కూతురు చేసిన ఆ పని! నాన్నకి తెలిశాక..

తండ్రీ కూతుళ్ల అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. నాన్నకి కూతురంటే పంచ ప్రాణాలు. కూతురికి నాన్న సూపర్ హీరో. అమ్మతో కన్నా నాన్న దగ్గరగా చనువుగా ఉండి.. ప్రతి సమస్యను తండ్రితో చెప్పుకునే ఆడపిల్లలు ఎందరో ఉన్నారు. ప్రతి తండ్రి తన బిడ్డలో తల్లిని చూసుకుంటాడు.Sri Media News

Jul 3, 2024 - 15:09
 0  8
కూతురు చేసిన ఆ పని! నాన్నకి తెలిశాక..
girl hanging herself

తండ్రీ కూతుళ్ల అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. నాన్నకి కూతురంటే పంచ ప్రాణాలు. కూతురికి నాన్న సూపర్ హీరో. అమ్మతో కన్నా నాన్న దగ్గరగా చనువుగా ఉండి.. ప్రతి సమస్యను తండ్రితో చెప్పుకునే ఆడపిల్లలు ఎందరో ఉన్నారు. ప్రతి తండ్రి తన బిడ్డలో తల్లిని చూసుకుంటాడు. అందుకే ఇంట్లో, బయట పులిలా తిరుగుతూ ఎవరి మాట వినని తండ్రి.. కూతురి కోసం తగ్గుతాడు. ఆమె సంతోషం కోసం ఏ త్యాగానికి అయినా రెడీ అవుతాడు. తండ్రీకూతుళ్ల మధ్య బంధం అంత బలంగా ఉంటుంది. అందుకే కూతురికి నాన్న సూపర్ హీరో... అటువంటి తండ్రికి తను ప్రాణంగా చూసుకుంటున్న కూతురు దూరమైందని తెలిస్తే... ఇక తిరిగిరాని లోకాలకు చేరుకుందని తెలిస్తే... ఆ తండ్రి తట్టుకోగలడా.. ఈ ఘటన గురించి తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది.

ఓ తండ్రి తన కూతురు ఉన్నత చదువులు చదివి.. తన కాళ్ల మీద తాను నిలబడాలి అనుకున్నాడు. కూతురి కష్టనష్టాల్లో తోడుగా నిలిచేవాడు. కూతురికి చిన్న సమస్య వచ్చినా ఆగమేఘాల మీద వచ్చి సమస్యను పరిస్కారించేవాడు సునీల్... కూతురు గ్రీష్మ అంటే అంత ప్రేమ... కానీ ఏం జరిగిందో ఏమో కూతురు గ్రీష్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ విషయం తల్లి.. తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఆఫీసు నుండి బయలు దేరిన తండ్రి.. ఇంటికి రాలేదు.

కేరళలోని కొట్టాయంలోని చేర్యానాడులో చోటుచేసుకుంది. సునీల్, గీత అనే దంపతులు గ్రీష్మ అనే కూతురితో కలిసి చేర్యానాడులో నివసిస్తున్నారు. కూతురు గ్రీష్మ... మావెలిక్కరలోని ఓ కాలేజీలో చదువుతోంది. తండ్రి సునీల్ కొట్టాయంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ.. తల్లి పాల ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శిగా ఉండేవారు. చింతలు లేని కుటుంబం. ప్రేమగా చూసుకునే తండ్రి... కూతురంటే పంచప్రాణాలు కానీ ఏం జరిగిందో తెలియదు...  జూన్ 27 2024 గురువారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో గ్రీష్మ ఆత్మహత్య చేసుకుంది.

బయట పనులు చూసుకోని ఇంటికి వచ్చిన తల్లి.. ఉరి కొయ్యకు వేలాడుతూ కనిపించిన కూతురిని చూసి షాక్ అయ్యింది. వెంటనే భర్త సునీల్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది. సునీల్ ఆఫీసు నుండి హుటాహుటిన బయలు దేరాడు... కానీ ఇంటికి రాలేదు... భర్త వస్తాడు అని గీత ఇంటి వద్ద కూతురి శవం వద్ద విలపిస్తూ ఎదురు చూసింది. కానీ... సునీల్  రాలేదు... గీతకు ఏం అర్థం కాలేదు... భర్త కోసం కుటుంబ సభ్యులతో రెండు రోజుల పాటు  వెతికింది... ఎక్కడ సునీల్ కనిపించలేదు... చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది గీత. ఫిర్యాదు తీసుకున్న పోలీసలు విచారణ చేపట్టారు. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పరిశీలించారు.. అయితే  ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో కనుగొనలేకపోయారు. తండ్రి కోసం ఎదురు చూసి  చివరకు ఆదివారం కూతురి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే కూతురు లేదని, ఇక రాదని తెలిసి.. తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow