా అందుకుంటుంది. కల్కి మూవీ మూడవ వారంలోకి ఎంటర్ అయిన ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తూనే ఉంది. హిందీలో కూడా ఇప్పటికే 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలిపి క్రాస్ చేసింది. ఓవర్సీస్‌లో 17 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌కి దాటిపోయి సౌత్ సినిమాల్లో నాన్ బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. తెలుగులో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ చిత్రంగా కల్కి మూవీ నిలిచింది.
కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథకు పురాణగాథ, పాత్రలను జత చేసి నాగ్ అశ్విన్ ఈ మూవీని తీర్చిదిద్దారు. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఈ సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు. సినిమా విజువల్ వండర్‌గా నిలిచింది.
What's Your Reaction?