పరువు హత్య? కన్నకూతుర్ని కొట్టి చంపేశారు పగ చల్లారక... ఏం చేశారంటే?

దేశంలో రోజు రోజుకి పరువు హత్యలు పెరుగుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కసితో కుటుంబ సభ్యులే కాలయముళ్లుగా మారుతున్నారు. సినిమా స్టోరీలను మించిన రీతిలో బడా క్రిమినల్స్‌ను తలదన్నేలా హత్యలు చేస్తున్నారు.Sri Media News

Jul 8, 2024 - 18:14
 0  3
పరువు హత్య? కన్నకూతుర్ని కొట్టి చంపేశారు పగ చల్లారక... ఏం చేశారంటే?

సమాజంలో జరుగుతున్న ఈ దారుణాలు చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్యే ఉంటున్నామా అన్న అనుమానం కలుగుతోంది.క్షణికావేశంలో సొంత పిల్లలు అని మరచిపోయి హత్యలకు కత్తులు నూరుతున్నారు. పిల్లల నిర్ణయాలను ఇప్పటికి కొందరు తల్లిదండ్రులు  అంగీకరించలేక దుర్మార్గపు ధోరణితో కొట్టుమిట్టాడుతున్నారు. వారికి కన్న పిల్లల కంటే కూడా.. కంటికి కనిపించని పరువు, మర్యాదలే ఎక్కువయ్యాయి. ఇప్పటికీ పరువు హత్యలు జరుగుతున్నాయంటే మనుషుల ఆలోచన ఎంత వెనుకబడి పోయిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా తమ ఇష్టానికి వ్యతిరేకంగా లవ్ మ్యారేజ్ చేసుకుందన్న కోపంతో సొంత కుటుంబ సభ్యులే హత్య చేసి.. ఓ యువతిని తగులబెట్టారు.


ఈ ఘోరమైన సంఘటన రాజస్థాన్‌లోని ఝలావర్‌లో చోటు చేసుకుంది. భర్త ముందే ఆ యువతిని కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసి తరువాత ఆమెను చంపి, ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికలో కాల్చారు. అసలు ఏం జరిగిందంటే... 24 ఏళ్ల యువతి.. రవి భీల్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరివీ వేర్వేరు కులాలు. అయితే ఆమె ప్రేమ విషయం ఇంట్లో తెలిసింది. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని కుటుంబ సభ్యులతో గొడవ పడింది. వారిని ఎదిరించి వారు ఒప్పుకోలేదు. ఇంకా ఇంట్లో ఏంత చెప్పిన ప్రయోజనం లేదు అనుకుంది. తాను ఇష్టపడ్డ వ్యవక్తితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.... అయితే కుటుంబ సభ్యులకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో వారికి దూరంగా వెళ్లిపోయారు. అయినప్పటికి తల్లిదండ్రులకు అమ్మాయి మీద కోపం తగ్గలేదు... తమ పరువు తీసిందన్న కోపంతో ఆమెను చంపేయాలనుకున్నారు .

అవకాశం కోసం ఎదురు చూస్తు వచ్చారు. ఓ రోజు ఆమె మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలోని బ్యాంకుకు వస్తుందని తెలుసుకున్నారు. అక్కడే ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ చేశారు. భార్యతో కలిసి రవి భీల్ బ్యాంకు దగ్గరకు రాగానే.. అక్కడే రెక్కి నిర్వహించిన యువతి  బంధువులు.. భర్త కళ్లెదుటే.. భార్యను ఎత్తుకెళ్లారు. అనంతరం ఆమెను హత్య చేసి దహనం చేసేశారు.

 తన భార్యను కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త. కానీ పోలీసులు చేరుకునే సమయానికే అంతా జరిగిపోయింది. ఘటనాస్థలానికి 80 శాతానికి పైగా బాధితురాలి శవం కాలిపోయింది. పోలీసుల రాకను గమనించిన కుటుంబ సభ్యులు అక్కడి నుండి పరారయ్యారు. మృతురాలి అవశేషాలను తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ కు పంపించారు పోలీసులు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ పరువు హత్య స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ వివరాలు తెలుసుకున్న నెటిజన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉన్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తక్కువ కులం వ్యక్తిని వివాహం చేసుకుందని కన్న బిడ్డను చంపుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు ఎలాంటి శిక్షలు విధించినా కూడా తక్కువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వారికి కఠినమైన శిక్షలు విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్యే ఉంటున్నామా అన్న అనుమానం కలుగుతోంది. క్షణికావేశంలో అడ్డొచ్చిన వారు కూతురు, కొడుకు ఎవరైన వదలడం లేదు. పరువు కోసం హత్యలు చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులకు పిల్లల కంటే కూడా.. కంటికి కనిపించని పరువు, మర్యాదలే ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికీ పరువు హత్యలు జరుగుతున్నాయంటే మనుషుల ఆలోచన ఎంత వెనుకబడి పోయిందో అర్థం చేసుకోవచ్చు.  

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow