మితిమీరిన ప్రాంక్.....తిరుమలలో ప్రాంక్ వీడియో!
సోషల్ మీడియా వచ్చాక ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంక్ వీడియోలు చాల పాపులర్ అవుతున్నాయి. అందుకే యువత ఫ్రాంక్ వీడియోలు చేయడం పై ఎక్కువగా ఫోకాస్ పెడుతున్నారు.ఫ్రాంక్ వీడియోలు అంటే ఇప్పుడు సాధారణంగా మారింది. అయితే కొందరు ఈ ప్రాంక్ వీడియోలను ఏంజాయ్ చేస్తుంటే.Sri Media News
కొంతమంది దీని వల్ల అసౌకర్యానికి గురి అవుతున్నారు. ఎక్కువగా.. యూట్యూబర్లు, రీల్స్ స్టార్లు లైక్‌లు, కామెంట్‌ల కోసం ఈ ఫ్రాంక్ వీడియోలు, ఫ్రాంక్ వీడియోలు చేయడం ఇప్పుడు కామన్‌గా మారింది. అది ఎక్కడ చేస్తున్నాం.. ఎప్పుడు చేస్తున్నాం.. ఇలాంటి విషయాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. తమకు లైక్స్ వచ్చాయా.. ఎంత వరకు రీచ్ వచ్చింది అని మాత్రమే చూస్తుండటం పెద్ద సమస్యగా మారుతోంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఫ్రాంక్ వీడియోల వల్ల చాలమంది జనాలు భయపడిన వారు ఉన్నారు. ఇలాంటి ఓ ఫ్రాంక్ ఘటనే తిరుమల శ్రీవారి క్యూ లైన్ లో చోటు చేసుకుంది.
పవిత్ర పుణ్యక్షేత్రం అయినా తిరుమల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు ప్రాంక్ వీడియో చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీటీఎఫ్ వాసన్ అనే వ్యక్తి.. తన స్నేహితులతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే వారు నారాయణగిరి షెడ్ల వద్దకు వచ్చిన తర్వాత క్యూ లైన్లలోనే ప్రాంక్ వీడియో తీయాలని అనుకోని... క్యూ లైన్ల వద్ద ఉన్న కంపార్ట్‌మెంట్ తాళాలు తీస్తున్నట్టు ప్రజలను నమ్మించారు. దీంతో వారిని చూసిన ప్రజలు వారు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది అని అనుకోని... క్యూ లైన్లలోని భక్తులు ఒక్కసారిగా లేచి అటు వైపు పరుగులు పెట్టారు.. భక్తులు అక్కడికి రావడంతో అది ప్రాంక్ అంటూ వెకిలిగా నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
దీంతో తిరుమల వంటి పవిత్ర స్థలంలో ఇలాంటి పిచ్చి వేశాలు వేస్తారా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు . తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో నిల్చున్న భక్తులను ఆట పట్టించేలా యూట్యూబర్ చేసిన ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో టీటీడీ చర్యలు చేపట్టింది. ఎంతో పటిష్టమైన భద్రత, నిఘా ఉండే ప్రదేశంలో కొంతమంది యువకులు మొబైల్ ఫోన్లు తీసుకురావడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిబ్బందిని ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను తమిళనాడుకు పంపినట్లు సమాచారం. సాధారణంగా దేవస్థానం లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదు… కానీ ఈ యువకులు భద్రత సిబ్బంది కళ్లు కప్పి మరి ఎలా తెచ్చారు. నిర్లక్ష్యం గా వ్యవహరించిన భద్రత సిబ్బంది ఎవరు అనే దానిపై విచారణ చేస్తున్నారు అధికారులు.
What's Your Reaction?