ఛీ.. ఛీ చదువుకున్న మూర్ఖుడు వీడు!లోకం చూడని రెండు పసి గుడ్డులను చంపేశాడు..

ప్రపంచం బిజీ బిజీగా ముందుకు దూసుకుపోతుంది. అమ్మయిలు కూడా ఇప్పుడిప్పుడే... బయటకు వచ్చి మగవారితో పోలిక లేకుండా ప్రతి రంగంలో అబ్బాయిలతో సమానంగా అడుగులు వేస్తున్నారు. మగవారికి మేం ఏమాత్రం తక్కువ కాదు అని... అవకాశాలలో సగం తీసుకుంటూ ప్రతి రంగంలో జెట్ స్పీడ్‌‌తో దూసుకుపోతున్నారు.Sri Media News

Jul 4, 2024 - 13:28
 0  5
ఛీ.. ఛీ చదువుకున్న మూర్ఖుడు వీడు!లోకం చూడని రెండు పసి గుడ్డులను చంపేశాడు..
baby feet

ప్రపంచం బిజీ బిజీగా ముందుకు దూసుకుపోతుంది. అమ్మయిలు కూడా ఇప్పుడిప్పుడే... బయటకు వచ్చి మగవారితో పోలిక లేకుండా ప్రతి రంగంలో అబ్బాయిలతో సమానంగా అడుగులు వేస్తున్నారు. మగవారికి మేం ఏమాత్రం తక్కువ కాదు అని... అవకాశాలలో సగం తీసుకుంటూ ప్రతి రంగంలో జెట్ స్పీడ్‌‌తో దూసుకుపోతున్నారు. ఈ మార్పుతో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోతున్నారు కొందరు తల్లిదండ్రులు. అంతేనా... మాకు అబ్బాయితో పని ఏముంది? ఆడపిల్ల చాలు అంటున్నారు. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో మగపిల్లాడి కంటే ఆడపిల్ల పుడితేనే తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. కానీ ఆడపిల్ల అని పుట్టగానే చంపేసే వారు కొందరైతే, పుట్టేది ఆడపిల్ల అని తెలిసి కడుపులో వున్న పిండాన్ని బయటకు రాకుండా చిదిమేసే వారు కొందరున్నారు. ఇప్పటికీ ఇటువంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

తాజాగా సూర్యా పేటలో ఈ తరహా ఘటన బయటకు వచ్చింది. చదువుకున్న ఓ మూర్ఖుడు.. తనకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి కడుపులో బిడ్డను చిదిమేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సూర్యాపేట జిల్లా చివ్వెల మండలం ఎంజీనగర్‌ తండా చెందిన రత్నావత్‌ హరిసింగ్‌కు మహబూబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం రాముతండాకు చెందిన బట్టు కృష్ణ, క్రాంతి దంపతుల కుమార్తె సుహాసినికి 2019లో వివాహం అయ్యింది. వీరికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. హరిసింగ్ ఇటీవల ఉస్మానియా మెడికల్ కాలేజీ నుండి పీహెచ్డీ పట్టా కూడా పొందాడు. కాగా... అతడికి వారసుడు కావాలన్న కోరిక ఉండేది. దీంతో ఏడాదిన్నర కింద సుహాసిని గర్భం దాల్చడంతో స్కానింగ్ చేయించగా ఆడశిశువు అని తెలుసుకున్న హరిసింగ్.. సుహాసినికి అబార్షన్ చేయించాడు.

మళ్లీ ఏడు నెలల కింద రెండోసారి గర్భవతి కావడంతో  మరోసారి స్కానింగ్ తీయించగా ఆడపిల్ల అని  తెలిసింది. దీంతో అబార్షన్ చేయించేందుకు ఓ డాక్టర్ను కలవగా ఏడో నెలలో చేస్తే తల్లీ, బిడ్డకు ప్రమాదం ఉంటుందని, వద్దని సలహా ఇచ్చాడు. ఇది నచ్చని.. హరి సింగ్ హుజూర్నగర్ ప్రాంతంలో ఓ క్లినిక్ నడుపుతున్న ఆర్ఎంపీతో అబార్షన్ చేయించాడు. సుహాసిని పరిస్థితి విషమించడంతో సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. అక్కడే చికి త్స పొందుతూ సుహాసిని చనిపోయింది. వెంటనే సుహాసిని మృతదేహాన్ని ఎంజీనగర్‌ తండాకు తీసుకొని వెళ్లారు. తండ్రికి అసలు విషయం తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలి భర్త హరిసింగ్‌తో పాటు పలువుర్ని అరెస్టు చేశారు. పదహారు మందిపై కేసు నమోదు చేశారు. లింగ నిర్థారణ చేసి, అబార్షన్లు చేస్తున్న వారు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

మగ పిల్లాడే కుటుంబాన్ని ఉద్ధరిస్తాడనే గుడ్డి నమ్మకం ప్రస్తుత సమాజంలోని చాలా మందికి ఉంది. అయితే కంటే కూతురినే కనాలి అంటున్నారు నేటి తరం యువత. అంతేందుకు... కొడుకులు తల్లిదండ్రులను రోడ్డున పడేస్తుంటే... కూతుర్లే వారిని సాకుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం కూడా...  దీంతో నాటి పరిస్థితులు సమూలంగా మారాయి. ఆడపిల్లల తల్లిదండ్రుల్లో మంచి మార్పు కనిపిస్తున్నది. నాడు భారమనుకున్న ఆడపిల్ల నేడు వరమై.. కన్నవారి కనుపాపై.. ఇంటి మహాలక్ష్మిగా వెలుగొందుతుంది. కానీ కొందరు వంశోద్దారకుడు అంటూ మగపిల్లల కోసం పరితపిస్తూ..చట్ట విరుద్దం అని తెలిసినా కూడా లింగ నిర్దారణకు పాల్పడుతున్నారు. అక్కడితో ఆగకుండా కడుపులో ఉన్నది అమ్మాయి అని తెలియగానే.. బిడ్డను తల్లి గర్బంలోనే చంపేస్తున్న హరిసింగ్‌ వంటి రాక్షసులు వున్నారు. పుట్టబోయేది ఎవరైనా.. మన బిడ్డే అని అనుకున్నా.. ఓ లోటూ లేకుండా చూసుకుందాం అన్న మార్పు సమూలంగా వస్తేనే.. ఇటువంటి భ్రూణ హత్యలకు ఫుల్‌ స్టాప్‌ పడుతుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow