చంద్రబాబు1995.. పాలన రిపీట్.! 1995 బాబు ఎలా ఉండేవారు? 2024 బాబు వ్యూహాలు ఏంటి?
రాష్ట్ర అభివృద్ది కోసం ఇక వేగంగా వెళ్లడమే. 4.0 బాబుని చూపిస్తా....1995 నాటి సీబీఎన్‌ని మీరందరు చూస్తారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు... చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Sri Media News
రాష్ట్ర అభివృద్ది కోసం ఇక వేగంగా వెళ్లడమే. 4.0 బాబుని చూపిస్తా....1995 నాటి సీబీఎన్‌ని మీరందరు చూస్తారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు... చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎక్కడ చూసిన ఇదే టాపిక్ నడుస్తుంది... ‘అప్పట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. ఇప్పుడు అలా చేయను కానీ....తప్పు చేస్తే మాత్రం ఎవరినీ వదిలిపెట్టను. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఇది వర్తిస్తుంది’ అని బాబు హెచ్చరించడంతో... రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు 1995లో బాబు ఎలా ఉండేవారు... అని గూగుల్‌లో సర్చ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో అప్పట్లో బాబు వేగం.. దూకుడు.. కార్యాచరణ ఎలా ఉండేది.. ఈ వీడియోలో తెలుసుకుందాం.
తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల వల్ల 1995 ఆగస్టు 23న కుట్రదారుల నుండి పార్టీని కాపాడిన చంద్రబాబు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 1995 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ క్షణం నుంచి ఆయన దూకుడు పెంచారు. 1995 నవంబర్ 1 'ప్రజల వద్దకు పాలన' ప్రారంభించి రాజకీయనాయకులలో ఐటీ జ్ఞానిగా పేరు తెచ్చుకున్నారు. ఈ-గవర్నెన్స్ ను ప్రజలకు పరిచయం చేసారు. ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలను ప్రోత్సహించి విద్య, ఆరోగ్య, మౌలిక, ఆర్థిక, పాలనా రంగాలలో సాంకేతికతను జోడించి. బాబు తన మార్క్ పాలన ఎలా ఉంటుందో ఉమ్మడి రాష్ట్రానికి దేశానికి రుచి చూపించారు. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు.
ఎన్టీఆర్ తెలుగుజాతికి ప్రపంచ ఖ్యాతి తీసుకువస్తే... చంద్రబాబునాయుడు తెలుగువారి ప్రతిభను ప్రపంచ నలుమూలలకు పరిచయం చేసారు. అది కూడా... 1998లో అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబు గౌరవార్ధం సెప్టెంబర్ 24వ తేదీని 'నాయుడు డే'గా ప్రకటించెంతగా... ఈ ఒక్క ఘటన చాలు బాబు విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో చంద్రబాబు రోజులో 20 గంటలకు పైగానే పనిచేసే వారని అప్పటి నాయకులు ఇప్పటికి చెబుతారు. ప్రభుత్వ ఉద్యోగులపై దృష్టి సారించి...ఉద్యోగులు సమయం వృధా చేయకుండా... వారి ఆఫిస్ టైమింగ్ లో ప్రజల కోసం పని చేయల్సిందే అనేవారు... దానికి తగ్గట్టే అల్టిమేట్ జారీ చేస్తూ.... ఏదైనా పని పూర్తికాకుంటే పూర్తయ్యే వరకు చేసి వెళ్ళాలని గట్టిగా చెప్పేవారట... దీంతో చంద్రబాబును పని రక్షసుడు అనేవారు. ఇప్పటికి ఆయనక ఆ ముద్ర అలగే కొనసాగుతుంది. చంద్రబాబు పేరు చెపితే చాలు ఉద్యోగులు ఒక్క మాట మాట్లాడకుండా పనులు చేసేవారు. గ్రామం, పల్లే, పటణం అనే తేడా లేకుండా పాలన చేసేవారని చెబుతారు. అంతేకాదు... రాష్ట్రంలో ఏమాత్రం కరప్షన్ లేని ఉద్యోగులను తయారు చేశాడు. ఉద్యోగులు ప్రజల నుంచి రూపాయి తీసుకోవాలంటేనే వణికి పోయేవారట. అలా అని ఉద్యోగులను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు... జీతాలు ఇవ్వలసిన దానికంటే ముందు ఇచ్చేవారు చంద్రబాబు.
ఇంత చేశారు కాబట్టే చంద్రబాబును పలు వార్త పత్రికలు పొగడ్తలతో ముంచెత్తాయి.. ఇండియా టుడే 'ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం' గా కిర్తించగా.... ఎకనామిక్ టైం... 'బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' అని... టైమ్ ఆసియా సంస్థ "సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్" అని... అమెరికాకు చెందిన ఒరాకిల్ కార్పొరేషన్ ప్రచురించే మాస పత్రిక 'ప్రాఫిట్' అని చంద్రబాబును 'హిడెన్ సెవెన్ వర్కింగ్ వండర్స్ లో ఒకరు' అని... సిఎన్ఎన్ వార్త సంస్థ "సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" అనే అనేక బిరుదులను ఆయన సొంతం చేసుకున్నారు.
అంతేకాదు... బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, సింగపూర్ మాజీ ప్రధాని గో చోక్ టోంగ్... వంటి వారు భారతదేశానికి వచ్చినప్పుడు తమ షెడ్యూల్ లో ఆంధ్రప్రదేశ్‌ను చేర్చుకొని చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యేవారు. ఇదంతా ఇప్పటి వారికి తెలియక పోవచ్చు. కానీ ఆయన పాలనలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాం గురించి ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిన నాయకుడు. 1995వ సంవత్సరం నుండి 2004 వ సంవత్సరం వరకు 9 సంవత్సరముల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించారు చంద్రబాబు.
సో ఇప్పుడు అదే మార్క్ పాలన చూపిస్తానని చంద్రబాబు అంటున్నారు. ‘ప్రజలిచ్చిన ఈ గౌరవాన్ని వారి కోసమే వినియోగిస్తానని.. నా స్వార్థం కోసం ఉపయోగించుకోనని... సమర్థవంతమైన పాలన అందించి చంద్రబాబు పాలన ఎలా ఉంటుందో ఇప్పటి యువతకు చూపిస్తాను అని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే తను 2024లో చరిత్ర సృష్టించాలని ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రానికి అత్యంత ప్రాధానమైన రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి, ఉపాధి కల్పన అనే మూడు అంశాలపైనే ఫోకాస్ పెట్టారు. ఎన్నికల్లో కూడా వీటిపై చంద్రబాబు ప్రచారం చేశారు కూడా. అందుకే ఇప్పుడు ఈ మూడు శాఖలకు మంత్రుల కేటాయింపులోనూ చంద్రబాబు ఆచితూచి అడుగులు వేశారు.
నిజం చెప్పాలంటే... అమరావతిలో రాజధాని చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలని మొదటి నుంచీ చంద్రబాబు కలలు కన్నారు. దీని కోసం ఎంతో శ్రమించారు. కానీ... 2019లో ఓడిపోవడం వల్ల ఈ రాజధాని నిర్మాణన్ని వైసీపీ అడ్డుకుంది. మూడు రాజధానులు అనే ఆంశాన్ని తెరపైకి తెచ్చి రాజధాని లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం. అయితే 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖా మంత్రిగా పనిచేసిన పొంగూరు నారాయణ .. రాజధాని మాస్టర్ ప్లాన్లో కీలక పాత్ర పోషించారు. సో ఇప్పుడు ఇప్పుడు మళ్లీ అదే నారాయణకు పట్టణాభివృద్ధి శాఖను సీఎం చంద్రబాబు అప్పగించారు.
పోలవరం బాధ్యతలను మంత్రి నిమ్మల రామానాయుడికి ఇచ్చి... నీటిపారుదలశాఖను మంత్రిగా నియమించారు. దీనికి కారణం లేక పోలేదు.. పోలవరాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ నిమ్మలరామానాయుడు అప్పట్లో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అనేకసార్లు ప్రెస్మీట్లు పెట్టి మరీ అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరన్ని వైసీపీ నాశనం చేసిందని అనేకసార్లు ఆరోపించారు. సో పోలవరంపై పూర్తి అవగాహన నిమ్మలకు ఉండటంతో పోలవరం నిర్మాణ బాధ్యతలను మంత్రి నిమ్మల రామానాయుడికి చంద్రబాబు అప్పగించారు.
ఉపాధి కల్పన విషయానికి వస్తే... బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో టీడీపీ విడుదల చేసిన సూపర్ సిక్స్ పథకాల్లో ఇదీ ఒకటి. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ప్రతి మీటింగ్లో చంద్రబాబు స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ శాఖకు కూడా ఇప్పుడు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. గతంలో ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రిగా అనుభవం ఉన్న లోకేష్‌కి ఈ సారి ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.
2024 గెలుపు తరువాత ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటు 4.0 బాబుని చూపిస్తునే వస్తున్నారు చంద్రబాబు. సో ఇదే క్రమంలో అధికారులెవరైనా మారకపోతే వారికి షాక్ ట్రీట్ మెంట్ ఇస్తానని... అధికారులు అందరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి... జగన్ ముఖ్యమంత్రిగా పనికిరాడని ప్రజలు తీర్పు ఇచ్చారని... ప్రజల సీఎం అంటే ఇలా ఉండాలో నేను నిరూపిస్తానని... ఎవరైనా సరే ఆడబిడ్డలపై విచ్చలవిడిగా వ్యవహరిస్తే వదిలిపెట్టనని. అత్యాచారం చేస్తే అదే వారికి చివరి రోజవుతుందని.... ప్రభుత్వమంటే ఎవరూ తమాషాగా తీసుకోవద్దని...మహిళలకు అన్యాయం జరిగితే ఉపేక్షించనని. 4.0 బాబు చేతల్లో చేసి చూపిస్తాడని గుర్తుపెట్టుకోండి అని హెచ్చరించారు చంద్రబాబు. అయితే.. 1995లో చంద్రబాబు వయసు 45 సంవత్సరాలు, ప్రస్తుతం 75 సంవత్సరాలు అయినా అదే దూకుడుతో పనిచేస్తున్నారు. అయితే 2029లోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి
What's Your Reaction?