కోడలు ప్రాణం తీసిన మేనమామ... విషమిచ్చి ఉరి వేసి.. క్రూరంగా!

ఈ ప్రస్తుత సమాజంలో ఎవర్ని మామ్మలో ఎవర్ని మమ్మొదో అర్థం కావడం లేదు.. మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో చెప్పలేక పోతున్నాం.  సొంత వాళ్ళే తోడేళ్ళు అవుతున్న సమాజంలో బ్రతుకుతున్నాం. Sri Media News

Jul 2, 2024 - 16:00
 0  8
కోడలు ప్రాణం తీసిన మేనమామ... విషమిచ్చి ఉరి వేసి.. క్రూరంగా!

ఈ ప్రస్తుత సమాజంలో ఎవర్ని మామ్మలో ఎవర్ని మమ్మొదో అర్థం కావడం లేదు.. మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో చెప్పలేక పోతున్నాం.  సొంత వాళ్ళే తోడేళ్ళు అవుతున్న సమాజంలో బ్రతుకుతున్నాం. తండ్రి తర్వాత తండ్రి మేన మామ  అంతటి గౌరవం ఉంటుంది... కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ఘటనలో... మేనమామ కాలయముడైయ్యడు. మేనమామ అర్థం చేసుకుంటాడు అని నమ్మి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పినందుకు మేన కోడలి ప్రాణం తీశాడు. 

కర్ణాటకలోని బైచవళ్లి గ్రామంలో దీప అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. సంతోషంగా ఉన్న తన జీవితంలోకి మేనమామ పెళ్లి చేసుకుంటాను అని కాలయముడిల వచ్చాడు. కానీ మేనమామను చేసుకోవడం దీపకు ఇష్టంలేదు. దీప వయసు 21 మేనమామ మల్దేశ్ బార్కి దీప మీద సుమారు 14 ఏళ్ల పెద్దవాడు. పైగా తాగుబోతు.. తాగి వచ్చి అప్పుడప్పుడు దీపతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. 35 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాక పోవడంతో మల్దేశ్ దీప పై కన్నేశాడు. అక్క కూతురు అయితే ఇబ్బంది ఉండదు. అనుకున్నాడు. అయితే దీప డిగ్రీ పూర్తి చేసి పై చదువులు చదువుదాం అనుకుంది. తల్లిదండ్రులకు కూడా చెప్పింది. కానీ దీప పై కన్నేసిన మేనమామ దీనికి ఒప్పుకోలేదు. దీపను ఇక చదివించవద్దని, త్వరలో పెళ్లి చేయాలని దీప తల్లిదండ్రులను పట్టుబట్టాడు. వయసుకు వచ్చిన పిల్లను ఇంకా చదివిస్తే... ప్రేమ దోమ అంటుంది అని వారిని బెదిరిస్తూ... అక్క బావలను తనవైపు తిప్పుకున్నాడు. కానీ మామను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని తల్లిదండ్రులకు చెప్పింది. అయినప్పటికీ తల్లిదండ్రులు పట్టించుకొలేదు. బలవంతంగా మల్దేశ్ బార్కి తో ఆమెకు నిశ్చితార్థం చేశారు.

నిశ్చితార్థం అవ్వడంతో మరింత ఎక్కవగా టార్చర్ చేసేవాడు..  తప్పతాగి వచ్చి.. మేనకోడలితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మేనమామ తీరు చూసి తట్టుకోలేక దీప.. మేనమామను పెళ్లి చేసుకోనని తల్లిదండ్రలుకు  తెగేసి చెప్పేసింది. ఇకా చేసెదేముంది అనుకుంటూ... తల్లిదండ్రులు ఈ విషయం బార్కికి చెప్పారు. దీంతో దీప పై కోపం పెచ్చుకున్నాడు మేనమామ... ఇది నన్ను వద్దు అంటుందా... అని కోపంతో రగిలిపోయాడు... నిశ్చితార్థం అయ్యాక.. ఇష్టంలేదు అని చేప్పి అవమానించడం తట్టుకోలేక పోయాడు.... దీప దగ్గరకు వెళ్లి నీతో మాట్లాడేపని ఉంది అని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. ఎవరు లేని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి విషం ఇచ్చి..

మేనకోడలు అనే జాలి లేకుండా... ఉరి వేసి చంపేశాడు. ఎంతసేపటికీ కూతురు ఇంటికి రాకపోవడంతో దీపా తల్లిదండ్రులు అనుమానం వచ్చి మల్దేశ్‌కు ఫోన్ చేశారు. దీప తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిందని మల్దేశ్ చెప్పాడు. అయితే రాత్రి వరకు దీప రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీప సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ను పరిశీలించగా అది తోట ఉన్నట్టు తెలిసింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు మల్దేశ్‌ను విచారించాగా... దీపను హత్య చేసినట్లు అంగీకరించాడు. చంపిన ప్రాంతానికి తీసుకువెళ్లి చెట్టుకు వేలాడుతు కుళ్లిపోయిన దీప మృతదేహాన్ని పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. బార్కీని అరెస్టు చేసి.. విచారిస్తున్నారు పోలీసులు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow