డ్రింక్‌లో మత్తు మందు కలిపి.. కారులోనే 4 గంటల పాటు గ్యాంగ్‌ రేప్‌!

ఆడపిల్లకి అమ్మ కడుపులో తప్ప ఇంక ఎక్కడా భద్రత లేదేమో అనిపిస్తుంది ప్రస్తుత రోజులు చూస్తుంటే.. నిన్నటికి నిన్న కన్న తండ్రే పోర్న్‌ సైట్‌ చూస్తూ.. కూతురుపై అత్యాచారానికి ఒడిగట్టాడు.Sri Media News

Jul 4, 2024 - 10:56
 0  4
డ్రింక్‌లో మత్తు మందు కలిపి..  కారులోనే 4 గంటల పాటు గ్యాంగ్‌ రేప్‌!
gang rape
ఆడపిల్లకి అమ్మ కడుపులో తప్ప ఇంక ఎక్కడా భద్రత లేదేమో అనిపిస్తుంది ప్రస్తుత రోజులు చూస్తుంటే.. నిన్నటికి నిన్న కన్న తండ్రే పోర్న్‌ సైట్‌ చూస్తూ.. కూతురుపై అత్యాచారానికి ఒడిగట్టాడు.. తాజాగా నగరం నడిబొడ్డున.. కారులో తిప్పుతూ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు కో వర్కర్స్‌.. జీవితంపై ఎన్నో ఆశలతో రాష్ట్రాన్ని వదిలిపెట్టి బతుకుతెరువు కోసం వచ్చిన ఆమెను.. నమ్మించి తీసుకువెళ్లి.. కారులోనే గ్యాంగ్‌ రేప్‌ చేశారు దుర్మార్గులు. ఈ ఘటన గురించి తెలుసుకునే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆమె కడపకు చెందిన యువతి.. హైద్రబాద్‌కు వచ్చి.. జాబ్‌ సెర్చింగ్‌ చేసింది.. అలా మియాపూర్‌లో ఉన్న జేఎస్‌ఆర్‌ గ్రూప్‌ సన్‌సిటీ అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో ఆమె ట్రైనీగా చేరింది. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న ఆమె కో వర్కర్స్‌ సంగారెడ్డి, జనార్దన్‌రెడ్డి యువతిపై కన్నేశారు. ఆమెతో నెమ్మదిగా మాటలు కలపటం మెుదలు పెట్టారు.. అయితే ఏనాడూ ఆమె తన లిమిట్స్‌ క్రాస్‌ చేసి మాట్లాడటం కానీ, వారితో చనువుగా ఉండటం కానీ చేయలేదు. దీంతో ఆమెను ఏదైనా చేయాలన్న దురుద్దేశంతో.. సైట్‌ విజిట్‌ పేరిట ఆమెను యాదాద్రికి కారులో తీసుకువెళ్లారు. కంపెనీ పని కాబట్టి.. అక్కడికి రాను అని చెప్పటానికి ఆస్కారం లేకుండా పోయింది ఆమెకు.
ఇక అక్కడ సైట్‌ విజిట్‌ చేసి తిరిగి వస్తుండగా నిందితులు ఇద్దరూ ఆమెకు ముందుగా మత్తు మందు కలిపిన ఆహార పదార్ధాలు తినేలా ప్లాన్‌ చేశారు. ఆమెకు డౌట్‌ వచ్చి.. బాధితురాలు తినకపోవడంతో మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌‌ ఇచ్చారు. మెుదట తాగటానికి డౌట్‌ పడినా.. అందుబాటులో తాగేందుకు ఏదీ లేదని..  ఆ కూల్‌డ్రింక్‌ తాగింది. ఇక మత్తులో జారుకున్న ఆమెపై కారులోనే దారుణానికి ఒడిగట్టారు. 4 గంటలపాలు కారులో తిప్పుతూ గ్యాంగ్‌ రేప్‌ చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు ఆమెను కారులో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశారు. ఎట్టకేలకు దుర్మార్గులనుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. 
మత్తు క్రమంగా తగ్గటంతో… బాధితురాలికి ఏం జరిగిందో అర్థం అయిపోయింది. అక్కడే ఉన్న నిందితుల్లో ఒకడైన జనార్ధన్‌తో పాటు ఇతరుల నుంచి తప్పించుకుని అదే రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన ఘోరాన్ని వివరించి.. న్యాయం చేయాలని పోలీసుల ముందు భోరుమని కన్నీళ్లు పెట్టుకుందా యువతి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. కొత్త నేర చట్టాలు అమల్లోకి రావటంతో.. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. నిందితుల కోసం గాలింపు చర్యలు మెుదలు పెట్టారు. దీంతో నిందితులు పోలీసులకు చిక్కారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow