వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి స్పెషల్ ! అవినాశ్‌ రెడ్డి భారతికి బావ ఎలా అయ్యాడంటే..?

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. ఆ పేరే ఒక ప్రభంజనం.. నిరుపేదలకు సేవ చేసిన వైద్యుడిగానే కాదు.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జనం చేత నీరాజనం అందుకున్న నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న పవర్‌ఫుల్ మాస్ లీడర్ ఆయన.Sri Media News

Jul 8, 2024 - 18:28
 0  3
వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి స్పెషల్ ! అవినాశ్‌ రెడ్డి భారతికి బావ ఎలా అయ్యాడంటే..?
YS Rajashekar reddy Jayatnthi

రాజన్న పేరులోనే కాదు.. మ్యానరిజంలోనూ రాజసం ఉట్టిపడుతుంది. ఆయన చిరు నవ్వులో ఆప్యాయత, ఆత్మీయత ఊగిసలాడుతుంది. తెలుగోడి తెగువకు నిలువుటద్దంలా తెల్లటి పంచెకట్టు, నిండైన ఆహర్యం, అన్నివేళలా ఆకట్టుకునే చిరుదరహాసం.. మడమతిప్పని గుణం.. ఎవరికైనా ఎదురెళ్లే మొండి ధైర్యం.. సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచే తత్వం.. అభాగ్యులను అక్కున చేర్చుకుని అభిమానించే స్వరం.. ఇవి రాజన్న పేరు గుర్తుకొస్తే.. కళ్లముందు కదలాడే రూపం వెనుకున్న జ్ఞాపకాలు. పాద యాత్ర పేరుతో జనంలోకి వెళ్లి.. అదే జనంలోంచి వచ్చిన మాస్ లీడర్‌గా ఎదిగారు వైఎస్ఆర్. 2009లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కొన్నాళ్లకే అనుకోని విధంగా 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు.

అయితే  ‌‌‌వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి వంశం గురించి పూర్తి వివరాలు చాల మందికి తెలియదు... సో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన వంశం గురించి, పూర్వికుల గురించి... అవినాశ్‌ రెడ్డి భారతికి బావ ఎలా అయ్యాడు  తెలుసుకుందాం....  వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పూర్వికులది కడప జిల్లా పులివెందులలోని బలపనూరు గ్రామం. రాజశేఖరరెడ్డి ముత్తాత పేరు యెడుగూరి పుల్లా రెడ్డి, ఆయన భార్య పేరు అచ్చమ్మ. పుల్లా రెడ్డి-అచ్చమ్మల కొడుకైన వెంకటరెడ్డికి మొత్తం 10 మంది సంతానం. వారిలో ఐదుగురు కొడుకులు, ఐదుగురు కుమార్తెలు. వారిలో ఆరో సంతానంగా రాజారెడ్డి జన్మించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తాతైన వెంకటరెడ్డి వేంకటేశ్వరస్వామి వీర భక్తుడు. ఆయన మేనమామ చిన కొండారెడ్డి తెలుగు ఉపాధ్యాయుడు కావడంతో చిన్నతనం నుంచి వెంకటరెడ్డి సీస పద్యాలు రాసేవారు. నిత్యం ఓం నమఃశివాయ అంటూ పంచాక్షరీ మంత్రం జపించేవారు.

వెంకటరెడ్డి చిన్నప్పటి నుంచి చదువులపై మంచి పట్టు ఉండటంతో.. ఆ కాలంలోనే టెన్త్‌ వరకు చదువుకున్నారు. వెంకట్‌రెడ్డికి పదహారేళ్లు వచ్చేసరికి.. బోనాల లక్ష్మమ్మతో పెళ్లి జరిగింది. వీరికి చిన్న కొండారెడ్డి పుట్టాడు.. కొడుకు పుట్టిన తరువాత లక్ష్మమ్మ హెల్త్‌ పాడవటంతో, చనిపోయింది. దీంతో వెంకరెడ్డి మంగమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. అలా వీరికి, పెద కొండా రెడ్డి, ప్రభుదాస్‌ రెడ్డి, సుగుణమ్మ, రత్మమ్మ, వైయస్‌ రాజా రెడ్డి, మేరీ పునీత అనే తొమ్మిది మంది సంతానం ఉండేవారు.
సంపాదించేది ఒకరు, కానీ ఫ్యామిలీ పెద్దది కావటంతో.. కుటుంబ పోషణ భారంగా మారింది వెంకట రెడ్డికి. ఈ టైమ్‌లోనే అంటే 1939 టైమ్‌లో క్రిష్టియన్‌ మిషనరీస్‌ హిందువులకు ఫ్రీ ఎడ్యుకేషన్‌, జాబ్స్‌ ఇస్తామని చెప్పి, వారిని క్రిష్టియానిటీలోకి మార్చటం మెుదలు పెట్టారు. అలా బలపనూరుకు వచ్చిన క్రిష్టియన్‌ మిషనరీ.. వైయస్‌ వెంకటరెడ్డిని కలిసి.. క్రైస్తవ మతానికి మారితే, పిల్లలందరికీ మంచిగా ఎడ్యుకేషన్‌ చెప్పటంతో పాటు జాబ్‌ కూడా వచ్చేలా చేస్తామని చెప్పారు. పిల్లల కోసం వేరే దారిలేక వైయస్‌ వెంకట రెడ్డి క్రిష్టియానిటీలోకి మారారు. అలా కడపలోని ఓ పాఠశాలలో వెంకట రెడ్డికి టీచర్‌గా జాబ్‌ కూడా వచ్చింది.

పిల్లలు అందరూ చదువులలో దూసుకుపోతున్నా, చిన కొండారెడ్డి, రాజారెడ్డి మాత్రం వెనుకబడ్డారు.. కానీ.. ఇంగ్లీష్‌లో మాత్రం ఫుల్‌ ఫ్లూయెంట్‌గా మాట్లాడేవారు. రాజారెడ్డి సోదరి సుగుణమ్మ కడప జిల్లాలో తొలి మహిళా గ్రాడ్యుయేట్. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా పొందారామె... ఇలా ఉండగా మిగిలిన గ్రామస్థులను కూడా క్రిష్టియానిటీలోకి మార్చాలని ప్రయత్నించిన వెంకటరెడ్డిపై కోప్పడిన గ్రామస్తులు, అక్కడ నుంచి వారి ఫ్యామిలీని తరిమేశారు. దీంతో పులివెందులకు వెళ్లిపోయారు. క్రిష్టియన్‌ మిషనరీ ఇచ్చిన డబ్బుతో అక్కడ 130 ఎకరాల భూమిని కొన్నాడు వెంకట రెడ్డి. స్వయానా మేనకోడలైన జయమ్మను వివాహం చేసుకున్నారు. వారికి ఆరుగురు సంతానం కలిగింది. వీరికి జార్జి రెడ్డి, వివేకానంద రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, సుధాకర్‌ రెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి, విమలమ్మ పుట్టారు. అయితే తండ్రి అయిన వెంకట రెడ్డి మరణించటంతో, రాజా రెడ్డి పులివెందులలో సర్పంచ్‌గా పోటీ చేసి.. రాజకీయంగా ఎదగాలని అనుకున్నారు. కానీ కాంట్రాక్ట్‌ వర్క్స్‌ వల్ల ఎక్కువ శాతం బళ్ళారీలోనే ఉండాల్సి వచ్చేది.

ఇక 1949 జూలై 8న,జమ్మలమడుగులో జన్మించిన వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి, పాఠశాల విద్యాభ్యాసం బళ్లారిలో సాగగా, తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో విద్యనభ్యసించారు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు. అనంతరం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్‌ సర్జన్‌గా పట్టా పొందారు. వైద్య విద్య పూర్తైన తర్వాత కొంతకాలం జమ్మలమడుగులో వైద్యాధికారిగా పనిచేశారు. అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో కట్టించిన ఆస్పత్రిలో పనిచేశారు. వైఎస్సార్‌ సతీమణి విజయమ్మ. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. వారే జగన్ మోహన్‌ రెడ్డి, షర్మిల. కాగా, వైఎస్సార్ తాత వెంకట రెడ్డికి రెండో భార్య మంగమ్మతో పది సంతానం కలగగా.. మొదటి భార్య లక్ష్మితో ఒకరు సంతానం కలిగారు. ఆయనే చిన కొండారెడ్డి. చిన కొండారెడ్డికి పది మంది సంతానం కలగగా... వారిలో 6వ కూతురు సుగుణమ్మ, 9వ కుమారుడు వైఎస్ భాస్కర్‌ రెడ్డి అందరికీ తెలుసు. సుగుణమ్మ, భాస్కర్‌ రెడ్డి కుండ మార్పిడి పెళ్లిళ్లు చేసుకున్నారు. సుగుణమ్మ- ఈసీ గంగిరెడ్డిలకు భారతి కుమార్తె. భాస్కర్‌ రెడ్డి-లక్ష్మమ్మలకు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి కుమారుడు. ఇలా భారతి, అవినాష్‌ రెడ్డి వరసకు మేన బావామరదళ్లు. ఇక, వైఎస్ జగన్-భారతీ దంపతులకు హర్ష, వర్ష అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వైఎస్ షర్మిల-అనీల్ కుమార్ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డికి ప్రియా అట్లూరితో ఇటీవల వివాహం కాగా, కుమార్తె అంజలికి పెళ్లి కాలేదు.

అయితే... 2004లో తొలిసారి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యరు... దీని వెనుక పెద్ద కథే ఉంది... 2003 వేసవిలో పాదయాత్ర చేపట్టి, దాదాపు 1,467 కిలోమీటర్లు పర్యటించారు. ఈ యాత్రలో ప్రతి చోటా ప్రజలతో మమేకమవుతూ, వారి కష్టాల్ని తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల్ని కలిసి వారి ఇబ్బందుల్ని కళ్లారా చూసి, చలించి పోయారు. ముఖ్యంగా రైతు సమస్యల మీద ఆయనకు పూర్తి అవగాహన కలిగింది. పర్యటన ముగిసేలోపు ప్రజల సమస్యలు, పరిష్కారాలపై ఆయనకు పూర్తి అవగాహన వచ్చింది. ఈ యాత్రలో ప్రజలు, అభిమానుల నుంచి వైఎస్సార్‌కు ప్రతి చోటా మద్దతు లభించింది. ప్రజలు కూడా ఆయనలోని నిజాయతీని అర్థం చేసుకుని, తర్వాత జరిగిన 2004లో వైఎస్ఆర్‌‌కి ఘన విజయాన్ని అందించారు.

అప్పటి తెలుగు దేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ పాదయాత్రతో చంద్రబాబు నాయుడికి ఎదురెళ్లిన దీశాలి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెటూరు వరకు ప్రాంతాలన్నీ కలియతిరుగుతూ, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ.. వారికి నేనున్నానని భరోసానిస్తూ ముందుగుసాగాడు. అప్పుడు ఊపుమీదున్న తెలుగు దేశం పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ డీలాపడిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి కొత్త జోష్‌నిచ్చిన నాయకుడు. ఆ పాదయాత్ర ఫలితమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మళ్లీ పట్టం కట్టడం... 2004, మే 14న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా '' ఎడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి అను నేను'' అంటూ ఆ జనహృదయ నేత ప్రమాణ స్వీకారం చేశారు.

2009లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కొన్నాళ్లకే అనుకోని విధంగా 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. తండ్రి మరణం తరువాత  కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాడు. వైఎస్సార్‌ సంక్షేమ పథకాల బ్రాండ్‌తో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీని స్థాపించి... అలా.. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అఖండ విజయం సాధించింది. జగన్‌ తొలిసారి ఏపీ సీఎం అయ్యాడు. 2024లో వచ్చిన సర్వత్రిక ఎన్నికల్లో దారుణంగా జగన్ పార్టీ ఓడిపోగా... ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.

ఇలా చూసుకుంటు పోతే... వైఎస్సార్‌ కుటుంబంలో చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. వీరిలో చాల మంది... పార్టీ వెనకుండి రాజకీయలు చేస్తారు. 2019 ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికల్లో అన్న జగన్ రెడ్డి గెలుపు కోసం కీలక పాత్ర పోషించారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రచారంలో ఆకట్టుకున్నారు. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత తన అన్న జగన్‌తో షర్మిలకు గ్యాప్ వచ్చింది. అనంతరం ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో పార్టీని ప్రకటించారు. దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల.. ఏపీలో జగన్‌ ఓటమికి ఓ కారణమని చెప్పవచ్చు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow