ఎవరు ఈ రాఘవేంద్ర ద్వివేది? కప్పును తీసుకొచ్చి మరీ సెల్ఫీలు!టీ20 గెలుపులో ఇతడి కృషి ఏంటి?

11 ఏళ్ల నిరీక్షణ తరువాత.. ఫైనల్‌కి వెళ్లి.. మనం ప్రేక్షకుల మనసులు గెలిచాం అన్న పేరుతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది.. కానీ 2024లో ప్రేక్షకుల మనసుతో పాటు.. టీ 20 వరల్డ్‌ కప్‌ గెలిచి చరిత్ర సృష్టించారు మన ఇండియా టీమ్‌.. ఇప్పుడంతా రోహిత్‌ సేనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.Sri Media News

Jul 3, 2024 - 15:19
 0  16
ఎవరు ఈ రాఘవేంద్ర ద్వివేది? కప్పును తీసుకొచ్చి మరీ సెల్ఫీలు!టీ20 గెలుపులో ఇతడి కృషి ఏంటి?
Rahul dwivedi, Hardik Pandya T20 World Cup

చాల మందికి తెలియని ఓ విషయం ఏమిటంటే... ఈ గెలుపు వెనుక ఓ అజ్ఞాత వ్యక్తి ఉన్నాడు... కానీ అతడు ఎవరికి కనిపించాడు.. తెర వెనుక నుంచే ఇండియా కోసం కష్టపడ్డాడు. తన గురించి చెప్పకుంటే ఈ టీ 20 వరల్డ్‌ కప్‌ విజయం కూడా చిన్నబోతుంది... ప్రపంచ కప్ గెలుపు చరిత్ర అసంపూర్ణంగా మిగిలిపోతుంది...

ఎందుకంటే అతడు సామన్యుడుకాదు... కానీ సామాన్యుడిలా ఉంటాడు. క్రికెటర్‌ కావాలని కలలు కన్నాడు. తండ్రి ఒప్పుకోలేదు. ఓ రోజు కొడుకుని పిలిచి...నీకు చదువు కావాలా, క్రికెట్ కావాలా.. అని అడిగాడు. మొహమాటం లేకుండా చేతిలో బ్యాగు, జేబులో 21 రూపాయలతో ఇల్లు వదిలి తన లక్ష్యాలను సాధించుకోడానికి ఇంటి నుంచి  వెళ్లిపోయాడు... ఇది జరిగి 24 ఏళ్లు అవుతుంది. ఈ 24 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో కష్టాలు చూశాడు. చెతిలో చిల్లిగవ్వలేక స్మశానంలో పడుకుని ఉపవాసాలు ఉన్నాడు. కడుపు నిండినా, నిండకున్నా టీమిండియా జట్టుకు అద్భుతమైన సేవలు చేశాడు. అందుకే ఎవరికి దక్కని అరుదైన గౌరవం అతడికి దక్కింది. భరత్ వరల్డ్ కప్‌ గెలిచిన తరువాత అందరు అతని దగ్గరికి కప్పును తీసుకొచ్చి మరీ సెల్ఫీలు దిగారు.

అతడే... రాఘవేంద్ర ద్వివేది.. ఉత్తర కన్నడ జిల్లాలోని కుమటాకు చెందినవాడు.క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. కానీ ఇంట్లో తల్లిదండ్రులకి మాత్రం అతడు క్రికెట్ ఆడటం ఇష్టం ఉండేది కాదు. కొడుకు క్రికెట్ పిచ్చి చూసి ఓరోజు తండ్రి... నీకు చదువు కావాలా, క్రికెట్ కావాలా..? అని అడిగాడు ఒక్క క్షణం ఆలోచించకుండా... మొహమాటం లేకుండా చేతిలో బ్యాగు, జేబులో 21 రూపాయలతో ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు ద్వివేది. ఎక్కడికి వెళ్లాలో తెలియాక.. హుబ్లీకి వెళ్లాడు... వారం రోజులు అక్కడ బస్టాండులో తల దాచుకున్నాడు... రోజు అక్కడే ఉంటున్న అతన్ని పోలీసులు గమనించి ఇక్కడ ఉండకూడదు వెళ్లిపో అన్నారు. దాంతో సమీపంలోని గుడిలో కొన్ని రోజులు ఉన్నాడు. అక్కడ పెట్టిన ప్రసాదం తింటూ ఆకలి తీర్చుకునేవాడు. గుడిలో కూడా అతడిని గమనించిన వారు ఎన్నో రోజులు ఉండనివ్వలేదు. అయినా ఇంటికి వెళ్లలేదు. ఆ ఆలోచన కూడా ద్వివేదికి రాలేదు... తన లక్ష్యం ఒక్కటే..  పెద్ద క్రికెటర్ అవ్వాలి.. ఇదే  ఆశయంతో ఎక్కడ చోటు దొరక్క... చివరికి స్మశానవాటికకు వెళ్లి... అక్కడే ఓ పాడుబడిన ఇంట్లో ఉండేవాడు. ఇలా నాలుగున్నరేళ్లు తినీతినకుండా ఆ పాడుబడిన ఇంట్లోనే ఉన్నాడు.

ఇలా సాగిపోతున్న తన జీవితాన్ని... క్రికెటర్ అవ్వాలి అన్న తన కళను తన జీవితంలో జరిగిన ఓ ఘటన చెల్లచెదురు చేసింది... దురదృష్టవశాత్తు ఒక ప్రమాదంలో కుడి చేయి విరిగింది. దాంతో అతడి క్రికెట్ కలలు చెదిరిపోయాయి. అయినా క్రికెట్ మీద ఆశ చంపుకోలేదు. ఇంటికి తిరిగి వెళ్లాలి అనుకోలేదు... హుబ్లీలోని ఓ స్టేడియంకు వెళ్లి అక్కడ ప్రాక్టీస్ చేసే క్రికెటర్లకు బంతులు విసురుతూ... వారి ప్రాక్టీసుకు హెల్ప్ చేస్తూ ఉండేవాడు. అక్కడే అతడిని చూసిన ఓ వ్యక్తి ద్వివేదికి మంచి స్నేహితుడైయ్యాడు. ఈ స్నేహంతో ద్వివేదిని అతనితో పాటు బెంగుళూరు తీసుకువెళ్లాడు. అక్కడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ ద్వివేదిని ట్రైనింగ్ హెల్పర్‌గా చేర్చుకుంది. కర్నాటక క్రికెటర్ల ప్రాక్టీసు సెషన్‌లో ఇతడు హెల్ప్ చేసేవాడు.

ఒకరోజు, కర్ణాటక మాజీ వికెట్ కీపర్, ప్రస్తుత అండర్-19 సెలక్షన్ కమిటీ చీఫ్ తిలక్ నాయుడు చూపు ద్వివేదిపై పడింది. రాఘవేంద్ర  ద్వివేది అంకితభావానికి ముగ్ధుడైయ్యాడు తిలక్ నాయుడు. ద్వివేదిని కర్ణాటక మాజీ క్రికెటర్ జావగల్ శ్రీనాథ్‌కి పరిచయం చేశాడు. ఇక్కడే రాఘవేంద్ర ద్వివేది జీవితం మలుపు తిరిగింది.  శ్రీనాథ్ కర్ణాటక రంజీ జట్టులోకి రావాల్సిందిగా ద్వివేదిని ఆహ్వానించాడు. ఆ మాటతో ద్వివేది అనందానికి హద్దు లేదు... క్రికెట్ సీజన్‌లో కర్ణాటక జట్టుతో కలిసి పనిచేసి, పని లేనప్పుడు చిన్నస్వామి స్టేడియం సమీపంలోని జాతీయ క్రికెట్ అకాడమీలో సేవలందించే వాడు ద్వివేది.

ఇలా ఒకటి కాదు రెండు కాదు నాలుగు సంవత్సరాలు రాఘవేంద్ర ద్వివేది పైసా ఆశించకుండా పని చేసాడు... ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇలా ఉంటునే NCAలో చేస్తూ BCCI లెవల్-1 కోచింగ్ కోర్సును పూర్తి చేశాడు... ప్రాక్టీస్‌కు వచ్చిన భారత జట్టు క్రికెటర్లలో ఫేవరెట్‌గా మారాడు... సచిన్ టెండూల్కర్ రాఘవేంద్ర ప్రతిభను గుర్తించడంతో 2011లో భారత జట్టులో శిక్షణ సహాయకుడిగా ఛాన్స్ కొట్టేశాడు. ఇలా గత 13 సంవత్సరాలుగా, జట్టు విజయంలో రాఘవేంద్ర ద్వివేది కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. నిజం చెప్పాలంటే భారత క్రికెట్ జట్టుకు వెన్నెముక అయ్యాడు. అంతేకాదు.. ద్వివేది టీమ్ ఇండియా త్రోడౌన్ స్పెషలిస్ట్.. 2011లో త్రోడౌన్ స్పెషలిస్ట్‌గా భారత జట్టులో అడుగు పెట్టాడు ద్వివేది.

అప్పటి నుంచి టీమ్ ఇండియాకు  ప్రాక్టీస్ సెషన్‌ల సేవలు అందిస్తు వస్తున్నాడు. ఓ క్రికెటర్ ద్వివేది గురించి ఇలా అన్నాడు... ‘‘ఇప్పటి వరకు రఘు ద్వివేది  కనీసం ఓ మిలియన్ బంతులు విసిరి ఉంటాడు... కొన్నిసార్లు 150 కిలోమీటర్ల వేగంలో బాల్స్ విసురుతుంటే… గ్రౌండ్‌లో పేరున్న స్పీడ్ బౌలర్లు కూడా మీడియం పేస్ బౌలర్లు అనిపించేవాళ్లు... ప్రపంచంలోని మరే ఇతర త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు వేగానికి సాటిలేరు’’ అన్నాడు. అంతేకాదు... విరాట్ కోహ్లి ఒకసారి ఇలా అన్నాడు, ‘‘నెట్స్‌లో రఘు 150 కి.మీ. వేగంతో  బంతిని వెస్తాడు. దీనివల్ల... మ్యాచ్‌ల సమయంలో ఫాస్టెస్ట్ బౌలర్లు మాకు మీడియం పేసర్‌లుగా కనిపిస్తారు.’’ అని అన్నాడు విరట్. ఇలా  ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈరోజు  ఒక మంచి స్థాయికి వచ్చాడు రాఘవేంద్ర ద్వివేది.  టీమిండియా విజయాలలో ముఖ్య పాత్ర పోషిస్తూ తన కలను నెరవేర్చుకుంటున్నాడు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow