రాజ్‌తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ....రోజుకో మలుపు ఉహించని ట్విస్టులు!లావణ్యకు మస్తాన్ సాయితో ఎఫైర్ ఉందా?
హీరో రాజ్‌తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ రోజుకో మలుపు తిరుగుతుంది. పదకొండెళ్ల క్రితం పెళ్లి చేసుకున్నామని ఆరోపిస్తున్న రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య ఇప్పుుడు మరో షాకింగ్ న్యూస్ మీడియాకు చెప్పి షాక్ ఇచ్చింది. ఇద్దరం కలిసి గుట్టుగా పదేళ్లుగా కాపురం చేస్తున్నామని చెబుతున్న లావణ్య.Sri Media News
మేమిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెబుతుంది... అయితే మా ఈ రిలేషన్ మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని.. రాజ్ తరుణ్ నాకు కావాలని అంటుంది లావణ్య... అంతేకాదు... రాజ్ తరుణ్ చాల మంది హీరోయిన్స్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని చెబుతూ... వారి పేర్లను సైతం చెప్పడం... రాజ్‌తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ హాట్ టాపిక్ గా మారింది. మరీ రాజ్ తరుణ్ తో ఎఫైర్ పెట్టుకున్న ఆ హీరోయిన్స్ ఎవరు?. రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్న ఆ బిగ్ బాస్ బ్యూటి ఎవరై ఉంటారు. మస్తాన్ సాయి ఎవరు?.. లావణ్యకు అతనితో నిజంగా ఎఫైర్ ఉందా? తెలుసుకుందాం.
పదకొండెళ్లుగా కాపురం చేస్తున్న వీరిద్దరు. ఎన్నో సార్లు విదేశాలకు వెళ్లారు. కానీ వెళ్లిన లావణ్య... లావణ్య అనే పేరు మీద విదేశాలకు వెళ్లలేదు...అన్విక అనే పేరుతో విదేశాల్లో ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేవారు. ఈ మధ్యలో ఎంతో మంది హీరోయిన్స్ తో రాజ్ తరుణ్ ఎఫైర్స్ నడిపించిన... లావణ్య సర్దుకు పోయింది. రాజ్ తరుణ్ నాతో ఉంటే చాలు అని అనుకుంది. ఇలా జరుగుతుండగా... రాజ్ తరుణ్ తిరగబడర సామీ సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మాల్వీ మల్హోత్రా నటించింది. అయితే ఈ సమయంలోనే రాజ్ తరుణ్ మాల్వీ మల్వోత్ర మధ్య అనుబంధం ఎర్పడింది. అదికాస్తా ప్రేమగా ముదిరి... ఇద్దరు పికల్లోతు ప్రేమలో మునిగి పోయారు... ఇలా రాజ్ తరుణ్, లావణ్యల జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది మాల్వీ మల్హోత్రా..
కొత్త లవర్ రావడం... మల్వి లావణ్యకంటే అందంగా ఉండటం... మన హీరో లావణ్యను ట్రాక్ తప్పించి... మల్వోత్రాతో ప్రేమ పట్టాలు ఎక్కాలి అనుకున్నాడు... లావణ్యను దూరం పెట్టడం మొదలు పెట్టాడు రాజ్ తరుణ్... దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి... గొడవలు జరుగుతున్న కూడా రాజ్ తరుణ్ కొత్త ప్రేయసి మాల్వీని చూడకుండ ఉండలేక పోయాడు. మాల్వీని కలవడానికి ఎప్పుడు చూడలి అనిపిస్తే అప్పుడు ముంబై వెళ్లిపోయేవాడు. ఇది గమనించిన లావణ్య రాజ్ తరుణ్ ని నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగుతూ ఉండేవి. ఇలా ఉండగా... మాల్వీ, రాజ్ తరుణ్ ప్రేమ విషయం మాల్వీ ఇంట్లో తెలిసి... లావణ్యను వదిలించుకుంటే మాల్వీని ఇచ్చి పెళ్లి చేస్తాం అని చెప్పారట. అంతటితో అగలేదు... లావణ్యకు మాల్వీ తండ్రి, సోదరుడు లావణ్య ఫోన్ చేసి బెదిరించారు...
రాజ్ తరుణ్ ను వదిలేయాలని, అవసరమైతే కొంత డబ్బు తీసుకొని రిలేషన్ షిప్ ను బ్రేక్ చేసుకోవాలని సూచించారట. మాల్వి మల్హోత్రా సోదరుడు మరో అడుగు ముందుకేసి, లావణ్యను జైళ్లో పెట్టిస్తానని, చంపేస్తానని కూడా బెదిరించాడట. లావణ్య మాత్రం రాజ్ తరుణ్ ని వదిలేది లేదు అని చెప్పడంతో... ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో లావణ్యను రాజ్ తరుణ్, మాల్వీ కలిసి ఇరికించారని లావణ్య ఆరోపణలు చేసింది. ఇలా దాదాపు 43 రోజులు జైలు జీవితం చూసి వచ్చానని... రాజ్ తరుణ్ నాతో రిలేషన్ లో ఉంటునే కొంతమంది హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకున్నడని చెబుతుంది లావణ్య.. అంతేకాదు... ఆ హీరోయిన్ల పేర్లు కూడా చెప్పింది.
ఇద్దరి లోకం ఒకటే సినిమాలో కలిసి నటించిన టైంలో షాలిని పాండే తో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నడని.. లవర్ సినిమా హీరోయిన్ రిద్దీ కుమార్, మాల్వి మల్హోత్రా తో పాటు బిగ్ బాస్ అరియానా తో కూడా ఎపైర్ ఉందని... అరియానాతో ఎఫైర్ మొదలయ్యాక రాజ్ ఇంటికి వచ్చేవాడు కాదని... అరియానా నాతో ప్రవర్తించే విధానం కూడా మారిందని... ఒక అమ్మాయి ఏం చేస్తోందో మరో అమ్మాయిగా నాకు అర్థం అయ్యిందని.. మణికొండలో అరియానా ఉంటున్న అపార్ట్మెంట్ కి రాజ్ వెళ్ళేవాడని... ఆ అపార్ట్మెంట్ లో వాళ్లే నాకు ఫోన్ చేసి చెప్పారని... వాళ్ళిద్దరి ఫోటోలు కూడా నేను చూశాను అని.... నేను పని మీద గోవా వెళ్లినప్పడు రాజ్ తరుణ్ ఫోన్ నుంచి నాకు అరియనా కాల్ చేసి... చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడిందని... నీకు జీతం ఎంత వస్తుంది అని అడిగితే నేను..ఇదే బిగినింగ్ కదా తక్కువ వస్తుంది అని చెప్పా.. అప్పుడు అరియనా అవునా.. నాకైతే రోజుకి 50 వేల నుంచి లక్ష వరకు వస్తుంది అంటూ నన్ను తక్కువ చేసి మాట్లాడిందని... అప్పుడే నాకు అర్థం అయింది.. ఆ తర్వాత నేను అరియానా కి వార్నింగ్ ఇచ్చాను. దీనితో అరియానా నాకు సారీ కూడా చెప్పింది. ఆ కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయని లావణ్య షాకిచ్చింది.
రాజ్ తరుణ్ మాత్రం అలాంటిదేం లేదని... లావణ్య డ్రగ్స్ తీసుకుంటోందని తెలిసి పూర్తిగా దూరమయ్యానని.. "2017 తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని... ప్రతిదానికి బెదిరించేది, లావణ్య నన్ను బ్లాక్ మెయిల్ చేసేదని... నా పరువు పోతుందని అన్ని మూసుకొని ఉన్నాను అని... ఇప్పుడింక భయపడేది లేదు... నేను కూడా లీగల్ గా ఫైట్ చేస్తాను... లావణ్యను మాన్వి కుటుంబ సభ్యులు బెదిరించలేదు అని క్లారిటి ఇస్తూ... 8 ఏళ్ల కిందట మస్తాన్ సాయి అనే అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలని లావణ్య కంప్లయింట్ ఇచ్చిందని... ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గరుందని... నా తర్వాత అతడితోనే రిలేషన్ లో ఉందని... నా ప్లాట్ కు మస్తాన్ సాయిని తీసుకువచ్చేదని... అయితే ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని తెలిసిన తర్వాత, నా పరువు పోతుందని నేనే అక్కడ్నుంచి వెళ్లిపోయానని... నిజంగా లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే, ఈరోజు మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చేంత పరిస్థితి తనకు రాదంటున్నాడు రాజ్ తరుణ్. తను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని ప్రకటించాడు. మాన్వి తన సహ-నటి మాత్రమేనని, తామిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని చెప్పాడు.
మరో వైపు లావణ్య... మస్తాన్ సాయికి నాకు ఎలాంటి సంబంధం లేదని... మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని... రాజ్ తరుణ్ కావాలని మాపై ఆరోపణలు చేస్తున్నాడని క్లారిటి ఇచ్చింది... ఇదే సమయంలో మస్తాన్ సాయి ఓ ఇంటర్యూలో ఫోన్ ద్వారా లైన్ లోకి వచ్చి క్లారిటి ఇచ్చాడు. లావణ్యతో తనకి ఎలాంటి రిలేషన్ షిప్ లేదని, రాజ్ తరుణ్ తనపై కావాలని ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నాడని మస్తాన్ అన్నారు. అతను ఎందుకు అలా మాట్లాడుతున్నాడో నాకు అర్ధం కావడం లేదని.. ఒక మ్యూజిక్ ఈవెంట్ కోసం లావణ్యతో కాంటాక్ట్ అయ్యానని, తరువాత రాజ్ తరుణ్ పరిచయం అయ్యారని మస్తాన్ చెప్పుకొచ్చాడు. అలాగే లావణ్య, రాజ్ తరుణ్ వ్యక్తిగత విషయాల గురించి నాకు పెద్దగా తెలియదని... ఇప్పుడు లావణ్యతో నాకు ఏదో ఎఫైర్ ఉందని రాజ్ తరుణ్ ఆరోపణలు చేస్తుంటే ఆశ్చర్యంగా అనిపించిందని... రాజ్ తరుణ్ చూపించిన ఎఫ్ఐఆర్ కూడా ప్రేమకి సంబందించింది కాదని, వేరొక ఇష్యూకి సంబంధించిందని... ఆ కేసుని కాంప్రమైజ్ చేసుకుంటున్నామని కూడా మస్తాన్ క్లారిటీ ఇచ్చాడు. ఈ కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగు చూసే అవకాశం లేక పోలేదు...
What's Your Reaction?