కాలయముడైన భార్త భార్యతో పురుగులు మందు తాగించి దారుణం...

ఎన్నో ఆశలు పెట్టుకుని అత్తింటిలో అడుగు పెట్టిన కోడలికి మెట్టినిల్లు నరకం అయ్యింది. మరణించిన తరువాత చూడవల్సిన నరకం ఆమె అత్తింట్లో ముందే చూసింది... కట్నం కావాలంటూ భర్త... తీసుకురా..! అని అత్త, ఆడపడుచు, బావ వేధింపులతో నరకం చూసింది.Sri Media News

Jul 2, 2024 - 15:38
 0  7
కాలయముడైన భార్త భార్యతో పురుగులు మందు తాగించి దారుణం...

ఓ మొగుడు కాలయముడిగా మారితే... ఎన్నో ఆశలు పెట్టుకుని అత్తింటిలో అడుగు పెట్టిన కోడలికి మెట్టినిల్లు నరకం అయ్యింది. మరణించిన తరువాత చూడవల్సిన నరకం ఆమె అత్తింట్లో ముందే చూసింది... కట్నం కావాలంటూ భర్త... తీసుకురా..! అని అత్త, ఆడపడుచు, బావ వేధింపులతో నరకం చూసింది. మెట్టినిల్లు మొత్తం కలిసి... ప్రతి రోజు మీ ఇంటికి వెళ్లి కట్నం తీసుకురా..!అని వేదిస్తుంటే... పుట్టినింటి వారిని అదనపు కట్నం అడిగేందుకు ఆమెకు మనసు రాలేదు... ఎంతో ఘనంగా పెళ్లి చేసి కట్నకానుకలు ఇచ్చి పంపిన పుట్టినింటిని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని ఆ మహిళ అందుకు ఒప్పుకోలేదు... దీంతో అత్తింటివారు.. ఆ మహిళకు బ్రతికుండగానే నరకం చూపించారు... భర్త అయితే  కాలయముడై... కన్న పిల్లల ముందు భార్యతో పురుగులు మందు తాగించాడు. ఇదంతా చూస్తున్న మెట్టినింటివారు ఆపకుండా... మద్దతు పలికారు. ఈ దారుణ ఘటన విశాఖ జిల్లా గాజువాక సనత్ నగర్‌‌లో చోటు చేసుకుంది.

అనకాపల్లి కొత్తూరుకు చెందిన పద్మినిని గాజువాక సనత్ నగర్‌‌కు చెందిన సోమేశ్వరరావుకు ఇచ్చి ఏడేళ్లు క్రితం ఘనంగా వివాహం చేశారు తల్లిదండ్రులు. అంతేకాదు.. అల్లుడు అడిగిన కట్న కానుకలు అన్ని లేదు కాదు అనకుండా ఇచ్చారు. ఎంతో సంతోషంతో పద్మిని మెట్టినింట అడుగు పెట్టింది... ఇద్దరు పిల్లలు పుట్టినంత వరకు సంసారం  చాల సాఫీగా సంతోషంగా సాగిపోయింది. సడన్‌‌గా అత్తింటి వారికి కోడలు ఏటీఎంలా కనిపించింది. అంతే... అదనంగా కట్నం కావాలంటూ భార్త,అత్త, ఆడపడుచు, బావ వేధించడం మొదలు పెట్టారు.. ఈ వేదింపుల గురించి కన్నవారికి చెప్పలేక, అత్తింటి ఆరళ్ళు భరించలేక నరకం చూసింది పద్మిని.

ఎన్ని ప్రయత్నాలు చేసిన భార్య మొండిగా ఉండటం సహించలేక పోయాడు భర్త సోమేశ్వరరావు.. దీనికి తోడు తల్లి, అన్న,వదిన నీ పెళ్లాం నీ మాట వినడం లేదా.. అంటు రెచ్చగొట్టడంతో... కోపంతో రగిలిపోతూ... 2024 మే ఒకటో తేదీన రాత్రి  సోమేశ్వరరావు పురుగుల మందును ఇంటికి తీసుకు వచ్చి పిల్లలు చూస్తుండగానే... వారి ఎదురుగా పురుగుల మందు పెట్టి నువ్వు తాగుతావా.. పిల్లలకు పట్టమంటావా.. అంటూ బెదిరించాడు. భార్య నుంచి స్పందన లేక పోవడంతో... భర్త పద్మిని చేత బలవంతంగా పురుగుల మందు తాగించాడు... ఆ సమయంలో అందరు ఇంట్లోనే ఉన్న చనిపోతుందని తెలిసిన పోతే పోని... అన్నట్టు ఎవరూ పట్టించుకోలేదు... పురుగుల మందు తాగించి మూడు రోజులు ఇంట్లోనే తాళం వేసి ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు సాయంతో మెల్లగా ఆసుపత్రి చేరింది పద్మిని.  చివరికి కేజీహెచ్ లో చికిత్స పొందుతూ 26 రోజులు మృత్యువుతో పోరాడి చివరకు తనువు చాలించింది.

చనిపోయే ముందు కొన ఊపిరితో ఉన్న పద్మిని ఆడియో రికార్డ్ తోపాటు మరణ వాగ్మూలం రాసింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఆడియోలో  పద్మిని ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం... ‘‘మామయ్య నేను పద్మినిని.. ఎంత బాగా చూసుకున్నారు మామయ్య నన్ను.. పెళ్లి చేసుకుంటే బాగుంటాను సంతోషంగా ఉంటాను అని పెళ్లి చేశావు కాదా మామయ్య.. రెండు లక్షలు ఇచ్చావు.. పెళ్లి చేసి కష్టాలపాలు చేశావు. పెళ్లి అయినప్పటి నుంచి జరిగిన గొడవలు నీకు తెలుసు కానీ.. ఆ మెున్న మెున్న జరిగిన గొడవలు నీకు తెలియదు కదా అందుకే ఈ ఆడియో రికార్డ్ చేస్తున్నాను... రైస్ షాపు పెడతాను అని చెప్పి ఇంట్లో ఉన్న బంగారం నామెడలో ఉన్న బంగారం తాకట్టు పెట్టి షాపు పెట్టినప్పటి నుంచి రోజూ  గొడవలే... మీ అమ్మ వాళ్ల ఇంటి నుంచి నీకు రావాల్సిన వాటా తెచ్చుకో నేను బిజినెస్ ఎక్సపెండ్ చేసుకోవాలి అని రోజు గొడవే... ఒకరోజు ఉండలేక తిరగబడ్డాను మామయ్య.. నాకు పెళ్లి కాని చెల్లి ఉంది. వాళ్లు ఉన్నవి అమ్ముకుంటున్నారు. ఎలా ఇస్తారు అని అడిగాను. అంతే.. నన్ను గట్టిగా కొట్టి ఒకరోజంతా ఇంట్లో రూమ్‌‌లో పెట్టి తాళం వేశాడు మామయ్య.

ఆరోజు శనివారం ఒకటో తారీఖు సాయంత్రం బయటకు వెళ్లాడు... పురుగులు మందు తెచ్చి దాచాడు. పిల్లలకు అన్నం పెట్టి కుర్చుంటే నన్ను పిలిచి ఈ మందు నువ్వు తాగుతావా. పిల్లలకు పట్టించనాా అని చాలా ఇబ్బంది పెట్టాడు మామయ్య. ఉరుకోలేక తిరగబడి తోసేశాను.. వాడికి గ్యాస్ బండ తగిలింది... ఆ కోపంతో నన్ను కొట్టి.. నాజుట్టుపట్టుకోని నోటిలో పురుగులు మందు వేసి నోరు తెరవకుండా మూసేశాడు మామయ్య. మందు కక్కనివ్వలేదు మామయ్య. పుర్తిగా మందు తాగిన తరువాత నోటి పై చెయ్యి తీశాడు మామయ్య. అది తాగిన ఆరగంట నుంచి రాత్రి అంతా వాంతులే... ఒక 50 వాంతులు జరిగి ఉంటాయి మామయ్య.

 అయిన దగ్గరకు రాలేదు మామయ్య.. అసలు తెలివి ఒపికలేదు మామయ్యనాకు మూడు రోజులు నన్ను గదిలో పెట్టి ఉంచాడు మామయ్య. వాస్ రూమ్ కి కూడా వెళ్ల కుండా తాళం వేశాడు మామయ్య. సచ్చిపోతాను అనుకున్నడేమో... చావకపోయే  సరికి సోమవారం బయటకు తీసుకువచ్చాడు. ఇదంతా డబ్బుల కోసమే మామయ్య. నా పిల్లలకు వాడి దగ్గర రక్షణ ఉండదు మామయ్య నా పిల్లలను కాపాడండి మామయ్య. ఇదాంతా మీకు చెబుదాం అనే రికార్డ్ చేశాను మామయ్య’’ అంటు పధ్మిని ఆడియో లో ఆవేదన వ్యక్తం చేసింది. కాగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో భర్త సోమేశ్వరరావు, బాధితురాలి అత్తామామల్ని గాజువాక పోలీసులు అరెస్టు చేశారు.

దేశంలో వరకట్న వేధింపులకు  ఎంతో మంది మహిళలు చనిపోతున్నారు. అయినప్పటికి ప్రభుత్వం ఎప్పటి నుండో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నా.. సరైన కట్టడి చర్యలు లేవనేది కొంత మంది వాదన. 1983 లో వరకట్నాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ వరకట్న హత్యలు జరుగుతునే ఉన్నాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow